"బాబు నువ్వే మా టార్గెట్", పార్లమెంట్ సాక్షిగా ప్రధాని.. "చంద్రబాబు నిన్ను దించటమే మా టార్గెట్", ఊరు ఊరు తిరిగి చెప్తున్నాడు జగన్.. "నేను గెలవకపోయినా పరవాలేదు, ఎవరు గెలిచినా పరవాలేదు, చంద్రబాబుని మాత్రం గెలవనివ్వను", ఇంత విచిత్రంగా స్పందిస్తాడు పవన్ కళ్యాణ్... ఇక తెలంగాణాలో ఉన్న తెరాస పార్టీకి కూడా చంద్రబాబే టార్గెట్ అంట.. స్వయంగా చెప్పాడు కేటీఆర్... కాంగ్రెస్ ను సీరియ్‌సగా తీసుకోకుండా చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నాం అంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నాడు ఈ పిల్లోడు. వీళ్ళ అయ్యేమో తెలుగుదేశం అనే ఒక పార్టీ ఉందా, అది ఒక 0.01% ఉన్న చిల్లర పార్టీ అంటాడు.. కొడుకేమో, చంద్రబాబుని చూస్తే మాకు వణుకు, అందుకే టార్గెట్ చేస్తున్నాం అంటాడు..

ktr 14102018 2

ఈ ప్రపంచంలో ఉన్న మూర్ఖులు అందరికీ చంద్రబాబే టార్గెట్.. ఎందుకంటే చంద్రబాబు మంచి చేస్తున్నాడు. వీళ్ళకి పాలించమని ఇస్తే, సంవత్సరం ముందే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి, ఎన్నికలకు వచ్చి, 4 ఏళ్ళలో చేసింది ఏంటో చెప్పుకోకుండా, చంద్రబాబు చంద్రబాబు అంటూ నామస్మరణ చేస్తూ, గడిపేస్తున్నారు. 2013 తెలంగాణా ఇవ్వక ముందు గుర్తుందా ? తెలంగాణా దేవత సోనియమ్మ అంటూ, కెసిఆర్ తో పాటు, ఆయన ఫ్యామిలీ మొత్తం వెళ్లి, సోనియా గాంధీ పాద పూజ చేసి వచ్చారు. ఇంటిల్ల పాది గ్రూప్ ఫోటో దిగి, త్వరలోనే మా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్నాడు కెసిఆర్. తరువాత, సోనియా దెయ్యం అన్నాడు.. దేవత అన్న నోటితోనే దెయ్యం అన్నాడు... ఇక 2009లో తెలుగుదేశంతో కలిసి మహా కూటమి అన్నాడు. చంద్రబాబు అంత నాయకుడు ఈ ప్రపంచంలోనే లేడు అన్నాడు. కట్ చేస్తే, ఎన్నికలు అయిన మరుసటి రోజే, ఫలితాలు కూడా రాకుండా వెళ్లి ఎన్డీఏలో చేరిపోయాడు. ఇక ఇప్పుడ, దేశం మొత్తం మోడీని వ్యతిరేకిస్తుంటే, వెళ్లి మోడీ పక్కన చేరాడు. ఎందుకంటే, 7 వేల కోట్ల రూపాయల సహారా స్కాంలో అడ్డంగా దొరికినందుకు..

ktr 14102018 3

ఒక పక్క బీజేపీని, మరో పక్క ఎంఐఎంని పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. ఇలాంటి రాజకీయ వ్యభిచారి, చంద్రబాబుని విమర్శ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు చంద్రబాబుని విమర్శ చేస్తారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, ఎన్నికలకు వెళ్తుంటే వణికిపోతున్నారు. ఆ రోజు సోనియాని తిట్టి ఈ రోజు కలుస్తున్నారు అంటే, నువ్వు, నీ అయ్యా సోనియా కంటే ఘోరం అని అర్ధం, అందుకే పెద్దగీత, చిన్న గీత అన్నట్టు, ఎవరి వల్ల తెలుగు జాతికి నష్టమో, ఎవరి వల్ల తెలంగాణా సమాజం నాశనం అవుతుందో, తెలుగుజాతిని దెబ్బ తీసే మోడీతో కలిసి కుట్ర చేస్తున్న వాళ్ళని ఎదుర్కోవటానికి, శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి, కాంగ్రెస్ తో కలిసారు. అయినా 0.01% ఉన్న పార్టీ మీద టార్గెట్ ఎందుకు కేటీఆర్.. ఎందుకు అంత వణుకు.. నువ్వు చెప్పే సొల్లు అంతా నిజం అయితే, తెలంగాణా ప్రజలే చంద్రబాబుని టార్గెట్ చేస్తారు. నువ్వు ఎందుకు వణికిపోయి, టార్గెట్ చెయ్యటం ?

