కేసీఆర్ నోరు తెరిస్తే ఎలా బూతులు తిడతారో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఆ తిట్లే తనను గెలిపిస్తాయనే భ్రమలో కేసీఆర్ ఉంటారు. అందుకే ఎవరిని పడితే వాళ్ళని, బూతులు తిడుతూ, ప్రచార సభలని మార్చేస్తూ ఉంటారు. నిన్న లగడపాటి రాజగోపాల్, తెలంగాణాలో ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలుస్తారు అని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై, సన్నాసులు అంటూ తిట్ల దండకం అందుకున్నారు కేసీఆర్. రెండు నెలల క్రిందట ఇదే లగడపాటి సంస్థ, కేసీఆర్ గెలుస్తాడు అని చెప్తే, ఆహా ఓహో అంటూ ప్రచారం చేసి, ఇప్పుడు లగడపాటి ఎవరు గెలుస్తారో చెప్పకుండా, కేవలం కొంత మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు అని చెప్పాగానే, అతను సన్నాసాడు అయిపోయాడు.
శుక్రవారం సాయంత్రం భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. కేసీఆర్ సర్వేలపై స్పందిస్తూ.. ‘కొంతమంది సన్నాసులు.. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా శాపాలు పెట్టినోళ్లు.. కొన్ని వెకిలి, మకిలి, పిచ్చి సర్వేలు విడుదల చేస్తారు. ఆ సర్వేలను టీఆర్ఎస్ కార్యకర్తలు, ఓటర్లు పట్టించుకోవద్దు. ఆ సర్వేలతో ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు చెప్పింది విని.. ఏది నిజమో ఆలోచించుకొని ఓటేయండి. గత్తరగా ఓటేస్తే.. వచ్చే ఐదేళ్లు గత్తర, గత్తరగానే ఉంటుంది’అన్నారు.
స్వతంత్ర ప్రభంజనం దేనికి సంకేతం? స్వతంత్రులకు ఓటేయాలని ఓటర్ సంకల్పించుకున్నాక నియోజక వర్గం బయటి అంశాలేవీ పని చేయబోవని, పోలింగ్ తేదీనాటికి స్వింగ్లో మార్పులేవీ ఉండబోవని కూడా లగడపాటి చెప్పారు. ఇప్పటివరకు ఆయన సర్వేలు చాలా వరకు నిజం కావడంతో ఇది కూడా నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్రులు ఎక్కువగా ఎన్నికవడానికి కారణాలేంటి? గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తింది అనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే సాధారణంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం వీస్తున్నపుడు స్వతంత్రులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటోంది.