ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, గ్రామం ఇంధన పొదుపునకు చిరునామాగా మారాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వచ్చే సంక్రాంతి కల్లా 100 శాతం ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 30న కలెక్టర్ల సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఇంధన, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి కల్లా మొత్తం 27 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

led 30112018 2

సంక్రాంతి పండగకల్లా గ్రామాల్లోని వీధులన్నీ ఎల్‌ఈడీ వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి సంక్రాంతికి కొత్త వెలుగులు నిండాలని, ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో ప్రజలు పండగ చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆరు జిల్లాల్లో (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, చిత్తూరు, కడప, అనంతపురం) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామాల్లో 18.81 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాలన్నీ కలిపి కేవలం 9000 లైట్లు మాత్రమే ఏర్పాటు చేశాయని వివరించారు. మొత్తం జాతీయ ఎల్‌ఈడీ కార్యక్రమంలో 33 శాతంతో ఏపీ అగ్రపథంలో నిలిచిందని పంచాయతీరాజ్, ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కలెక్టర్ల సదస్సులో ఎల్‌ఈడీ వీధి దీపాల కార్యక్రమంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖను కోరారు.

led 3011201 8 3

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కే జవహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈఈఎస్‌ఎల్ మద్దతుతో 6466 గ్రామ పంచాయతీల్లో 18.81 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చినట్లు చెప్పారు. జనవరి 15 కల్లా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి కృషి చేస్తామని అన్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 27 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు పూర్తయితే ఏటా 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపుతో ఖజానాకు రూ. 180 కోట్లు ఆదా అవుతున్నాయన్నారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, జీ సాయి ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజవౌళి, అడిషనల్ సెక్రటరీ. ఏపీ ట్రాన్క్సో, ఎండీ ఏపీ జెంకో కే విజయానంద్, నెడ్క్యాప్ ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌... రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేనేలేరు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎందరో ప్రముఖులు ఆయనను సంప్రదిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అనేకమంది అగ్ర నాయకులు, అభ్యర్థులు లగడపాటికి ఫోన్‌ చేస్తున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులూ ఆయనను ఆశ్రయిస్తున్నారు. కొందరు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, మీడియా సంస్థల వారు కూడా లగడపాటితో మాట్లాడేందుకు తహతహలాడుతున్నారు. కారణం... సర్వే నిపుణుడిగా, ఆంధ్రా అక్టోప్‌సగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు, విశ్వసనీయత!

lagadapati 30112018

అయితే తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని లగడపాటి రాజగోపాల్‌ జోస్యం చెప్పారు. రెబెల్స్‌గా బరిలోకి దిగిన వీరు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు. తిరుమల వచ్చిన సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొందని చెప్పారు. తన సర్వే ఫలితాలను డిసెంబర్‌ 7న వెల్లడిస్తానని తెలిపారు. అంతకుముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ బోథ్‌ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి జాదవ్‌ అనిల్‌ కుమార్‌ గెలవబోతున్నారని తెలిపారు.

lagadapati 30112018

దీన్నిబట్టి వారికి ఏమేరకు ప్రజాబలం ఉందో అర్థమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు తొలిసారి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కానని పునరుద్ఘాటించారు. గతంలో ఆయన సర్వేలన్నీ నూటికి నూరుపాళ్లు నిజం కావడంతో... ఆయన నుంచి సమాచారం తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందా, లేదా తెలుసుకోవాలని ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఆయనను సంప్రదిస్తున్నారు. వ్యక్తిగతంగా తాము విజయం సాధిస్తామా, లేదా సర్వే చేసి పెట్టాలని పలువురు అభ్యర్థులు అడుగుతున్నారు. వ్యక్తిగతంగా ఒక్కో అభ్యర్థి గెలుపోటములపై సర్వే చేయబోమని, రాష్ట్ర స్థాయిలో మొత్తం ఫలితంపైనే తన సర్వే ఉంటుందని లగడపాటి చెబుతున్నారు. సర్వే ఫలితాలను డిసెంబరు 7న పోలింగ్‌ ముగియగానే సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపిస్తూ చేపట వేటకు వెళ్లిన 28 మంది ఏపీ జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులపై భారత ఎంబసీ స్పందించింది. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ స్వీకరించింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను భారత హైకమిషన్.. పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. నిర్బంధించిన మత్స్యకారులను కరాచీ పంపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ అధికారులతో భారత ఎంబసీ అధికారి గౌరవ్ అహ్లువాలియా సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటు ఇస్తామని భారత ఎంబసీ అధికారుల హామీ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌కు కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు సమాచారం అందించారు.

