కేంద్రంలో ప్రధాని మోదీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడి, ప్రాంతీయ పార్టీలకే ప్రధాని పదవి ఇవ్వాలన్న ఆలోచన వస్తే అది చంద్రబాబుకు దక్కే అవకాశాలున్నాయని మాజీ ఎంపీ, సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఉండవల్లి పాల్గొన్నారు. ‘‘మోదీ వ్యతిరేక శక్తులను ఏకంచేయడంలో, ఆయనను ఎదిరించడంలో మమత, మాయావతికంటే చంద్రబాబు ముందున్నారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక కూటమి అధికారంలోకి వచ్చి ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వాల్సి వస్తే... చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం ఉంది. అయితే, టీడీపీ పది లేదా అంతకంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి’’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

undvalli 8052019

చంద్రబాబుపై 17 కేసులున్నాయని రాజకీయ విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, ఆయన 3 కేసులు మినహా అన్నీ కొట్టేయించుకున్నారని ఉండవల్లి చెప్పారు. ఆయనపై వైఎస్‌ విజయలక్ష్మి వేసిన కేసులతో సహా అన్ని కేసులు కొట్టేశారన్నారు. ఇటీవల లక్ష్మీపార్వతి కేసు మళ్లీ బయటకు వచ్చిందన్నారు. ఏలేరు స్కామ్‌తో చంద్రబాబుకు ప్రత్యక్షంగా సంబంధం లేదని... ఇది ప్రభుత్వంపై ఉన్న కేసు అని ఉండవల్లి చెప్పారు. ఇక... పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తనకు ఎన్నో సందేహాలున్నాయని ఉండవల్లి అన్నారు. ‘‘కాఫర్‌డ్యామ్‌నే ఆధారంగా చేసుకుని గోదావరి జలాలను మళ్లిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే గోదావరి జలాల ఉధృతికి రాజమండ్రి నుంచి పోలవరం దాకా కొట్టుకుపోతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

undvalli 8052019

ఒకవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని.. పురుషోత్తపట్నం ద్వారా ఎడమ ప్రధాన కాలువ ద్వారా జలాలను విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని... ఇంతలో పోలవరం డ్యామ్‌ నిర్మాణంలో తొందరేమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. పోలవరం డ్యామ్‌ నిర్మాణంలో తన సందేహాలు నివృత్తి చేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదన్నారు. తన సందేహాలను జల వనరుల శాఖ అధికారులు ఎవరైనా తీరిస్తే .. ఇప్పటిదాకా దేవుడిలాంటి వారిని విమర్శించినందుకు క్షమాపణలు చెబుతానని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై సందేహాలను ప్రస్తావిస్తూ... వీవీ ప్యాట్‌ల లెక్కింపులో ఏమైనా పొరపొట్లు దొర్లితే మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఉండవల్లి చెప్పారు.

రాష్ట్రంలో ఏ నేరం, ఘోరం, మోసం జరిగినా, దాని వెనుక ఎదో ఒక చోట వైసీపీ పార్టీకి చెందిన ఎవరో ఒకరు ఉండటం అనేది సర్వ సాధారణం. గతంలో అనేక విషయాలు ఇవి చూసాం. ఇప్పుడు తాజగా జరిగిన బ్యాంక్ మాసంలో, ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకు చెందిన బ్యాంకులో ఏకంగా రూ. 2.64 కోట్ల నగదు మాయమైంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఖాతాదారులైన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగదు మాయం కావడంతో ఆందోళన చెందిన బ్యాంక్ క్యాషియర్ ఈశ్వర్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం, వవ్వేరు కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఈ బ్యాంకుకు వైసీపీ నేత సూరా శ్రీనివాసులు రెడ్డి ఛైర్మన్‌గా ఉన్నారు. నగదు మాయం కావడం వెనుక సూరాతో పాటు ఉద్యోగుల పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

vavveru 08052019

గడచిన ఆరేళ్లలో ఖాతాదారుల ఎకౌంట్లలో తప్పుడు లెక్కలు సృష్టించి డబ్బులు స్వాహా చేసినట్లు సమాచారం. దీంతో అంతర్గత విచారణ చేపట్టిన బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ఇంటిదొంగల చేతి వాటంపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, ఇతర ఉద్యోగ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఖాతాదారుల సొమ్మును సొంత ఖర్చులకు శ్రీనివాసులు రెడ్డి వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాసులు రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తరఫున బ్యాంక్ నగదును ఖర్చు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసులు రెడ్డిపై గతంలో మద్యం కేసులు ఉన్నాయి. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్యాషియర్ ఈశ్వర్‌ను అధికారులు విచారిస్తున్నారు. ఈ బ్యాంక్‌లో ఏడాదికి రూ. వంద కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి.

