ఆంధ్రప్రదేశ్ లో "ధికారిక అరాచకానికి" ఇది ఉదాహరణ... ఈ వ్యాఖ్యలు చేసింది, సామాన్య ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, ఈ రాష్ట్ర హైకోర్ట్. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పటానికి, ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగటం, వేరే పార్టీ వచ్చిన తరువాత, సహజంగా కొన్ని రోజులు ఉద్రిక్త పరిస్థితిలు, కక్ష సాధింపులు ఉంటాయి. కాని అవి తీవ్ర రూపం దాల్చితే, రాష్ట్ర ఇమేజ్ కే ప్రమాదం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది. తమ కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ చెప్పింది. తెలుగుదేశం పార్టీ సానుభితిపరులు, అనుకుంటే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పీకేస్తున్నారు అని చెప్పింది. తెలుగుదేశం సానుభూతి పరులు అనుకుంటే, వారి రేషన్ డీలర్ షిప్ కట్ చేస్తున్నారు అని చెప్పింది. అలాగే ఉపాధి హామీ బిల్లులు, వివిధ పనుల బిల్లులు చెల్లింపులు కూడా. అయితే అన్నిటికీ ఆధారాలు ఉండవు కాబట్టి, కోర్ట్ మెట్లు ఎక్కే వీలు ఉండదు.

court 04022020 2

అయితే ఒక రేషన్ డీలర్ విషయంలో, ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాసిన లేఖ తమకు అందటంతో, హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఈ రేషన్ షాపుని రద్దు చేసి, నేను సూచించిన వారికి మాత్రమే ఇవ్వండి అంటూ, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి రాసిన లేఖ, ఆ లేఖ అనుగుణంగా, అమలు చేసిన అధికారి పై, హైకోర్ట్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఉప ముఖ్యమంత్రి చెప్పిన విధంగా చేసిన, జాయింట్‌ కలెక్టర్‌ది అనాలోచిన చర్య అంటూ, హైకోర్ట్ వ్యాఖ్యానించింది. అధికారిక అరాచకానికి, ఈ చర్య ఒక ఉదాహరణ అంటూ, తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో పాటుగా, వెంటనే, సదరు రేషన్ షాపు డీలర్‌కు అనుమతిని వెంటనే పునరుద్ధరించాలని హైకోర్ట్, తీర్పు ఇచ్చింది.

court 04022020 3

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెదకంటిపల్లిలో పి.మోహనాంబ నిర్వహిస్తున్న రేషన్ షాపు అనుమతిని, పోయిన ఏడాది డిసెంబరు 2న, అక్కడ జాయింట్‌ కలెక్టర్‌ రద్దు చేశారు. మీ రేషన్ షాపు నిర్వహణలో లోపాలు ఉన్నాయి అని, అక్టోబరు 29న నోటీసు ఇచ్చారు. వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా, రేషన్ షాపు రద్దు చేసారు. దీంతో ఆమె, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి రాసిన లేఖతో పాటుగా, ఇది నిబంధనలకు వ్యతిరేకం అని, కోర్ట్ కు వెళ్లారు. కనీసం ఆమె రేషన్ షాపులో తనిఖీ కూడా చెయ్యలేదని, కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీని పై స్పందించిన కోర్ట్, డీలర్ ను తొలగించటానికి ఒక పద్దతి ఉంటుందని, ఉపముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించకూడదని, ఇవన్నీ ‘అధికార అరాచకం’గా చెప్తూ, కోర్ట్ ఆ రేషన్ షాపుని, పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది.

బినామీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, ఆయనసాక్షిమీడియా తెలుగుదేశంపై ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, 5, 6 నెలలనుంచి ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌పై జ్యుడీషియల్‌ విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌చేస్తున్నా, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని టీడీపీనేత, ఆపార్టీఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన ఆస్తులు, వ్యాపారాలు, వ్యవహారా లు అన్నీ బినామీలతోనే నడుపుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆఖరికి రాజకీయాల్లోకూడా కేసీఆర్‌కు బినామీగా వ్యవహరిస్తున్నాడన్నారు. తెల్లరేషన్‌కార్డులున్నవారంతా అమరావతి చుట్టుపక్కల భూములుకొన్నారని, వారంతా తెలుగుదేశం బినామీలని దుష్ప్రచారం చేస్తూ, టన్నులకొద్దీ బురద ప్రతిపక్షంపై చల్లాలని జగన్‌ ఆయన మీడియా ప్రయత్నించ డం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని కుటుంబాలకంటే తెల్లరేషన్‌కార్డుదారులే ఎక్కువగా ఉన్నారని, విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి కూడా తెల్లకార్డులున్నాయని, అలాంటివారు రాజధాని చుట్టుపక్కల భూములుకొంటే, దాన్ని టీడీపీకి అంటగట్టడం ఎంతవరకు సబబని నిమ్మల నిలదీశారు. 797 తెల్లకార్డులున్నవారు, రాజధాని చుట్టపక్కల గ్రామా ల్లో 600 ఎకరాలవరకు కొన్నారని సాక్షిమీడియాలో పేర్కొన్నారని, అలాకొనడం తప్పయినప్పడు చర్యలు తీసుకోవడం మానేసి బురదజల్లే ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

