ఈనెల 10న ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం కార్యాలయం నుంచి నోట్ వెళ్లింది. అయితే కేబినెట్ నిర్వహణపై సమాలోచనలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్ సమావేశమయ్యారు. భేటీ పూర్తయిన అనంతరం సీఎస్ సుబ్రహ్మణ్యం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ నెల 10న కేబినెట్ నిర్వహణ అనుమానమేనని సీఎస్ చెప్పుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే కేబినెట్ నిర్వహణ ఉంటుందన్నారు. అజెండాలో అంశాలపై ఈసీఐ అనుమతి ఇస్తేనే కేబినెట్ భేటీ ఉంటుందని సీఎస్ తేల్చిచెప్పారు.

lvs 07052019

అసాధారణ పరిస్థితులు ఉంటేనే కేబినెట్ నిర్వహణకు అనుమతి ఉంటుందన్నారు. తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాలు ఉంటేనే కేబినెట్‌లో పెడతామన్నారు. ఏయే అంశాలు అజెండాలో పెట్టాలనేది సీఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సీఎంవో ఇచ్చే అజెండాపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు. శాఖలు ఇచ్చిన సమాచారాన్ని సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తోందని.. ఈసీకి పంపించాల్సిన అంశాలు ఇక్కడినుంచి పంపిస్తామన్నారు. ఈసీఐకు 48 గంటలు ముందు సమాచారం ఇవ్వాలని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

 

lvs 07052019

ఈనెల 10 ఏపీ కేబినెట్ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఎన్నికల కోడ్‌ను అనుసరించే ఏపీ మంత్రివర్గ సమావేశం ఉండాలని అన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారమే నేతలు, అధికారులు నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు, అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పుస్తకాలు పంపామని ఆయన అన్నారు. అనుమానాలు ఉంటే సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తామిచ్చిన పుస్తకాల్లో అన్ని వివరాలు ఉన్నాయని, అవి చదువుకుని, చర్యలు తీసుకోవాలని ద్వివేది చెప్పారు. రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఈ నెల 10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎం కార్యాలయం సీఎస్‌కు పంపిన నోట్‌ ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం కార్యాలయం పంపిన నోట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రమణ్యం అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్‌, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్‌ సమావేశమయ్యారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. కేబినెట్‌ సమావేశం నిర్వహించాలంటే సీఎం కార్యాలయం సీఎస్‌కు నోట్‌ పంపిస్తుంది. ఆ నోట్‌ను సీఎస్‌... ఇతర విభాగాల కార్యదర్శులకు పంపిస్తారు. కార్యదర్శులు పంపే సమాచారం ఆధారంగా అజెండా రూపొందిస్తారు.

cs 07052019

ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో కేబినెట్‌ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి సమస్య, తుపాను సహాయక చర్యలు, కరవు పరిస్థితులపై చర్చించేందుకు కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై సీఎస్‌ సుబ్రమణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. కేబినెట్‌ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశముంది. సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా సీఎస్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఫణి తుపాను ప్రభావం, ఖరీఫ్‌ యాక్షన్ ప్లాన్, తాగునీటి ఎద్దడిపై సమావేశంలో చర్చ జరగనున్నది. సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఎలా రియాక్ట్ అవుతారా..? అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

cs 07052019

కేబినెట్‌ భేటీ ఎజెండాకే పరిమితమవుతుందా? లేదా బిజినెస్‌ రూల్స్‌పై కూడా చర్చిస్తారా..? అని ఉత్కంఠ నెలకొంది. కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ప్రకారమే వ్యవహరించాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సమీక్షా సమావేశాలకు అటు సీఈవో.. ఇటు సీఎస్ ఇద్దరూ అంగీకరించకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుందా..? లేదో వేచి చూడాల్సిందే మరి. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ, అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాకపోతే, క్యాబినెట్ ఏమి చేస్తుంది అనేది కూడా ఆసక్తిగా మారింది.

