ఒక పక్క పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ అట్టర్ ఫ్లోప్ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనల పై అనేక ఆంక్షలు పెడుతున్నారు. మొన్న చంద్రబాబ రోడ్ షో కు పర్మిషన్ ఇవ్వకపోవటం, చంద్రబాబు సభలకు తెరాస ప్రచార రధాలు పంపించి రెచ్చగొట్టటం లాంటి పనులు చేస్తున్న తెరాస ప్రభుత్వం, ఈ రోజు చంద్రబాబు, ఆజాద్ పాల్గున్న రోడ్ షో పై కూడా ఆంక్షలు పెట్టారు. ఆదివారం రాత్రి ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ సెంటర్‌‌లో చంద్రబాబు, గులాంనబీ ఆజాద్‌‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మొదట గులాంనబీ ఆజాద్ నియోజకవర్గ అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టగానే పోలీసులు వచ్చి వాహనాన్ని కదిలించాలని కోరారు.

azad 02122018 1

ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఇలా చేస్తున్నామని పోలీసులు ఇందుకు వివరణ కూడా ఇచ్చారు. దీంతో ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పోలీసులు అడ్డుకోవడంతో కాసింత ఆగ్రహానికి లోనైన ఆజాద్ ఆగ్రహానికి లోనైన అనుమతిచ్చి మధ్యలో ఇలా చేయడం సబబు కాదని మండిపడ్డారు. పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని, విధి నిర్వహణ సక్రమంగా చేయాలని ఆజాద్ పోలీసులను సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ 40, 50 ఏళ్లుగా తాను హైదరాబాద్‌లో వివిధ సభలకి వచ్చినప్పటికీ ఇంత మంది యువకులు పాల్గొన్న బహిరంగ సభను చూడలేదని ఆజాద్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌, బీజేపీని ఓడించాలన్న చైతన్యం ఇక్కడి ప్రజల్లో వచ్చిందని ఈ సభల ద్వారా రూఢీ అవుతోందని ఆయన అన్నారు.

azad 02122018 1

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అటువైపు మోదీ ఇటువైపు జూనియర్ మోదీ మాటలతోనే కడుపు నింపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 37 సంవత్సరాలుగా బద్ధవిరోధులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడ ప్రజాస్వామ్యం కోసం ఒక్కటయ్యామని తెలిపారు. తెలంగాణకు ఎందుకు వచ్చారు? ఏం పని? అని తండ్రీ కొడుకులు అడుగుతున్నారని, అనవసరంగా తిడుతున్నారని తానే ఏం తప్పు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు తేవడం తప్పా? ఐటీ కంపెనీలు తేవడం తప్పా? అని నిలదీశారు. కేసీఆర్ తన హయాంలో ఒక్క ఫాంహౌజ్‌ని నిర్మించుకున్నారు గానీ, ఒక్క పనైనా చేపట్టారా? అని బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ వారు పూర్తి చేశారని బాబు తెలిపారు.

ఎన్నికలు పూర్తయిన ఛత్తీస్‌గఢ్‌లో ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్‌ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. కొందరు అనధికార వ్యక్తులు... సీసీటీవీ కెమెరాలకు మరమ్మతుల పేరుతో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల్లోకి ప్రవేశించి, అక్కడే ఉంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని స్ట్రాంగ్‌ రూంలోనూ గంటన్నరపాటు విద్యుత్‌ సరఫరాను, సీసీటీవీలను నిలిపివేశారని ఆరోపించింది. ఈ పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నందున ఈవీఎంల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వీ, మనీశ్‌ తివారీ, పీఎల్‌ పునియా, వివేక్‌ ఠంకా, టీఎస్‌ సింగ్‌ దేవ్‌ల బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

strong room 02122018 1

అనంతరం పునియా విలేకరులతో మాట్లాడుతూ... ఛత్తీస్‌గఢ్‌ విషయమై తాము ఫిర్యాదుల కంటే సూచనలే ఎక్కువ చేశామన్నారు. అక్కడ సీసీటీవీ కెమెరాలకు మరమ్మతుల పేరుతో కొందరు వ్యక్తులు స్ట్రాంగ్‌ రూముల్లోకి వచ్చి ఉంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారి విషయంలో నియంత్రణ విధించాలని కోరినట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూముల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించేటప్పుడు గందరగోళం జరిగే ప్రమాదముందని, దానిపైనా దృష్టి సారించాలని సూచించినట్లు పునియా వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని రౌండ్లను ఒకేసారి చేపట్టకుండా... ఒకదాని తర్వాత ఒకటిగా లెక్కించి, ప్రతి రౌండ్‌ లెక్కలను అభ్యర్థులకు చెప్పిన తర్వాతే ముందుకెళ్లాలని కోరామన్నారు. ఆయా కేంద్రాల్లోకి జిల్లా కలెక్టర్లు ఫోన్లు తీసుకొని వెళ్లకుండా నిర్దేశించాలని అడిగామన్నారు.

