చంద్రబాబు నివాసం పై అతి పెద్ద కుట్ర జరిగిందా ? అసలు ఏమి సాధించటం కోసం ఇలా ప్లాన్ చేసారు ? కేవలం చంద్రబాబుని అల్లరి చెయ్యటం కోసమా ? లేక నిజంగా ఏదైనా కుట్ర ఉందా ? ఈ రోజు చంద్రబాబు ఉండవల్లి నివాసం దగ్గర అలజడి రేగింది. చంద్రబాబు చెయ్యి నొప్పి కారణంగా, హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న వేళ, ఆయన నివాసం దగ్గర సెక్యూరిటీ వాళ్ళు, కొంత మంది తెలుగుదేశం నేతలు ఉన్నారు. అయితే ఈ సమయంలో వారికి కొంత మంది అనుమానాస్పదంగా తిరగటం కనిపించింది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాక్స్ లు కూడా ఉన్నాయి. అయితే వారు మాత్రం చంద్రబాబు సెక్యూరిటీ దగ్గర ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా, అక్కడకు వచ్చి డ్రోన్ లు పైకి లేపారు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిలదీసిన వినలేదు, దీంతో అక్కడ చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

cbn 16082019 2

ఈ నేపధ్యంలో అక్కడే ఉన్న తెలుగుదేశం నేతలు, మీరు ఎవరు, ఇక్కడకు ఎందుకు వచ్చారు, పర్మిషన్ ఏది అని అడిగినా వారి వద్ద సమాధానం లేదు. మేము డ్రోన్ వీడియోలు తీస్తామని, నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా మేమే తీసామని, జగన్ అన్న పంపించాడని ఒకసారి, కాదు కాదు, జగన్ అన్న దగ్గర ఉండే కిరణ్ అన్న పంపించాడు అని మరోసారి చెప్పారు. దీనికి సంబందించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ కిరణ్ ఎవరు అనేది మాత్రం ఎవరికీ తెలియటం లేదు. మరో పక్క విషయం తెలియటంతో, పోలీసులు వచ్చి, అతన్ని మేము విచారణ చేస్తాం అని తీసుకు వెళ్తున్న టైంలో, తెలుగుదేశం నేతలు అడ్డు పడ్డారు. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఇక్కడకు వచ్చారో, ఇవన్నీ చెప్పకుండా, మీరు తీసుకువెళ్లటానికి వీలు లేదని ఆందోళన చేసారు.

cbn 16082019 3

అయితే, కొద్ది సేపటి తరువాత, వాళ్ళు మా వాల్లే అంటూ జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. వరద అంచనా కోసం మేమే పంపించామని చెప్పారు. అయితే, వాళ్ళని ఐడి కార్డులు అడిగితె మాత్రం లేవు అని చెప్పారు. ఇక మరో పక్క ఆ వీడియో కేవలం చంద్రబాబు ఇంటి వద్ద మాత్రమే ఎందుకు తీస్తున్నారు ? మిగతా చోట్ల ఎందుకు తీయటం లేదు అనే ప్రశ్నకు సమాధానం లేదు. చంద్రబాబు ఎన్ఎస్జీ భద్రతలో ఉంటారు. ఆయన నివాసం మీద డ్రోన్ లేపే ముందు, ఎన్ఎస్జీ పర్మిషన్ తీసుకున్నారా అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. అయితే ఇది కుట్ర కోణమా ? లేక చంద్రబాబు ఇంటి వద్ద వరదను పెద్దదిగా చూపించి, పైశాచిక ఆనందం పొందే కుట్రా అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు సరైన విధంగా వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది.

దేశంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు ? మోడీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ? మోడీ సాహోసోపేత నిర్ణయాలు ప్రజలకు నచ్చుతున్నాయా ? మోడీ పని తీరు ఎలా ఉంది ? వివిధ రాష్ట్రాలు సియంలు ఎలా పని చేస్తున్నారు ? ఇలాంటి వివరాలు అన్నీ, ఇండియా టుడే latest గా నిర్వహించిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడయ్యాయి. ఏడాదికి రెండు సార్లు, ప్రతి ఆరు నెలలకు, ఇండియా టుడే, మూడ్ అఫ్ ది నేషన్ సర్వే నిర్వహిస్తుంది. ప్రజల అభిప్రాయలు తెలుసుకుని, ప్రజలు ఇప్పటిప్పుడు ఏమని అనుకుంటున్నారో చెప్తారు. ఈ సారి కూడా ఈ సర్వే నిర్వచించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఈ సర్వే జరిగింది. దాదపుగా 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు,194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేసారు. మొత్తం 12,126 మంది అభిప్రాయాలని మూడ్ ఆఫ్ ది నేషన్ తీసుకుంది.

