విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదు రోజైన ఆదివారం దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీసంఖ్యలో తరలిరానున్నారు. మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ముఖ్యమంత్రి దుర్గగుడికి రానున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మళ్లీ శ్రీకాకుళం వెళతారు. మరో రెండు మూడు రోజులు అక్కడే ఉండి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తారు.

mulanaxtram 14102018 2

మీడియా పాయంట్ వ‌ద్ద మంత్రి కొల్లు ర‌వీంద్ర విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి ప‌ట్టువ‌స్త్రాలు అందించే సాంప్ర‌దాయం ఉంద‌ని ఈ మేర‌కు ఆదివారం మ‌ధ్యాహ్నం దుర్గ‌మ్మ‌కు ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తార‌ని చెప్పారు. శ్రీకాకుళంలో తిత్లీ తుపాను కార‌ణంగా దెబ్బ‌తిన్న కుటుంబాలు, ఆయా ప్రాంతాల‌ను ప‌రిశీలించేందుకు ముఖ్య‌మంత్రి వెళ్లార‌న్నారు. న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు ల‌క్ష‌ల మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నార‌ని, ఆదివారం మూలా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా ఒక్క‌రోజునే మూడు నుంచి నాలుగు ల‌క్ష‌ల మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటార‌ని అంచ‌నా వేశామ‌న్నారు.

mulanaxtram 14102018 3

అందుకు త‌గిన‌ట్లుగా ఏ ఒక్క భ‌క్తుడికి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జిల్లా యంత్రాంగం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖ‌ల అధికారులు, పాల‌క‌మండ‌లి స‌భ్యులు స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నార‌ని మంత్రి అభినందించారు. గ‌త సంవ‌త్స‌రం ద‌స‌రా ఉత్స‌వాల‌లో 15 నుండి 16 ల‌క్ష‌ల మంది భ‌క్తులు దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నార‌ని ఈ సంవ‌త్స‌రం భ‌క్తుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. మంత్రి వెంట పాల‌క‌మండ‌లి స‌భ్యులు, అధికారులు పాల్గొన్నారు.

అందరినీ పుల్ల పెట్టి కెలికి మరీ తన్నించుకునే జీవీఎల్, ఈ సారి సియం రమేష్ ను కెలికి మరీ, ఈ వారం కోటా పూర్తి చేసుకున్నారు. ఈ రోజు ఉదయం, జీవీఎల్, సియం రమేష్ ను ఉద్దేశించి ఒక ట్వీట్ వేసారు "రమేష్ గారు, రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసు. మీలాగే ఛాలెంజ్ చేసి టీడీపీ ఎంపీ సృజన చౌదరి గారు గతంలో తోక ముడిచారు. మీరూ అంతేనా? మీ ఎంపీ లకు పౌరుషం ఎక్కువ. పెర్ఫార్మన్స్ తక్కువ! నేను చర్చకు రెడీ. ఎప్పుడైనా,ఎక్కడైనా! మీరు సిద్ధమా!" ఎంతో జుబుక్సాకరంగా, రెండు అర్ధాలు వచ్చేలా, రోడ్డు పై రిక్షా వాళ్ళు కూడా మాట్లాడిన భాషలో జీవీఎల్ ట్వీట్ చేసారు. కావాలని రెచ్చగొట్టి, పబ్బం గడుపుకునే జీవీఎల్, సియం రమేష్ రిప్లై ఇస్తారని ఊహించ లేకపోయారు.

tweet 13102018 2

సియం రమేష్ ఇదే ట్విట్టర్ లో, జీవీఎల్ వేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చారు, "గతం లో మీరు సాక్షాత్తు రాజ్యసభలోనే 14 వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దంది అన్నప్పుడు... నేను సభలోనే ఛాలెంజ్ చేశాను, " నిరూపిస్తే రాజీనామా చేస్తా" అని...! అప్పుడు తోక ముడిచింది మీరు కాదా ? ఇప్పటికీ మీతో ఏ అంశం మీదనైనా చర్చకు నేను సిద్దం. ఎప్పుడు? ఎక్కడ? మీరే చెప్పండి" అంటూ ట్వీట్ చేసారు. తద్వారా జీవీఎల్ నరసింహారావు సవాల్‌ను సీఎం రమేశ్ స్వీకరించారు. జీవీఎల్‌తో తాను చర్చలకు సిద్ధమని ప్రకటించారు. స్థలం, సమయం చెబితే తాను రెడీగా ఉంటానని తెలిపారు. ఐటీ అధికారుల పిలుపు మేరకు హైదరాబాద్ వచ్చిన రమేశ్... కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

tweet 13102018 3

రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు జరగుతున్నాయని రమేశ్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను శుక్రవారం నుంచి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఐటీ అధికారుల సోదాలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. తన కంపెనీల్లో ఎక్కడా అవకతవకలు జరగలేదని... చేసిన పనులకు, ప్రాజెక్టులకు లెక్కలున్నాయన్నారు. ఢిల్లీకి భారీగా డబ్బులు తరలిపోయాయన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. తమ కంపెనీ అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేస్తుందని.. నాలుగేళ్లలో రెండు వందల కోట్లకు పైగా పన్నులు చెల్లించామని సీఎం రమేశ్ తెలిపారు.