strong room 02122018 1

అయితే భోపాల్‌ కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో శనివారం దాదాపు గంటన్నర పాటు సీసీకెమెరాలు, ఎల్‌ఈడీ తెరలు పనిచేయలేదు. దీంతో ఆందోళన చెందిన కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీ నేతలు.. దీనిపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. కలెక్టరేట్‌ పరిధిలో శనివారం ఉదయం గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్లే సీసీ కెమెరాలు పనిచేయలేదని తేల్చింది. అయితే భోపాల్‌లోని పాత జైలులోని స్ట్రాంగ్‌ రూమ్‌ గదికి తాళం వేయలేదంటూ కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదును స్వీకరించిన ఈసీ దీనిపై విచారణ జరిపించింది. ప్రస్తుతం స్ట్రాంగ్‌ రూమ్‌ గది మూసేసి తాళం వేసి ఉందని ఈసీ వెల్లడించింది. అయితే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈవీఎంలకు భద్రత కరవైందంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఓటమి భయం పెట్టుకున్న కేటీఆర్, తమ పార్టీ ఓటమికి చంద్రబాబే కారణం అవుతున్నారనే అసహనంతో, నిన్న ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, చంద్రబాబు అంతు చూస్తాం, ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం అని చెప్పిన సంగతి తెలిసిందే. దీని పై చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మలక్‌పేటలో తెదేపా అభ్యర్థి ముజఫర్‌ అలీకి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు, కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందించారు. లంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌ తనను బెదిరిస్తున్నారని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని తెదేపా చంద్రబాబు నాయుడు అన్నారు. కేటీఆర్‌ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని.. బెదిరిస్తే భయపడబోమని.. అవసరమైతే కథ తేల్సుకుంటాం తప్పా.. భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

cbn 02122018

నేను అభివృద్ధి చేశానంటే కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబం కోసం కాదని..తెలంగాణ ప్రజల కోసం అభివృద్ధి చేశానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో 35 ఏళ్లు ఉండి గల్లీ గల్లీ తిరిగానని.. తెలంగాణ రాష్ట్రమంటే అమితమైన ఇష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టానని చంద్రబాబు తెలిపారు. ఐటీ సిటీని హైటెక్ సిటీగా నిర్మించామని.. సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని.. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సమక్షంలో నామకరణం చేశామని చంద్రబాబు అన్నారు. కృష్ణా నీళ్లు తీసుకొచ్చి నీటి సమస్య లేకుండా చేశానని బాబు తెలిపారు. హైదరాబాద్‌ను మహానగరంగా తయారు చేశానని చెప్పారు. కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాకూటమి 5 లక్షలతో ఉచితంగా ఇల్లు కట్టి ఇస్తుందని చంద్రబాబు అన్నారు.టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు చెప్పారు.

cbn 02122018

తాను చేసిన అభివృద్ధితోనే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కి వచ్చి నివసిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నగరానికి కృష్ణా నీటిని తీసుకువచ్చి నీటి సమస్యను తీర్చానని చెప్పారు. కేసీఆర్‌ పాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డానని విమర్శలు చేస్తున్నారని.. దేనికి అడ్డుపడ్డానో తెలపాలని నిలదీశారు. తాను తెలంగాణలో ఆదాయాన్ని పెంచానని.. కేసీఆర్‌ దుబారా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ముజఫర్ అలీ గారిని.. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో కూడా సెక్యూలర్ గర్నమెంట్ రావాలంటే సీనియర్ మోడీ, జూనియర్ మోడీ ఓడిపోయాలని చంద్రబాబు అన్నారు.

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, ట్విట్టర్‌లోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానంటే తాను అడ్డుపడ్డానా? అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానంటే అడ్డుతగిలానా? అంటూ నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి తాను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్ ఒక్కపనైనా చేశారా? అని ఆయన సవాల్ విసిరారు. ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అంటూ బాబు విమర్శించారు.

twitter 02122018

అవేవి చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసిన తనపై విమర్శలు చేయడం ఏమిటో తనకు అర్థం కావడంలేదని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ చెప్పే అచ్చేదిన్‌ నాలుగున్నరేళ్లలో ఎక్కడా కనిపించలేదని ఎద్దేవాచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే తప్పకుండా అచ్చేదిన్‌ వస్తుందని వ్యాఖ్యానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాకపోయినా కేసీఆర్‌ అడగరని, గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వకపోయినా నోరు మెదపరని, ఎయిమ్స్‌కు అనుమతులు ఇవ్వకపోయినా నిలదీయారని, చివరికి ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోయినా తానకేమీ పట్టనట్టు కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని దీన్నిబట్టి చూస్తుంటే మోడీతో కేసీఆర్‌ ఎంత రహస్య ఒప్పందం చేశారో తెలుస్తుందని చెప్పారు

twitter 02122018

నేనెవరికీ భయపడను… భయపడే సమస్యే లేదు… నన్ను బెదిరించిన వాళ్ళంతా పతనమైపోయారు… ప్రధాని నరేంద్రమోడీ కూడా భయపెట్టేందుకు ప్రయత్నించాడు… ఐటీ, ఈడీని పంపించాడు… నాతో పెట్టుకుంటే కొరివితో పెట్టుకున్నట్టే… తస్మాత్‌ జాగ్రత్త అంటూ తెరాస అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ తనను బెదిరిస్తున్నారని, ఈ ఊ కదంపుడు హెచ్చరికలను తాను ఖాతరు చేయనని నరేంద్రమోడీకన్నా ముందే తాను ముఖ్యమంత్రిని అయ్యానని జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించానని చెప్పారు. గత ఎన్నికల్లో తెరాస అధినేత కేసీఆర్‌ ఇచ్చిన హామీలకే దిక్కు లేదని, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకే కొత్త హామీలు ఇచ్చేందుకు ఆయన బయలుదేరారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏసీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read