ఆంధ్రప్రదేశ్‌ పై బీజేపీ యాక్షన్ ప్లాన్ ఊపందుకుందా ? చంద్రబాబు టార్గెట్‌గా బీజేపీ మరింత దాడిని పెంచబోతుందా? రాబోయే ఆరు నెలల్లో ఏం జరగబోతోంది? ఏపీలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చేసింది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటినుంచి మొదలైన రాజకీయ యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. ఎన్డీయే నుంచి బయటకొచ్చాక మోదీపై టీడీపీ యుద్ధం ప్రకటించింది. హోదా ఇవ్వకుండా మోదీ ఎలా మోసం చేసింది ప్రజలకు వివరిస్తూ.. ధర్మపోరాట దీక్షలు చేసింది. అవకాశం వచ్చిన ప్రతీసారి మోదీ తీరును చంద్రబాబు ఎండగట్టారు. అంతేకాదు రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు జగన్, పవన్‌తో కలిసి కుట్రలు పన్నారని ఆరోపించారు.

bjpactionplan 30102018 2

దీంతో చంద్రబాబు టార్గెట్‌గా బీజేపీ పావులు కదపడం ప్రారంభించింది. బాబు ఇమేజ్‌ను, టీడీపీని దెబ్బతీసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఇందుకు తగినట్టుగానే బీజేపీ తెరవెనుక పావులు కదిపింది. తిరుమల రమణదీక్షితుల అంశంతో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ చూసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత పీడీ ఎకౌంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి.. చంద్రబాబుకు ఇక్కట్లు తప్పవంటూ బీజేపీ నేతలు హెచ్చరికలు చేశారు. మరోవైపు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై టీడీపీ ధర్నాకు దిగింది. దీంతో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ప్రాంతాలవారీగా రెచ్చగొట్టేందుకు బీజేపీ కొత్తపన్నాగం పన్నిందని టీడీపీ ఎదురుదాడి చేయడంతో కమలనాథులు వెనక్కితగ్గారు.

bjpactionplan 30102018 3

దీంతో టీడీపీని దెబ్బతీసేందుకు తన ఫార్ములాను బీజేపీ బయటకు తీసింది. ఐటీ దాడులతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. అలాగే ఓటుకు నోటు కేసును బయటకులాగి చంద్రబాబును ఇరుకున పెట్టాలని అనుకుంది. తాజాగా ఐటీ దాడులు, జగన్ పై కోడి కత్తి దాడి,అగ్రిగోల్డ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే దేనికీ భయపడబోమని, ఎంతకైనా సిద్ధమని టీడీపీ నేతలు ప్రకటించారు. మరోవైపు జగన్, పవన్‌తో బీజేపీ తెరవెనుక అవగాహన కుదుర్చుకుందని టీడీపీ మొదటినుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. త్వరలో ప్రభుత్వం మారిపోతుందని, ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కాబోతున్నామని రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో, బీజేపీ వైపు నుంచి, మరిన్ని ఇబ్బందులు రావటం తధ్యంగా టిడిపి నేతలు భావిస్తూ, మానసికంగా సిద్ధమవుతున్నారు.

రాష్ట్రంలో గరుడ బ్యాచ్ కు, మరో పని పడింది. ఈ శుక్రవారం, రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ళ పండుగ డైవర్ట్ చెయ్యటనికి రెడీ అవుతున్నారు. చ్చేనెల 2న, రాష్ట్రవ్యాప్తంగా మరోమారు 2 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణం పూర్తయిన పట్టణ ప్రాంతాల్లోని 50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని 1.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. వీటితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలోని హుద్‌-హుద్‌ తుపాను బాధితులకు నిర్మించిన ఇళ్లకు కూడా గృహ ప్రవేశాలు ఉంటాయన్నారు.

housing 30102018 2

మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6.88 లక్షల ఇళ్లు పూర్తైనట్లు చెప్పారు. జనవరి నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. దేశంలోనే సొంతంగా రాష్ట్రనిధులతో లక్షలాది ఇళ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు. మరోమారు గ్రామీణులకు 4 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వీటితో కలిపి ఇప్పటివరకు పునాదిపడని మరో లక్ష ఇళ్లకు డిసెంబర్‌లో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఒకేసారి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

housing 30102018 3

వడ్డీ రేటు అధికంగా ఉన్నందున హడ్కో నుంచి రుణ సమీకరణపై పునరాలోచిస్తున్నట్లు వెల్లడించారు. మూడు బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయినా ఇటుకల బిల్లు రానివారికి త్వరలోనే ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్టు వివరించారు. తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 16,362 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీరికి రూ.2.50 లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు. మరో 34 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. నిబంధనల పేరుతో కేంద్రం కావాలనే కొర్రీలు వేస్తూ గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లను మంజూరు చేయడం లేదని విమర్శించారు.

