బీజేపీ వ్యక్తి ఆధారిత పార్టీ ఎన్నటికీ కాదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికగానే పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ చుట్టూనే బీజేపీ రాజకీయా లు తిరుగుతున్నాయని, ఆయనపైనే పార్టీ పూర్తిగా ఆధారపడిందన్న వ్యాఖ్యలను గడ్కరీ కొట్టిపారేశారు. బీజేపీ ఎన్నటికీ మోదీ లేదా అమిత్‌ షాది కాదని తేల్చిచెప్పారు. ‘‘గతంలో వాజ్‌పేయి, ఆడ్వాణీది కాలేదు.. ఇప్పుడు మోదీ, షా ది కాదు’’ అని గడ్కరీ అన్నారు. పార్టీ, ప్రధాని పరస్పరం సహకరించుకుంటారని వివరించారు. ‘‘పార్టీ బలంగా ఉండి నాయకుడు బలహీనంగా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించలేం. కానీ నాయకుడు బలంగా ఉండి పార్టీ బలహీనంగా ఉన్నా గెలవొచ్చు. బలమైన నాయకుడికి సహజంగానే అగ్రస్థానం దక్కుతుంది’’ అని అన్నారు.

gadkari 11052019

ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతోనే.. జాతీయవాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలను గడ్కరీ ఖండించారు. జాతీయవాదం సమస్య కాదని.. అది బీజేపీ ఆత్మ అని స్పష్టంచేశారు. కాగా, ప్రధాని కావాలనే ఆలోచన గానీ, కోరిక కానీ, అజెండా గానీ లేదని గడ్కరీ స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ విషయంలో దాచుకోవాల్సింది ఏమీ లేదని, ఈ విషయంపై ఇంతకు ముందే వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచనలు గానీ, కోరిక కానీ ఆయనకు లేదని, అజెండా కూడా లేదని తేటతెల్లం చేశారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో మిత్ర పక్షాలపై ఆధారపడాల్సి వస్తే కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తారన్న ఊహాగానాలు మీడియాలో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. అయితే వీటిని నితిన్ తోసిపుచ్చారు.

 

gadkari 11052019

వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమని, బీజేపీ ప్రభుత్వం ఎంతమాత్రం కాదని గడ్కరీ కుండబద్దలు కొట్టారు. ఒకవేళ బీజేపీకే మెజారిటీ వచ్చినా సరే, దానిని తాము ఎన్డీఏ ప్రభుత్వం గానే పరిగణిస్తామని, తమ మిత్రులను తమతో కలుపుకుపోతామని ఆయన తెలిపారు. ఏవిధంగా అత్యధిక సీట్లను సాధిస్తారని ప్రశ్నించగా... ఒడిశా, బెంగాల్, కేరళతో పాటు యూపీలో కూడా అత్యధిక సీట్లు సాధించడం ద్వారా తమ కల నెరవేర్చుకుంటామని నితిన్ గడ్కరీ ప్రకటించారు. బీజేపీ రానూ రానూ మోదీ కేంద్రంగానే నడుస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వాజ్‌పాయ్, ఆడ్వాణీ ఉన్న రోజుల్లోనూ అలా నడవలేదని, ఇప్పుడూ అలా నడవదని స్పష్టం చేశారు. బీజేపీ సైద్ధాంతిక పునాదులున్న పార్టీ అని, మోదీ,షా‌ పార్టీ ఎన్నటికీ కాదని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరానే కాంగ్రెస్, కాంగ్రెస్సే ఇందిరా అని అప్పటి అధ్యక్షుడు డీకే బరువా నినదించినట్టు ప్రస్తుతం మోదీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోదీ అన్నట్లు తయారైందా? అన్న ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ బీజేపీ ఎప్పటికీ వ్యక్తి కేంద్రంగా నడవదని ఆయన తెలిపారు.

