జగన్ ప్రియ శిష్యురాలు, నోరు తిరేస్తే మగవాళ్ళు కూడా హడిలిపోయే మాటలతో విరుచుకుపతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మల్యే, , సినీ నటి రోజా గురించి అందరికీ తెలిసిందే. ఆవిడ నోరు తెరిస్తే, ఆ బూతులు వినలేక ఎంతటి వారైన చెవులు మూసుకోవాల్సిందే. ఆ బూతులు వల్లనే, ఆమెను అసెంబ్లీ నుంచి కూడా సంవత్సరం పాటు సస్పెండ్ చేసారు. అయినా ఆవిడ నోటి దురద మాత్రం తగ్గలేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, అందరినీ బూతులతో వాయిస్తూ ఉంటుంది రోజా. అలాంటి రోజా అంటే, చివరకు హోం మినిస్టర్ కూడా భయపడే పరిస్థితి.
రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ తరువాత అంతటి పవర్ఫుల్ స్థానం హోం మినిస్టర్ ది. అలాంటి హోం మినిస్టరే, రోజా అంటే వామ్మో అంటున్నారు. వైసీపీ నేత రోజా నోరు మంచిది కాదని, ఆమె గురించి తాను మాట్లాడబోనని ఏపీ డీప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రోజా ఈ మధ్య కాలంలో, కోడి కత్తి దాడి తరువాత, ఇష్టం వచ్చినట్టు అందరి మీద విరుచుకు పడుతుంది. జగన మోహన్ రెడ్డి, కోడి కత్తి దాడి గురించి మాట్లాడే అందరి పై రోజా ను వదులుతున్నారు. ఈ క్రమంలోనే కోడి కత్తి దాడి తరువాత, ఆ కేసు వివరాలు చినరాజప్ప చెప్తూ వస్తున్నారు.
సహజంగా రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు. రాజప్ప మాట్లాడగానే, రోజా మీడియా ముందుకు వచ్చి, ఆయన పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పాపం గోదావరి జిల్లాల నుంచి పరువు గల వ్యక్తిగా, వివాదరహితుడిగా పేరున్న చిన రాజప్ప , రోజా నోరుకి దడుచుకుని, ఒక నమస్కారం పెట్టారు. సోమవారం రాత్రి చినరాజప్ప దంపతులు శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్ రాజకీయ దురుద్దేశంతోనే తన హత్యకు చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారని అన్నారు. లేకపోతే ఘటన జరిగిన 20 రోజుల తర్వాత కోడికత్తి గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రోజా నోరు మంచిది కాదని, ఆమె గురించి తాను మాట్లాడబోనని అన్నారు.