మీకు మేము లక్షల లక్షల కోట్లు ఇచ్చాం, లెక్కలు చెప్పండి అంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు మనం వింటున్నాం. అయితే, కేంద్ర అధికారులు అది బూటకం అని తేల్చారు. అయితే ఈ రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే, ఇక ఏపికి ఇచ్చేది ఏమి లేదని తేల్చి చెప్పూర్. భజన చట్టం, హామీలు సరిగ్గా అమలవడం లేదని, కేంద్రం మొండి వైఖరితో ఉందని, రాష్ట్ర శాసనసభ ఆరు పేజీలతో తీర్మానం చేసి పంపించింది. దానికి కేంద్రం ఒక్క పేజీలో సమాధానం పంపింది. పాతలెక్కలతో ఒక స్టేటస్‌ నోట్‌ తయారుచేసి పంపింది.

center 19112018 2

విభజన చట్టం, హామీల ప్రకారం రాష్ట్రానికి ఇంకా ఎన్ని నిధులు రావాలి ? ఏ రకమైన ప్రయోజనాలు కలగాలి ? కేంద్రం మొండి వైఖరి వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందనే అంశాలతో అసెంబ్లీ తీర్మానం పాపంగా, ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని నిధులు అందాయనే విషయాన్ని కేంద్ర హోం శాఖ సమాధానంగా పంపింది. సాధారణంగా.. చేస్తాం, పరిశీలిస్తాం, త్వరలో నిర్ణయం తీసుకుంటామనే మొక్కుబడి సమాధానాలు కేంద్రం నుంచి వస్తుంటాయి. కానీ మోదీ ప్రభుత్వం బరితెగించి.. మేం చేసిందిదీ.. మీరడిగే వాటితో మాకు సంబంధం లేదన్నట్లుగా.. స్టేటస్‌ నోట్‌ తయారుచేసింది. ఇందులో కూడా ఇప్పటి వరకు అరకొరగా ఇచ్చిన నిధుల లెక్కలే తప్ప అంశాలవారీగా వివరాల్లేవు.

center 19112018 3

విభజన చట్టం, హామీలకు సంబంధించి నిధులు ఇవ్వడమే కాకుండా.. కేంద్రం తీసుకోవలసిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తన నోట్‌లో కనీసం ప్రస్తావించలేదు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రత్యేక సాయం కింద రాష్ట్రానికి ఇచ్చింది రూ.14,310 కోట్లేనని స్పష్టంగా పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా సాయం చేశామంటున్న బీజేపీ నేతల వ్యాఖ్యలు అవాస్తవాలని దీని ద్వారా నిరూపితమైంది. విభజన తర్వాత రాష్ట్రానికి రూ.16 వేల రెవెన్యూ లోటు ఉంటుందని గవర్నర్‌, ఏజీ, కేంద్ర కమిటీ, రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రూ.16 వేల కోట్లకుగాను ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి రూ.3,979 కోట్లు మాత్రమే అందాయి. తాజాగా పంపిన స్టేటస్‌ నోట్‌లోనూ ఇంకా ఇవ్వాల్సిన లోటు గురించి ఎక్కడా ప్రస్తావించనేలేదు. వెనుకబడిన జిల్లాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. దీని గురించీ స్టేటస్‌ నోట్‌లో సమాధానం లేదు. రాజధానికి రూ.1,500 కోట్లు ఇచ్చామని.. వెనుకబడిన జిల్లాలకు రూ.1,050 కోట్లు ఇచ్చామని, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో డ్రైనేజీల నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇచ్చామని, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,764.7 కోట్లు ఇచ్చామని అందులో పాత లెక్కలన్నీ చెప్పింది. విదేశీ రుణ సాయం (ఈఏపీలు) కింద రాష్ట్రం తీసుకున్న రుణాలకు సంబంధించి కేంద్రమే అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ నాలుగున్నరేళ్లలో రూ.15.81 కోట్ల వడ్డీ చెల్లించినట్లు కేంద్రం పేర్కొంది.

రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాల నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తవుతుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ తొట్టత్తిల్ బి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలు పూర్తయి, నోటిఫికేషన్ వెలువడిన అనంతరం రాష్ట్రానికి హైకోర్టును తరలిస్తామన్నారు. శనివారం రాజధాని పరిధిలోని నేలపాడు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస భవనాలను సీజే రాధాకృష్ణన్, పలువురు న్యాయమూర్తులు సందర్శించారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ రాజధానిలో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, జోనల్ ప్లాన్, తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు.

highcourtcj 19112018 2

జ్యుడీషియల్ కాంప్లెక్ వెలుపల, లోపల జరుగుతున్న పనులను చీఫ్ జస్టిస్ నిశితంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. కాంప్లెక్స్ మధ్యభాగంలోని కట్టడం గురించి ఆరాతీశారు. అక్కడ అద్దాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాంప్లెక్స్ పనులకు సంబంధించి కొన్ని మార్పులను సీజే ప్రతిపాదించారు. ఫర్నీచర్, కోర్టు హాళ్ల డిజైన్, జడ్జీల చాంబర్లు, అడ్వకేట్ల కార్యాలయాలు, ఫుల్‌కోర్టు సమావేశ మందిరం, తదితర అంశాలపై సీఆర్డీఏ కమిషనర్‌తో చర్చించారు. జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారుల ప్రవేశమార్గాలు, కాంప్లెక్స్‌లో వారికి అనువైన స్థలాల గురించి అడిగి తెలుసుకున్నారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన డిజైన్లను పరిశీలించారు.

