ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ పట్టటం లేదు... ఏపి ప్రజల మూడ్ అర్ధం కావటం లేదు.. ప్రతి సారి లాగే, ఈ సారి కూడా ప్రజల నాడి పట్టటంలో జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. తినే తిండిని పెంటతో పోల్చిన వ్యక్తికి సలాం కొడుతూ, ఆంధ్రా వాడి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడు జగన్. పదే పదే కేసీఆర్ ను పొగుడుతూ, ఏపి ప్రజల సెంటిమెంట్ తో నాకు పని లేదు అంటున్నారు. తాజగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా ఇవే వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎ్‌సతో కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన జగన్‌.. తాజాగా ఆ పార్టీని వెంటబెట్టుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు తాను తెలంగాణ అధికార పార్టీతో కలిసి ప్రయత్నిస్తానన్నారు.

kcrjagan 01040209

‘‘రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలలో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకం అవుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే పక్క రాష్ట్రం(తెలంగాణ) 17 ఎంపీ సీట్ల మద్దతు తీసుకుంటాం’’ అని జగన్‌ అన్నారు. వైసీపీకి ప్రజలు అన్ని ఎంపీ సీట్లూ ఇస్తే అంత బలంగా ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకమవుతామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తెలంగాణలోని 17 ఎంపీ సీట్ల మద్దతు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.

kcrjagan 01040209

కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తానంటే ఎందుకు అభ్యంతరం? కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్ అన్నారు. "మా మధ్య ప్రజల ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. జాతీయ స్థాయిలో మేం కోరుకునేదేమిటంటే మా మొర ఆలకించడానికి, మా వినతులు పట్టించుకోవడానికి ఎవరో ఒకరుండాలి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వక పోతే ఇక ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి? మాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఫెడరల్‌ ఫ్రంట్‌ తో కలిసి పోరాడతాం" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే, ప్రజల సెంటిమెంట్ ఏ మాత్రం పట్టించుకోకుండా, కేవలం కేసీఆర్ కు భయపడి, ఇలా భజన చేస్తున్నారని, ప్రజలు అనుకుంటున్నారు.

ఎన్నికల వేళ ఏపీలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. తిరుపతి గ్రామీణ మండలం పద్మావతిపురంలో నివాసం ఉంటున్న వైకాపా నేత గణపతినాయడు ఇంటిపై సోమవారం వేకువజామున పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన గోడ గడియారాలు, చీరలు పోలీసులకు పట్టుబడ్డాయి. ముందుగా అందిన రహస్య సమాచారం మేరకు తిరుచానూరు సీఐ అశోక్ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు వైకాపా నేత ఇంటిపై దాడులు నిర్వహించారు. ఓ గదిలో భారీగా భద్రపరచిన గోడగడియారాలు, చీరలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

chevireddy 0104219 1

ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తూ.. పంచడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. అలాగే మరో వైసీపీ నేత గణపతినాయుడు ఆధ్వర్యంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న వాచీలు, చీరలను సీజ్ చేసినట్లు చెప్పారు. మరో పక్క, కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు వైసీపీ క్యాలెండర్లు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వైసీపీ కార్యకర్త పవన్‌ ఇంట్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన వస్తువులను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏపి ఎన్నికల్లో ఎప్పుడూ చూడని, ఎవరూ ఊహించని ఫలితాలు చూడబోతున్నామా ? చంద్రబాబు కష్టానికి ఫలితం అనూహ్యంగా దక్కనుందా ? అభివృద్ధితో పాటు, సంక్షేమం సూపర్ హిట్ అయ్యిందా ? జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీతో కలిసి చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు బెడిసికొట్టాయా ? అవును అనే అంటుంది లోక్‌నీతి-సీఎస్ డీఎస్‌ సర్వే. ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని ‘లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌’ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటిదాకా అనేక జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే గెలుపు అని చెబుతుండగా... మొట్టమొదటిసారి ‘టీడీపీదే హవా’ అనే అంచనాలు వెలువడ్డాయి. ఏబీపీ చానల్‌ కోసం లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ ఈ సర్వే చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ బంపర్‌ మెజారిటీతో విజయం సాధించనుంది.

