ప్రకృతి వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించగలుగుతున్నా.. రాజకీయ కుట్రలు అంతకంటే తలనొప్పిగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడగానే విభజన సమస్యలు చుట్టుముట్టాయని.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెడితే.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరో రకంగా వివక్ష చూపిస్తోందన్నారు. దీనికి అదనంగా రాష్ట్రంలోని మరో పార్టీ సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోందన్నారు.

cbn 15102018 2

రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు సమస్యగా మారాయని.. వాటిని పట్టుదల, కసితో అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మన హక్కులు డిమాండ్‌ చేస్తే దాడులు చేసే పరిస్థితి నెలకొందని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని అభిప్రాయపడ్డారు. ఐటీ దాడులు చేయడం ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారంలో పోటీ పడాలే తప్ప.. కక్ష సాధింపు వైఖరి సరికాదని హితవు పలికారు. న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు. తుపాను బాధిత ప్రజలకు అండగా ఉండాలని, వంశధార ఎడమ కాలువ గండ్లు పూడ్చే పనులు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

cbn 15102018 3

చెరువుల కట్టలు పటిష్టం చేసే పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. నష్టపోయిన రైతులు పంట బీమా అడుగుతున్నారని, ఆ కంపెనీలతో తక్షణమే చర్చించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట బీమా ప్రయోజనం బాధిత రైతాంగానికి అందించాలని, ఇప్పటికే 35వేల హెక్టార్లలో ఎన్యూమరేషన్ పూర్తిచేశారన్నారు. మిగిలిన లక్ష హెక్టార్లలో పంటనష్టం అంచనా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు సిబ్బందిని, అధికారులను రప్పించుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. రేపు తాను శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికల్లా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశంచేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులు, జిల్లాల కలెక్టర్లు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వైఎస్ జ‌గ‌న్ మార్కు కుట్ర‌ల‌కు ఈ సారి తుఫాన్ బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ బాధితుల‌కు త‌క్ష‌ణ సహాయం అందించేందుకు సీఎం చంద్ర‌బాబు, మంత్రులు రాత్రింబ‌వ‌ళ్లు కృషి చేస్తుంటే... క‌నీసం బాధితుల‌ను ప‌ల‌క‌రించ‌డాహ‌నికి కూడా రాని జ‌గ‌న్‌...స‌రికొత్త కుట్ర‌ల‌కు తెర‌లేపారు. తునిలో కాపుల ఉద్య‌మం మాటున రైళ్లు త‌గ‌ల‌బెట్టించిన ఘ‌న‌మైన చ‌రిత్ర జ‌గ‌న్‌ది. తండ్రి శవం ప‌క్క‌న‌బెట్టుకుని సీఎం కావాల‌నే దుర్బుద్ధితో సంత‌కాలు సేక‌రించుకున్న తనయుడు, ఆయన స్థాపించిన పార్టీ వైసీపీ ఆలోచ‌న‌లు ఇలాగే ఉంటాయి. తిత్లీ తుఫాన్ బాధితులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న హెరిటేజ్ సంస్థ స్వచ్ఛందంగా కొన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది.

jagan 15102018 1

అయితే హెరిటేజ్ ప్రధాన వ్యాపారం పాలు, పాలుపదార్థాలు కావడంతో..అవి ప్యాక్ చేసే కవర్లు రెడీగా ఉన్నాయి. ఉద్దానం, సముద్రతీర ప్రాంతాలకు అత్యవసరం కావడంతో...ప్యాకింగ్ కోసం సిద్ధంగా ఉన్న కవర్లలో సురక్షిత నీటిని ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు. ఆ ప్యాకెట్ పై సైక్లోన్ బాధితులకు నీటి సరఫరా అని కూడా రాసారు. బాధితులకు సత్వరం సాయం అందించాలనే లక్ష్యంతో హెరిటేజ్ సంస్థ చేసిన మంచిపనిని ప్రశంసించి, ప్రోత్సహించాల్సింది పోయి..పాలప్యాకెట్లలో నీళ్లు సరఫరా చేస్తున్నారని కుట్రపూరిత కథనాలను రెడీ చేసి.. తన విషపుత్రిక సాక్షి ఉద్యోగులు, సిబ్బంది ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న జగన్ మనస్తత్వం ఏంటో తేటతెల్లమైంది. ఒక కష్టం వచ్చినప్పుడు అండగా ఉండేది ఎవరో, రాజకీయాలు కుట్రలు చేసేది ఎవరో తిత్లీ తుఫాన్ తేల్చేసింది. ఏడు పదుల వయస్సు దగ్గరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ మంత్రి లోకేష్, మంత్రులంతా జిల్లాలోనే మకాం వేసి మరీ తుఫాన్తో అస్తవ్యస్తమైన ఒక్కో వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. నేరుగా బాధితుల ఇళ్లకు, తిత్లీ ధాటికి ధ్వంసమైన, నష్టపోయిన ప్రాంతాలకు చేరుకుని తక్షణ అవసరం ఏంటో? బాధితులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని మరీ సాయం అందిస్తున్నారు.