వాన్‌పిక్‌పేరుతో 18వేల ఎకరాలను, లేపాక్షిపేరుతో 6వేల ఎకరాలను తనకంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన వారికి అప్పనంగా ధారాదత్తంచేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ పేరుతో విషప్రచారం చేయడం సిగ్గుచేటన్నా రు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరప్షన్‌ ఆఫ్‌ ఎంపరర్‌ పేరుతో పుస్తకాలు ముద్రించి, రాజధాని భూముల్లో 24వేలఎకరాలు దోచేశారని విషప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ, 4వేల ఎకరాలని చెప్పారన్నారు. ఇప్పుడేమో సాక్షిలో 600 ఎకరాలంటూ కొత్తకథలు చెబుతున్నారని, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌శాఖ వివరాలుపరిశీలిస్తే గత 5ఏళ్లలో కేవలం 125ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్స్‌ జరిగినట్లు స్పష్టమైందన్నారు. అవినీతి అనేది వెలికితీసేకొద్దీ పెరగాలని, కానీ తగ్గడం చూస్తుంటే ఎవరికైనా అది తప్పుడు ప్రచారమనే అనుమానమే కలుగుతుందన్నారు. రాత్రికిరాత్రి సూట్‌కేసుకంపెనీలు సృష్టించి, వాటిద్వారావచ్చిన సొమ్ముతో రూ.10ల విలువైన షేర్లను వందలు, వేలకు అమ్ముకున్న జగన్‌ కంపెనీలైన భారతిసిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌ వంటివే నిజమైన బినామీ కంపెనీలని నిమ్మల మండిపడ్డారు.

జగన్‌తాత రాజారెడ్డి, 1200 ఎకరాల అసైన్డ్‌ల్యాండ్‌ని ఆక్రమించుకుంటే, ఆ వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం బయటపెట్టడంతో, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, ''ఏదో తెలియక కొన్నాము.. 631ఎకరాలు వెనక్కు ఇచ్చేస్తాము'' అని చెప్పింది వాస్తవం కాదా అని టీడీపీ ఎమ్మెల్యే నిగ్గదీశారు. క్విడ్‌ప్రో, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేపదాలకు జగనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నారు. అమరావతి ప్రాంతలోని రైతులు, అసైన్డ్‌భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని కోరినందునే చంద్రబాబు ఆనాడు భూములమ్ముకునే హక్కును కల్పించారన్నారు. అమరావతిని చంపేశాక, అసైన్డ్‌భూములకు కూడా కమర్షియల్‌ ప్లాట్లు ఇస్తానని చెబుతున్న జగన్‌, ఎంతభూమి చ్చినా రైతులకు ఉపయోగం ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంకోసం, 70, 80ఏళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న , వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటున్న కుంటలు, పుంతలు, లింకురోడ్లు, కల్లాలు, పోరంబోకు, పట్టాభూముల్ని జగన్‌ సర్కారు లాక్కుంటోందన్నారు.