survey 01042019 1

టీడీపీ 126 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వైసీపీ 45 నుంచి 50 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చింది. ఇక... 25 ఎంపీ సీట్లలో టీడీపీ 18 నుంచి 22 వరకు గెలుచుకుంటుందని, వైసీపీ 3 నుంచి 5 వరకు నెగ్గుతుందని లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ స్పష్టం చేసింది. జనసేన 2 నుంచి 5 వరకు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చునని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. తెలుగుదేశం పార్టీకి 46.2 శాతం ఓట్లు లభిస్తాయని లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ అంచనా వేసింది. వైసీపీకి 37.2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.

survey 01042019 1

మళ్లీ బాబు ఎందుకంటే... అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కొనసాగాలనే భావన. జగన్‌, పవన్‌లతో పోల్చితే చంద్రబాబు నాయకత్వంపైనే ఎక్కువ విశ్వాసం. రైతులకు సహాయం చేసే అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు ‘పసుపు కుంకుమ’, రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్‌, పింఛన్లు, చంద్రన్న బీమా, ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్ను ఎత్తివేత... మరిన్ని సంక్షేమ పథకాల ప్రభావం. పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, కియ వంటి కంపెనీల రాక, మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు సామర్థ్యం! చంద్రబాబు పట్ల ఓటర్లు మొగ్గుచూపడానికి ఇవే కారణాలని లోక్‌నీతి-సీఎస్ డీఎస్‌ తెలిపింది.

ఎన్నికల తర్వాత జగన్ ఎన్డీయేలోకి వస్తారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ చెబుతున్న జాబితాలోని అత్యధికులు ఎన్డీయేలోకి వస్తారని ఆయన చెప్పుకొచ్చారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో చాలా సర్జికల్ స్రైక్స్ జరిగాయని, ఎప్పుడైనా చెప్పుకున్నామా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు దత్తాత్రేయ కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రిగా కేసీఆర్‌ ఒక్క కేబినెట్‌ భేటీకి కూడా వెళ్లలేదని, కేసీఆర్‌కు సర్జికల్‌ దాడుల గురించి ఏం తెలుసని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ‘టీఆర్‌ఎస్‌, వైసీపీ మాకు మిత్రులే’... అని కేంద్ర మంత్రి, ప్రధానికి అత్యంత విశ్వాసపాత్రుడైన పీయూష్‌ గోయెల్‌ కూడా వారం క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.

dattatraya 01042019

ఈ ప్రకటనలు వైసీపీని ఇరుకున పడేసింది. మోదీని వైసీపీ ఎక్కడా విమర్శించడంలేదు. బీజేపీతో తమ బంధాన్ని గోప్యంగా ఉంచుతోంది. దానిపై బహిరంగంగా మాట్లాడటంలేదు. ఇప్పుడు వారి మధ్య మైత్రిని పీయూష్‌, దత్తాత్రేయ బయట పెట్టేశారు. బీజేపీతో బహిరంగ స్నేహం క్రైస్తవులు, ముస్లింలో ఆగ్రహం తెప్పిస్తుందని, వారి ఓట్లు దూరమవుతాయనే ఆందోళనతోనే జగన్‌ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పీయూష్‌, దత్తాత్రేయ ఈ బంధాన్ని బయట పెట్టేశారని రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినవస్తున్నాయి. పీయూష్‌, దత్తాత్రేయ వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో కొంత గుబులు కనిపిస్తోంది. బీజేపీకి మిత్రపక్షంగా మైనారిటీల్లో వ్యతిరేకత ఏర్పడుతుందేమోనన్న అనుమానం వారిని తొలుస్తోంది. ఈ వ్యాఖ్యలను అందిపుచ్చుకొని టీడీపీ నాయకత్వం దానిని ప్రచారంలో పెడితే దానికి ఎలా సమాధానం ఇవ్వాలన్న దానిపై వారు తర్జనభర్జన పడుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది!

dattatraya 01042019

పోలవరం ప్రాజెక్టుపై మొదట్నుంచీ టీఆర్‌ఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ‘మన మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు చంద్రబాబు’ అని కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న పోలవరంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు రాయలసీమకు కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టులనూ మూసేయాలన్నట్లుగా ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్నారు. ‘పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ వైఖరి మాటేమిటి? దాని గురించి కూడా జగన్‌ మాట్లాడితే బాగుండేది’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్‌ వ్యాఖ్యలు అసహనంతో, కేవలం ఎదురుదాడి కోసం చేసినట్లుగా ఉన్నాయని... కీలక సమయంలో సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నట్లయిందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read