గుడిని మింగే వాడుంటే గుళ్లో లింగాన్ని మింగే వాడు ఒకడు ఉంటాడు అనే సామెత మనం తరుచు వింటూ ఉంటాం. అయితే, ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పనులకు సరిగ్గా సరిపోతుంది. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో అంతా అవినీతి జరిగి పోయింది, అంటూ గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన ప్రతి పని పై ఎంక్వయిరీల మీద ఎంక్వయిరీలు వేస్తూ, హడావిడి చేస్తున్నారు. అయితే జగన్ చేసే పనుల వల్ల చంద్రబాబుకి అయితే ఇప్పటి వరకు ఎలాంటి నష్టం రాలేదు. నష్టం అంతా మన రాష్ట్రానికి వస్తుంది. జగన్ చేసే సమీక్షల వల్ల ఇప్పటికే 42 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు కోర్ట్ కు వెళ్ళాయి. అంటే భవిష్యత్తులో, వీరు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటం ఇక ఉండదు అనే చెప్పాలి. మరో పక్క అమరావతి ఆపటం వల్ల అంటూ ఎల్ అండ్ టీ ఇబ్బంది పడుతుంది, పోలవరం నుంచి నవయుగని వేల్లిపోమన్నారు.

sujana 04082019 2

ఇలా ప్రతి విషయంలోనూ రాష్ట్రానికి ఇబ్బందే జరుగుతుంది. అయితే ఇందాక చెప్పినట్టు, గుడిని మింగే వాడుంటే గుళ్లో లింగాన్ని మింగే వాడు ఒకడు ఉంటాడు. జగన్ చేసే పనుల వాల్, నష్టం మీ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అంటుంది బీజేపీ. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అనే విషయం జగన్ మర్చిపోతున్నారని, రెండు నెలల నుంచి ఎందుకు పనులు ఆగిపోయాయో కేంద్రం సమీక్ష చేస్తుందని, బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు విద్యుత్ కంపెనీలను బెదిరిస్తున్నారని, దీని పై కూడా పార్లమెంట్ అయిపోయినే వెంటనే, ఢిల్లీ స్థాయిలో సమీక్ష ఉంటుందని అన్నారు. అలాగే 75 శాతం లోకల్ రిజర్వేషన్ విషయం కేంద్రం ద్రుష్టికి కూడా వచ్చిందని, ఎవరు ఎక్కడైనా పని చేసుకునే రాజ్యాంగం ఇచ్చింది అని, మిగతా రాష్ట్రాలు ఇలాగే ఆలోచిస్తే, ఎంతో ప్రమాదం అని, దీని పై కూడా కేంద్రం చర్చిస్తుందని, జగన మొండిగా వెళ్ళినా, ఇది కోర్ట్ లో నిలవదని సుజనా చౌదరి అన్నారు.

sujana 04082019 3

గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగితే, రాష్ట్రం నిరభ్యంతరంగా విచారణ చేసి తగు చర్యలు తీసుకోవచ్చని, కాని దాని కోసమని ప్రాజెక్ట్ లు అన్నీ ఆపెయ్యటం ఏంటో అర్ధం కావటం లేదని సుజనా అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును కక్షతో రద్దుచేసినట్లు కనిపిస్తోందని సుజనా చౌదరి అన్నారు. జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితి, అలాగే టెండర్ ఎందుకు రద్దు చేసారు, రాష్ట్రానికి ఆ హక్కు ఉందా, వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, అనే విషయం పై సోమవారం సమీక్ష చేస్తారని సుజనా చౌదరి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చారని, ఆయన నిర్ణయాల పై వేచి చూసే ధోరణిలో ఉందాం అనుకున్నా, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, వాటి వల్ల తీవ్ర నష్టం ఉండటంతో, కేంద్రం కూడా జోక్యం చేసుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను ఇండియా తీసుకు రావటానికి, వీళ్ళు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఏకంగా 22 మంది ఎంపీలు, కేంద్రానికి ఉత్తరం రాసి, మా వాడిని విడిపించండి అని అడిగారు అంటే, ఏమనుకోవాలి ? ఏ ప్రత్యెక హోదా కోసమో, పోలవరం కోసమో, అమరావతి కోసమో 22 మంది ఎంపీలు లేఖ రాసారు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించే వారు. కాని, ఈ 22 మంది ఎంపీలు, మా వాడిని వేరే దేశంలో పట్టుకున్నారు, విడిపించండి అంటూ, కేంద్రానికి మొదటి లేఖ రాసారు. కేంద్రం మాత్రం, ఈ విషయంలో మేమేమి చెయ్యగలం, కావాలంటే, మీరు ఆయన్ను జైలులో కలవటానికి ఏర్పాట్లు చెయ్యగలం అని చెప్పి, కేంద్రం చేతులు దులుపుకుంది. దీంతో చేసేది లేక, వైసీపీ ఎంపీలు తమ ప్రయత్నాలు మానుకున్నారు.