coastgaurd 29112018 2

ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల యోగక్షేమాలపై ఆరా తీశారు. మత్స్యకారులంతా సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని సూచించారు. పాకిస్థాన్ విదేశాంగ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించాలన్నారు. ఏపీ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటు ఇస్తామని రాయబార కార్యాలయ అధికారులు హామీ ఇచ్చినట్టు ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ కు సమాచారం. వివరాలు కుటుంబ సభ్యులకు తెలియ చేయాలని పేర్కొన్నారు. మత్స్యకారులు స్వస్థలాలకు వచ్చేదాకా బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

 

coastgaurd 29112018 3

అదుపులో ఉన్న జాలరల్లో 20 మంది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల వాసులుగా గుర్తించారు. నలుగురు తూర్పుగోదావరి, మరో నలుగురు విజయనగరం జిల్లాకు చెందిన జాలర్లను తెలుస్తోంది. మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్బంధించిన జాలర్లను కరాచీ పంపినట్టు సమాచారం. కాగా, ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు మంత్రి కళా వెంకట్రావు తెలియజేశారు. ఏపీ భవన్ అధికారులతో ఈ మేరకు చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. అదుపులో ఉన్న జాలర్లను తిరిగి ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని, జాలర్లకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాలర్ల కుటుంబాలు ఆందోళన చెందవద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఎక్కడైనా ఒక పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారతన్నాడు అంటే, ఆ వ్యక్తిని పార్టీ మారకుండా బుజ్జగిస్తాయి పార్టీలు. ఆయనకు ఏమి కావాలో అది చేసి, బుజ్జగిస్తూ ఉంటాయి. అందునా ఒక మాజీ మంత్రి, దళిత వర్గం అయితే, అలాంటి వ్యక్తిని వదులుకోవటానికి ఏ పార్టీ సాహసించదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, అంత తేలికగా ఎవరినీ వదులుకోరు. అయితే, ఇక్కడ మాత్రం అంతా రివర్స్, పార్టీ మారతన్నాడు అనే వార్తలు రాగానే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మేళతాలాలతో సాగానపుతాం అంటున్నాయి. వార్తా ఛానల్స్ లో తెలుగుదేశం పార్టీకి షాక్, చంద్రబాబుకి షాక్ అని రాస్తున్నాయిని, అసలు మాకు షాకే లేదని, ఆయన్ను హాయగా పార్టీ నుంచి సాగానంపుతాం అంటున్నాయి. ఇంతకీ ఆ ఎమ్మల్యే, మాజీ మంత్రి ఎవరంటే, రావెల కిషోర్‌‌బాబు.

jaansena 30112108 2

మాజీ మంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌‌బాబు త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 1న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో రావెల పార్టీలో చేరనున్నారు. కాగా ఇప్పటికే జనసేనలో చేరికపై పవన్ కల్యాణ్‌‌తో రెండు దఫాలుగా రావెల భేటీ అయ్యారు. కొంత కాలంగా రావెల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ తనను పట్టించుకోవట్లేదని రావెల అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని రోజులుగా రావెల పార్టీ మారతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన రావెల కిషోర్‌కు ఏపీ కేబినెట్‌‌లో చంద్రబాబు చోటు కల్పించారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాల వల్ల రావెలను మంత్రి పదవి నుంచి తప్పించడం జరిగింది.

jaansena 30112108 3

వివాదాస్పద వ్యక్తిగా పేరున్న రావెల కిషోర్‌బాబును జనసేనలోకి చేర్చుకునేందుకు పవన్‌ ఎలా ఓకేచేశారని జనసేన శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడు ఇతని పై పోరాడామని, ఇప్పుడుం మన పార్టీలో చేరిపోగానే, పునీతుడు అయిపోతాడా అని జనసైనిక్స్ అంటున్నారు. రాజధాని భూ అక్రమాలల్లో రావెల పాత్రతో పాటు, ఆయన కుమారులపైనా పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లో రావెల కుమారుడు ఒక ముస్లిం మహిళను రోడ్డుపైనే చేయి పట్టుకుని కారులోకి లాగబోయాడు. ఆ సమయంలో స్థానికులు అతడిని చితక్కొట్టారు. కానీ తర్వాత కేసు రాజీ చేసుకున్నారు. మరో సందర్భంలో రావెల కిషోర్‌బాబు కుమారుడు మద్యం సేవించి అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. రావెల కిషోర్‌బాబు పైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. రావెల కిషోర్‌బాబు తనను వేధిస్తున్నాడంటూ గుంటూరు చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ అప్పట్లో బోరున విలపించారు. ఈ వ్యవహారశైలి వల్లే రావెల మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు. అయితే వైసీపీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యగా, అక్కడ తలుపులు వేసేయ్యటంతో, పవన్ చేర్చుకోవటానికి రెడీ అయ్యారు.

Advertisements

Latest Articles

Most Read