ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఐటీ, ఎలక్ర్టానిక్స్ హబ్గా మారనుంది. శ్రీవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్కు అనుగుణంగా పనిచేస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలించింది. ప్రఖ్యాత కంపెనీ టీసీఎల్ తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించింది. చైనాలోని షేన్జెన్లో టిసిఎల్ కంపెనీ సిఈఓ కెవిన్ వాంగ్ తో గురువారం భేటీ అయిన మంత్రి నారా లోకేష్ ..ఏపీకి టీసీఎల్ రావాలని ఆహ్వానించారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో టిసిఎల్,ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది.
టీసీఎల్ ఘనత ఇది.. సన్రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రతిష్టాత్మక ఎలక్ర్టానిక్స్ కంపెనీ టీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చైనా పర్యటనలో జరిగిన అతి పెద్ద ఒప్పందం ఇది. టీవీలు,స్మార్ట్ ఫోన్లు,వాషింగ్ మేషిన్లు, ఏసీలు, ఫ్రిజ్ల వంటి కన్సూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టీసీఎల్ కంపెనీ ఏపీకి తీసుకు రావడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిసిఎల్ కంపెనీలలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టివి ప్యానల్స్ తయారీ లో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్న టిసిఎల్ సంవత్సరానికి 80 లక్షల టివి ప్యానల్స్ తయారు చేస్తోంది.
ఎలా ఒప్పించారంటే..! చైనా పర్యటన సందర్భంగా టీసీఎల్తో కుదిరిన ఒప్పందం వెనుక మంత్రి లోకేష్ పట్టుదల, సడలని ఆత్మవిశ్వాసం ఉంది. ముందుచూపు, పక్కా ప్రణాళికతో టీసీఎల్ యాజమాన్యాన్ని ఒప్పించి, మెప్పించి ఏపీకి రప్పిస్తున్నారు. దీనికి చాలా రోజుల ముందే టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు ఇండియా వచ్చారు. అప్పుడే వీరిని కలిసిన మంత్రి లోకేష్..ఏపీలో ఐటీ, ఎలక్ర్టానిక్స్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరించారు. అప్పటి నుంచీ టీసీఎల్ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న టీసీఎల్.. ఇండియాలో ఏపీయే తమ సంస్థ కార్యకలాపాలకు అనువైన ప్రదేశమని నిర్ణయం తీసుకునేలా మంత్రి ఇక్కడి పరిస్థితులను వారికి వివరించారు.
గతంలో టీసీఎల్ ప్రతినిధులు ఇండియాకు వచ్చిన నుంచీ చైనాలో ఒప్పందం జరిగే వరకూ మాటల్లేవు, లీకుల్లేవు.. అంతా ఒక పద్ధతిప్రకారం, ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలక్ర్టానిక్స్ కంపెనీని తీసుకురావడంలో విజయం సాధించారు లోకేష్. టీసీఎల్ సీఈవోకి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి దేశంలో ఎక్కడా లేని పాలసీని తీసుకొచ్చి ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలో పనిచేస్తున్న మూడు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ఇప్పటి వరకూ దేశంలో కేవలం ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ మాత్రమే జరిగిందని, ఆంద్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని చెప్పారు.
డిజైన్ టూ డెత్ అనే మోడల్ లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్, పిసిబి, చిప్ డిజైన్, కెమెరా మాడ్యూల్స్, బ్యాటరీ ఇలా అన్ని ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని టీసీఎల్ సీఈవోకి వివరించారు. ఇండియాలో ప్రతి సంవత్సరం వినియోగిస్తున్న 500 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ లో 250 బిలియన్ డాలర్ల విలువైన కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారు చెయ్యాలి అని టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. టీసీఎల్తోపాటు, కంపెనీ విడిభాగాలు సరఫరా చేస్తున్న 15 కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అని మంత్రి కోరారు. మంత్రి ప్రతిపాదనలపై సీఈవో సానుకూలంగా స్పందించారు. అనంతరం తిరుపతిలో కంపెనీ పెట్టేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందం జరిగింది.