ఇప్పుడంటే ప్రజా కూటమి వచ్చింది.. సొంత రాష్ట్రంలో కోదండరాం, గద్దర్, ఇటు చంద్రబాబు, అటు నుంచి రాహుల్ కేసీఆర్ చేసిన మోసాలని వివరిస్తున్నారు కాని, గత నాలుగు ఏళ్ళుగా కేసీఆర్ కు నిద్ర లేని రాత్రులు గడిపేలా చేసిన రేవంత్ రెడ్డిని మాత్రం మర్చిపోకూడదు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, రాహుల్, చంద్రబాబు సభలకు వచ్చినంత మంది ప్రజలు, రేవంత్ ప్రచార సభలకు కూడా వస్తున్నారు. అందుకే, రేవంత్ ని వీలైనంత వరకు ప్రచారానికి రాకుండా కేసీఆర్ వేసిన స్కెచ్ వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. అందుకే రేవంత్ కూడా గత రెండు రోజులుగా కోడంగల్ దాటి బయటకు రావటం లేదు. రేవంత్ ని ఎన్నికల ప్రచారంలో హత్య చేస్తారంటూ, దానికి మాజీ నక్సల్స్ ని ఉపయోగిస్తున్నారు అంటూ, లీక్ ఇచ్చారు.

revanth 01122018

దానికి తోడు రేవంత్ సెక్యూరిటీ తగ్గించారు. గతంలో ఇలాగే పరిటాల రవి విషయంలో కూడా జరగటంతో, రేవంత్ జాగ్రత్త పడ్డారు. ఇదే విషయం పై కోర్ట్ కి తెలిపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ రేవంత్‌రెడ్డికి 4+4తో భద్రత కల్పించాలని శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలంది. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంకలగకుండా భద్రతా సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొంది. తన కదలికల సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారని ఒకవేళ ఆయన ఫిర్యాదుచేస్తే, దర్యాప్తు జరిపి నివేదికను తమకు సమర్పించాలంటూ డీజీపీని న్యాయమూర్తులు ఆదేశించారు. భద్రత అంశాన్ని పట్టించుకోకుండా ముందుకెళితే ప్రాణాలు తీసేందుకూ వెనకాడేలా లేరని, అందుకే పార్టీ కార్యకర్తలు, అనుచరుల ఒత్తిడి, సూచనలతో ఎన్నికల పర్యటన వాయిదా వేసుకున్నానని రేవంత్ వెల్లడించారు.

revanth 01122018

శుక్రవారం కొడంగల్‌లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ప్రచారంలో వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేని సీఎం కేసీఆర్‌ నాపై కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగా నక్సల్‌ ఏరివేతలో సుశిక్షితులైన కొందరు పోలీసు అధికారులు, లొంగిపోయిన మావోయిస్టులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నర్సంపేట్‌లో నాపై దాడికి వ్యూహం రచించారు. ఆ విషయమై పోలీసు వర్గాలే నాకు చెప్పాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఉన్నందున, వారి ముసుగులో దాడి చేయిస్తారనే స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే కొడంగల్‌ నియోజకవర్గంలోనే ఉంటున్నా. ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లు నాకు రక్షణగా లేకపోగా నా విషయాలన్నీ పోలీసు ఉన్నతాధికారులకు మోస్తున్నారు. ఇదే విషయమై పలు దఫాలుగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పార్టీలో హోదా పెరిగితే భద్రత పెంచాలి. బదులుగా నాకు భద్రత తగ్గించారు. ఉన్నవాళ్లనూ ఇన్‌ఫార్మర్లుగా వాడుకుంటున్నారు. ఐబీ అధికారులతో నాకు ప్రమాదం పొంచి ఉంది" అంటూ రేవంత్ తెలిపారు.

తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వెళ్ళిపోవటం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. ఆయన వెళ్లిపోతారని చాలాకాలంగా రాజకీయ వర్గాలు ఊహిస్తున్నదే కావడంతో ఈ వ్యవహారం పెద్దగా కలకలం కూడా కలిగించలేదు. ఎన్నికలకు బాగా ముందుగా ఆయన తనంతట తానే వెళ్లిపోవడం టీడీపీ నాయకత్వానికి కూడా ప్రశాంతత చేకూర్చింది. టీడీపీలో రావెల తారాజువ్వలా వేగంగా పైకెగిరి, అంతే వేగంగా కిందకు జారిపోయారు. నిజానికి ఆయన సతీమణి రావెల శాంతిజ్యోతి 2009 ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ (ఎస్సీ) స్థానంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో రావెల మొదట వైసీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు. అక్కడ సాధ్యం కాకపోవడంతో ప్రత్తిపాడు నుంచి టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు.

jaansena 30112108 2

ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఆయన గతంలో లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వద్ద పనిచేసి ఉండడంతో పాత నాయకులను పక్కనపెట్టి టీడీపీ అధినాయకత్వం ఆయనకు టికెట్‌ ఇచ్చింది. ఆయన అక్కడ విజయం సాధించారు. అనుభవం ఉన్న అధికారిగా పరిపాలనలో మంచి ఫలితాలు చూపిస్తారన్న అంచనాతో చంద్రబాబు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి పెద్ద శాఖలు ఇచ్చినా పనితీరు కనబరచలేకపోయారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలతో తగాదాలు నిత్యకృత్యంగా మారాయి.జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌తో బహిరంగంగానే గొడవపడ్డారు. ఈ కారణంగా తదుపరి విస్తరణలో చంద్రబాబు ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు.

jaansena 30112108 3

అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న రావెల పార్టీలో అంటీముట్టనట్లుగా ఉంటూ వచ్చారు. టీడీపీ అంటే ఉప్పునిప్పుగా వ్యవహరించే ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో చేయికలిపారు. చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు దగ్గరయ్యారు. ఇలాంటి చర్యలతో ఆయనకు ప్రత్తిపాడులో మళ్లీ టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగింది. దాంతో రావెల వైసీపీలో చేరాలనుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలిశారు. ప్రత్తిపాడు నుంచే పోటీచేసే అవకాశమివ్వాలని కోరారు. అయితే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరితకే టికెట్‌ ఇస్తామని చెప్పడంతో.. బాపట్ల (ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచైనా అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ జగన్ కూడా కుదరదు అనటంతో, ఈయన వచ్చి పవన్ పక్కన చేరారు. పవన్ తో రావెల చేరటానికి ఇదే కారణం తప్ప, ఇంకా ఏమి లేదని, ఆయన వర్గం చెప్తుంది.

 

రాష్ట్రంలో కాగిత రహిత పాలన కొనసాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా శుక్రవారం ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన క‌లెక్టర్ల స‌దస్సును పూర్తిగా కాగితరహితంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల పాలనాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రెజెంటేషన్లన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే అందించడం విశేషం. పూర్తి కాగిత రహితంగా జరిగిన సమావేశం రాష్ట్ర చరిత్రలో ఇదేనని అధికారులు ప్రకటించారు. గ‌తంలో జ‌రిగిన స‌ద‌స్సుల‌కు భిన్నంగా ఈ సమావేశం మొత్తం డిజిట‌ల్ మ‌యంగా నిర్వహించారు. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌ పోర్టల్‌ను రూపొందించింది. ఈ పోర్టల్‌ను సమావేశం ప్రారంభంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

collectors 01122018 2

ఎన్నో ప్రత్యేక‌త‌ల‌తో ఈ పోర్టల్‌ను రూపొందించారు. స‌ద‌స్సులో పాల్గొనే క‌లెక్టర్లు, వివిధ శాఖ‌ల ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రగతి నివేదికలను ఇందులో పొందుప‌రచారు. ఆన్‌లైన్ విధానంలోనే ముఖ్యమంత్రికి ప‌వ‌ర్‌పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. లోగడ జరిగిన క‌లెక్టర్ల స‌ద‌స్సులకు సంబంధించిన గణాంకాలు, నివేదిక‌ల‌ను కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచడం విశేషం. ఆయా స‌దస్సులు తీసుకున్న నిర్ణయాలు, వాటిపై జిల్లా పాలనాధికారులు తీసుకున్న చర్యలు ఇకపై ఇందులో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అవుతున్నాయ‌నేది సాధారణ ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి అధికారికి సోషల్ మీడియా మొబైల్ అప్లికేషన్ల ద్వారా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందించారు.

