జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటీషన్ మీద, ఈ రోజు సిబిఐ కోర్టులో విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ అధికారులు మెమో దాఖలు చేసారు. బెయిల్ రద్దు పిటీషన్ కు సంబంధించి, కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయానికి తాము బద్దులమై ఉంటామని సిబిఐ మెమో దాఖలు చేసింది. అయితే ఈ రోజు ఈ కేసుకి సంబంధించి విజయసాయి రెడ్డి ఈ రోజు తమ కౌంటర్ దాఖలు చేసారు. అయితే మళ్ళీ విజయసాయి రెడ్డి కౌంటర్ పైన మళ్ళీ వదానలు కొనసాగే అవకాసం కనిపిస్తుంది. అయితే రఘురామకృష్ణం రాజు లేవనెత్తిన అంశాల పై పెద్దగా కౌంటర్ లో ప్రస్తావించలేదని తెలుస్తుంది. ప్రధానంగా ఈ పిటీషన్ కొట్టేయాలని, ఇది నిలబడే పిటీషన్ కాదని, రఘురామారాజుకి తమ పై కోపం ఉందని, కుళ్ళు ఉందని ఆ కౌంటర్ లో తెలిపారు. అలాగే ఇది పబ్లిసిటీ కోసం, ప్రోపగాండా కోసం, రఘురామరాజు వేసిన పిటీషన్ అని అన్నారు. అలాగే రఘురామకృష్ణం రాజు మీద సిబిఐ కేసులు ఉన్నాయని, అలాగే రఘురామరాజు పై తాము ఇప్పటికే స్పీకర్ కు లెటర్ ఇచ్చామని, అందుకే రఘురామరాజు తమ పై కక్ష కట్టుకుని, తమ మీద పిటీషన్ వేసారని కౌంటర్ లో తెలిపారు.

rrr 16082021 2

అలాగే తాము కనుక బెయిల్ కండీషన్లు అతిక్రమించి ఉంటే, సిబిఐ వాళ్ళే అభ్యంతరం చెప్పే వాళ్ళు కదా అనే పాయింట్ ని కూడా తమ కౌంటర్ లో తెలిపారు. వాళ్ళు ఎలాంటి అభ్యంతరం ఇప్పటి వరకు చెప్పలేదు కాబట్టి, తాము ఎలాంటి బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని అన్నారు. ఇదంతా అనవసరమైన పిటీషన్ అని, కేవలం పబ్లిసిటీ కోసం వేసిన పిటీషన్ అని, అందుకే ఈ పిటీషన్ ని రద్దు చేయాలి అంటూ, విజయసాయి రెడ్డి తమ పిటీషన్ లో తెలిపారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పితీషన్ లో కూడా ఇలాగే జగన్ తరుపు కూడా వాదనలు వినిపించారు. దీనికి విచారణ అర్హత లేదు అని, కేసు కొట్టేయాలని కోరారు. అయితే ఇక్కడ విచారణ అర్హత ఉంటేనే కదా బెంచ్ మీదకు వచ్చింది, పిటీషనర్ లేవనెత్తిన అంశాలు కాకుండా, మిగతా అంశాలు లేవనేత్టటం ఏమిటో అని న్యాయవాదులు అంటున్నారు. ఇక ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజు రఘురామరాజు న్యాయవాదులు కౌంటర్ ఇస్తే, ఈ కేసుని కూడా 25వ తేదీకి వాయిదా వేసే అవకాసం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ నిర్ణయంతో, మనకు జీవోలు ఆన్లైన్ లో కనిపించవు. ఇటీవల బ్లాంక్ జీవోల విషయంలో, ప్రభుత్వ వైఖరి తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఆ జీవోలో ఏమి లేకుండా, కేవలం బ్లాంక్ జీవోలు అనేకం విడుదల చేసారు. అసలు అందులో ఏమి ఉందో, ఏమి లేదో చెప్పకుండా, కేవలం బ్లాంక్ జీవో ఇవ్వటం వివాదాస్పదం అయ్యింది. అలాగే అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకుంటూ కూడా, జీవోలు విడుదల చేసారు. ఇక రహస్య జీవోలు కూడా అనేకం విడుదల అయ్యాయి. దీని పై ప్రతిపక్షం టిడిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అంశం పై గవర్నర్ కూడా షాక్ అయినట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జీవోలు ఏమి ఆన్లైన్ లో ఉంచకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవోలు అన్నీ ఇక నుంచి ఆఫ్ లైన్ లోనే పెట్టాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, ఉత్తర్వులు జారీ చేసారు. మెమో రూపంలో అన్ని శాఖల కార్యదర్శులకు ఈ ఉత్తర్వులు జారీ చేసారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అనుసరిస్తూ, ఆన్లైన్ లో జీవోలు పెట్టటం నిలిపి వేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

