ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. విద్యాశాఖలో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు కొన్ని నెలలగా పెండింగ్‌లో ఉండడంతో ఆ విషయాన్ని కామినేని శ్రీనివాసరావు ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తమ జీతాలు అందుకున్న ఉపాధ్యాయులు కామినేని శ్రీనివాస్‌తో పాటు సోమవారం సచివాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో పాటు మాజీ మంత్రి కామినేనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. మరో పక్క ఈ భేటీ రాజకీయంగా కూడా చర్చ అయ్యింది.

bjp 12112018 2

అయితే బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీలో చేరేందుకు కామినేని శ్రీనివాసరావు చూస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుంతుంది. ఏపీ కేబినెట్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు బీజేపీ పై జాతీయ స్థాయలో దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో తెగదింపులు చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురందేశ్వరి, జీవీఎల్ లాంటి నేతలు, చంద్రబాబు,టీడీపీల పై విరుచుకుపడుతున్నారు. మాటల దాడి చేస్తున్నారు. ఎవరు ఏమన్నా..కామినేని మాత్రం ఏం మాట్లాడటం లేదు.

bjp 12112018 3

మరో పక్క, కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్న కామినేని టీడీపీ పక్షాన అక్కడ నుంచే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారని అనుచరులు చెబుతున్నారు. బీజేపీ నాయకుడై ఏనాడు టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా కామినేని వ్యవహరించలేదు. ఇది ఇలా అంటే, కామినేని వైఖరి పై కొందరు నేతలు పనిగట్టుకుని మరీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. తన సొంత నియోజకవర్గమైన కైకలూరులో టీడీపీ బలంగా ఉంది. అందుకే బీజేపీ నుంచి టీడీపీలోకి రావడానికి కామినేని ఆసక్తి చూపిస్తున్నారనే వాదన లేకపోలేదు. అయితే, ఇప్పుడు కామినేని, చంద్రబాబుతో భేటీ అవ్వటంతో, మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ, టిడిపి మధ్య ఇంత వైరుధ్యం ఉన్న నేపధ్యంలో, కామినేని చంద్రబాబుని కలవటం, సహజంగానే ఆశ్చర్యపరుస్తుంది.

మమ్మల్ని ఎదురిస్తున్న, చంద్రబాబుని ఎలా అయినా దించాలనే ఆపరేషన్ మొదలు పెట్టింది కేంద్రం. ఈ ఆపరేషన్ లో ప్రధాన పాత్రదరులు, ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రాన్ని, మోడీ, అమిత్ షా లను ఒక్క మాట కూడా అనకుండా, ఢిల్లీ అహంకారం పై దేశ వ్యాప్త ఉద్యమం చేస్తున్న చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరు అందరూ కలిసి పని చేస్తే, ప్రజలు వీరి గుట్టు పట్టేస్తారని, ఇప్పటి వరకు విడివిడిగానే ఉన్నారు. కాని ఎన్నికల్లో జగన్, పవన్ కలిసి పని చెయ్యాలని, ఢిల్లీ ఆదేశాల మేరకు, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పని చేస్తారనే వార్తలు కూడా వచ్చయి. అయితే, జగన్, పవన్ పొత్తు పై, ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.

jagan 12112018 1

ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇటీవల విశాఖపట్నంలో వట్టి రవి ఇంట్లో కలిశారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర జరిగిన సమయంలో జగన్మోహనరెడ్డి పవన్‌ను కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారు. అయితే సీఎం సీటుపై పవన్‌కల్యాణ్‌ దృష్టి పెట్టడం వల్ల సీట్లు సర్దుబాటుకాక బయటకు వచ్చినట్టు తెలిసింది. కులం, మతం పునాదులపై వారు అధికారంలోకి రాలేరు.

jagan 12112018 1

ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఆడుతూ ఆంధ్ర ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని నమ్మించి దగా చేసింది. అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాంగ్రె్‌సతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దానిని చూసి ఓర్వలేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని కారెం మండిపడ్డారు.

 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మరోసారి బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారం పై, ముఖ్యంగా జీవీఎల్ చేస్తున్న తప్పుడు ప్రచారం పై ఫైర్ అయ్యారు. దేశంలో తొలి 10 స్థానాల్లో ఉండే నేరగాళ్లు, రాజకీయ అబద్ధాలకోరు ఎవరని గూగుల్‌లో వెతికితే ప్రధాని నరేంద్రమోదీ పేరు వస్తోందని కుటుంబరావు వ్యాఖ్యానించారు. హిందూత్వాన్ని అడ్డం పెట్టుకుని పట్టణ ఉగ్రవాదం మొదలుపెట్టిందెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో బీజేపీ వాళ్లను చూసి వీధి కుక్కలు కూడా అసహ్యించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయరన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉంటారని, ఆయన ట్వీట్లపై వచ్చే స్పందన ఒక్కసారి పరిశీలించుకుంటే అతని స్థాయి ఏంటో తెలుస్తుందన్నారు. ‘కనకదుర్గ గుడి దగ్గర అడుక్కోవడానికి కూడా జీవీఎల్ పనికిరాడు. పనికిమాలిన వెదవలను రాష్ట్రంలోకి రానివ్వడమే ఎక్కువ’ అని కుంటుంబరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ప్రజల డబ్బులు వృధా చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని ఫైర్ అయ్యారు.

