గత కొన్ని రోజులుగా, జగన్, పవన్, మన రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అంటూ హడావిడి చెయ్యటం చూసాం. వీరికి తోడు ఎప్పుడో 2015 అవినీతి మీద రిపోర్ట్ అంటూ ఒకటి చూపించి, దాంట్లో మనం ఫస్ట్ ఉన్నాం అంటూ హేళన చేస్తూ ఉండేవారు. నిజానికి 2015లో వచ్చిన రిపోర్ట్, 2014 సంవత్సరం గురించి. అయితే, ఇదే పాత రిపోర్ట్ పట్టుకుని, ఇప్పటికీ మనం అవినీతిలో నెంబర్ వన్ ఉన్నాం అంటూ హడావిడి చేస్తూ ఉంటారు. అయితే, తరువాత ఎన్నో రిపోర్ట్ లు వచ్చి, మన రాష్ట్రంలో అవినీతి తక్కువ అని చెప్పినా సరే, అదే పాత రిపోర్ట్ పట్టుకుని హడావిడి చేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు మరో రిపోర్ట్ వచ్చింది.దీంట్లో మన రాష్ట్రంలో అతి తక్కువ అవినీతి ఉందని తేలింది. ఇవి వివరాలు..

survey 12102018

నోయిడా కేంద్రంగా పని చేసే 'లోకల్ సర్కిల్స్' అనే కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్... ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియాతో కలసి 'ఇండియా కరప్షన్ సర్వే 2018' సర్వే చేసింది. తెలంగాణలో 43 శాతం మంది తమ పనులను చేయించుకోవడానికి సంబంధిత అధికారులకు లంచాలు ఇస్తున్నారు. ఏపీలో 38 శాతం మంది లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 50 శాతం, పంజాబ్ 56 శాతం, తమిళనాడు 52 శాతం మందితో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. లంచాలను అధికంగా ఇస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. 2017లో కూడా తెలంగాణ ఇదే స్థానంలో ఉంది.

survey 12102018

మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో 11వ స్థానంలో ఉంది. 2017లో ఏపీ 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది ఆంధ్రలో అవినీతి తగ్గిందని ఈ సర్వే కూడా చెప్పింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, భూమి సమస్యల కోసం తెలంగాణలో 68 శాతం మంది, ఏపీలో 50 శాతం మంది లంచాలు ఇస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది తర్వాత పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగులకు ఎక్కువ లంచాలు ఇస్తున్నారు. అవినీతిని తగ్గించడంలో ఏపీ సఫలమైందని లోకల్ సర్కిల్స్ ఛైర్మన్ సచిన్ తపారియా తెలిపారు. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు తీసుకువచ్చిన 1100 వల్ల కొంత అయితే, ఏసిబి ఆక్టివ్ గా పని చెయ్యటం మరో కారణం. మరి ఇప్పుడు జగన్, పవన్ ఈ షాక్ లో నుంచి బయటకు వచ్చి, ఏ విమర్శ చేస్తారో...

హైదరాబాద్, కర్నూలు జిల్లాలోని ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం పెట్టి, కాంగ్రెస్ కంటే ఘోరంగా, నరేంద్ర మోడీని ఇరుకున పెట్టిన దగ్గర నుంచి, మోడీ, తెలుగుదేశం పార్టీ కక్ష కట్టారనే ప్రచారం, జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సియం రమేష్ ఇంటి పై ఐటి దాడుల నేపధ్యంలో, ఆయనకు అనుకోని మద్దతు లభించింది. జాతీయ పార్టీ సీపీఐ నేత సురవరం సుధాకర్, ఢిల్లీలోని రమేష్ నివాసానికి వెళ్లి ఆయనకు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో సిపిఐ, పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తూ, ఇక్కడ విమర్శలు చేస్తున్నా, జాతీయ స్థాయిలో మాత్రం చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు.

ramesh 121020008 2

ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ బీజేపీని విభేదిస్తున్నవారి పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్వతంత్ర సంస్థలను కేంద్రం వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎవరన్నా ప్రశ్నిస్తే మోడీ తట్టుకోలేక పోతున్నారని అంటున్నారు. మరో పక్క, తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్న ఐటీ దాడులపై పలువురు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో జరిగేవి ఐటీ దాడులు కావని... కక్ష సాధింపు దాడులని ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట మార్గాన్ని ఎన్నుకున్నందుకే తమ పార్టీ నేతలు ఈ దాడులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిజాయితీగా ఉన్న తాము ఇటువంటి దాడులకు భయపడమని స్పష్టం చేశారు.