ఎక్కడో ఊరికి దూరంగా ఉండే ఇలాంటి భూముల్ని అటురైతులకు కాకుండాచేసి, ఇళ్లస్థలాల పేరుతో పేదలకు అప్పగించినా ఎంతవరకు ఉపయోగపడతాయో ఆలోచించాలన్నారు. కుంటలు, పుంతలు, కల్లాలుగా ఉన్న 20, 30, 40సెంట్లభూమిని కేవలం 10, 15 కుటుంబాలకు ఇచ్చినా, ఆభూములన్నీ ఊళ్లకు కిలోమీటర్లపైబడి దూరంగా ఉన్నాయ ని, వాటిలో ఆయాకుటుంబాలు నివాసమెలా ఉంటాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అలాదూరంగా ఉన్న స్థలాలకు విద్యుత్‌సౌకర్యం, నీటివసతి, రవాణా వసతి కల్పించడానికి ప్రభుత్వానికి అదనపు భారమవుతుందన్నారు. జగన్‌సర్కారుకు నిజంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధే ఉంటే, ఊళ్లకు పక్కనే ఉండే భూములను ల్యాండ్‌అక్విజేషన్‌ పద్ధతిలో తీసుకొని, అన్నిరకాలుగా ఒకకాలనీగా అభివృద్ధిచేసి స్థలపంపిణీ చేస్తే బాగుంటుందని నిమ్మల హితవుపలికారు. ప్రజాసేవకులు గా ఉండాల్సిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వానికి వత్తాసు పలకడం మంచిపద్ధతి కాదన్నారు. మాజీమంత్రి కే.ఎస్‌.జవహర్‌పై 7, 8 సెక్షన్లుపెట్టి, తప్పుడుకేసులు మోపి, గృహనిర్బంధంలో ఉంచారని నిమ్మల మండిపడ్డారు. ర్యాలీచేయడమే జవహర్‌ చేసిన నేరమైతే, వైసీపీవారు చేస్తున్న ర్యాలీలపై ఏంసమాధానం చెబుతారని, వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి చిక్కుల్లో పడవద్దని రామానాయుడు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేది ఎప్పుడో సెటిల్ అయిపోయిన ఇష్యూ. అయితే జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక ముక్క సెక్రటేరియట్ ను వైజాగ్ లో పెడుతున్నాం అని, మరో ముక్క హైకోర్ట్ ని కర్నూల్ లో పెడుతున్నాం అని, అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పుడు జోక్యం చేసుకుంటుందా అని ఏపి ప్రజలు ఎదురు చూస్తున్న వేళ, ఈ రోజు కేంద్రం పార్లమెంట్ లో ఈ విషయం పై స్పందించింది. ఏపి రాజధాని పై ప్రకటన చేసింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని ఈ విషయంలో ప్రశ్నలు అడిగారు. జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు రాజధానులుగా చేస్తున్నారు, మీకు తెలుసా ? దీని పై గవర్నమెంట్ అఫ్ ఇండియా అభిప్రాయం ఏమిటి ? ఏపి ప్రభుత్వాన్ని ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు, తీసుకుంటే, రాష్ట్రం వెనక్కు వెళ్ళిపోతుంది, పెట్టుబడులు రావు, అలాగే భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోతారు అని, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించవచ్చు కదా అని గల్లా జయదేవ్ ప్రశ్న వేసి అడిగారు.

దీని పై, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని 2015లో నోటిఫై చేశారని, ఆయన గుర్తు చేసారు. అలాగే ప్రస్తుతం, మూడు రాజధానుల విషయం పై, తాము మీడియాలో వస్తున్న రిపోర్ట్ లు చూస్తున్నాం అని అన్నారు. ఇక రాష్ట్రాల్లో రాజధాని విషయం అనేది, రాష్ట్రాలకు సంబంధించిన విషయం అని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే, కేంద్రం కూడా అమరావతికి జరుగుతున్న అన్యాయం పై మేము ఏమి చెయ్యలేం అనే విషయం చెప్పిందా అనే విషయం అర్ధమవుతుంది. ఇంత గందరగగోళం రాష్ట్రంలో ఉన్నా, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. అయితే ఇక్కడ అమరావతిని నోటిఫై చేసారా, గజెట్ ఇచ్చారా అని అడుగుతున్న మంత్రులకు మాత్రం, ఈ రోజు సమాధానం దొరికింది. వారి మాటలు అబద్దం అని తేలిపోయింది.

ఇక పొతే, ఈ రోజు గల్లా జయదేవ్, అమరావతిలో రైతుల పై, మహిళల పై, తన పై జరిగిన దాడి విషయాలను పార్లమెంట్ ద్రుష్టికి తీసుకు వచ్చారు. అధికారం ఉంది కదా అని, అమరావతిలో వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. అకారణంగా 1-4-4 సెక్షన్ పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చలో అసెంబ్లీ అని రైతులు, మహిళలు పిలుపు ఇస్తే, ఆ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గున్న తనను, పోలీసులు వేధించారని అన్నారు. తనను చొక్కా చించి మరీ గాయపరిచారని అన్నారు. తనను అరెస్ట్ చేసి 13 గంటలు, అరెస్ట్ చూపించకుండా అటు ఇటూ తిప్పారని, చివరకు 13 గంటల తరువాత, జడ్జి ముందు హాజరు పరిచారని అన్నారు. అమరావతిలో 49 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని గల్లా సభ దృష్తికి తీసుకొచ్చారు.