‘ఔట్‌ అయిన బ్యాట్స్‌మన్‌ అంపైర్‌ను నిందించినట్లు... ఓటమి ఖరారు కావడంతో విపక్షాలు ఈవీఎంలను నిందిస్తున్నాయి’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘అసలు అంపైరే లేకుండా మ్యాచ్‌ ఆడేయాలని మోదీ జట్టు ప్రయత్నిస్తోంది. రిఫరీ వ్యవస్థనే నాశనం చేస్తోంది. ఈ జట్టును దేశ ప్రజలు ఈ నెల 23న పక్కన పెట్టేస్తున్నారు. అంపైర్‌ను పెట్టుకుని, రిఫరీ వ్యవస్థను, ఇతర వ్యవస్థల్ని సంరక్షిస్తూ నిబంధనల ప్రకారం ఆడే జట్టుకు పట్టం కడుతున్నారు’ అని శుక్రవారం తెలిపారు. ఈసీపై తామెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. మోదీకే ఆ అలవాటుందన్నారు. ‘గోద్రా అల్లర్ల అనంతరం గుజరాత్‌ సమాజాన్ని మతప్రాతిపదికన చీల్చి... దాని నుంచి లబ్ధిపొందాలనుకున్నారు.

game 27032019

అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లింగ్డో తన బృందంతో గుజరాత్‌లో పర్యటించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో మీరు... జేమ్స్‌ మైఖేల్‌ లింగ్డో ఇటలీ నుంచి వచ్చారా? రాజీవ్‌గాంధీ కుటుంబాన్ని అడగాలి అని వ్యాఖ్యానించారు. లింగ్డో, సోనియాగాంధీ చర్చిలో కలుస్తారా అని వ్యాఖ్యానించారు. ఈసీని మతం పేరిట, వ్యక్తిగతంగా విమర్శించిన మీరా మాకు నీతులు చెప్పేది?’ అని మోదీపై మండిపడ్డారు. ప్రధానికి ఉండాల్సిన లక్షణాలేవీ ఆయనకు లేవన్నారు. ‘దివంగత ప్రధానులు, రాజకీయ నేతల కుటుంబాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తా రు. దేశ రక్షణ వ్యవస్థను మీ స్వార్థానికి వాడుకుంటారు. అన్ని వ్యవస్థల్ని, నాయకులను, పార్టీలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి ట్రాక్‌ రికార్డు పెట్టుకుని మాకు నీతులు చెప్తారా?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

 

game 27032019

"ఎన్నికల షెడ్యూల్‌కు 73 రోజులు తీసుకున్న ఈసికి 50% వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..?. రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోదీ వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు" అని చంద్రబాబుఅన్నారు.

ఆయ‌న ఓ సీనియ‌ర్ ఐఏయ‌స్ అధికారి. ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చే అధికారుల్లో ఒక‌రు. కీల‌క‌మైన శాఖ‌లో ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న నివాసంలో చోరీ జ‌రిగింది. ఆయ‌న ఇంట్లో పెద్ద ఎత్తున న‌గ‌దు.. ఆభ‌ర‌ణాలు చోరీకి గురైన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ర‌హ‌స్యంగానే విచార‌ణ సాగిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దు రూపంలో ఎలా ఉంది..లెక్క‌లు ఏంట‌నే చ‌ర్చ మొద‌లవుతుంద‌నే భ‌యం తో ఆయ‌న కొంద‌రు ముఖ్యుల ద్వారా వ్య‌వ‌హారం న‌డుపుతున్నారు.. ఆ సీనియర్ ఐఏఎస్ నివాసంలో చోరి జ‌రిగింది. దాదాపుగా 85 ల‌క్ష‌ల న‌గ‌దు ..పెద్ద ఎత్తున అభ‌ర‌ణాలు మాయం అయిన‌ట్లు స‌మాచారం.

ias 10052019

విజ‌యవాడ‌లోని సూర్యారావు పేట‌లో ఆయ‌న నివాసం ఉంటున్నారు. ఇంత భారీ స్థాయిలో న‌గ‌దు..ఆభ‌ర‌ణాలు పోతే ఆ అధికారి మాత్రం ఓపెన్‌గా కేసు పెట్ట‌టానికి నిరాక‌రించిన‌ట్లె స‌మాచారం. ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దు పోయింద‌ని చెబితే..అస‌లు అంత న‌గ‌దు ఎక్క‌డి నుండి వ‌చ్చింద‌నే దానికి స‌మాధానం..లెక్కులు చెప్పాల్సి ఉంటుందనే కార‌ణంతో మ‌న్నకుండి పోయారు. అదే స‌మ‌యంలో దాదాపు 25 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాలు సైతం మాయం అయ్యాయి. వీటిని అధికారి బ‌య‌ట‌కు చెప్ప‌లేక పోతున్నారు. ఆల‌స్యంగా ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆయన నివాసంలో చోరి జ‌రిగిన త‌రువాత కొంద‌రు ముఖ్యుల స‌హ‌కారంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా అధికారులు విచార‌ణ చేస్తున్నారు.