highcourtcj 19112018 3

కేపిటల్ సిటీ, ఐకానిక్ భవనమైన హైకోర్టు డిజైన్లను తిలకించారు. జడ్జీల బంగ్లా పనులు, లోపల వసతుల్లో మార్పులు, చేర్పులను సూచించారు. ఐఏఎస్ అధికారుల నివాస భవనాల నిర్మాణాలను, మోడల్ ఫ్లాట్లు, జడ్జిల క్వార్టర్ల నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఈ(అమరావతిలోని) హైకోర్టుకు వచ్చే అవకాశం నాకు ఉండకపోవచ్చు. అవకాశం ఉంటే నేను తప్పనిసరిగా వచ్చేవాడిని. అంత బాగా ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు సమాచారం. తాము మూడు వారాల కిందట వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు పనుల వేగం బాగా పెరిగిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలలుగన్న ఫార్ములా-1 రేస్ పోటీలు, నేడు అమరావతిలో సాకారమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి వైపు పారిశ్రామికేవేత్తలు చూస్తున్నారని, త్వరలోనే అమరావతి ముందు వరుసలో నిలవనుందన్నారు. అమరావతి ఎఫ్1హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ పోటీలను చివరిరోజు ఆదివారం వీక్షించిన చంద్రబాబు ఫలితాల అనంతరం ప్రసంగించారు. ఇక నుండి ప్రతి ఏడాది ఎన్టీఆర్ సాగర్‌లో పవర్ బోట్ రేస్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు.

manoj 18112018 2

వచ్చే ఏడాది ఇదే సీజన్‌లో ఫార్ములా-1 బోట్ రేసులు తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 1 నుండి 7 వరకు కృష్ణానదిలో వాటర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్ములా-1 పోటీలను అమరావతిలో నిర్వహించేందుకు హెచ్2వో ఎంతో సహకారం అందించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో ఫార్ములా-1 పోటీలు నిర్వహించాలని ప్రయత్నించామన్నారు. అయితే ఇప్పటికి ఆ కల అమరావతిలో సాకారమైందన్నారు. ఇక నుండి ప్రతీ నెల అమరావతిలో ఒక ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించారు.

manoj 18112018 3

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఫన్‌తో పాటు బిజినెస్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే బిజిసెన్ సమ్మిట్ల ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న అమరావతి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించనుందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం టూరిజం అభివృద్ధికీ అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని రంగాల అభివృద్ధికి టూరిజం ఎంతో కీలకమన్న చంద్రబాబు ఆ శాఖ అధికారుల సమన్వయంతోనే ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. వీటి స్ఫూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావచ్చని అశిస్తున్నామన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న ఎయిర్‌ఫోర్స్ ఈవెంట్ కూడా ప్రపంచ దేశాలను ఆకర్షించిందన్నారు.

నిన్న ఏపిలో సూపర్ సండేలా ఉంది. ఒక పక్క అమరావతిలో బోటు రేస్ అందరినీ ఆకట్టుకోగా, మరో పక్క వైజాగ్ లో అదిరిపోయే మారథాన్ జరిగింది. నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్ ఆదివారం విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా జరిగింది. దాదాపు 15వేలకు మంది పైగా మారథాన్‌లో పాల్గొన్నారు. సింబెక్స్ 18 ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొంటున్న రాయల్ సింగపూర్ నేవీ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. నేవీ మారథాన్‌ను 42.2కిమీ కరేజ్ రన్, 21.1 డెస్టినీ రన్, 10 కిమీ ఫ్రెండ్‌షిప్ రన్, 5 కిమీ ఫన్ రన్ కేటగిరీల్లో నిర్వహించారు.

vizagmarathon 19112018 2

ప్రస్తుతం తూర్పు తీరంలో ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొంటున్న రాయల్ సింగపూర్ నేవీ (ఆర్‌ఎస్‌ఎన్) సిబ్బంది ప్రతినిధులు 10 కిమీ ఫ్రెండ్‌షిప్ రన్‌లో పాల్గొన్నారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ 5 కిమీ ఫన్ రన్‌ను, ఆర్‌ఎస్‌ఎన్ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ ఎడ్విన్ లియోంగ్ 10కిమీ ఫ్రెండ్‌షిప్ రన్‌ను ప్రారంభించారు. 42.2 కిమీ కరేజ్ రన్ పురుషుల విభాగంలో మోహిత్ రాథోడ్, మహిళల విభాగంలో కె.తిరుపతమ్మ ప్రథమ స్థానాలు సాధించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కును తూర్పునౌకాదళ ప్రధానాధికారి కరమ్‌బీర్ సింగ్ అందజేశారు.

vizagmarathon 19112018 3

ఆదివారం తెల్లవారుజాము 4.15 గంటల నుంచి విశాఖ ఆర్కేబీచ్‌ తీర ప్రాంతం కిక్కిరిసిపోయింది. నావికాదళం నిర్వహిస్తున్న ఈ మారధాన్‌లో 15వేలమందికిపైగా పాల్గొన్నారు. 42 కి.మి., 21 కి.మి., 10 కి.మి, 5 కి.మి. విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు. తెల్లవారుజాము 42 కి.మి. పరుగును కెప్టెన్‌ అన్మేష్‌ ప్రారంభించారు. ఈ పరుగులో 351 మంది పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకు 21 కి.మి. పరుగును కమాండెండ్‌ అరవింద్‌ శర్మ ప్రారంభించగా, ఇందులో 2254 మంది పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు 10 కి.మి. పరుగును రియల్‌ అడ్మిరల్‌ త్రిపాఠి ప్రారంభించగా, ఇందులో 4291 మంది, 5 కి.మి. పరుగులో 8253 మంది పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read