ఎలాగైనా చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి.. అలా చెయ్యాలి అంటే, చంద్రబాబుకి సహకరించే వారిని ముందు ఇబ్బంది పెట్టాలి... ఫాక్షన్ ఆలోచనలు అంటారు వీటిని.. ఇలాంటి అలోచనే ఇప్పుడు కేంద్రం చేస్తుంది. రాష్ట్రంలో భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అదేమంటే, దాడులు జరిగితే భయం దేనికి, కడిగిన ముత్యం లాగా బయటకు రండి అంటూ ఫోజులు కొడుతున్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూపాయి అయినా అక్రమం అని తేల్చారా అంటే, లేదు ? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, చంద్రబాబును సాధించటానికి చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో సంచలన విషయం బయట పడింది. చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారిని ఇబ్బంది పెట్టే పెద్ద ఆపరేషన్ మొదలు పెట్టారు.

it 14102018 2

చంద్రబాబుని డైరెక్ట్ గా టచ్ చేసే దమ్ము లేక డ్రామాలు ఆడుతున్నారు. ఐటీ శాఖ చాలా లోతుల్లోకి వెళ్లి మరీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ‘‘గత నాలుగేళ్లుగా భారీగా లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలన్ని మాకు చెప్పండి’ అంటూ బ్యాంకులకు ఐటీ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవలికాలంలో జాగ్రత్త పడినప్పటికీ... పాత లెక్కలను తీసి పక్కాగా పట్టుకోవచ్చునని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.మరీ ముఖ్యంగా... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ కంపెనీలు, సంస్థలు నిర్వహించిన లావాదేవీల వివరాలను పలు బ్యాంకులనుంచి ఐటీ శాఖ సేకరిస్తున్నట్లు తెలిసింది.

it 14102018 3

లక్ష్యంగా నిర్ణయించుకున్న కంపెనీల బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు. ఒకచోట తీగ దొరికితే గొలుసుకట్టుగా డొంకను కదిలించుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ వ్యవహారం క్రమంగా వ్యాపార వర్గాల్లోకి చేరుతుండడంతో గుబులు మొదలైంది. ఇటీవల 200 మంది సిబ్బంది 19 బృందాలుగా విడిపోయి వీర విహారం చేశారు. ఒకరోజు, రెండు రోజులు కాకుండా... రోజుల తరబడి అదే పనిగా వేడి కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం లేని వారు కూడా బెంబేలెత్తుతున్నారు. పలువురు రియల్టర్లు, వ్యాపారులు అసలు ఇప్పుడేమీ కొత్త లావాదేవీలు వద్దు, ఒప్పందాలు, రిజిస్ర్టేషన్లు వద్దే వద్దు అన్న స్థాయికి వెళ్లిపోయారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవాళ్లే కాకుండా...ఒక మాదిరిగా వ్యాపారాలు చేసేవారూ టెన్షన్‌ పడుతున్నారు. బీజేపీకి కావాల్సింది కూడా ఈ భయమే. అది సృష్టించటంలో ఇప్పటికి సక్సెస్ అయ్యారు. 2019లో ప్రజల టైం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఉదయం ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించే నిమిత్తం వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. సోమిరెడ్డి, ఆయన సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం టైర్లు పేలడంతో జాతీయ రహదారిపై అదుపుతప్పింది. దీంతో వాహనం స్కిడ్ అయి, డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, తన అనుభవాన్ని చూపిస్తూ, వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. సోమిరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తరువాత ఆయన మరో వాహనంలో తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మందస గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు.

somireddy 14102018 2

అంతకు ముందు సోమిరెడ్డి శ్రీకాకుళంలో పర్యటించారు. వ్యవసాయ శాఖామాత్యులు పంట నష్టాల అంచనా నిక్కచ్చిగా తయారు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి అధికారులను ఆదేశించారు. శని వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంట నష్టాల ఎన్యూమరేషన్ పై నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి మంత్రి విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిత్లీ తుఫాను వలన పలాస, ఇఛ్ఛాపురం, టెక్కలి నియోజక వర్గాలలో 13 మండలాలలో పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. 1.39 లక్షల హెక్టార్లలో వరి పంట, 20 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటిలో జీడి, అరటి, కొబ్బరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోరాదనే వుద్దేశ్యంతో

