గతంలో ఎన్నో ఆరోపణలు... పారదర్శకంగా పనులు చేస్తున్నా, కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నా, అన్ని ఆడిట్ రిపోర్ట్ లు ఇచ్చిన తరువాతే, నిధులు విడుదల చేసినా, రాజకీయం కోసం, ఎన్నో ఆరోపణలు చేసారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. జగన్ మోహన్ రెడ్డి పోలవరం పై ఎన్ని ఆరోపణలు చేసారో అందరికీ తెలిసిందే. పోలవరం అంచనాలు పెంచేసి, చంద్రబాబు దోచుకున్నారు అన్నారు. కాంట్రాక్టు పనులు నవయుగకి ఇచ్చి దోచుకున్నారు అన్నారు. ఇలా అనేక ఆరోపణలు చేసారు జగన్. ఇక ప్రాధాని మోడీ కూడా తక్కువ ఏమి చెయ్యలేదు. ప్రధాని హోదాలో ఉంటూ, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం కేంద్రంది అని తెలిసినా, పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు ఏటియం గా వాడుకున్నారు అంటూ, ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేసారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, పోలవరం ప్రాజెక్ట్ లో మొత్తం అవినీతే అన్నట్టు, హడావిడి చేసారు. తీరా చూస్తే, అవన్నీ తప్పుడు ఆరోపణలు అని ఇప్పుడు ఏకంగా కేంద్రం, ప్రధాని మోడికి నివేదిక ఇచ్చింది.
పునరావాస ప్యాకేజి, పరిహారం చెల్లింపుల్లో భారీగా అక్ర మాలు జరిగాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన ఫిర్యాదుపై జలశక్తి మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రధాని కార్యాలయానికి అందిన ఫిర్యాదును జలశక్తి మంత్రి త్వశాఖకు పంపుతూ సవివర నివేదికను అందజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం ఆదేశించింది. ఈ మేరకు జలశక్తి మంత్రిత్వశాఖ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు పై నివేదికను, ప్రధానికి సమర్పిచింది. పోలవరం ప్రాజక్టు కాంట్రాక్టు నిబంధనల్లో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని ఆ నివేదికలో తెలిపింది. నిర్ణయాలు అన్నీ, సంబందిత అధికారుల అనుమతితోనే జరిగాయని, ఆ రిపోర్ట్ లో, స్పష్టం చేసింది, కేంద్ర జలశక్తి శాఖ
గతంలో కాంట్రాక్టర్ ను మార్చుతూ కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించడంపై కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ స్పందించింది. కాంట్రాక్ట్ కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయని, గతంలో కాంట్రాక్టర్ సరిగ్గా సమయానికి పని చెయ్యకపోవటంతో, 60సి నిబంధన ప్రకారమే కాంట్రాక్టు సంస్థను మార్చినట్లు, ప్రధాని కార్యాలయానికి చెప్పింది కేంద్ర జలశక్తి శాఖ. ఇక ధరలు పెరగటానికి కారణం, 2013 భూసేకరణ చట్టం అని చెప్పింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా, గతంలో పోలవరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పినట్టు, ఆ నివేదికలో కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. ఈ వివరాలను ప్రధాని కార్యాలయానికి అందజేయడంతో పాటు ఫిర్యాదుదారుడు పెంటపాటి పుల్లారావుకు జలశక్తి శాఖ ఒక కాపీ అందజేసింది.