collectors 01122018 3

జిల్లా క‌లెక్టర్ల స‌మావేశాలలో ఆయా ప్రభుత్వ శాఖల పనితీరు నివేదిక‌ల స‌మ‌ర్పణ‌కు కాగితాల ఖ‌ర్చు ప్రతిసారి ఐదారు ల‌క్షల రూపాయ‌లు అయ్యేది. ఈ పర్యాయం ఆ మేరకు వ్యయాన్ని నియంత్రించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్‌టైమ్ గవర్నన్స్‌ విభాగాన్ని అభినందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో ఆర్టీజీఎస్‌ను అమలుచేస్తుండటం గర్వకారణమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఆర్టీజీఎస్‌ ద్వారా ప్రభుత్వం స‌త్ఫలితాలను సాధించగలుగుతోందని చెప్పారు. ఆర్టీజీకి అనుబంధంగా ఉన్న ‘ప‌రిష్కార వేదిక’ 1100 కాల్ సెంట‌ర్ ద్వారా ప్రజ‌ల‌కు అనుసంధానం అవుతుండటంతో పరిపాలనలో అత్యుత్తమ ఫలితాలను రాబట్టగలుగుతున్నామన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజ‌ల స‌మస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే కాకుండా మరింత నాణ్యమైన సేవలను అందించడానికి ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌ సాధ్యమవుతోందని అన్నారు.

‘ఆదరణ-2’ పథకం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం అధికార యంత్రాంగం అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. లబ్దిదారుల సహనానికి పరీక్ష పెట్టేలా పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ‘ఆదరణ-2’పై ప్రజల్లో సంతృప్తి 54% మాత్రమే ఉండటాన్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి దీనిని సరిదిద్దుకోవాలని చెప్పారు. మరింత బాధ్యతగా వ్యవహరించి లబ్దిదారులకు తక్షణం ఉపకరణాలు అందేలా, వారంతా సంతోషంగా ఉండేలా చూడాలన్నారు. పెద్ద పరికరాలను ప్రత్యేక వాహనాల్లో లబ్దిదారుల ఇళ్లకు గౌరవంగా తరలించాలని, నియోజకవర్గాల వారీగా పనిముట్లను లబ్దిదారులకు వెంటనే అందించాలని చెప్పారు. ఈ పనిముట్లతో ఆయా కుటుంబాలకు అదనపు ఆదాయం చేకూరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

collectors 01122018 2

‘పేదలకు వైద్యసేవల్లో సంతృప్తస్థాయి పెరగాలి. అన్ని జిల్లాలలో 85% సంతృప్తి రావాలి. 108 సేవలు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు, సంచార చికిత్స, తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్, అన్ని పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి పెరగాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంలో డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, అది మంచి పద్ధతి కాదని, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని చెప్పారు. సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని ఈ తరహా సేవల్లో నాణ్యతను పెంచే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. డాక్లర్లు అందుబాటులో లేరని, మందుల కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. దశలవారీగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. న్యూట్రీ గార్డెన్లను అభివృద్ది చేసే బాధ్యతను అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చి పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీ ప్రత్యేకాధికారులకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

collectors 01122018 2

సంక్రాంతి పండుగ కల్లా అన్ని గ్రామాలు సుందరంగా మారాలని, ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా సరికొత్త శోభ రావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి షెడ్ల నిర్మాణం డిసెంబర్ 31 కల్లా పూర్తిచేయాలని చెప్పారు. అలాగే సంక్రాంతి కల్లా రాష్ట్రంలో ప్రతి గ్రామం ఎల్‌ఈడీ కాంతులతో నిండాలన్నారు. ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు లక్ష్యం 27.52 లక్షలు కాగా, ఇప్పటికి 18.96 లక్షలు (69%) పూర్తి చేశారని, మిగిలిన 7,525 గ్రామాల్లో 8.56 లక్షల వీధి దీపాల ఏర్పాటును 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఏపీఎల్‌ఈడీ ప్రాజెక్టు ఆరు జిల్లాలలో పూర్తయ్యిందని, జనవరి 15కల్లా మిగిలిన ఏడు జిల్లాలలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఉదయం ఆరు గంటలకల్లా వీధి దీపాలు ఆపాలని, పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయని కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్టర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆధునిక యంత్రసామాగ్రి వినియోగంపై కార్యశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read