సోషల్ మీడియాలో తన పేరిట వస్తున్న ఎన్నికల సర్వేలు తనవి కాదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిసెంబర్ 7 తర్వాత తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తానని చెప్పారు. అయితే, ప్రధాన పార్టీలేవైనా కోరితే ముందుగానే సర్వే చేసి చెబుతానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్- టీడీపీ పొత్తు ఏమేరకు సక్సెస్ అవుతుంది? అని విలేకరులు ప్రశ్నించగా, ఆ విషయాన్ని ప్రజలే చెప్పాలని సమాధానమిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ రాష్ట్రంలోనూ నేరుగా ప్రత్యర్థులు కాదు కనుక, అందుకే, కలుస్తున్నారేమోనని అభిప్రాయపడ్డారు.

lagdapati 31102018 2

రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవమున్న నాయకుడు చంద్రబాబు అని, గతంలోనూ ప్రతిపక్ష పార్టీలను ఆయన కలిపే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్షపార్టీలను ఏకం చేయడం ఆయనకు కొత్తేమి కాదని అన్నారు. ఈ సందర్భంగా లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో పోటీ చేయాలని ప్రజలు తనను అడిగారని, అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, తెలంగాణలో పోటీ చేసే అవకాశం వస్తే కనుక లోక్ సభ ఎన్నికల్లో నిలబడతానని అన్నారు. ఆంధ్రా భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయనని చెప్పిన లగడపాటి, తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు.

lagdapati 31102018 3

పొలిటికల్ రీ ఎంట్రీపై లగడపాటి రాజగోపాల్ క్లారిటీ ఇచ్చారు. తనకు అవకాశమొస్తే తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లే ఆలోచన లేదని, పార్లమెంటుకు అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపారు. డిసెంబర్‌ 7 తరువాతే తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌- టీడీపీ పొత్తు... సక్సెస్‌ అవుతుందా లేదా అనేది ప్రజలే చెప్పాలన్నారు. పార్టీలు కోరితే ముందే సర్వే చేసి చెబుతానని లగడపాటి పేర్కొన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం ప్రజల నాడి చెబుతానని లగడపాటి వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులు కారని, సీఎం చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడని, ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు.

రేపు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాతో చంద్రబాబు సమావేశం అవుతారు. మధ్యాహ్నం వామపక్ష నేతలతో, సాయంత్రం అఖిలేష్‌ యాదవ్‌తో చంద్రబాబు భేటీకానున్నారు. 'సేవ్‌ నేషన్‌' పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

rahul 31102018 2

ఈ నేపధ్యంలో, రాహుల్ గాంధీతో భేటీ వార్తల పై చంద్రబాబు స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందరితో కలిసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడిందని, దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు తాను బాధ్యత తీసుకున్నానని, 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశానని చెప్పారు.

rahul 31102018 3

‘‘ప్రధాని మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశదిశ చూపింది. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాల్లో కీలకపాత్ర షోషించాల్సిన సమయం వచ్చింది. ఢిల్లీలో మనం యాక్టివ్‌ కావాలి. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వస్తాం. రేపు ఢిల్లీలో రాహుల్‌తో మాట్లాడి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తా. నాకు ప్రధాని పదవిపై కోరికలేదు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశ రాజకీయాల్లో అందరికంటే ముందున్న వ్యక్తిని నేను. ప్రధాని పదవి చేపట్టాలని 1995లోనే నాపై ఒత్తిడి వచ్చింది. రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించాను’’ అని చంద్రబాబు చెప్పారు.

ఎన్నికలు వచ్చాయంటే రకరకాల సర్వేలు వెలుగు చూస్తుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఉండే డిమాండే వేరు. ఆయన చెప్పినవన్నీ ఇప్పటివరకూ జరుగుతూనే వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తన సర్వేను త్వరలో ప్రకటిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలోనూ చంద్రబాబును కలిసిన రాజగోపాల్ మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబును ఆయన అనుభవం ఉన్న నేతగా అభివర్ణించారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారంటూ కితాబు ఇచ్చారు.

lagdapati 31102018 2

చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడని, ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడని కొనియాడారు. ఇటీవల అమరావతిలో ఆయన చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. బాబును కలిసిన తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడుతూ... తాను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అలాగే తొలిసారి సచివాలయాన్ని సందర్శించానని చెప్పారు. హైదరాబాద్‌ సచివాలయం కన్నా.. అమరావతి సచివాలయం చాలా బాగుందని, తాత్కాలిక సచివాలయమే ఇంత అందంగా ఉంటే ఇక అసలు సచివాలయం వరల్డ్‌క్లాస్‌గా ఉంటుందని ఆయన పొగడ్తలు గుప్పించారు. సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు చంద్రబాబును అభినందించానన్నారు. అయితే లగడపాటి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించిన విషయం తెలిసిందే.

