శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారిని చూసేందుకు వచ్చిన చిన్నారి సీఎంని ఆటోగ్రాఫ్ అడగగా వెంటనే చిన్నారి తెచ్చుకున్న పుస్తకంలో తన సంతకం చేసి ఇచ్చారు. చిన్నారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం పర్యటించారు. సోంపేట, కవిటి, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి కనీసం అన్నం పొట్లాలు కూడా అందలేదన్న వాస్తవాన్ని తెలుసుకుని ఒకరోజు పర్యటనగా వచ్చిన బాబు తిత్లీ బాధితులతోనే పలాసలో శుక్రవారం రాత్రి గడుపుతానంటూ వెల్లడించారు.

chinnari 13102018 2

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడం, రోడ్డులపై పడి ఉన్న భారీ చెట్లు తొలగించడంతోపాటు అత్యవసర సర్వీసులన్నీ పునరుద్ధరణ చేసేవరకూ తాను పలాసలోనే మకాం వేస్తానంటూ చెప్పడంతో రాజధాని నుంచి సిక్కోల్ వరకూ అధికార యంత్రాంగం అంతా ఆయన వెంటే పరుగులు పెడుతున్నారు. తిత్లీ తుపాను బాధిత గ్రామాల్లో తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. డీఎస్పీ కార్యాలయం మైదానంలో సి.ఎం. హెలీకాఫ్టర్ ల్యాండ్ అనంతరం అక్కడ నుంచి నేరుగా పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం బయలుదేరి రోడ్డుమార్గంలో వెళుతూ ప్రజల హర్షధ్వానాలకు సి.ఎం. కారు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.

chinnari 13102018 3

పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కారు దిగి అక్కడపడి ఉన్న చెట్లను పరిశీలించి చెట్లు తొలగింపునకు కలెక్టర్ కె.్ధనంజయరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కాశీబుగ్గ బస్ స్టేషన్ వద్ద దిగి అక్కడ కూలిన చెట్లను పరిశీలించి చెట్ల తొలగించాలని స్థానిక అధికారులకు హుకుం జారీ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ నుంచి బయలుదేరి వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామం వెళుతూ మార్గ మధ్యలో తుపానుకు నష్టపోయిన జీడితోటలను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా అక్కుపల్లి చేరుకుని గ్రామస్థులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. పిల్లలకు భోజనాలు పెట్టాలని, పేద వారందరికీ రేషన్ షాపుల ద్వారా 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం ఈ రోజును నుంచే తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. తాగునీరు, విద్యుత్‌లకు ఇబ్బంది పడుకుండా తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రహదారులు, ఇతరత్రా సౌకర్యాలు కూడా త్వరలోనే కల్పించనున్నట్లు వివరించారు.

‘అసలు సినిమా ముందుంది’ అన్నట్లుగానే జరుగుతోంది! ఆదాయపు పన్ను శాఖ సోదాల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా... ఆయన సన్నిహితులపై ఐటీ గురి పెడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహంలో భాగంగానే వరుస సోదాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయంగా ముఖ్యమంత్రికి సన్నిహితులుగా ఉన్న వారు, పార్టీకి ఆర్థికంగా సేవలందించిన వారిపై ఐటీ కన్ను వేసినట్లు తెలుస్తోంది. తొలుత నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుపై ఐటీ గురి పెట్టింది. తర్వాత ఒకేసారి 19 బృందాలు విరుచుకుపడ్డాయి.

next it raids 13102018

ఆపై... రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఇప్పుడు... సీఎం రమేశ్‌ వంతు! ఇదే క్రమంలో త్వరలోనే రెండు ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలపైనా దాడులు జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఒకటి టీడీపీ నేతకు చెందిన సంస్థ. సోదాల్లో ఏం గుర్తించారు, ఏం స్వాధీనం చేసుకున్నారనే విషయాలపై ఐటీ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. వీటిపై ఎలాంటి అధికార ప్రకటనలు విడుదల చేయడంలేదు. ఆయా నేతలు, కాంట్రాక్టు కంపెనీలకు చంద్రబాబుతో ఉన్న సంబంధాలపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

next it raids 13102018

గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్న వారు, ఈ ఎన్నికల్లో సహకారం అందించే అవకాశమున్న వారితో ‘హిట్‌ లిస్ట్‌’ తయారైనట్లు సమాచారం. ఆయా కంపెనీలకు చెందిన సమస్త సమాచారాన్ని ఐటీ శాఖ ముందుగానే తెప్పించుకున్నట్లు తెలిసింది. కర్ణాటక ఎన్నికల నాటినుంచే తాము ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా సమాచార సేకరణను ఐటీ శాఖ ప్రారంభించిందని అంటున్నారు. వాటి ఆధారంగా దాడులు జరపడం, ఏవైనా దొరికితే మరింత ముందుకెళ్లడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు వ్యూహరచన చేసుకుంటోందని తెలిసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండింగ్‌పై సరైన సమాచారం లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారుల్లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం ఉదయం తుపాను ప్రాంతాలను వీక్షించేందుకు శ్రీకాకుళం నుంచి సీఎం బయలుదేరారు. ఇచ్ఛాపురం, ఇతర ప్రాంతాలను విహంగ వీక్షణం చేసిన తరువాత, పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హెలికాప్టర్‌ దిగాలి. అక్కడి నుంచి సీఎం రోడ్డు మార్గాన వెళ్లాలి. ఇందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30 గంటల సమయంలో సీఎం కోసం అంతా కళాశాల మైదానం వద్ద ఎదురు చూస్తుండగా... ఆయన కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్‌ వద్ద దిగినట్టు తెలిసింది.