ramesh 121020008 3

ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గుర్తిస్తున్నారని, ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఏకం కావాల్సిన తరుణమిదేనని అభిప్రాయపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దాడులు జరిగితే అసలు అక్రమాలు బయటపడతాయని అన్నారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా మోదీ, అమిత్‌షా అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై నిలదీసినందుకే ప్రధాని నరేంద్రమోదీ ఏపీపై కక్ష కట్టారని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమేనని మరో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. తమిళనాడు, కర్ణాటక, యూపీ, దిల్లీలోనూ రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నికల ముందు ఇదే రీతిలో కేంద్రం దాడులు చేయించి ఘోరంగా దెబ్బతిందని దుయ్యబట్టారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన నివాసాలు, వ్యాపార సంస్థల్లో ఏకకాలంలో 60 మంది అధికారులు సోదాలు చేస్తున్ారు. హైదరాబాద్‌లోని నివాసంలో 10 మంది అధికారులు పలు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ దాడులపై ఆయన మీడియా సమావేశంలో మాట్లడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగానే, ఐటి అధికారులు సియం రమేష్ కు ఫోన్ చేసారు. లైవ్ వస్తూ ఉండగానే, రమేష్ కు ఫోన్ చెయ్యటంతో, ఆయన కూడా లైవ్ లోనే ఐటి అధికారులకు సమాధానాలు చెప్పారు.

ramesh 12102018 3

సోదాలకు మీరు తెలంగాణా అధికారులను మధ్యవర్తులుగా తీసుకెళ్ళారు, ఇది మంచి పద్ధతి కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం, మా పై ఎలా దాడి చేస్తుందో తెలియటం లేదా అంటూ ఐటి అధికారులని ఫోన్ లో అడిగారు. మీ ఉద్యోగాలకు కేంద్రం చెప్పినట్టు చేస్తారా అంటూ అధికారులని రమేష్ ప్రశ్నించారు. నా పై ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి, అనవసరంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, నా వైపు నుంచి, మా పార్టీ కార్యకర్తల నుంచి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అంటూ, ఐటి అధికారులకు చెప్పారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసినందునే తనపై కుట్రపూరితంగా ఐటీ దాడులు చేయిస్తున్నారని సీఎం రమేశ్‌ ఆరోపించారు.

ramesh 12102018 4

ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని వేధించాలని చూస్తోంది. ఆంద్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర పన్నుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడేది లేదు. కడప ఉక్కు కర్మాగారంపై దీక్ష చేసినందునే నాపై దాడులు చేస్తున్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు డిమాండ్‌తో‌ నేను దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం కేంద్రం మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి కర్మాగారం ఏర్పాటు పై నిలదీశాను. దీనికి ప్రతిఫలంగా మరుసటిరోజే నాపై ఐటీ దాడులు చేయించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే కేంద్రం ఐటీ దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది. సీఎం రమేశ్‌పై దాడులు జరుగుతాయని భాజపా, వైకాపా నేతలు కొద్దిరోజుల క్రితమే చెప్పారు. వైకాపా చెప్పినట్లే భాజపా నడుచుకుంటోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?. వారి కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు. మాపై ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేది లేదు. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు.

టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఉద్యమించినందుకే తనను, టీడీపీ నేతలను కేంద్రం టార్గెట్ చేసుకుంటోందని సీఎం రమేశ్ ఆరోపించారు. ఎన్ని దాడులు నిర్వహించినా, ఎంతగా హింసించినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నవేళ హైదరాబాద్ తో పాటు కడప జిల్లాలోని ఆయన స్వగ్రామం పోట్లదుర్తిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

kadapa 12102018 2

ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ కు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోట్లదుర్తి ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం నిరంకుశ వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్, మోదీ-కేడీ అంటూ నినాదాలు చేశారు. సీఎం రమేశ్ ఇంటి వద్దకు చేరుకుని ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అనతరం అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో.. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు – యర్రగుంట్ల రహదారిని దిగ్భందించిన టీడీపీ శ్రేణులు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

kadapa 12102018 3

బీజేపీ నేతలు కుట్రతోనే ప్రభుత్వ సంస్థలను సీఎం రమేష్‌పైకి ప్రయోగించారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. అయితే వీరు కంట్రోల్ తప్పి, ఐటి అధికారుల పై దాడుల చేస్తారేమో అని పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్సు ని దింపారు. ఇదే సందర్భంలో సియం రమేష్, అక్కడి వారితో మాట్లాడుతూ, ఏ విధమైన చర్యలకు పాల్పడవద్దని, ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపాలని, వారి పని వారిని చేసుకోనివ్వండి అంటూ పిలుపు ఇచ్చారు. అక్కడ వారికి ఏమి దొరకవని, మనలని మానసికంగా ఇబ్బంది పెట్టటానికి మోడీ పంపిస్తే వచ్చారని, అది వాళ్ళ వృత్తి ధర్మం అని, వారి పని వారిని చేసుకోనివ్వండి అంటూ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read