ఆపరేషన్ గరుడ... ఈ ప్లాన్ మొట్టమొదట బయట పెట్టింది, సినీ హీరో శివాజీ.. అన్నీ కాకపోయినా, ఆయన చెప్పిన దాంట్లో, 90 శాతం నిజం అయింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీద దాడి మినహా, శివాజీ చెప్పిన ప్రతి పాయింట్ నిజం అయింది. గవర్నర్ జోక్యం చేసుకోవటం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరగటం, కులాల మధ్య గొడవలకి ప్లాన్ చెయ్యటం, చంద్రబాబుకు నోటీసులు, తెలుగుదేశం నాయకుల పై ఐటి దాడులు, ఇవన్నీ గత నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, ఢిల్లీ పై యుద్ధం మొదులు పెట్టిన దగ్గర నుంచి, అన్ని వైపుల నుంచి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో, బీజేపీ, జనసేన, జగన్, కెసిఆర్ కుమ్మక్కు కళ్ళారా చూస్తున్నాం.

sivaji 13102018 2

అయితే ఈ క్రమంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి శివాజీ మరో విషయం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే, ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లడారు. "ప్రత్యేకహోదా అంశం రాజకీయ నిర్ణయమని… 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ స్పష్టంగా చెప్పారు. ఢిల్లీలో ప్రత్యేకహోదాపై చర్చ నడుస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు త్వరలో దీని పై మళ్ళీ ఉద్యమం మొదలు పెడతాడు. పొలిటికల్ హీట్ పెంచుతారు. డిసెంబర్ నెలలో ప్రత్యేక హోదా ఇస్తారు. కాకపోతే రాయతీలు లేకుండా హోదా మాత్రమే ఇస్తారు. మనకు కావాల్సింది రాయతీలతో కూడిన ప్రత్యేక హోదా. కేవలం రాజకీయం కోసమే రాయతీలు లేని ప్రత్యెక హోదా ఇచ్చి, ఆ ప్రాంతీయ పార్టీ నాయకుడుకి క్రెడిట్ ఇస్తారు" అంటూ శివాజీ చెప్పారు.

sivaji 13102018 3

అయితే, శివాజీ చెప్పినట్టుగానే, ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఆరు నెలలుగా, పవన్ కళ్యాణ్ నోటి వెంట హోదా అనే మాట రాలేదు. ఉన్నట్టు ఉండి హోదా పై మాట్లాడాటం, చంద్రబాబు అఖిలపక్ష సమావేశం పెట్టాలి, మమ్మల్ని ఢిల్లీ తీసుకువెళ్ళి అని చెప్పటం, ఇవన్నీ ప్లాన్ లో భాగమే అని తెలుస్తుంది. ఇది వరకు రెండు అఖిలపక్ష మీటింగ్ లు పెడితే, వాటికి రాని పవన్ కళ్యాణ్, ఈ రోజు మాత్రం, మళ్ళీ అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి అంటున్నారు. ఎప్పుడో వదిలేసిన ప్రత్యేక హోదా మళ్ళీ అందుకుంటున్నాడు. అంటే, హీరో శివాజీ చెప్పినట్టే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు, అమిత్ షా నుంచి స్క్రిప్ట్ వచ్చింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ నుంచి, కొత్త సినిమా చూడబోతున్నాం.

ఐటీ దాడులపై తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, తన భార్య పేరు మీద నోటీసులు వచ్చాయని ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు నెలల క్రితం ఐటీ దాడులు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఐటీ దాడుల పేరుతో సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు చేస్తున్నారని, రిత్విక్ కంపెనీలో సోదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు. ఐటీ అధికారులు సహకరిస్తే తన ఇంట్లో జరిగే సోదాలను.. వీడియో తీసి మీడియాకు పంపిస్తానని రమేష్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం సీఎం రమేష్‌ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

itramesh 13102018 2

ఐటీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులను నిన్నటి నుంచి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు పిలవడంతో హైదరాబాద్‌ వచ్చానని, ఐటీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాలకు పూర్తిగా సహకరిస్తామని సీఎం రమేష్‌ తెలిపారు. సీఎం రమేశ్‌ నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దాదాపు 60 మంది ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు చేశారు.

itramesh 13102018 3

ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసం, కడప జిల్లా పోట్లదుర్తిలోని నివాసంతో పాటు రిత్విక్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని 12 చోట్ల, పోట్లదుర్తి ఇతర ప్రాంతాల్లో ఐదు చోట్ల ఈ తనిఖీలు కొనసాగాయి. భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై సీఎం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. జీవీఎల్‌ ఏమైనా ఐటీ అధికారా? అని ప్రశ్నించారు. ఆయనపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రమేశ్‌ స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో దిల్లీ నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisements

Latest Articles

Most Read