ఎవరు పడితే వారు, ఎలాంటి విమర్శలు చేసినా, చంద్రబాబు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారికి సమాధానం చెప్పి, వారిని పెద్ద వాళ్ళని చెయ్యరు. మంచి వైపు ప్రజల ఆలోచనలు వెళ్ళకుండా, ఇలాంటి విమర్శలుకు సమాధానం చెప్తే, ప్రజల ఆలోచనలు అభివృద్ధి వైపు కాకుండా, చెడు వైపు వెళ్తుందని, ఆయన్ను ఎంత విమర్శించినా పెద్దగా పట్టించుకోరు. అందుకే, ఒక మామూలు వాడు కూడా, ఆయాన పై ఎంత మాట అనటానికైన వెనుకాడరు. చంద్రబాబు ఏమి చెయ్యడులే అనే భయం. ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన పార్టీ నాయకులు కూడా లైట్ తీసుకుంటారు. ఇదే క్రమంలో, తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఉన్న కేసీఆర్, ప్రాజెక్ట్ ల పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
దీంతో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న విమర్శలపై ప్రజల్లోకి వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇరిగేషన్ అధికారులతో సమావేశం అయ్యారు. స్టేటస్ నోట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్ధిష్ట విధానం పాటించాలనే కోరుతున్నామని, ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు ఏమీ చేయలేదని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ ఆమోదం పొందాలని కోరామని అధికారులు తెలిపారు. ఏపీ విధానం, కేంద్రానికి రాసిన లేఖలోని అంశాలను.. తెలుగు ప్రజలకు వివరిద్దామని చంద్రబాబు అన్నారు.
ఇదీ అసలు జరిగిన విషయం... రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ స్థానంలో సమీకృత దుమ్ముగూడెం ఎత్తిపోతల(సీతారామ ఎత్తిపోతల) పథకాన్ని రూ.7926.147 కోట్లతో చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చిందని, 50 టీఎంసీల నీటిని వినియోగించుకొని ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చే ఈ పథకం కొత్తదని ఏపీ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ చర్య ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని పేర్కొంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84(8) (ii) ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం సిఫార్సు చేయాలని, సెక్షన్ 85(8)(డి) ప్రకారం ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం చేసిన కేటాయింపులపై ప్రభావం చూపరాదని లేఖలో వివరించింది. అపెక్స్ కౌన్సిల్ కూడా ఆమోదించాల్సి ఉంటుందని తెలిపింది.