గత కొద్ది రోజులుగా, ఏపి పోలీసుల పై, ముఖ్యంగా ఇంటలిజెన్స్ పై కేటీఆర్ ఓ పేలుతున్నాడు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం మర్చిపోయి, తన రాజకీయం కోసం, ఏపి పై పడి ఏడుస్తున్నాడు. చివరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసాడు. ఈ మొత్తం వ్యవహారం పై, ఏపి డీజీపీ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు మహాకూటమి తరఫున డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలను ఏపీ డీజీపీ తోసిపుచ్చారు. ఆ ముగ్గురు తమ సిబ్బందేనని, వామపక్ష తీవ్రవాదం పై సమాచార సేకరణ కోసమే తెలంగాణకు వెళ్లారని తెలిపారు.

dgp 31102018

‘ఏపీ నిఘా పోలీసులకు తెలంగాణలో ఏం పని ఉంది’ అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన విమర్శలకూ సమాధానం ఇచ్చారు. ‘ఇంటెలిజెన్స్‌ పోలీసులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు’ అని స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో డబ్బు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీ-సీఈవో రజత్‌ కుమార్‌ షైనీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్‌ ఏడీజీ నుంచి సమాచారం తెప్పించుకుని తెలంగాణ సీఈవోకు డీజీపీ సమాధానం పంపించారు.

dgp 31102018

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఏపీకి చెందిన కీలకమైన ఆస్తులు, వీఐపీల రక్షణకు పలు విభాగాలు పని చేస్తున్నాయి. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కార్యకలాపాలపై రహస్య సమాచారం తెలుసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మా విభాగాలు విధులు నిర్వహిస్తున్నాయి. అంతర్గత భద్రతపై వివరాలు సేకరించేందుకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌కు ఉంటుంది’’ అని డీజీపీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచారనడం అసత్యం, నిరాధారమని తెలిపారు. స్థానిక పోలీసులు కూడా దీనిపై ప్రాథమికంగా విచారణ జరిపి... ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని నిర్ధారించారన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, హైకోర్టులో పిటిషన్‌ వేసారు.. తన కేసుల పై బెయిల్ కోసమో, లేక స్టే ఆర్డర్ కోసమో కాదు. విశాఖ విమానాశ్రయంలో తన పై జరిగిన దాడి ఘటనలో వైఎస్‌ జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన పై జరిగిన హత్యాయత్నం ఘటన పై ఈ రోజు కోర్ట్ లో పిటీషన్ వేసారు. తన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం వల్లె హత్యాయత్నం జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజకీయంగా కేసు ధర్యాప్తు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

jagancourt 31102018 2

హత్యాయత్నం ఘటన పై కేంద్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేని స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని జగన్‌ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ డీజీపీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు, డీజీపీ బాధ్యతారహితంగా మాట్లాడారని, అందుకు సంబంధించి వీడియో క్లిప్పింగులను కూడా జగన్ పిటీషన్ లో జతచేశారు.

jagancourt 31102018 3

మొత్తం 11 పేజీల కాపీని కోర్టుకు అందజేశారు. ఆపరేషన్ గరుడ పేరుతో తనపై కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. సినీ నటుడు శివాజీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడని, తనపై దాడి జరుగుతుందని శివాజీ ముందే చెప్పారని, తనను హత్య చేసి ఆపరేషన్ గరుడలో భాగమంటూ చిత్రీకరించాలని చూస్తున్నారని పిటీషన్ లో జగన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ గత గురువారం విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కూర్చొని ఉండగా,సెల్ఫీ నెపంతో వచ్చిన శ్రీనివాసరావు అనే యువకుడు జగన్‌ పై కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి, వైసీపీకి వీరాభిమాని కావటంతో, కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయనున్నారా? గత కొద్ది రోజులుగా కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకోనున్నారని తెలుస్తోంది. పటేల్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పందించడానికి అటు ఆర్బీఐ, ఇటు ఆర్థిక శాఖ నిరాకరించాయి. ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర విషయాల్లో ప్రభుత్వ సూచనలకు రిజర్వ్ బ్యాంక్ ససేమీరా అంటుండటంతో.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఉర్జిత్ పటేల్‌కు ప్రభుత్వం లేఖలు పంపింది. ప్రజా ప్రయోజనం కోసం, నిర్దిష్ట సమస్యల విషయంలో రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతూ ఆర్బీఐ గవర్నర్‌కు సూచనలు చేసే అధికారం కేంద్రానికి ఉందని సెక్షన్ 7 స్పష్టం చేస్తోంది.