jagan 15102018 1

కష్టసమయంలో సహాయకచర్యలకు ప్రభుత్వంతో కలిసి రావాల్సింది పోయి..తనదైన పులివెందుల మార్కు కుట్రలతో సర్కారును బద్నాం చేయాలనుకుని...ఏం చేయలేక..హెరిటేజ్ సంస్థపై ఏడుపు ప్రారంభించారు. దాహంతో ఎండిపోతున్న తుఫాన్ బాధితుల గొంతులను స్వచ్ఛందంగా, మానవతా ధ్రుక్పథంతో తడపటం తప్పా? జగన్ అని హెరిటేజ్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. స్వచ్చమైన రక్షిత నీరు అందుబాటులో ఉన్న పాలప్యాకెట్లలో అవసరమైన వారికి, ఆపన్నులకు అందించడం తప్పా అని నిలదీస్తున్నారు. వైఎస్ జగన్ తాను సాయం చేయడు..తన పార్టీ నేతలను తుఫాన్ బాధితులను కనీసం పలకరించేందుకు కూడా పంపడు. సాయం అందిస్తున్న ప్రభుత్వం, సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్న సీం, మంత్రులు..స్వచ్ఛందంగా సాయం అందిస్తున్న హెరిటేజ్ వంటి సంస్థలపైనా యిలాంటి కుట్రపూరిత కథనాలు ప్రచారం చేయడంపై తుఫాన్ బాధితులు మండిపడుతున్నారు. కొండంత కష్టంలో ఉన్న తమకు సాయం అందిస్తున్న హెరిటేజ్ పై యిలాంటి ఆరోపణలు, అవాస్త ప్రచారాలు చేసి..తమకు సాయం అందకుండా జగన్ చేస్తున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా, అస్తవ్యస్త పరిస్థితి ఉంది. ఎక్కడ చెత్త అక్కడే ఉండి పోయింది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నా, మునిసిపల్ కార్మికులు మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో చెత్త పేరుకుపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా రాష్ట్రంలో చెత్త నిల్వ చేరుకుని అనారోగ్య పరిస్థితి కి దారితీస్తోంది. అయితే ఈ పరిస్థితి చూసిన, పెనములూరు ఎమ్మెల్యే బోడేప్రసాద్, ఎవరో వస్తారని చూడకుండా, పరిస్థితిని కొంతవరకు అయినా అదుపు చేయాలని భావిస్తూ ఎమ్మెల్యే బోడేప్రసాద్ ఉయ్యూరులో స్వచ్ఛ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల తో కలిసి
ఉయ్యూరు మెయిన్ రోడ్ లో చెత్త తొలగించారు.

bode 15102018 2

ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా స్వచ్ఛ సేవా కార్యక్రమం కొనసాగుతోంది. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, పట్టణ ప్రధాన రహదారులను శుభ్ర పరుస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో పట్టణాలలో రోజురోజుకి పరిశుభ్రత క్షీణిస్తోంది. చెత్తను తొలగించే ప్రక్రియలో భాగంగా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు స్వయంగా ముందుండి చీపురు పట్టి రోడ్లు, సైడ్ డ్రైయిన్లు శుభ్రం చేస్తూ తమ పార్టీ శ్రేణులతోనూ పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ కార్మికులు సమ్మె విరమించేందుకు ముందుకు వచ్చినా కొన్ని పార్టీల అనుబంధ ట్రేడ్ యూనియన్లు
వారిని అడ్డుకోవడం విచారకరమని అన్నారు.

bode 15102018 3

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేస్తోందని, వారికి అన్ని విధాలా తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రజారోగ్యం, పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగినంతకాలం పట్టణాన్ని స్వచ్చ సేవ కార్యక్రమంతో శుభ్రం చేసేందుకు తమవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత స్థానిక సంస్థల బాధ్యతగా మాత్రమే కాకుండా ప్రజల కూడా స్వచ్ఛందంగా తమతమ ప్రాంతాన్ని శుభ్రపరచుకోవాలని సూచించారు. అది ఆరోగ్య సమాజానికి దోహద పడుతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను ఇటీవల తితలీ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా తుపాను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంది. అయితే నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా చంద్రబాబు పిలుపిచ్చారు. మన రాష్ట్రంలో జరిగిన విపత్తుకు, అందరూ తగిన విధంగా సహయం చెయ్యాలని కోరారు. చంద్రబాబు పిలుపుకు స్పందించిన సినీ హీరోలు ముందుకొస్తున్నారు. అందరి కంటే ముందు, తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మొదటి వ్యక్తిగా సంపూర్ణేష్ బాబు నిలబడ్డాడు.

cinema 15102018

తన వంతు సాయంగా 50 వేల రూపాయలు సిక్కోలు ప్రాంత వాసులకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. శ్రీకాకుళం వాసులు తుపాను కారణంగా చాలా నష్టపోయారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నట్లు చెబుతూ.. తనవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించానని అన్నాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా 5 లక్షల సహాయం చేసారు. అదే విధంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు మంచి మనసుతో ముందుకు రావాలని సంపూర్ణేష్ బాబు పిలుపునిచ్చారు.

cinema 15102018

ఇక ఈ రోజు చంద్రబాబు పిలుపికి స్పందిస్తూ, ‘తితలీ’ బాధితులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి ఇండస్ట్రీలోని వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షల విరాళాన్ని, కల్యాణ్‌రామ్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. గత కొద్దిరోజులుగా.. ‘తితలీ’ తుఫానుతో శ్రీకాకుళం జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ తుఫాను పెను బీభత్సానికి చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల కుటుంబాలు నివాసముండేందుకు ఇళ్లు లేక నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read