పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించినందుకే తన ఇంటిపై ఐటీశాఖతో దాడులు చేయించారని తెదేపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ విమర్శించారు. తన ఇంట్లో ఐటీ సోదాలపై ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సియం రమేష్ చెప్పిన మాటలు చూస్తూ, మోడీ-షా ఎంతకు దిగాజారిపోయరో అర్ధమవుతుంది. కెసిఆర్ ఎలా అయితే నకిలీ ఐటి దాడులు చేపించారో, ఇంచు మించు అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ నిజమైన ఐటి అధికారులు వచ్చినా, వారెంట్ మాత్రం తప్పుడు వారెంట్.

itwist 14102018

సియం రమేష్ మాట్లాడుతూ, ఐటీ అధికారులు తప్పుడు వారెంటుతో వచ్చారని తెలిపారు. తన భార్య పేరుతో సెర్చ్‌ వారెంట్‌ తీసుకుని వచ్చారని.. రిత్విక్‌ అగ్రిఫామ్స్‌లో ఆమె డైరెక్టర్‌ కాదని వివరించారు. తప్పుడు సమాచారంతో వచ్చి హడావుడి చేశారని మండిపడ్డారు. తనిఖీలకు కారణం చెప్పమంటే ఐటీ అధికారులు చెప్పలేదన్నారు. ఈ విషయం పై వదిలిపెట్టను అని, దీని పై నాకు సరైన వివరణ ఇచ్చే దాకా ఎంత వరకు అయినా వెళ్తానని అన్నారు. ఇప్పటి వరకు ఐటి అధికారులకు భయపడి ఎవరూ మాట్లాడలేదని, నేను మాత్రం ఇలా కక్ష సాధింపు చేసే వారిని వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. తన తలతీసినా తాను బెదిరిపోయేది లేదన్నారు. తాను పోయినా... తన కుటుంబసభ్యులు పోరాడుతారని రమేష్‌ పేర్కొన్నారు. మూడు బెడ్‌రూమ్‌లు ఉన్న ఇంట్లో... ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు సోదాలు చేయడానికి ఏముంటుందని రమేష్ ప్రశ్నించారు

itwist 14102018

‘పదేళ్ల క్రితం మూసిన కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. ఏ సమాచారంతో తనిఖీలు చేశారో లీగల్‌గా వెళ్లి ప్రశ్నిస్తాం. మా ఇంట్లో కీలక పత్రాలు దొరికాయని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. ఎలాంటి కీలక పత్రాలు దొరికాయో ఆ ఛానళ్లే చెప్పాలి. నేనేమైనా పాకిస్థాన్‌తో సంబంధం పెట్టుకున్నానా?. నావద్ద ఏదైనా రక్షణ ఆయుధాలకు సంబంధించిన సమాచారం ఉందా?. బ్యాంకు ఖాతాల పత్రాలు మాత్రమే దొరికితే కీలక పత్రాలు అంటు ప్రచారం చేశారు. మా బంధువుల ఇంట్లో మాత్రమే రూ.3.50 లక్షల నగదు ఐటీ అధికారులకు దొరికింది. నేను, మా బంధువులు క్రమం తప్పకుండా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నాం. ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించడం మానుకునేది లేదు.’ అని సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు.

రాజకీయ కక్షతోనే కేంద్రం ప్రభుత్వం తనపై ఐటీదాడులకు దిగిందని… టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోపించారు. సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. భయాందోళనలకు గురి చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఇదంతా చేస్తోందన్నారు.. పరోక్షంగా బీజేపీలో చేరాలంటూ బెదిరింపులకు దిగుతోందన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ మెంబర్‌గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు చేయించారన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయని, మీ పెద్దలకు చెప్పండని ఐటీ అధికారులన్నారని రమేష్‌ తెలిపారు. పార్టీ మారాలని ఐటీ అధికారి మదన్‌ అనడం దేనికి నిదర్శనమని రమేష్‌ ప్రశ్నించారు.

audio 14102018 2

ఐటీ అధికారి మదన్‌ మాట్లాడిన మాటలు ఆడియో కూడా రికార్డు చేసామని చూపించారు. ఇది ఎవరికి ఇవ్వాలో వాళ్లకి ఇస్తామని, రేపు నేషనల్ మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని, అక్కడ మరిన్ని విషయాలు చెప్తానని అన్నారు.
బంధుమిత్రులతో సహా, తన వ్యాపారాలతో సంబంధం లేని వ్యక్తులనూ వదలకుండా సోదాలు చేశారన్నారు. సోదాలు చేయడానికి గల సరైన కారణాలను ఐటీ అధికారులు చెప్పలేకపోయారని చెప్పారు. టీడీపీలో క్రియా శీలకంగా ఉండడంతో పాటు, ప్రజలతో మమేకమై ఉండడం వల్లే బీజేపీ తనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు.

audio 14102018 3

తాను అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తనకు రాష్ట్రంలో రెండువేల కోట్ల విలువైన ప్రాజెక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేటెడ్‌ దక్కాయంటూ కొన్ని మీడియా సంస్థల చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.లక్ష రూపాయలైనా నామినేటెడ్‌గా వచ్చినట్టు నిరూపిస్తే.. ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. ఇలా దాడులతో బీజేపీ పార్టీలోకి చేర్చుకోవాలన్నదే కేంద్రం లక్ష్యం అని సంచలన ఆరోపణలు చేశారు. ఎలాంటి బెదిరింపులకు దిగినా తాను భయపడేది లేదన్నారు. ఈ దాడులతో తమకేమి నష్టం లేదని కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని సీఎం రమేష్‌ ఆరోపించారు.