తాము ఎక్కడినుంచి వచ్చామన్నది మర్చిపోయి, నోటికి పనిచెబుతున్న వైసీపీనేతలు, జగన్‌వద్ద మార్కులు పొందడంకోసం, చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, నగరిఎమ్మెల్యే రోజా ఎవరుపెట్టిన రాజకీయభిక్షతో పైకివచ్చానన్న విషయం విస్మరించి ప్రవర్తిస్తోందని టీడీపీమహిళానేత, మాజీఎమ్మెల్యే, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మంగళవారం ఆమె టీడీపీ కేంద్రకార్యాలయంలో విలేలకరులతో మాట్లాడారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌లను విమర్శిస్తున్న రోజా, నేడు ఆమె ఆస్థాయికి రావడానికి సదరువ్యక్తులే కారణమనే సంగతి తెలుసుకోవాలన్నారు. ఓడిపోయినవాళ్లంతా దద్దమ్మలే అని రోజా భావిస్తున్నట్ల యితే, ఆమెకూడా దద్దమ్మేనన్నారు. శాసనమండలిలో ఉన్నవారంతా భజనపరులే అని చెబుతున్న రోజా, అదే ఎమ్మెల్సీ పదవికోసం చంద్రబాబు కాళ్లుపట్టుకున్న విషయా న్ని రాష్ట్రప్రజలు మర్చిపోలేదన్నారు. వైసీపీఎమ్మెల్యేలను మించిన భజనపరులు ఎవరూ లేరని కూడా ప్రజలకు అర్థమైన విషయాన్ని రోజా గ్రహించాలన్నారు. రోజా, ఇతర వైసీపీమహిళానేతల మాటలకు జనం ఇప్పటికే నవ్వుకుంటున్నారన్నారు. అస్తమానం చంద్రబాబుని, లోకేశ్‌ని విమర్శించే రోజా, తనపార్టీ నేతలతో కలిసి చర్చకు రావాలని, ఏఅంశంపై లోకేశ్‌తో చర్చకు వస్తుందో ఆమేచెప్పాలన్నారు.

పీఠాధిపతుల చుట్టూ తిరిగితే పదవులు వస్తాయని భావిస్తున్న వైసీపీనేతలు, తమనియోజకవర్గాల్లోని ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితికి దిగజారారని అనిత మండిపడ్డారు. అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళలగురించి చులకనగా మాట్లాడిన రోజాకు పిండప్రదానం చేయడానికి రాజధాని ఆడబిడ్డలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై జరగుతున్న దాష్టీకాలు, దారుణాలు, అఘాయిత్యాల గురించి స్పందించలేని రోజా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం జరగనివాటిని జరిగినట్లుగా భూతద్దంలో చూపిందన్నా రు. వైసీపీప్రభుత్వం వచ్చిన 8నెలల్లోనే 150 మానభంగాల కేసులు నమోదయ్యాయని, ఆనాడు నానాయాగీ చేసిన రోజాకు ఇవేవీ తెలియవా అని అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్కరోజుకూడా ఒక్కబాధితురాలిని పరామర్శించని రోజా, మళ్లీ యధావిథిగా చంద్రబాబు, లోకేశ్‌ల జపమే చేస్తున్నారన్నారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్‌ కన్నాముందు, జగన్‌ వస్తాడని చెప్పిన రోజా, రాష్ట్రంలో దిశచట్టం అమలవుతుందో, లేదో సమాధానం చెప్పాలన్నారు.

జగన్‌అన్న తీసుకొచ్చిన దిశచట్టం చెత్తబుట్టపాలైంద ని అనిత దుయ్యబట్టారు. టీడీపీఅధినేతను, లోకేశ్‌ను విమర్శించే ముందు తాము సూచించిన సవాల్‌ని రోజా స్వీకరించాలన్నారు. చంద్రబాబుని ఎందుకు తరిమికొట్టాలో చెప్పాలన్న అనిత, కియాను తీసుకొచ్చినందుకా.. కరవు ప్రాంతంలో వరిపండేలా నీటిని పారించినందుకు తరిమికొట్టాలో రోజా చెప్పాలన్నారు. విశాఖకు వచ్చిన పరి శ్రమలను తరిమేసి, సుజలస్రవంతి వంటి పథకాలను నిలిపివేసిన జగన్‌, తనభూముల్ని అమ్ముకోవడానికే విశాఖలో రాజధాని అంటున్నాడన్నారు. ఎవరు ఎవర్ని తరిమికొట్టా లో, ఎవరు ఎవర్ని గెలిపించాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. నగరిప్రజలు తమ ఎమ్మెల్యే ఎక్కడుందో కనుక్కోవాలని స్టూడియోలచుట్టూ తిరుగుతుంటే, రోజామాత్రం పీఠాధిపతులు చుట్టూ తిరుగుతోందన్నారు. రోజా పద్ధతిమార్చుకోకుండా అదేతీరుగా ప్రవర్తిస్తే, త్వరలోనే ఆమె బతుకుజట్కా బండి అవడం ఖాయమని అనిత ఎద్దేవాచేశారు.

Advertisements

Latest Articles

Most Read