 

పోలవరం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతుల అంశంపై జోక్యం చేసుకోలేమని ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. పోలవరం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందంటూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. 2005లో పర్యావరణ అనుమతులు ఇస్తే.. ఈ పిటిషన్‌లో వాటినే సవాలు చేశారని, ఇప్పుడు దీనిపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతిలిచ్చిన 90 రోజుల్లోనే ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిటిషన్ వేయాలని ఎన్జీటీ తెలిపింది. మత్స్యకారుల జీవనోపాధి అంశమైనా.. పర్యావరణ అనుమతులపైనే సవాల్ చేస్తూ పిటిషన్ వేశారని, అయినా ఇంత ఆలస్యంగా పిటిషన్ ఎందుకు వేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. కాగా, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే పోలవరం వల్ల మత్స్యకారులకు నష్టం జరిగేటట్లయితే ఫోరమ్‌లను ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు ఎన్జీటీ సూచించింది.

polavaram 08052019

ఇది ఇలా ఉంటే, గత రెండు రోజులుగా పోలవరం పై విషం చిమ్ముతున్న జగన్ సన్నిహితులు కేవీపీ, ఉండవల్లికి మంత్రి దేవినేని ఉమా ఈ రోజు కూడా కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు లోటస్‌పాండ్‌ కేంద్రంగా కేసీఆర్‌, జగన్‌ కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేల మంది కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పోలవరం పనులు చేస్తుంటే.. రాజమండ్రి కొట్టుకుపోతుందని కొందరు అసత్యాలు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదే పదే ఉత్తరాలు రాసే కేవీపీ, ఉండవల్లి, జగన్‌కి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు.

polavaram 08052019

జగన్‌పై ప్రేమ ఉంటే వైకాపాలో చేరాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్‌ సుప్రీంకోర్టుని, ఆయన కుమార్తె కవిత జాతీయ హరిత ట్రైబ్యునల్‌ని ఆశ్రయించినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. పట్టిసీమ దండగ అని మాట్లాడిన నేతలు.. ఆ నీటి ద్వారా కృష్ణా జిల్లాకు, రాయలసీమ జిల్లాలకు ఎంత లబ్ధి చేకూరిందో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరానికి రావాల్సిన నిధులను కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని నుంచి సాధించుకుంటామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు తీరికలేకుండా పోయిందని విమర్శించారు. ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం ఇప్పటికైనా ఆపాలని మంత్రి సూచించారు.

సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, ఆ పార్టీ శాసనసభ్యుడు విక్రమ్ రంద్వాలు జర్నలిస్ట్ లకు డబ్బులను ఎన్వలప్ కవర్లలో పెట్టి ఇచ్చినట్లు ఉంది. దీనిపై లేహ్ ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక ఎన్నికల అధికారికి లేఖ రాశారు. గురువారం (మే-2,2019) హోటల్ సింగీ ప్యాలెస్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో జర్నలిస్ట్ లకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆ లేఖలో ఆరోపించారు.

cc tv footage 08052019

అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. లేహ్ ప్రాంతంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ర్యాలీ కవర్ చేసేందుకు జర్నలిస్ట్ లకు ఇన్విటేషన్ లెటర్స్ ఇచ్చినట్లు బీజేపీ తెలిపింది. ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ లపై పరువునష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది. ఎన్వలప్ కవర్లు అందుకున్న జర్నలిస్ట్ లలో ఒకరైన రిన్ చన్ అన్ గ్మో మాట్లాడుతూ...సింగీ ప్యాలెస్ లో మీడియా సమావేశ సమయంలో బీజేపీ సీనియర్ లీడర్ నలుగురు జర్నలిస్ట్ లకు ఎన్వలప్ కవర్లు ఇచ్చారు. ఎన్వలప్ కవర్లను ఇక్కడ ఓపెన్ చేయవద్దు అని ఆయన సూచించారు. ఎన్వలప్ అందుకున్న వారిలో నేను కూడా ఉన్నాను.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో ఇదంతా జరిగింది. నాకు అనుమానం వచ్చి ఓపెన్ చేశాను. కొన్ని రూ.500నోట్లు అందులో ఉన్నాయి. దీంతో తిరిగి ఆయనకే ఆ ఎన్వలప్ ఇచ్చాను. అయితే ఆయన అది తీసుకునేందుకు నిరాకరించారు.

cc tv footage 08052019

అయితే ఆ ఎన్వలప్ ను అక్కడే టేబుల్ పై ఉంచినట్లు ఆమె తెలిపింది. జర్నలిస్ట్ ల కంప్లెయింట్ తో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది. కంప్లెయింట్ ను లోకల్ కోర్ట్ కి పంపించినట్లు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐదో దశలో భాగంగా లడఖ్ రీజియన్ లో సోమవారం(మే-6,2019) పోలింగ్ జరిగింది. లడఖ్ లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ బీజేపీ,కాంగ్రెస్ లు బుద్దిస్ట్ అభ్యర్థులను బరిలో నిలిపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో 36 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి లడఖ్ సీటుని బీజేపీ దక్కించుకుంది.అయితే గతేడాది నవంబర్ లో లడఖ్ బీజేపీ ఎంపీ తుప్స్ స్తాన్ చెవాంగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.మరికొందరు కీలక నాయకులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు.

Advertisements

Latest Articles

Most Read