cbi 03082019 2

ఇక తరువాత నిమ్మగడ్డ లాయర్ల వంతు. ప్రతి శుక్రవారం, జగన్ కేసులు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి సియం అయ్యారు కాబట్టి ఆయనకు మినహాయింపు వచ్చినట్టు ఉంది. అయితే మిగతా వారు మాత్రం ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళాల్సిందే. దీంతో, వాన్పిక్ కేసులో A3 గా ఉన్న నిమ్మగడ్డ కూడా కోర్ట్ కు వెళ్ళాలి. కాని ఆయన సెర్బియాలో అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇదే విషయం నిమ్మగడ్డ లాయర్లు, సిబిఐ కోర్ట్ కు తెలిపి, మా క్లైంట్ వచ్చే పరిస్థితిలో లేరు అంటూ సిబిఐ కోర్ట్ కు తెలిపారు. అసలు సెర్బియా ఎందుకు వెళ్లారు అని సిబిఐ కోర్ట్ ప్రశ్నించగా, ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు సంబంధించిన విషయంపై అక్కడి క్రీడాశాఖ మంత్రితో చర్చించేందుకు సెర్బియా వెళ్లారని చెప్పారు. ఫుట్‌బాల్‌ లీగ్ లాంటిది నిమ్మగడ్డ ఇండియాలో పెట్టె ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

cbi 03082019 3

అయితే , ఇక్కడ లాయర్లు మరో కోరిక కోరారు. మా క్లైంట్ తరుచు విదేశాలకు వెళ్తూ ఉంటారు, ప్రతి సారి మీకు ముందస్తు సమాచారం ఇచ్చాం, కాని ఈ సారి సెర్బియ పోలీసులు అరెస్ట్ చేసారు అని చెప్పారు. సెర్బియాలో రాజు పాలన ఉంది, ఆయన ఇండియా రాకుండా, యూఏఈ ఇంటర్‌పోల్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు, ఆయన ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టులో వాన్‌పిక్‌ కేసు విచారణకు హాజరు కాకపొతే, విచారణ లేట్ అవుతుంది, అందుకే సిబిఐ కోర్ట్ తరుపున, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, నిమ్మగడ్డను భారత్‌కు రప్పించే ప్రయత్నం మీరు చెయ్యండి అని సిబిఐ కోర్ట్ ని కోరారు నిమ్మగడ్డ లాయర్లు. అయితే న్యాయమూర్తి మధుసూదన్‌రావు మాత్రం, అది మాకు సంబంధం లేదు, మేము అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం అంటూ, ఇక్కడ విచారణ ఎప్పటి లాగే కొనసాగుతుంది అని చెప్పారు. అయితే కేంద్రంతో కాకుండా సిబిఐ కోర్ట్ ద్వారా నిమ్మగడ్డను రప్పిద్దాం అనుకున్న నిమ్మగడ్డ లాయర్ల గేమ్ బెడిసికొట్టింది.

