కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, జగన్ నంచి నుంచి వాగ్మూలం తీసుకోవలసి ఉందని విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్‌చంద్ర లడ్డా ఇది వరకే తెలిపారు. ఆయనకు ఇప్పటికే సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు అందజేశామని వెల్లడించారు. రిజిస్టర్ పోస్టులో, జగన్ కు నోటీస్ పంపారు. సిట్ కూడా ఇప్పటికి మూడు సార్లు నోటీసు పంపింది.
అయినా జగన్ వినకపోవటంతో, ఈ రోజు మరోసారి నోటీసులు పంపారు. కోడికత్తి దాడి కేసులో జగన్‌కు సిట్ మరోసారి నోటీసులిచ్చింది. వాంగ్మూలం ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో జగన్, ఆయన పీఏకు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాడి ఘటన సమయంలో జగన్ ధరించిన చొక్కాను నవంబర్ 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో చొక్కా కీలకమని కోర్టులో దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేశారు. దాడి జరిగిన తర్వాత పోలీసులకు జగన్ వాగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను ఏపీ పోలీసుల బృందం కలిసింది. వాగ్మూలం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఏదైనా ఏజెన్సీ వారితో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నారు. దీంతో పోలీసుల బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తి దాడి ఘటనపై జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కత్తి దాడి ఘటనపై స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలంటూ జగన్ కోర్టులో పిటిషన్‌లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని, అది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోందన్నారు. ఈ పిటిషన్‌లో సీఎం చంద్రబాబుతో సహా ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. స్వతంత్ర్య దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.