jagan 16082021 2

గత అనేక ప్రభుత్వాల నుంచి జీవోలు ఆన్లైన్ లో ఉంచటం ఆనవాయితీగా వస్తుంది. ప్రజలకు పారదర్శకంగా, ప్రభుత్వ నిర్ణయాలు అందిస్తూ, ప్రజల ముందే సమాచారం ఇస్తూ, ధైర్యంగా నిన్నటి వరకు ప్రభుత్వాలు నడిచాయి. ప్రభుత్వం జారీ చేసే అన్ని ఉత్తర్వులు కూడా ఆన్లైన్ లోనే జారీ చేస్తూ వచ్చారు. ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉండటంతో, ప్రజలు కావలసినప్పుడు ఆన్లైన్ లోకి వెళ్లి కావాల్సిన సమాచారం చూసే వారు. అయితే ఇక నుంచి మాత్రం, ఆన్లైన్ లో ఎలాంటి సమాచారం అప్లోడ్ చేయవద్దు అని కూడా, అన్ని శాఖల కార్యదర్సులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, సంచలనంగా మారింది. అయితే ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు పలు అనుమానాలు లేవనెత్తాయి. ఆన్లైన్ లో ఉంటేనే ఇన్ని అరాచకాలు చేస్తున్నారని, ఆఫ్ లైన్ లో ఆదేశాలు విడుదల అయితే, ప్రజలకు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి, ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అనే నిర్ణయంతోనే, ప్రభుత్వం ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అంటూ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో నిన్న హ-త్య కు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించటానికి నారా లోకేష్ ఈ రోజు వచ్చాయి. అయితే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఉదయం నుంచి అక్కడ హైడ్రామా నడుస్తుంది. లోకేష్ రాక ముందే అక్కడ నుంచి రమ్య మృతదేహాన్ని తరలించటానికి ఏర్పాట్లు చేసారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, దళిత సంఘాలు నిరసన తెలిపాయి. నిందితుడిని చం-పే-యా-ల-ని , కోటి రూపాయల పరిహారం కావాలని డిమాండ్ చేసారు. అయితే ఇదే సమయంలో హోం మంత్రి అక్కడకు వచ్చి పది లక్షల చెక్ ఇచ్చారు. అక్కడ కూడా ఆందోళన రేగింది. పది లక్షలు ఇచ్చి చేతులు దులుపు కోవటం కాదని నిరసన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో లోకేష్ అక్కడకు వస్తున్నారని తెలుసుకుని, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి, మృతదేహాన్ని వెనుక గేటు నుంచి తరలించారు. మృతదేహాన్ని ఆమె ఇంటికి తరలించారు. దీంతో నారా లోకేష్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి, అక్కడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక ఇదే సమయంలో నీచ రాజకీయానికి తెర లేపింది వైసిపీ. అక్కడకు వచ్చి గొడవ చేసింది.

ln 16082021 2

దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసారు. అక్కడ ఉన్న టిడిపి నేతలను ఇష్టం వచ్చినట్టు ఈడ్చి పడేసారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పై చేయి చేసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న ఇతర నేతలను ఈడ్చి అవతల పడేసారు. నారా లోకేష్ ని ఆడుపులోకి తీసుకుని, పోలీస్ జీప్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. అయితే ఎక్కడకు తీసుకుని వెళ్తున్నారో చెప్పక పోవటంతో, తీవ్ర ఆందోళన నెలకొంది. చివరకు నారా లోకేష్ ని పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి అయన్ను అరెస్ట్ చూపిస్తారా, లేదా వదిలేస్తారా అనేది ఇంకా తెలియదు. అయితే పోలీసులు తీరు పై టిడిపి నేతలు మండి పడుతున్నారు. ఒక దళిత మహిళకు న్యాయం చేయమని అడగటం కూడా నేరమా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే లోకేష్ ని విడుదల చేయాలని, ఆ యువతికి న్యాయం చేసి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఇలా పిరికి వాడిలా ఉంటున్నారో అర్ధం కావటం లేదని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ అంటూ, ఒక సంస్థను ఏర్పాటు చేసి, దాని పేరిట రుణాలు తీసుకోవటం చట్ట విరుద్ధం అని, ఈ విధంగా రుణాలు ఇవ్వకుండా జాతీయ బ్యాంకులను ఆదేశించాలని, విజయవాడకు చెందిన కె.హిమబిందు వేసిన పిటీషన్ ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటీషన్ పై, ఈ రోజు పిటీషనర్ తరుపున వాదనలు జరిగాయి. ఈ విధంగా రుణాలు తీసుకోవటం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకం అని, అలాగే జాతీయ బ్యాంకులు కూడా ఈ విధంగా రుణాలు ఇవ్వటానికి, అనుమతి ఇవ్వకూడదని కూడా ఆయన వాదించారు. దీంతో పాటుగా ఇటీవల రాష్ట్రాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి, రుణాలు తీసుకున్నారని, దీని పై ఇది రాజ్యాంగ విరుద్ధం అని,కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి నోటీసులు పంపి, దీని పై వివరణ ఇవ్వాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఈ పిటీషన్ వెంటనే విచారణకు ఆదేశించి, తగు సూచనలు ఇవ్వాలని కూడా పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుని విజ్ఞప్తి చేసారు. ఇదే సమయంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ఇటువంటి పిటీషన్లకు విచారణ అర్హత లేదని అన్నారు. ఈ కేసులు, నిలబడే కేసులు కావని కూడా ఆయన హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.

hc 16082021 2

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ధికంగా ఇబ్బందులు పాలు చేసేందుకే, వారినికి ఒకటి, ఇలాంటి పిల్స్ వేస్తున్నారని, దీని ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అదే ఈ పిటీషన్ లో కనిపిస్తుందని, ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించ కూడదని, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఎటువంటి విచారణ అర్హత లేదని ఆయన వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఇటువంటి పిటీషన్ లాంటిదే ఇంకొకటి రెండు రోజుల్లో విచారణకు వస్తూ ఉండటంతో, ఈ పిటీషన్ ను కూడా ఆ పిటీషన్ తో కలిపి విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే ఆ పిటీషన్ లో ఉన్న అంశాలు, ఈ పిటీషన్ లో ఉన్న అంశాలు వేరని, ఈ పిటీషన్ ని విడిగా విచారించాలని కోరారు. అయితే దీని పై ఆ రోజే విచారణ చేస్తామాని హైకోర్టు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఒక ప్రత్యెక సంస్థను పెట్టి, మద్యం లాంటి వాటికి, భవిష్యత్తులో వచ్చే ఆదాయాలు చూపి, అప్పు తెచ్చుకుని, రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్న అంశం పై, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read