రాష్ట్రంలో పేదలకు 5 రుపాయలకే అన్నం పెట్టే, అన్న క్యాంటీన్ ను తాజగా వచ్చిన జగన్ ప్రభుత్వం మూసేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఎక్కడ మైలేజ్ వస్తుందో అని, ముందుగా అన్న క్యాంటీన్ రంగులు మార్చేసారు. దీనికి ఎంత ఖర్చు అయ్యిందో తెలియదు కాని, సోషల్ మీడియాలో మాత్రం, 11 కోట్లు ఖర్చు అయ్యిందనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే రంగులు మార్చితే మార్చారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారు కదా, రంగులు మార్చి, పేర్లు మార్చితే ఏమైందిలే అని అందరూ అనుకుంటున్న వేళ, మొన్న ఫస్ట్ తారీఖు నుంచి అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసేసారు. ఎందుకు మూసారో, ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం మాత్రం, చంద్రబాబు ఆదరాబాదరాగా, ఒక లక్ష్యం లేకుండా పెట్టారని, వీటిని సమీక్షించి, అప్పుడు చెప్తాం అంటుంది.

anna 03082019 2

మరో పక్క 150 కోట్లు అవినీతి అన్న క్యాంటీన్లలో జరిగింది అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అవినీతి జరిగితే ఎంక్వయిరీ చేసి, బాధ్యులను లోపల వెయ్యాలి కానీ, ఇలా కడుపు కాడ కూడు లాగేయ్యటం ఏంటి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మంత్రి బొత్సా సత్యన్నారాయణ చేసిన ప్రకటన చూస్తే మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అన్న క్యాంటీన్లకి బిల్డింగ్ లు అవసరం లేదని బొత్సా చెప్పారు. మేము వాటి స్థానంలో మొబైల్ క్యాంటీన్లు అంటే సంచార క్యాంటీన్లు తీసుకు వస్తామని బొత్సా అంటున్నారు. ఎక్కడ ప్రజలు ఉంటే, అక్కడకు ఈ సంచార వాహనాలు వెళ్తాయని, ఇలా ప్లాన్ చేస్తున్నామని బొత్సా చెప్పారు. ముందుగా రద్దీ ఎక్కడ ఉందొ చూస్తాం, ప్రజల వద్దకే ఈ సంచార క్యాంటీన్లని తరలిస్తామని బొత్సా చెప్పారు.

anna 03082019 3

అయితే, ఇది అంతా సాధ్యం అయ్యే పనేనా ? రద్దీ ఉన్న ప్రతి చోటా, ప్రజలు వచ్చి భోజనం చేస్తారా ? ఒక చోట ఉంటే, ఆకలి ఉన్న వాడు వచ్చి తింటాడు. మరి ప్రభుత్వం ఈ ఆలోచన ఎందుకు చేస్తుందో మరి ? ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ఒక కొత్త భయం మొదలైంది. శుభ్రమైన వాతావరణంలో పెదులు అన్నం తినాలని, చంద్రబాబు మంచి భవనాలు కట్టారు. ఇప్పుడు బొత్సా గారు, సంచార క్యాంటీన్లు అంటున్నారు. అలాగే అసలు భవనాలు అవసరం లేదు అంటున్నారు. మరి, ఇప్పటికే ఉన్న మంచి మంచి భవనాలు ఏమి చేస్తారు అనే వాదన కూడా మొదలైంది ? ఈ భవనాల్లో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరుస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కాని అది రాజకీయ ఆరోపణ గానే తీసి పారెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్న చోట, మద్యం దుకాణాలు పెట్టటానికి, రూల్స్ ఒప్పుకోవు. అయినా ప్రభుత్వం ఆ సాహసం చెయ్యలేదు. మరి ఈ భవనాలను ఏమి చేస్తారు ? ఇప్పటికే 150 కోట్ల అవినీతి అంటున్నారు కాబట్టి, ప్రజా వేదిక లాగా, కూల్చేస్తారా ? బొత్సా గారు, అన్న క్యాంటీన్లకు భవనాలు అవసరం లేదు అని ఎందుకు అన్నారు ? కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.