ias 10052019

అయితే, ఆయ‌న నివాసంలో ఎంతో కాలంగా ప‌ని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఈ చోరీకి పాల్ప‌డిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. సెక్యూరిటీ గార్డు ఎంతో కాలంగా ఆయ‌న వ‌ద్ద ప‌ని చేస్తున్నాడు. న‌మ్మ‌కంగా ఉండే వ్య‌క్తి కావ‌టంతో అధికారి కుటుంబం కూడా కుటుంబ స‌భ్యుడిగానే చూసుకుంది. అయితే, ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో సెక్యూరిటీ గార్డు ఆ సొమ్ము..ఆభ‌ర‌ణాల‌తో స‌హా ఉడాయించాడు. పోలీసులు ఈ కేసును టాస్క్‌ఫోర్స్ కు బ‌దిలీ చేసారు. వారు ప‌శ్చిమ బెంగాల్‌లో త‌ల దాక్కున్న అతన్ని ప‌ట్టుకున్నారు. ఏపీకీ తీసుకొచ్చారు. అప్ప‌టికే అత‌డు పెద్ద మొత్తంగా న‌గ‌దు ఖ‌ర్చు చేసిన‌ట్లు గుర్తించారు. అయినా..మిగిలిన సొమ్ము రిక‌వ‌రీ చేసీ ఐఏయ‌స్ అధికారికి ఇచ్చారు. వ‌చ్చిన దాంతో సంతృప్తి ప‌డి అధికారి కామ్ అయిపోయారు. అయితే, ఈ వ్య‌వ‌హారం అంతా ఇంత గోప్యంగా ఉంచాల్సిన ప‌రిస్థితికి కార‌ణం..ఆ న‌గ‌దు మొత్తానికి అధికారిక లెక్క‌లు లేక‌పోవ‌ట‌మే అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య రాజ‌కీయ‌ప‌ర‌మైన విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. వ్య‌క్తిగ‌తంగా కూడా విమ‌ర్శించిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత కూడా ఈ రెండు పార్టీల మ‌ధ్య మాటల యుద్ధం న‌డుస్తోంది.రాజ‌కీయప‌ర‌మైన ప్ర‌తి అంశానికీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ల‌కు ముడిపెడుతూ వైఎస్ జ‌గ‌న్‌పై టిడిపి విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆశ్చ‌ర్య‌క‌రంగా చంద్ర‌బాబును స‌మ‌ర్థిస్తోంది వైఎస్ఆర్ సీపీ. ఆ విష‌యంలో చంద్ర‌బాబు చేస్తోన్న కృషిని మెచ్చుకుంటోంది. ఆయ‌న చేస్తోన్న పోరాటాన్ని స్వాగ‌తిస్తోంది. ఆయ‌న‌ను అభినందిస్తోంది. అదే- వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్య‌వ‌హారం.

ambati 10052019

ఈ విష‌యంలో చంద్ర‌బాబు చేస్తోన్న పోరాటాన్ని అభినంద‌నీయ‌మ‌ని వైఎస్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు చెబుతున్నారు. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాలంటూ చంద్ర‌బాబు చేస్తోన్న డిమాండ్‌లో కొంత‌ నిజాయితీ ఉంద‌ని, నిబద్ధ‌త క‌నిపిస్తోంద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్ర‌కారం.. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, అందులో నుంచి వెలువడిన వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో తేడా వ‌స్తే ఏం చేస్తార‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంద‌ని, తేడా వ‌స్తే- అన్ని వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కిస్తారా? లేదా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

ambati 10052019

జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైన ఈ విష‌యంపై చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం వాడుకోకూడ‌ద‌ని, చిత్త‌శుద్ధితో పోరాటం చేయాల‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే దీనిపై తాము కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజ‌కీయాలు చేయాల‌నుకోవ‌డం స‌రికాద‌ని అంబ‌టి హిత‌బోధ చేశారు. సుప్రీంకోర్టులో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు వీవీ ప్యాట్ల‌ను లెక్కించ‌డానికి అవ‌కాశం ఇచ్చిందని, తేడా వ‌స్తే మొత్తం లెక్కించాలని అడ‌గ‌టంలో ధ‌ర్మం ఉంద‌ని అంబటి రాంబాబు చెప్పారు. అయిదు ఈవీఎంల‌ల్లో తేడాలంటూ వ‌స్తే, అన్ని ఈవీఎంలనూ లెక్కించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం స‌బ‌బేన‌ని ఆయ‌న అన్నారు.

Advertisements

Latest Articles

Most Read