lagdapati 31102018 3

మరో పక్క వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల జరిగిన దాడిని లగడపాటి రాజగోపాల్ ఖండించారు. ఆ ఘటన దురదృష్టకరమని, సీఎం, ప్రతిపక్ష నేత.. ఇలా ఎవరిపైనా దాడులు మంచివి కాదని అన్నారు. మనది ప్రజాస్వామిక దేశమని, మార్పు తీసుకురావడానికి చాలా మార్గాలు ఉన్నాయని, దాడుల వల్ల ఎటువంటి మార్పు తీసుకురాలేమని అన్నారు. జగన్ పై దాడి ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారని, దీనిపై ఆయన అభిప్రాయం కోరగా ఆయన బదులివ్వలేదు.

తనను చంపేస్తారేమోనని లక్ష్మీపార్వతీ లాంటి వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఎవరు చంపేస్తారని ఆమెను కూర్చొబెట్టి అడగాలని హీరో శివాజీ అన్నారు. ఆపరేషన్ గరుడపై ఏపీ విపక్ష నేతలు చేస్తున్న విమర్శల పై ఆయన ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించారు. ‘‘గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో నా హత్యకు సుఫారీ ఇచ్చారని మోదీ ఆరోపణలు చేశారు. మోదీపై చర్యలు తీసుకోవచ్చా?. తీసుకోవచ్చంటే నాపై కూడా చర్యలు తీసుకోవచ్చు. . నేను రాష్ట్రం కోసం..తెలుగుజాతి కోసం ఎంత తపన పడుతుతున్నాడో అర్ధం కాని మూర్ఖులే విమర్శిస్తున్నారు."

lakshmiparavathi 31102018 2

"నాకు తెలిసింది చెప్పా..నేను చెప్పింది మంచి విషయమో కాదో ఆలోచించండి. ఆపరేషన్‌ గరుడ గురించి మొదట విన్నప్పుడు నాకు హాస్యాస్పదంగా అనిపించింది. మోసాలు, ఘోరాలు చేయలే..ప్రజలకు మంచి విషయాలే చెప్పా. వైసీపీ, బీజేపీ ఉడత ఊపులకు రాను...దర్యాప్తు సంస్థ రమ్మంటే వస్తా. లక్ష్మీపార్వతి చెప్పిన విషయంపై సీబీఐ విచారణ వేయాలి. శివాజీ హత్యకు కుట్ర ఎలా జరిగిందని తెలుసుకోవాలి.’’ అని శివాజీ అన్నారు. ప్రాణ హాని భయంతో ఆమెరికా పారిపోయారంటూ ఏపీ ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.

lakshmiparavathi 31102018 3

శివాజీ మాట్లాడుతూ ‘‘నాకు ప్రాణ హాని 2015 నుంచే ఉంది, ఇప్పుడు కొత్తేంకాదు. భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. నా సొంత పనులపై వెళ్లా. నాకు మూడు మీటింగులు ఉన్నాయి. అంతేకాదు మా అబ్బాయి కాలేజ్ సీటు గురించి కనుక్కోవడానికి వెళ్లా. ‘ఆపరేషన్ గరుడ’పై నేను మొదట్లో చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అవహేళన చేసి మాట్లాడారు. ఇప్పుడు అతడిని పిలవండి. కుళ్లపొడవండి.. అని అనడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. బీజేపీ, వైసీపీ, లేదా ఇంకెవరికైనా అనుమానాలు ఉంటే ఎందుకు భుజాలు తరుముకుంటున్నారో ఇప్పటికీ అర్ధం కావడంలేదు. పోనీ మేమంతా ఒక్కటి అని చెప్పమనండి.. ఆ తర్వాత నాకు తెలిసిన కంటెంట్‌ని వాళ్ల యాంగిల్‌లో ఓపెన్ చేసి చెబుతా. ‘ఆపరేషన్ గరుడ’ అనేది ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బందిపెట్టాలనుకుంటున్నది ప్రజలకు స్పష్టంగా చెప్పాను. ప్రజలు నూటికి నూరు శాతానికి నమ్మేపరిస్థితి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో నామీద ఎగబడుతున్నారు.’’ అని అన్నారు.

 

Advertisements

Latest Articles

Most Read