జగన్ పై కోడి కత్తి దాడి తరువాత, దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు, పెద్ద వైసీపీ అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అతన్ని తెలుగుదేశం పార్టీకి అంటకట్టటానికి, లోటస్ పాండ్ లో ఉన్న మార్ఫింగ్ బ్యాచ్, తెలుగుదేశం సభ్యత్వ కార్డుతో, అతని పేరు మీద ఒక సభ్యత్వ కార్డు తాయారు చేసి వదిలింది. అయితే, ఆ కార్డ్ నెంబర్ ద్వారా అసలైన వ్యక్తి మీడియా ముందుకు వచ్చి, ఈ గొడవలోకి నన్ను ఎందుకు లాగారు అంటూ బాధపడ్డారు. ‘‘చిన్ననాటి నుంచి నేను ఎన్టీఆర్‌ అభిమానిని. సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎన్టీఆర్‌ అభిమానిగానే కొనసాగుతున్నా. ఓటు పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకే వేస్తూ వీరాభిమానిగా ఉన్నా. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన కుటుంబానికి చెందినవాడిని. నా కార్డును ఫోర్జరీ చేసి ఈ విధంగా అలజడి సృష్టించటం దారుణం’’ అంటూ నంబూరి అంకాలు కన్నీటి పర్యంతమయ్యాడు.

bapatla 30102018 2

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అంకాలు నిరుపేద గిరిజన కూలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కార్డు వ్యవహారంలో నిజానిజాలను వివరించటానికి టీడీపీ శ్రేణులు అంకాలును మీడియా ముందకు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా అంకాలు మాట్లాడుతూ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి పేరుతో నా టీడీపీ సభ్యత్వపు కార్డును ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోలి’’ అని డిమాండ్‌ చేశాడు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు.

bapatla 30102018 3

ఈ ఒరిజినల్‌ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. మరో పక్క, ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కుట్ర, మోసం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, మార్ఫింగ్‌ చేసి తప్పుడు కార్డుల సరైనవేనని చూపించడం, ఆధారాలు తారుమారు చేయడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటి ప్రకారం ఈ నకిలీ కార్డుల అంశం పై ఐపీసీలోని 120 (బి), 420, 468, 469, 471, 201, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెస్ట్‌ డీఎస్పీ సౌమ్యలత తెలిపారు.

కోడి కత్తి గుచ్చుడు దాడిలో, చిన్న గాయం అయ్యి, హైదరాబాద్ లోటస్ పాండ్ లో రెస్ట్ తీసుకుంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గాయాన్ని వైద్యులు ఈరోజు పరిశీలించారు. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి ఆరువారాల సమయం పడుతుందని చెప్పారు. లోటస్‌ పాండ్‌లో ఆయన్ను పరిశీలించిన అనంతరం సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. కోడికత్తితో చేసిన గాయంపై రక్త నమూనాల నివేదిక వచ్చిందని, అందులో ఎలాంటి విష నమూనాలు లేనట్లు గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలియటంతో, వైసీపీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

jagan 30102018 2

ఇన్నాళ్ళు అది విషం పూసిన కోడి కత్తి ఏమో అని, జగన్ అన్నకు స్లో పాయిజన్ ఎక్కుతుంది ఏమో అని, ఖంగారు పడిన వైసీపీ అభిమానులు, ఈ వార్తా విని, మా అన్న ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని సంతోషం వ్యక్తం చేసారు. మరో పక్క, పాదయాత్రకు వెళ్లాలనే అభిప్రాయంలోనే జగన్‌ ఉన్నారని, అయితే కొన్ని జాగ్రత్తలతో కొనసాగించవచ్చని తాము చెప్పినట్లు డాక్టర్ శివారెడ్డి వివరించారు. చేతిని కదిలించేటప్పుడు జగన్ నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. నొప్పి ఇంకా తగ్గకపోవడంతో జగన్ కు యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.

jagan 30102018 3

త్వరలోనే మళ్లీ ఆయన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో చేతికి ఎక్కువ శ్రమ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. చర్మంపై వేసిన కుట్లు సాధారణంగా వారంలోనే మానిపోతాయనీ, అయితే కండరాలకు వేసిన కుట్లు మానడానికి మరికొంత సమయం పడుతున్నారు. జగన్ విషయంలో గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పట్టే అవకాశముందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వెళతానన్న కోణంలోనే జగన్ మాట్లాడారని తెలిపారు. కాని మేము మాత్రం, గాయం మానే దాక, 45 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తున్నామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read