పెద్ద నోట్ల రద్దుపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్లరద్దుపై ఇంతవరకూ మౌనంగా ఉన్న ఆయన‌ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. నోట్లరద్దు దారుణమైన చర్య అని, ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌ అని అన్నారు. దీని వల్ల వృద్ధి రేటు తగ్గిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వెనక్కి వెళ్లిందని, ఇది జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు చాలా దారుణమైన నిర్ణయమని అన్నారు. త్వరలో విడుదల కానున్న ‘ఆఫ్‌ కౌన్సిల్‌: ది ఛాలెంజెస్‌ ఆఫ్‌ ది మోదీ-జైట్లీ ఎకానమీ’ పుస్తకంలో అరవింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

modi 29112018 2

‘నోట్ల రద్దు చాలా దారుణం. నగదుకు పెద్ద దెబ్బ. ఒక్క నిర్ణయంతో చలామణీలో ఉన్న కరెన్సీలో 86శాతం వెనక్కి వెళ్లింది. నోట్ల రద్దు జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపింది. నోట్ల రద్దుకు ముందు కూడా వృద్ధి నెమ్మదించినప్పటికీ 2016, నవంబరు 8 తర్వాత అమాంతం పడిపోయింది. నోట్ల రద్దుకు ముందు ఆరు త్రైమాసికాల్లో సగటు జీడీపీ వృద్ధి 8శాతంగా నమోదైంది. కానీ నోట్ల రద్దు తర్వాత ఏడు త్రైమాసికాల్లో సగటు జీడీపీ 6.8శాతానికి తగ్గింది’ అని అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత వడ్డీరేట్లు, జీఎస్‌టీ, చమురు ధరల జీఎస్‌టీ వృద్ధిని ప్రభావితం చేశాయని చెప్పారు. రాజకీయ పరిభాషలో నోట్ల రద్దు అనూహ్య పరిణామం అని, ఇటీవలి కాలంలో సాధారణ పరిస్థితుల్లో ఏ దేశమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

modi 29112018 3

ఇక నోట్ల రద్దు అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా విజయాన్ని ప్రస్తావిస్తూ.. ‘నోట్ల రద్దు గందరగోళానికి ఒక సమాధానం మాత్రం ఉంది. పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో పేదలకు ఇబ్బదులు సర్వసాధారణం. సంపన్నుల, అక్రమార్కులను కష్టపెట్టే క్రమంలో పేదలు తమ ఇబ్బందులను పట్టించుకోరు. నాది ఒక మేక పోయింది.. వాళ్లవి ఆవులు పోయాయి అని భావిస్తారు.’’ అని పేర్కొన్నారు. రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ 2016, నవంబరు 8న ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రద్దు నిర్ణయంపై అప్పటి ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్‌ సుబ్రమణియన్‌ను సంప్రదించలేదని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై అరవింద్‌ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఆయన నోట్లరద్దుపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. నాలుగేళ్ల పాటు ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్‌ గతేడాది పదవి నుంచి తప్పుకున్నారు.

తెలంగాణలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో బాబు రోడ్‌షో నిర్వహిస్తున్నారు. భవ్య ఆనంద్ ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా, అక్కడకి వచ్చిన యువత ‘‘వుయ్‌ లవ్‌ చంద్రబాబు. వుయ్‌ మిస్‌ యూ చంద్రబాబు. మీ వల్లే మేం ఇక్కడ ఉన్నాం’ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు స్వాగతం పలికారు. చంద్రబాబుకు స్థానిక యువత, కార్యకర్తలు, పలువురు ఐటీ ఉద్యోగులు అపూర్వ స్వాగతం పలికారు. చంద్రబాబు అభివాదం చేసిన సందర్భంగా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

hitechcity 29112018 2

నేతలు తమ ప్రసంగాల్లో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పుడల్లా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కార్యకర్తలను చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయంటూ చంద్రబాబు ప్రారంభించిన ప్రసంగం.. ఆద్యంతం వాళ్లను ఉత్సాహభరితులను చేస్తూ సాగింది. సైబరాబాద్‌ ఏర్పాటు, హైదరాబాద్‌ అభివృద్ధి కోసం తాను సీఎంగా ఉన్న సమయంలో చేసిన పనులను ప్రస్తావిస్తూ.. సభికులకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌పై తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు. కార్యకర్తలను ఆయన తమ్ముళ్లూ అంటూ సంబోధించినప్పుడల్లా రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

hitechcity 29112018 3

అబద్ధాలు చెప్పే కేసీఆర్‌కు ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు కావాల్సిందే రాజకీయమేనని అందుకే తనను విమర్శిస్తూ రాజకీయాలు చేస్తారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఇద్దరం కలిసి పనిచేద్దామంటే కేసీఆర్‌ ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీకి బి టీమ్ కేసీఆర్ అంటూ ఆరోపించారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని అందులో ఒకటి బీజేపీ ఫ్రంట్‌, మరోటి బీజేపీ వ్యతిరేకి ఫ్రంట్ అని చెప్పారు. కేసీఆర్ ఏ ఫ్రంట్‌లో ఉన్నారో తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి, ఐటీ అభివృద్ధికి.. చంద్రబాబే కారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటిది తనను ఏ మొహం పెట్టుకొని విమర్శిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌, దళితులకు మూడెకరాల భూమి ఎవరికిచ్చారని నిలదీశారు.