somireddy 14102018 3

కేంద్ర సాయం కన్నా ఎక్కువ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. వరి పంట అంచనాలకు 320 మందిని, ఉద్యానవన పంటల పరిశీలనకు 135 మందిని విశాఖపట్నం, విజయనగరం నుండి కూడా డిప్యూట్ చేయడం జరిగిందని తెలిపారు. పంట నష్టం కలిగిన ప్రతీ రైతుకు నష్ట పరిహారాన్ని త్వరితగతిన అందచేయడం జరుగుతుందని చెప్పారు. కొబ్బరి చెట్టుకు రూ. 1,000 లు, జీడి, మామిడికి హెక్టారుకు రూ.20 వేలు, అరటి పంటకు హెక్టారుకు రు.25 వేలు ఇన్ పుట్ సబ్సిడీని అందించడం జరుగుతుందని తెలిపారు. మూడు రోజులలో ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వంశధార నీరు విడుదల ద్వారా శీకాకుళం, నరసన్నపేట, ఆముదాల వలస మండలాలలో 25 వేల హెక్టార్ల పంట నీట మునిగిందన్నారు. ఉద్యానవన అధికారుల సహకారంతో గ్రామాలలో ఎన్యూమరేషన్ చేయాలని తెలిపారు. ఉపాధిహామీ సిబ్బంది కూడా ఎన్యూమరేషన్ కు తోడ్పాటు అందించాలని చెప్పారు.

రేవంత్ రెడ్డి ఇంటి పై 43 గంటలు ఐటి దాడులు చేసారు. చివరకు కొండను తవ్వి ఎలక తోక కూడా పట్టుకోలేక పోయారు. తరువాత విజయవాడ వచ్చి, టిడిపికి సానుభూతి పరులుగా ఉన్న పారిశ్రామిక వేత్తల పై దాడులు చేసారు, ఇక్కడ అసలు కొండను కూడా తవ్వలేదు, ఏమి లేక ఊపుకుంటూ వెళ్లారు. సుజనా చౌదరి కంపనీల పై చేసారు, అక్కడా ఊపుకుంటూ వెళ్లారు. ఇక లాభం లేదు, ఎదో ఒకటి పట్టుకోవాలనే ఆదేశాలు పై నుంచి రావటంతో, దాదాపు 100 మంది ఐటి అధికారులు సియం రమేష్ ఇంటి పై పడ్డారు. 51 గంటలు సోదాలు చేసారు. సాధించి సాధించి చివరకు ఇక్కడ కూడా ఎలక తోక కూడా పట్టుకోలేక పాపం, దసరా మామూలు తీసుకుని వెనుతిరిగారు.

ramesh 14102018 2

ఆయన కంపెనీల్లో జరిపిన సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను అధికారులు వెంటతీసుకెళ్లారు. సీఎం రమేష్ ఇంట్లోని ఓ లాకర్, ఆయన వేలిముద్రలతోనే తెరచుకుంటుందని తెలుసుకున్న అధికారులు, ఢిల్లీలో ఉన్న ఆయన్ను పిలిపించి, దానిని తెరిపించారు. ఆపై తమ తనిఖీలు ముగిశాయని గత అర్ధరాత్రి వెల్లడించిన అధికారులు, పంచనామా పత్రాల కాపీని సీఎం రమేష్ కు అందించి వెళ్లిపోయారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, విభజన హామీల అమలు దిశగా ఒత్తిడి తెస్తున్నందునే తనపై ఐటీ అధికారులతో దాడులు చేయించారని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.

ramesh 14102018 3

ఐటీ అధికారులు పంచనామా కాపీని తనకు అందించి, సోదాలు ముగిసినట్టు తెలిపి, వెళ్లిపోయిన తరువాత ఆయన గత అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. "నేను కరుడుగట్టిన టీడీపీవాదినని అందరికీ తెలుసు. నన్ను బీజేపీలోకి రావాలని అడిగారు. సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు కూడా, బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారని నన్ను ప్రశ్నించారు. నాపై నెల రోజుల క్రితం జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. భయానికి గురిచేసేందుకే నాపై బీజేపీ దాడులు చేయిస్తోంది. నేను ఎలాంటి బెదిరింపులకూ భయపడను. రేపు మరోసారి మీడియా ముందుకు వచ్చి మరిన్ని వివరాలు తెలియజేస్తాను" అని ఆయన అన్నారు.

Advertisements

Latest Articles

Most Read