gvl 12112018 2

‘‘రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలకు సీఎం చంద్రబాబునాయుడు జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తుంటే భాజపాకు వృథా ఖర్చులా కనిపిస్తోంది. 2012 నుంచి ప్రధానిగా పగ్గాలు చేపట్టే వరకూ నరేంద్రమోదీ దేశం మొత్తం విమానంలో పర్యటించారు. ఆ ఖర్చులు గుజరాత్‌ ప్రభుత్వం భరించిందా? లేక భాజపానా? గుజరాత్‌ ప్రభుత్వ ఖర్చులతోనే దేశమంతా తిరిగి, రాష్ట్ర ప్రయోజనాల కోసమని పద్దుల్లో రాశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ఇటీవల భాజపా రాష్ట్ర కార్యాలయ శంకుస్థాపనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎలా వచ్చారు? రక్షణ శాఖ విమానంలో కాదా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తోంది. దీనిపై భాజపా నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? లాటరీ గెలుచుకున్నట్లుగా వచ్చిన ఎంపీ పదవిని అడ్డంపెట్టుకుని జీవీఎల్‌ నరసింహరావు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు’’ అని పేర్కొన్నారు.

gvl 12112018 3

‘‘ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 59 నిమిషాల్లోనే రూ.కోటి రుణం ఇస్తామని ప్రధాని మోదీ ఆర్భాటంగా చెప్పారు. ఇందుకోసం పీఎస్‌బీ లోన్స్‌ ఇన్‌ 59 వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించారు. దీని కింద రాష్ట్రంలో ఎంత మందికి రుణాలిచ్చారో చెప్పగలరా? పీఎస్‌బీ లోన్స్‌ను క్యాపిటా వరల్డ్‌ సంస్థకు ఇచ్చారు. అవి కూడా షా పేరుతో ఉన్న వారివే. ఇంతకంటే పెద్ద కుంభకోణం ఉంటుందా? రుణాల కోసం లక్షల దరఖాస్తులు వస్తే ఆ ఒక్క సంస్థకే పెద్ద మొత్తంలో రుణాలేలా ఇస్తారు? ఇది ఆర్థిక ఉగ్రవాదం కాదా? దీనిపై లోతైన దర్యాప్తు జరపాలి...’’ అని కుటుంబరావు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీలో మంత్రి వర్గ విస్తరణ అంటే, ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, అన్ని కోణాలు చూసుకుని మంత్రి పదవి ఇస్తూ ఉంటారు. ఇది కొంత మందికి నచ్చదు. గతంలో కూడా అలుగుడు పర్వం చూసాం. కాని నిన్న జరిగిన విస్తరణలో ఎవరినీ నొప్పించని విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కార్యరంగం సిద్ధమైంది. మైనారిటీల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌, గిరిజనుల నుంచి కిడారి శ్రావణ్‌ల ఎంపికకు ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తమకు ఆమోదమేనని ప్రకటించారు.

cbn 12112018 2

మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, ప్రభుత్వ విప్‌గా చాంద్‌భాషాల నియామకానికి కూడా ఈ సందర్భంగా సీఎం పచ్చజెండా ఊపారు. తన నిర్ణయమే అంతిమమైనప్పటికీ ఏకాభిప్రాయంతో ప్రకటించాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే అందరితోనూ మాట్లాడాలంటూ ఈ రెండు వర్గాల శాసనసభ్యులు, పార్టీ నాయకులకు కబురు పంపారు. శనివారం ఉదయాన్నే ఉండవల్లికి పిలిపించి మాట్లాడారు. ఆ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోడానికి కారణాలను వివరించారు. దీంతో అప్పటిదాకా మంత్రి పదవులు ఆశించిన శాసనసభ్యులు చల్లబడి సీఎం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. సీఎం వద్ద సమావేశానికి వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, చాంద్‌భాషా ఒకింత అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రసారమాధ్యమాలతో మాట్లాడినప్పుడు తమకూ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామని వారన్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు వేదిక వద్దకొచ్చిన చంద్రబాబు ముందుగా ఫరూక్‌, శ్రావణ్‌ను తన కార్యాలయంలోకి పిలిపించారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణం చేయాల్సి ఉంటుందని చెప్పారు.

cbn 12112018 3

అనంతరం మైనారిటీల నేతలు 15మందితో ప్రజావేదిక లోపలి కార్యాలయంలో సమావేశమయ్యారు. వైకాపా నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇస్తే, గవర్నరు అభ్యంతరం చెబుతారనే సంకేతాలున్నాయని వెల్లడించారు. ఏళ్లుగా పార్టీలోనే పనిచేస్తున్న ఫరూక్‌కు అవకాశమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆశావహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామన్నారు. సీఎం అభిప్రాయానికి నేతలంతా మద్దతు పలికారు. మండలి ఛైర్మన్‌ పదవి నుంచి ఫరూక్‌ను తప్పిస్తున్నందున షరీఫ్‌కు అవకాశమివ్వాలని కొందరు సూచించగా చంద్రబాబు అంగీకరించారు. తనకూ ప్రభుత్వ విప్‌గా అవకాశమివ్వాలని చాంద్‌భాషా కోరారు. అనంతపురంనుంచి ఇప్పటికే ముగ్గురు విప్‌లుగా ఉన్నారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చివరకు సుముఖత తెలిపారు. దీంతో ఉదయం కొంత అసంతృప్తిగా ఉన్నారన్న నేతల వైఖరిలో మార్పు కన్పించింది.

Advertisements

Latest Articles

Most Read