helicpoter 13102018 2

దీంతో సీఎం కాన్వాయ్‌ మొత్తం హుటాహుటిన మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీసింది. అప్పటికే సీఎం హెలిప్యాడ్‌ నుంచి దిగిపోవడం, స్థానికులు ఆయనను చూసేందుకు దగ్గరగా వచ్చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.పోలీసులు ఆయన్ను పోలీసు స్టేషన్‌ ప్రహరీ లోపలికి తీసుకువెళ్లి గేట్లు మూసివేశారు. కాన్వాయ్‌ను సిద్ధం చేయడానికి 20 నిమిషాల వరకు సమయం పట్టడంతో అంతవరకు ఆయన స్టేషన్‌ ఆవరణలోనే గడిపారు. ముందుగా సిద్ధం చేసిన ల్యాండింగ్‌ పాయింట్‌ పైలట్‌కు కనిపించకపోవడంతో డీఎస్పీ కార్యాలయంవద్ద హెలికాప్టర్‌ దించినట్లు తెలిసింది.

helicpoter 13102018 3

‘తిత్లీ’ పెను తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో బాధితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. అనంతరం తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని, విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని చంద్రబాబు స్థానికులతో చెప్పారు.

రాజధానిలోని లింగా యపాలెం- కొండమరాజుపాలెంల మధ్య జపాన్‌కు చెందిన కునిఉమి సంస్థ, సీఆర్డీయే సంయుక్తంగా నిర్మించనున్న హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌ భవంతికి కునిఉమి సంస్థ అధ్యక్షుడు యమజాకి యసుయో, సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఈ నిర్మాణ విశేషాలను యసుమో శ్రీధర్‌కు వివరించారు. 2 ఎకరాల ప్రాంగణంలో, 1,000 చదరపు మీటర్లలో 6 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మిస్తామని, భవంతి మొత్తాన్ని పేపర్‌ కోర్‌ కోటెడ్‌ విధానంలో వాడేసిన కాగితంతో రూపొందించిన స్తంభాలపై, ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ సామగ్రితో రూపొందిస్తామని పేర్కొన్నారు.

japan 13102018 2

ఇందులో జపాన్‌ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శన శాలతోపాటు 700 మంది కూర్చునేందుకు వీలైన హాలును నిర్మిస్తామన్నారు. ప్రదర్శన శాలలో విశ్వాన్ని ప్రతిబింబించే గోళం (గ్లోబ్‌) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. దీనిని సందర్శకులు తాకి, తాము కోరుకున్న ప్రాంతాన్ని జూమ్‌ చేసి, చూసుకోగలిగే వీలుంటుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రజలకు పరిచయం చేసేందుకు సందర్శకుల హాలును వినియో గించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండ లాధ్యక్షురాలు వడ్లమూడి పద్మలత, సీఆర్డీయే ల్యాండ్స్‌ డైరెక్టర్‌ బి.ఎల్‌.చెన్నకేశవరావు, సీఈ ఎం.జక్రయ్య, ఎస్‌.ఇ. సీహెచ్‌ ధనుంజయ, సీసీడీపీ జేడీ ఎం.ఎ.క్యు.జిలానీ, కునిఉమి సంస్థ ఉపాధ్యక్షుడు అఖిలేష్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అకి ఇచిజుకా, భవంతి ఆర్కిటెక్ట్‌ సొంకె హూఫ్‌, బి.ఎస్‌.చక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

japan 13102018 3

అమరావతిని భవిష్యత్తులో సందర్శించే జపాన్‌ దేశ ప్రజలతోపాటు మన దేశీయులనూ అలరించేలా రూపొందబోతున్న ఈ పెవిలియన్‌ డిజైన్‌ను జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ షిగురు బన్‌ రూపొందించారు. పలు సుప్రసిద్ధ కట్టడాల ఆకృతులను రూపొందించిన షిగురు ఆర్కిటెక్చర్‌లో నోబెల్‌ బహుమతిగా అభివర్ణించదగిన ప్రిట్జ్‌కర్‌ ఆర్కిటెక్చర్‌ పురస్కార గ్రహీత! విశాలంగా, ప్రశాంతతకు నెలవుగా ఉండబోయే ఈ పెవిలియన్‌ను జపాన్‌కే చెందిన కుని ఉమి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్మించబోతోంది.

Advertisements

Latest Articles

Most Read