indiatoday 15082019 2

ఈ సర్వే జూలై 22, 2019 నుంచి జూలై 30 ,2109 వరకు జరిగింది. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా మోడీకి ఎదురు లేదని తేలింది. ఇప్పటి వరకు భారతదేశంలోనే అత్యంత బలమైన నాయకుడిగా మోడీ ఉన్నారని సర్వే చెప్పింది. భారత దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా మోడీ, 71 శాతంతో ముందు ఉన్నారు. ఇదే సర్వే పోయిన జనవరిలో మోడీకి 54 శాతం ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీకి 308 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పింది. ఎన్డీఏ కలుపుకుంటే, 357 స్థానాలు చెప్పింది. అలాగే కాంగ్రెస్ కు మరింత గడ్డు కాలం ఉందని సర్వే చెప్పింది. ఇప్పుడు ఉన్న నాలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కోల్పోతుందని సర్వే చెప్పింది. 370 రద్దు పై, దేశం మొత్తం మోడీ వెంటే ఉంది.

indiatoday 15082019 3

ఇక రాష్ట్రాల విషయాలకు వస్తే, ముఖ్యమంత్రుల పని తీరు చూస్తే, ముఖ్యమంత్రుల పాపులారిటీ కేటగిరీలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. జనవరిలో మమతా బెనర్జీ మొదటి స్థానంలో ఉన్నారు, ఇప్పుడు ఆమె ఏడో స్థానానికి పడిపోయారు. 20 శాతంతో తొలి స్థానంలో యోగీ ఆదిత్యనాథ్, 10 శాతంతో, రెండో స్థానంలో నితీష్ కుమార్ కుమార్, 8 శాతంతో మూడో స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్, అదే 8 శాతంతో తరువాత స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, అదే 8 శాతంతో తరువాత స్థానంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌లు ఉన్నారు. ఇక తరువాత స్థానంలో 7 శాతంతో, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి తరువాత మమతా బెనర్జీ ఉండటం గమనార్హం.

ఆమె తెలంగాణా తెలుగుదేశం పార్టీలో కీలక నేత.. ఎన్ని ఆటు పోట్లు వచ్చినా, తెలుగుదేశం పార్టీని విడవకుండా నిలబడ్డారు. అయితే, ఇక కమలం పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడి ఆమె తట్టుకోలేక పోయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఒక భావోద్వేగపు లేఖ రాసారు. ఆ లేఖ చూస్తే, ఆమె ఎంత భారంగా పార్టీ వీడుతున్నారో అర్ధమవుతుంది. చంద్రబాబు వల్ల పదవులు పొంది, మంత్రులు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి, చివరకు సియంలు కూడా అయ్యి, డబ్బు సంపాదించుకుని , చివరకు పార్టీ మారుతూ, చంద్రబాబుని తిట్టిన తిట్టకుండా వెళ్ళే వారే కాని, రేవంత్ రెడ్డి, సీతక్క తరువాత, అంతగా చంద్రబాబు పై కృతజ్ఞత చూపింది ఈమె. ఆమె, తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా నేత, బండ్రు శోభారాణి. పార్టీని వీడుతూ చంద్రబాబుకు రాసిన లేఖ ఇది....

bandru 150820192

"15 సంవత్సరాలుగా మీ వెన్నంటి ఉండి, మీతో కలసి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆహర్నిషలు ఓ సైనికురాలిగా పనిచేశా..పార్టీ అడుగు జాడల్లో నడుస్తూ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండ పాటించా..ఏలాంటి పదవులను ఆశించకుండా గ్రామాల్లోని నా పార్టీ కుటుంబ సభ్యులును కలసి మీరు చేస్తున్న అభివృద్ధి పనులను స్పష్టంగా వివరించాను. ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో కూడా పచ్చజెం డా భుజాన పెట్టుకొని పార్టీయేనా శ్వాసగా ముందు కుసాగాను. ఎన్నో ఆటు పోట్లు, తెలంగాణ ద్రోహులని ప్రజలు చీదరించుకున్నప్పటికినీ వెనుకడుగు వేయకుండా ముందుకు కదిలి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా కూడా పార్టీనే నమ్ముకొని ఇప్పటి వరకు కొనసాగాను. 15 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడవడం అదృష్టంగా భావిస్తున్నా..