center 31102018 2

స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకూ సెక్షన్ 7ను కేంద్రం వాడలేదు. 2008 సంక్షోభం సమయంలోనూ, 1991లో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా కేంద్రం ఇలా చేయలేదు. అసాధారణ రీతిలో కేంద్రం సెక్షన్‌ 7ను ఉపయోగించడంతో.. ప్రభుత్వ ఉద్దేశాలు, ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు శుక్రవారం ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోన్న తరుణంలో పటేల్ తన పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. రిజర్వుబ్యాంకును ఈ ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా, తన అవసరాలను, విధానాలను దాని మీద రుద్దుతూ పీకనులుముతున్నదని బ్యాంకు ఉద్యోగుల సంఘం విరాళ్‌ ఆచార్య విరుచుకుపడ్డారు.

center 31102018 3

రిజర్వుబ్యాంకు బోర్డులో పరివార్‌ మనిషి గురుమూర్తిని పార్ట్‌టైమ్‌ డైరక్టర్‌గా నియమించడంతో నిప్పురాజుకుంది. మోదీ మనిషిగా గురుమూర్తి అతిజోక్యం బ్యాంకులో అందరినీ బాధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా రెండోసారి గవర్నర్‌ గిరీ వెలగబెట్టకూడదని ఉర్జీత్‌ సైతం అనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో నిబంధనలను బాగా సడలించి చిన్నతరహా పరిశ్రమలకు భూరిగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్టు, అలాగే, సుమారు యాభై బిలియన్‌ డాలర్ల మిగులు నిధుల బదిలీ విషయంలోనూ స్పర్థలు నెలకొన్నట్టు చెబుతున్నారు. రిజర్వుబ్యాంకుతో సంబంధం లేకుండా అర్థరాత్రి మోదీ ఏకపక్షంగా తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం వేలాది చిన్నపరిశ్రమలను దెబ్బకొట్టి, లక్షలాదిమంది ఉపాధిని మాయం చేసిన విషయం తెలిసిందే.

దేశంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు చొరవ తీసుకున్న దగ్గర నుంచి, దేశ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఆయన పని ఆయాన చూసుకుంటుంటే, చంద్రబాబుని టార్గెట్ చేసి మరీ, ఆయన్ను కెలికి మరీ, తన్నించుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కూడా నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి మరీ శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మళ్ళీ రేపు గురువారంనాడు మరోసారి ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ‘సేవ్‌ నేషన్‌’ పేరుతో భాజపాయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం దిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలను చంద్రబాబు కలుసుకుంటారు.

rahul 31102018 2

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి న్యూఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ పర్యటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు కూటమి పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని వ్యవస్థలని నాశనం చేసిన మోడీ పై పోరాటం చెయ్యటంలో, అన్ని విపక్షాలు కలిసి రావట్లేదాని అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలితో కొన్ని పార్టీలు దూరం అవుతున్నాయి. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి, అందరినీ ఒక తాటి పై తీసుకురానున్నారు. మరో పక్క, ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లేందుకు ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.

rahul 31102018 3

ఈ రోజు మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో లంచ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసిన చంద్రబాబు వారితో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి దిల్లీ పర్యటనలో చంద్రబాబు రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వడివడిగా అడగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన రాహుల్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తదితరులతో భేటీ కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ భేటీ కీలకం కానుంది. అలాగే, భాజపాయేతర కూటమి ఏర్పాటుపైనా రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisements

Latest Articles

Most Read