ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఐదోసారి ఎర్రకోట మీద మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయబోతున్నారు. ఈ టెర్మ్‌కు ఇదే ఆఖరిసారి. గతంలో ఎర్రకోట నుంచి ఆయన ఎన్నో నినాదాలు ఇచ్చారు. స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి అయోగ్ తేవడం, ప్రతి గ్రామానికీ విద్యుత్ అనేవి ఎర్రకోట నుంచి ప్రకటించినవే. అయితే 2018లో ఆయన ఏం చేయబోతున్నారు? గత నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రస్తావిస్తారా? లేకపోతే ఎన్నికల ఎజెండానే మోదీ ప్రసంగంలో హైలైట్ అవుతుందా? అనే ఆసక్తి నెలకొంది.

modi 14082018 4

పరిశీలకుల అంచనా ప్రకారం ఈసారి పథకాల ప్రకటన కంటే రాజకీయాల ప్రకటనలే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా అయితే, రేపే మోడీ ఆ ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. వ్యవసాయం, రైతులు, కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు, రూపాయి పతనం, కులం పేరుతో దాడులు, నల్లధనం కట్టడి, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్ర వైఖరి, ఇలా అనేక చోట్ల కేంద్రం పై ప్రజలు కోపంగా ఉన్నారు. అయితే, ఇవేమీ రేపు మోడీ స్పీచ్ లో ఉండే అవకాసం కనిపించటం లేదు. ఈ సారి రెడ్ ఫోర్ట్ సాక్షిగా, రాజకీయ ప్రసంగమే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

modi 14082018 3

ఎన్నికలు సంవత్సరం, అదీ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ, మరిన్ని సంక్షేమ పధకాలు ప్రకటించే అవకాసం ఉందని అంటున్నారు. ప్రజాకర్షణ పధకాలతో, రేపు ప్రధాని ప్రకటనలు చేసే అవకాసం ఉంది. ‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయనున్న ప్రసంగంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రకటించే అవకాశం ఉంది’ అని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. దేశంలోని 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కింద సంవత్సరానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. గ్రామాల్లో నివసించే 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే 2.33 కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధిని పొందనున్నాయి. మొత్తానికి దేశంలోని 50 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు అందనున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఇవేమీ కాకుండా, మోడీ ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన ఏమన్నా చేస్తారా లేదా అన్న దాని పైనే, ఎక్కువగా ఫోకస్ పెట్టి చూస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు మెరుగైన ఆరోగ్యం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.37.37 కోట్లతో బసవ తారకం మదర్ కిట్ ను అందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బసవ తారకం మదర్ కిట్ ను ఉండవల్లి ప్రజావేదిక హాలులో ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. సెప్టెంబర్ 26వ తేదీ 2016 నుండి ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 5 లక్షల 70 వేల 673 మందికి ఈ కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కిట్ల వలన తల్లీ, పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరిందన్నారు.

cbnkanuka 14082018 2

ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీ వలన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని, 2015-16 సంవత్సరంలో 42 శాతం ఉండగా, 2017-18 సంవత్సరానికి 45 శాతానికి పెరిగాయన్నారు. ప్రభుత్వం మాతా శిశువుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యల వలన శిశు మరణాల సంఖ్య 15 నుండి 11కు తగ్గిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతినెలా దాదాపు 30 వేల ప్రసవాలు ప్రభుత్వాసుపత్రులలో జరుగుతున్నాయి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు మెరుగైన ఆరోగ్యం కొరకు ప్రభుత్వం రూ 37.37 కోట్లు ఖర్చు చేసి బసవ తారకం మదర్ కిట్లను 4.50 లక్షల తల్లులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క కిట్ విలువ రూ.1038 అని, ఈ కిట్లను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

cbnkanuka 14082018 3

ఈ కిట్లలో బాలింత మహిళకు ఆరోగ్యపరంగా ఉపయోగపడే 5 వస్తువులు ఉంటాయన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ మాతృత్వ కానుకగా ఒక చీర, తల్లీబిడ్డలను చలిగాలి నుండి రక్షించేందుకు రెండు స్కార్ఫ్ లు, తల్లీబిడ్డలను వెచ్చగా ఉంచేందుకు ఒక బ్లాంకెట్, బాలింత వ్యక్తిగత పరిశుభ్రత కొరకు 40 శానిటరీ నాప్ కిన్స్ ఉంటాయన్నారు. ఆరోగ్య పరంగా బాలింత గోరువెచ్చని నీరు త్రాగాల్సిన అవసరం ఉన్నందున ఒక థర్మాస్ ఫ్లాస్క్ ఇవ్వడం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా బాలింతలలో ప్రసవానంతర ఆరోగ్యంపై అవగాహన కొరకు రూపొందించిన “తల్లి సంరక్షణ” కొరకు “బసవ తారకం మదర్ కిట్ పోస్టర్” ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ‘పిడికిలి’ గుర్తుపై ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పిడికిలి గుర్తు ఐక్యతకు చిహ్నం కాదని... తిరుగుబాటుకు చిహ్నమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై ప‌వ‌న్ విషం చిమ్ముతున్నారని జూపూడి తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కావాలనుకునే రాజ‌కీయ‌ నాయ‌కుడికి ఓర్పు, నేర్పు అవసరమని ఆయన అన్నారు. ప‌వ‌న్‌కు మెంటల్ బ్యాలెన్స్ లేద‌ని జ‌నం భావిస్తున్నారని, జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో మీ రంగు బయట పడుతుందని, ప్రజాక్షేత్రంలో సమాదానం చెబుతామని అన్నారు. మొదట్లో కులమత బేధాలు లేవన్న పవన్ ఇప్పుడు తను కాపు కులం అయినందునే చంద్రబాబు నాయుడు గౌరవించారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

pk 14082018 2

వెల‌గ‌పూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ తనకు అప్పగించిన శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. తాత ముఖ్యమంత్రిగా చేసినా, తండ్రి ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారులతో గానీ, కార్యకర్తలతో గానీ ఎంతో హుందాగా వ్యవహరిస్తారన్నారు. సీఎం అవడానికి ఎందుకు అంత తొందర, మీ తాత ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సీఎం అయ్యారని పవన్ లోకేష్‌ని అంటున్నారని, అసలు లోకేష్ సీఎం కావాలనుకుంటున్నట్లు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు ఆయనతో కలిసి ఉన్నారు లోకేష్ ఎలాంటివారో మీకు తెలియదా? అని అడిగారు. లోకేష్‌కు సంబంధించి చేస్తున్న వితండవాదాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని టీడిపీ డిమాండ్ చేస్తోందన్నారు. సీఎం పదవి అంటే వడ్డించిన విస్తరికాదని, ఉర్రూతలూగించే ప్రసంగాలు, ఆవేశంతో ఊగిపోవడం కాదన్నారు.

pk 14082018 2

ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి పని చేసిన పవన్ 25 ఏళ్ల సుదీర్ణ ప్రణాళికతో రాజకీయాలలోకి వచ్చినట్లు, తనకు సీఎం కావాలని లేదని చెప్పారన్నారు. ఇప్పుడు చంద్రబాబు, జగన్, పవన్ లలో ఎవరిని సీఎం చేస్తారని అడుగుతున్నారని, ఎవరిని సీఎం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. సమాజంపైన, భారతీయ సంస్కృతిపైన, కుటుంబ వ్యవస్థపైన, పెళ్లిళ్లపైన పవన్‌కు అవగాహన లేదన్నారు. అవగాహన ఉన్న నాయకుడిలా కనిపిస్తారని, అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించడంలేదని అడిగారు. చంద్రబాబు యూ టర్న్ తీసుకోలేదని, మోడీ తీసుకున్నారన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం సందర్భంగా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.

pk 14082018 2

ఆయన అన్న చిరంజీవి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కావడంలేదన్నారు. విభజన సమయంలో ఆయన ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి నాయకుడుగా ఉన్న పవన్ తన అన్న పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ లో కలిపినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ పోటీ అభ్యర్థుల నుంచి పొలాలు, స్థలాలు, ఇళ్లు రాయించుకొని రాజకీయాలను కలుషితం చేశారన్నారు. పవన్ ఒకసారి తనకు 5గురు ఎమ్మెల్యేలు ఉంటే చాలంటారు, అంటే అన్న 18 మంది ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి పదవి చేపట్టినట్లు రుజువు చేయడంతో తను కూడా సీఎం కావచ్చని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆయన మాటలు పొంతనలేని విధంగా ఉంటాయన్నారు. జనసేన ప్రజా రాజ్యం-2గా లేక ఆ పార్టీ అవశేషంగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

మున్సిపాలిటీలో వీధి దీపాలు వెలగకున్నా.. కుళాయిల నుంచి నీటి విడుదల సక్రమం లేకున్నా.. కాల్వల్లో పూడికలు తొలగించకున్నా.. అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా భవన నిర్మాణం జరుగుతున్నా.. తదితర సమస్యల పై గతంలో ఫిర్యాదులు అందించాలంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి అధికారులకు విన్నవించినా పరిష్కారం కాని పరిస్థితి ఉండేది. చేసిన ఫిర్యాదులకు లెక్కాపత్రం కూడా ఉండేది కాదు. దీనితో అధికారుల్లో జవాబు దారీ తనం కొరవడేది. ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ప్రతి చిన్న పనికి మున్సిపల్ కార్యాలయానికి వచ్చే పనిలేకుండా ప్రభుత్వం పురపరిపాలన పారదర్శకం చేస్తూ సాంకేతిక బాట పట్టించింది. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమూలేదు... ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపింది. ప్రజలకు “పురాసేవ” యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణ ప్రాంతాల్లో పౌర సమస్యలను నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించేలా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

నగరాలు, పట్టణాల్లో పురపాలక సంఘాల నుంచి ప్రజలు సత్వర సేవలు పొందేందుకు పురసేవ యాప్ ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా 91 రకాల సేవలను ఆన్లైన్ విధానంలో పొందవచ్చు. యాప్ ను గూగూల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి egov.ap అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్లిక్ హెల్త్, శానిటేషన్, పరిపాలన, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన సేవలను పొందవచ్చు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి చార్జీలు, బిల్డింగ్ ప్లాన్ అనుమతి, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ విభాగాలు ఈ యాప్ లో ఉంటాయి. ప్రజలు తమకు అవసరమైన విభాగాలు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆయా విభాగాలకు సంబంధించిన సమస్యలను, ఫిర్యాదులను మున్సిపాల్టీకి ఈ యాప్ ద్వారా పంపించవచ్చు.

ముందుగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రీవియన్స్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదులు మున్సిపాల్టీ ఆన్లైన్లో నమోదవుతాయి. సమస్యలు ఫొటోలు తీసి పంపవచ్చు. ఈ యాప్ ద్వారా పంపిన ఫిర్యాదులు ఏపీ మున్సిపల్ ఎంప్లాయియాప్ కు చేరుతాయి. వీటిని సంబంధిత విభాగాల ఉద్యోగులు పరిశీలించి సమస్య పరిష్కారానికి నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలి. లేక పోతే ఫిర్యాదు కమిషనర్ కు వెళుతుంది. అక్కడ కూడా మోక్షం లభించకపోతే ఉన్నత స్థాయి అధికారులకు వెళుతుంది. సరైన కారణం లేకుండా సమస్యను పరిష్కరించకపోయినా, ఫిర్యాదు స్వీకరించకపోయినా సంబంధిత ఉద్యోగుల పై చర్యలు తీసుకుంటారు.

ఈ విధంగానే ఉన్నతాధికారులు, సీఎం కార్యాలయం డాష్ బోర్డ్ కు వస్తుంది. ఈ డాష్ బోర్డ్ ను ఉన్నతాధికారులు ప్రతి రోజు పర్యవేక్షిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలిసిపోతుంది. పౌర సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. తాగునీటి పైపు లైన్లు లీకేజ్, కలుషిత జలాలు సరఫరా, సక్రమంగా తాగు నీరు సరఫరా కాకపోవడం, రహదారుల మీద గోతులు, నాశిరకం పనులు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తను తొలగించక పోవడం, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాలు, ఫుట్ ఫాత్ ల అక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన బోర్డులు, వీధి లైట్లు వెలగకపోవడం, కుక్కల బెడద, పార్కులు, క్రీడా మైదానాలు నిర్వాహణ తదితర సమస్యలను ఈ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

చేయాల్సింది ఇది... నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థల పరిధిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘పుర సేవ’ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లోని గ్రీవెన్స్ విభాగంలోకి వెళ్లి సమస్యలను నేరుగా టైప్ చేసి పంపించవచ్చు. లేదా సమస్య ఫోటో తీసి, ఆ ప్రాంతం వివరాలు రాసి పంపిస్తే సంబంధిత ఉద్యోగి మొబైల్ కి చేరుతుంది. ఫిర్యాదుపై సంబంధిత ఉద్యోగి తీసుకున్న చర్యలను తిరిగి మళ్లీ ఫోటో ద్వారా తెలియజేయడం ఈ యాప్ ప్రత్యేకత. https://play.google.com/store/apps/details?id=org.egov.myap&hl=en&rdid=org.egov.myap

ఫిర్యాదు ఇలా... * ముందుగా జిల్లాను ఎంపిక చేసుకోవాలి. * మొబైల్ నెంబర్ నమోదు చేయాలి * పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకుని నమోదు చేయాలి * అనంతరం సమస్యల నమోదుకు సంబంధించి పలు విభాగాలు కనిపిస్తాయి. * వీటిలో పరిపాలన * ఇంజినీరింగ్‌ * పబ్లిక్‌హెల్త్‌ * రెవెన్యూ విభాగాలు ఉంటాయి.

ఇవీ సేవలు.... * ఫిర్యాదులు * ఆస్తిపన్ను * ఖాళీస్థలంపన్ను * నీటి ఛార్జిలు * భవన నిర్మాణ అనుమతులు * భవన క్రమబద్దీకరణ * పౌరసేవాకేంద్రం * అత్యవసర సేవలు కనిపిస్తాయి. వీటిలో అవసరమైన విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి.

జీపీఎస్‌ ఆధారంగా ఫిర్యాదు... ఫిర్యాదుదారుడు క్షేత్రస్థాయిలో జీపీఎస్‌ ఆధారంగా ఈ విధానం పనిచేస్తుంది. ఈ నూతన విధానంలో మొబైల్ జీపీఎస్‌ విధానంలో ఫోటో అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం మెసేజ్ బాక్స్ లో , మీ ఫిర్యాదు టైపు చెయ్యాలి.

ఫిర్యాదులు పరిష్కారంలో రికార్డు... ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా పురపాలక అధికారులకు 46,157 ఫిర్యాదులు అందగా, 94.44 శాతం తో, 43,592 సంసీలు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2,565 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read