యాభై శాతం ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ అంశంపై 22 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఫరూక్‌ అబ్దుల్లా ఈ ఉదయం సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. 50శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్‌పై .. కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. చంద్రబాబు సహా 21 పార్టీల విపక్షనేతలు రివ్యూ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 5శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని.. ఇప్పటికే ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన విషయం విధితమే. అంతకు ముందు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీ భవన్‌లో ఫరూక్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. వీవీప్యాట్ల అంశంపై చంద్రబాబు, ఫరూక్‌ అబ్దుల్లా మధ్య చర్చ జరిగింది. అనంతరం ఇద్దరూ కలిసి సుప్రీం కోర్టుకు వెళ్లారు.

supreme 07052019

సోమవారం రాత్రి చంద్రబాబు ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి లేఖ రాశారు. 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని, భారీగా అదనపు సిబ్బంది అవసరమని సుప్రీంకోర్టుకు ఈసీ వినిపించిన వాదనను తప్పుపట్టారు. ‘‘వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుందన్నదొక్కటే ఈసీ అభ్యంతరం. కానీ, ఈసీ వాదనలో నిజం లేదు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినప్పుడే గరిష్ఠంగా రెండో రోజుకు తుది ఫలితాలు వచ్చేవి. 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపునకు ఒక్కరోజుకంటే ఎక్కువ సమయం పట్టదు. 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తే... ఒక్కో టేబుల్‌కు వెయ్యి చొప్పున గంటకు 14వేల ఓట్లు లెక్కించవచ్చు. అలాగే, దీనికి అదనపు సిబ్బంది కూడా అవసరం లేదు. ఈవీఎంలలో ఓట్లు లెక్కించిన వారినే వీవీప్యాట్ల లెక్కింపునకూ ఉపయోగించుకోవచ్చు’’ అని చంద్రబాబు తన లేఖలో వివరించారు.

supreme 07052019

ఈసీ తన వాదనలోని డొల్లతనాన్ని గ్రహించి, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘‘50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుకోసం 22 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఓటు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. దానిపై అనుమానం కలిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించకూడదు. ఇప్పటికైనా వాస్తవాలు పరిశీలించి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు. 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని, భారీగా అదనపు సిబ్బంది అవసరమని సుప్రీంకోర్టుకు ఈసీ వినిపించిన వాదనను చంద్రబాబు తప్పుపట్టారు.

 

వీవీప్యాట్ల అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. కనీసం 50శాతం వీవీప్యాట్‌ చీటీలను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘ఈ అంశంలో మేమిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేము’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్లపై కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాదనలు ముగించి కోర్టు తీర్పు వెల్లడించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 21 పార్టీల విపక్షనేతలు రివ్యూ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం విచారించిన సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి విపక్షాలకు షాకిచ్చింది.

sureme 0702019

గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 5 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు మాత్రమే లెక్కించాలని గతంలో సుప్రీం ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటే వారం పడుతుందని ఈసీ పేర్కొన్నది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా లెక్కించే వీవీప్యాట్‌ స్లిప్పుల సంఖ్యను పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఒక శాసనసభ నియోజకవర్గంలోని అయిదు వీవీప్యాట్‌ స్లిప్పులను ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని ఎన్నికల కమిషన్‌ను ఏప్రిల్‌ 8న ఆదేశించింది.

sureme 0702019

అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. శాసనసభ నియోజకవర్గం పరిధిలో కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. ‘వీవీప్యాట్‌ చీటీల లెక్కింపును ఒకటి నుంచి అయిదుకు చేయడం సహేతుకమైన సంఖ్య కాదు. అది సంతృప్తి కలిగించేదీ కాదు’ అని ప్రతిపక్ష పార్టీలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. దీనికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తూ, అవి లెక్కించాలి అంటే 6 రోజులు పడుతుంది అంటూ కోర్ట్ కు చెప్పింది. అయితే ఈ రివ్యూ పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టు, కౌంటింగ్ కు 6 రోజులు పడుతుంది అనే విషయం సుప్రీం కూడా నమ్మినట్టు అనుకోవాలి.

Advertisements

Latest Articles

Most Read