కడప ఉక్కుపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ చేతులెత్తేశారు. ‘నా చేతుల్లో ఏమీ లేదు’ అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘‘త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నాకూ ఉంది. మా వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏవీ జరగాల్సిన పద్ధతుల్లో జరగడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. చివరికి... వారం రోజుల్లోపు ఈ ప్రాజెక్టుపై పత్రికా ప్రకటన జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్‌ రెడ్డి, తోటా సీతారామలక్ష్మి, నిమ్మల కిష్టప్ప, పండుల రవీంద్ర బాబు, కేశినేని నాని, టీజీ వెంకటేశ్‌, గల్లా జయదేవ్‌ శనివారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

tdp 14102018 2

‘‘ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని మా వాళ్లకు కూడా చెబుతున్నాను. మెకాన్‌ సంస్థ ఎందుకో చాలా నెమ్మదిగా పనిచేస్తోంది. నివేదికను త్వరగా సిద్ధం చేస్తారా లేదా అని నేను కూడా మెకాన్‌ను గట్టిగా అడిగాను’’ అని తెలిపారు. మెకాన్‌ సంస్థ కేంద్ర ఉక్కు శాఖ పరిధిలోనిదేనని ఎంపీలు గుర్తు చేశారు. త్వరగా నివేదిక తెప్పించండి అని కోరారు. చాలా సార్లు చెప్పానని, మరోసారి సంస్థ అధికారులతో సమావేశమవుతానని బీరేంద్ర బదులిచ్చారు. మరోవైపు, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) సంస్థ ఈక్విటీ రూపంలో పెట్టుబడులు పెట్టే అంశంతో పాటు ఐదు సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించినట్లు తెలిసింది.

tdp 14102018 3

‘‘మీరు సీనియర్‌ నాయకులు. మీకు అన్నీ తెలుసు. ఇప్పటికే చాలాసార్లు వచ్చి మిమ్మల్ని కలిశాం. ఇంకా ఎంత కాలం వేచిచూడాలి! ప్రతీసారి రావాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది’’ అని సుజనాచౌదరి అన్నారు. నాలుగైదు రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమపై పత్రికా ప్రకటన చేస్తామని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ హామీ ఇవ్వగా... అదే మీడియాకు చెప్పాలని ఆయనను ఎంపీలు కోరారు. దానికి ఆయన అంగీకరించలేదు. ‘నేను మీడియాతో మాట్లాడను. గతంలో మాట్లాడినప్పుడే తప్పుడు సంకేతాలు వెళ్లాయి. మళ్లీ ఆ పొరపాటు చేయను. మీడియాతో వద్దే, వద్దు’ అన్నట్లు తెలిసింది. ఒక కేంద్ర మంత్రి ఇంత నిస్సహాయతలో ఉన్నారంటే, మోడీ-షాలు ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారో అర్ధమవుతుందని, ప్రజలే సరైన బుద్ధి చెప్తారని టిడిపి ఎంపీలు అన్నారు.

గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. తన ఇల్లు, ఆఫీసుల్లో మూడురోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. తన బంధువులు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారని చెప్పారు. తన ఇళ్లు, ఆఫీసుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేష్ వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరిగాయని ఆయన విమర్శించారు. భయానక వాతావరణం సృష్టించేందుకే ఐటీ దాడులు చేశారని, రాజకీయంగా అభాసుపాలు చేయాలని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. పైనుంచి ఒత్తిడి ఉందని ఐటీ అధికారులే చెప్పారని సీఎం రమేష్‌ వెల్లడించారు.

kadapa 14102018 2

తప్పుడు వారెంట్‌తో వచ్చి తన ఇంట్లో సోదాలు చేశారని, రిత్విక్‌ అగ్రిలో తన భార్య డైరెక్టర్‌ కాదని.. షేర్‌ హోల్డర్‌ కాదని ఆయన తెలిపారు. తన కంపెనీ నుంచి వేలకోట్లు తరలిపోయాయని తప్పుడు వార్తలు రాశారని ఆయన చెప్పుకొచ్చారు. తమ కంపెనీ టర్నోవరే రూ.వెయ్యి కోట్లు లేదని, తన ఇంట్లో రూ.3.53లక్షలు స్వాధీనం చేసుకున్నారని సీఎం రమేష్‌ తెలిపారు. రూ.3.53లక్షల్లో దాదాపు రూ.2లక్షలు దేవుని ముడుపులే ఉన్నాయని చెప్పారు. తన ఇంట్లో ఉన్నవారి బ్యాంకు అకౌంట్లు, పాస్‌బుక్స్ తీసుకున్నారని, అలహాబాద్‌ బ్యాంక్‌లో తమకు అసలు అకౌంటే లేదని సీఎం రమేష్‌ తెలిపారు. బ్యాంకు అకౌంట్లు కీలక పత్రాలు అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.

kadapa 14102018 3

పీఏసీ మెంబర్‌గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు రిపారని సీఎం రమేష్‌ అభిప్రాయపడ్డారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయని మీ పెద్దలకు చెప్పండని ఐటీ అధికారులు తనతో అన్నారని సీఎం రమేష్‌ చెప్పడం గమనార్హం. ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదని ఏపీ టీడీపీ నేత సీఎం రమేశ్ గట్టిగా చెప్పారు. ఈ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. అధికారం ఉందని చెప్పి ఒత్తిడి చేసి తమను లొంగదీసుకోవాలని చూస్తారా? అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్రానికి లొంగే ప్రసక్తే లేదని, కడప బిడ్డగా మీసం మెలేసి చెప్తున్నా అని స్పష్టం చేశారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ఈ ఐటీ దాడుల వ్యవహారాన్ని జాతీయస్థాయిలో తెలియజేస్తామని సీఎం రమేశ్ హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read