bandru 150820193

ఎన్నో పార్టీ పదవులను కట్టబెట్టిన అధ్యక్షుడికి రుణపడి ఉంటాను. ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి పరిష్కారం దిశగా పాటుపడ్డాను, ఆలేరు ప్రజలతో మమేకమై సాగు తాగు జలాల కోసం పాదయాత్రలు, నిరసన దీక్షలు, జిల్లా ఏర్పాటుకై పాదయాత్ర, కరువు జిల్లా కోసం పోరాటంతో పాటు పలు ఉద్యమాలు నిర్వహించినా..రాజకీయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఆలేరు ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాటుపడుతున్నా.. అధ్యక్ష అర్ధం చేసుకొని మన్నించు.. 15 సంవత్సరాల తెదేపా పార్టీని వీడిపోతున్నా..రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షురాలిగా పదవులతో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా..మీతో కలసి పనిచేశాను. ఇన్నేళ్లుగా ఆడబిడ్డగా ఆదరించారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వానికి ప్రత్నాన్మయం భాజపానే ఉంది. అందుకే కమలం వైపు అడుగులు వేస్తున్నానంటూ పార్టీ అధ్యక్షుడికి తన రాజీనామా పత్రాన్ని పంపించి తన తెదేపాలో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, రెండో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. మొదటి పర్యటనలో ఆయన జేరాసులాం వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అని ప్రచారం జరిగింది. జీవో లో కూడా అదే రాసారు. అయితే, ఆయన భద్రతకు అని చెప్పి, 22 లక్షలు విడుదల చెయ్యటం మాత్రం, పెద్ద రచ్చ అయ్యింది. ఇది ఏకంగా నేషనల్ మీడియాలో కూడా రావటంతో, అందరూ దీన్ని తప్పుబట్టారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత, రెండో సారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అయితే, ఇక్కడ మాత్రం లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు.

ustour 15082019 2

మొన్నటి దాక తన అమెరికా పర్యటన వ్యక్తిగతం అని చెప్పారు. వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్నాను కాబట్టి, ఈ ఖర్చులు నావే అని చెప్పారు. అయితే, నిన్న రిలీజ్ అయిన జీవోలో మాత్రం, జగన్ గారు అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారని చెప్పింది. అక్కడే కొన్ని వ్యక్తిగత పనుల్లో కూడా పాల్గుంటారని చెప్పింది. అయితే ఇక్కడ కూడా మరో జీవో రిలీజ్ చేసారు. అది కూడా సెక్యూరిటీ కోసం అని, అంతే కాక, జగన్ తో పాటు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ముఖ్యమంత్రికి సహాయకుడి హోదాలో అమెరికా వెళ్తున్నారు. అంతే కాక ఆయన ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీపీ) భాగస్వామ్య డైరెక్టర్‌ మాలతి స్వామినాథన్‌, సీనియర్‌ అసోసియేట్‌ సావన్‌ తీర్థేలకూ అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

ustour 15082019 3

అయితే ఈ సారి మాత్రం, ఈ అధికారులకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం జీవో లో ఇవ్వలేదు. అయ్యే ఖర్చులు అన్నీ ప్రభుత్వం భరించాలి అన్నారు. అంటే మొన్నటి పర్యటన లాగే, జగన్ గారు మాత్రం, ఆయన సొంత ఖర్చుతో వెళ్తున్నారు అనేది ప్రజలకు చెప్తున్నారు. అయితే మొదట జగన్ అమెరికా పర్యటన అనే వార్తలు వచ్చినప్పుడు, ఆయన డల్లాస్ లో వైసిపీ కార్యకర్తలతో మీట్ అవుతారు అని మాత్రం చెప్పారు. తరువాత రెండు రోజుల నుంచి, ఆయన చిన్న కూతురుని కాలేజీ లో జాయిన్ చెయ్యటానికి అని చెప్పారు. నిన్న విడుదల చేసిన జీవోలో ఇవేమీ కాని, ఆయన అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నారు, దాంతో పాటు పర్సనల్ పనులు చూసుకుంటారని చెప్పింది. మొత్తానికి, ఇన్ని ట్విస్ట్ లు మధ్య, జగన్ గారు అధికారిక పర్యటనకు వెళ్తూ కూడా, ఆయనే సొంత ఖర్చులతో అమెరికా వెళ్తున్నారని వైసీపీ చెప్తుంది.

Advertisements

Latest Articles

Most Read