పోలవరం కేసు కీలక మలుపు తిరిగింది. ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని స్పష్టంచేసింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అఫిడవిట్‌లో పేర్కొనాలని కేంద్రానికి సూచించింది. ప్రజాభిప్రాయానికి సంబంధించిన విధివిధానాలేంటో పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. పోలవరం నిర్మాణం పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

polavaram 29112018

మరో పక్క, మొన్న సోమవారం నాటికి, ప్రాజెక్టు పనులు 61.93 శాతం మేర పూర్తయ్యాయి. తవ్వకం పనులు 81 శాతం, కాంక్రీటు పనులు 48.55 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం, ఎడమ కాలువ పనులు 65.54 శాతం, రేడియల్‌ గేట్ ల పనులు 61.94 శాతం పూర్తయ్యాయి. గతవారం స్పిల్‌వే పైలట్‌ చానల్‌ అప్రోచ్‌ ఛానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌కు సంబంధించి 5.11 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయి. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబంధించి 60 వేల క్యూబిక్‌ మీటర్ల వరకూ కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. కాఫర్‌ డ్యాం పనులు 50,000 క్యూబిక్‌ మీటర్ల మేర జరిగాయి. పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తంలో కేంద్రం ఇంకా రూ.3,162.32 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా ప్రాజెక్టుపై రూ.15,025.45 కోట్లు ఖర్చు చెయ్యగా,.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,889.59 కోట్లు ఖర్చు అయ్యింది. ఇందులో ఇంకా 3162.32 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.

polavaram 29112018

ఇది ఇలా ఉంటే, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరులశాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. 2017 ఆగస్ట్టులో సమర్పించిన సవరించిన అంచనాలను 14 నెలలుగా నాన్చుతూనే ఉంది. కేంద్ర మంత్రి గడ్కరీ ఈ ఏడాది జులైలో స్వయానా పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఇక అంతా తాను చూసుకుంటానని ఇచ్చిన అభయం కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ అధికారులు దిల్లీకొస్తే పది రోజుల్లో అంతా తేల్చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. 2014నాటి ధరల ప్రకారం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందన్న వాస్తవం తెలిసీ దిల్లీ పెద్దలు తాత్సారం చేస్తున్నారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు వచ్చి వెళ్లారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను కళ్లారా చూశారు. వచ్చినవాళ్లంతా ఏదో కొత్త సమాచారం అడగడం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ప్రహసనంగా మారిపోయింది. తాజాగా 63వేల పేజీల సమాచారం అందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏదో మెలిక పెడుతూనే ఉంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో జరిగిన దాడిపై హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఇందులో వెరైటీ ఏంటి అంటే, ఈ కేసు విచారణ ఏకంగా, ఎన్ఐఏ చెయ్యాలి అని. జగన్‌ పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని, కేసును ఏపీ పోలీస్ పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. జగన్‌పై జరిగిన దాడికి అన్‌లాఫుల్ ఎగినెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్3(ఏ) కింద కేసు నమోదు చేయాలని, కానీ పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్ 307 కింద నమోదు చేశారని పిటిషనర్ ఆరోపించారు.

jagan 29112018

జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందని, ఎన్ఐఏ యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం ఎయిర్‌పోర్ట్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా ఘటన జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందనే విషయం పోలీసులకు తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరించారని, 166 ప్రకారం వాళ్లు కూడా శిక్షార్హులేనని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్కే పిటీషన్‌ను నిశితంగా పరిశీలించిన హైకోర్టు ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది. గతంలో దాఖలైన పిటీషన్‌లో ఇంతవరకు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదంటూ సీఐఎస్ఎఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. సోమవారం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఈ కోడి కత్తి దాడి కేసు కోసం, ఏకంగా ఎన్ఐఏతో విచారణ జరిపించాలి అనటం చూసి, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇక మిగిలింది ఎఫ్బీఐ అని, దానికి కూడా పిటీషన్ పెడతారేమో అంటున్నారు.

 

jagan 29112018

మరో పక్క జగన్ చొక్కాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవద్దు అంటూ మరో పిటీషన్ దాఖులు అయ్యింది. కోర్టుకు సమర్పించిన జగన్ చొక్కను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవద్దని జగన్ తరపున న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు వేచివుండాలని కోరారు. సిట్ ఈ చొక్కాను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని కోర్టును కోరుతూ సిట్ పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై జగన్ తరపున న్యాయవాది కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisements

Latest Articles

Most Read