అధికారంలో ఉన్న పార్టీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. క్లీన్ ఇమేజ్ తో వ్యవహరించాలి. నేను రూపాయి అవినీతి చెయ్యను, దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తా అంటున్న జగన్ మోహన్ రెడ్డి గారు, మరింత జాగ్రత్తగా ఉండాలి. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ ఎంపీగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్‌ మాత్రం బ్యాంకులకు బాకీ పడుతున్నారు. దీంతో బ్యాంక్ పీవీపీ ఆస్తులు వేలానికి నోటీస్ ఇస్తుంది. పీవీపీ, ప్రముఖ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకుకు 148 కోట్ల 90 లక్షల రూపాయలకు బకాయి పడ్డారు. ఎన్ని సార్లు అడిగినా సరైన స్పందన రాకపోవటంతో, క్యానరా బ్యాంక్ ఆ డబ్బులు వసూలు చేయడానికి వేలం పాటను నిర్వహించటానికి రెడీ అవుతుంది. పొట్లూరి వరప్రసాద్ కు చెందిన కంపెనీ అయిన పీవీపీ కేపిటల్ లిమిటెడ్ సంస్థను ఈ నెల 14వ తేదీన వేలం వెయ్యటానికి సిద్ధం అయ్యింది.

canara 03082019 2

దీనికి సంబంధించి క్యనరా బ్యాంక్ ప్రక్రియ మొత్తానికి సంభందించిన వివరాలను పత్రికా ప్రకటన ద్వరా తెలియ చేసింది. ఈ ప్రక్రియ మొదలు పెట్టక ముందే, రెండు నెలల కిందటే పీవీపీకి, కెనరా బ్యాంక్ నోటీసును జారీ చేసింది. అయినా అక్కడ నుంచి స్పందన లేదు. పీవీపీకి చెందిన పీవీపీ కేపిటల్‌ కంపెనీ 2003లో కెనరా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. అయితే ఆ లోన్ చెల్లింపు విషయంలో మాత్రం, సకాలంలో తీర్చలేకపోవటంతో, నోటీసులు ఇచ్చినా స్పందించక పోవటంతో బ్యాంక్ ఇప్పుడు వేలం ప్రక్రియ మొదలు పెట్టింది. జులై 2వ తేదీ నాటికి ఈ రుణం మొత్తం వడ్డీతో కలిపి 148,90,40,170 రూపాయలకు చేరింది. లోన్ తీసుకున్న సమయంలో పీవీపీ, ఆయన భార్య ఝాన్సీ హామీదారులుగా ఉన్నారు. పీవీపీ భార్య ఝాన్సీ ఇప్పుడు పీవీపీ గ్రూప్ కు చెందిన పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ ఛైర్మన్ గా ఉన్నారు.

canara 03082019 3

వీరికి ఎన్ని సార్లు నోటీసులను పంపించినా, స్పందించకపోవడం వల్ల పీవీపీ కంపెనీలు అయిన, పీవీపీ వెంచర్స్, క్యాపిటల్స్ లిమిటెడ్ ఆస్తులను వేలం వేయటానికి కెనరా బ్యాంకు రెడీ అయ్యింది. మరో పక్క ఈ కంపెనీల పేరుతో పీవీపీ గతంలోనే చెన్నై సమీపంలోని పెరంబూరు, పురసవాక్కంలల్లో 2, 62,160 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా వేలం వేస్తామని కెనరా బ్యాంకు తెలిపింది. దీనికి సంబంధించి జూన్ 3వ తేదీన బ్యాంక్ పత్రికల్లో ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం, 40 రోజుల తరువాత, అంటే జూలై 14వ తేదీన వేలంపాట వెయ్యనున్నారు. దీని పై ఇప్పటికే రాజకీయంగా కూడా పీవీపీ టార్గెట్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఈ విషయం పై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

Advertisements

Latest Articles

Most Read