నేను చించేస్తా, నేను పొడిచేస్తా, అని ఊగిపోతూ సినిమా డైలాగులో కొట్టే పవన్ కళ్యాణ్ కు, అటు మోడీ అన్నా, ఇటు కెసిఆర్ అన్నా నోట్లో నుంచి మాట రాదు. కేవలం చంద్రబాబు మీదే తన ప్రతాపం చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు, ఇలాంటి వారిని పట్టించుకోడు. ఆయన పని, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. జగన్ లాంటి వాడి నిన్ను నడి రోడ్డు మీద కాల్చేయాలి అన్నా, విజయసాయి రెడ్డి లాంటి వాడు, చంద్రబాబు తల్లిని దుషించినా, ఎవరి పాపాన వాళ్ళే పోతారని, ప్రజలే అన్నీ గామినిస్తూ ఉంటారని వదిలేస్తారు. అందుకే, పవన్ కళ్యాణ్ లాంటి వారు, తెలంగాణా నుంచి, ఇక్కడకు వచ్చి చిందులు తొక్కుతూ ఉంటారు. నిన్న పవన్ కళ్యాణ్ తన సొంత రాష్ట్రం హైదరాబాద్ వెళ్ళిపోయారు.

lokesh 16082018 2

అక్కడ జనసేన కార్యాలయాల్లో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ, లోకేష్ పై విమర్శల వర్షం కురిపించి, కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్‌కు అనుభవం ఏది, అంటూ విమర్శలు చేసి, కేటీఆర్‌ ప్రజల నుంచి వచ్చిన మనిషి అంటూ, పొగడ్తల వర్షం కురిపించారు. నిజానికి కేటీఆర్‌ ప్రజల నుంచి వచ్చిన మనిషి కాదు, అమెరికాలో జీవినం సాగించి, రాజకీయాల్లోకి వచ్చాడు. ఏమి తెలియని కేటీఆర్‌ హడావిడి చూసే, హరీష్ వర్గం అసంతృప్తిగా ఉంది. మరి కేటీఆర్‌ లో, పవన్ కు కనిపించిన అనుభవం ఏంటో, లోకేష్ లో లేనిది ఏంటో ? లోకేష్ గత సంవత్సర కాలంగా, ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా, మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి, 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పే పవన్ అనుభువం ఏంటి ? పార్టీ టికెట్ లు అమ్ముకోవటం, పార్టీలు అమ్ముకోవటం తప్ప ? వ్యక్తిగతంగా వెళ్తే, ఇంకా చాలా అనుభవాల గురించి, మాట్లాడుకోవచ్చు.

lokesh 16082018 3

జగన్ మోహన్ రెడ్డి, ఉదయం లెగిసిన దగ్గర నుంచి చంద్రబాబు భజన చేస్తుంటే, పవన్ మాత్రం లోకేష్ భజన చేస్తున్నాడు. అదే పక్క కేటీఆర్ కు భజన చేస్తాడు. కేసీఆర్ పలాన అద్భుతం అంటాడు.చెల్లలు కవితకు ధన్యవాదాలు అంటాడు. కాని అవిశ్వాస తీర్మానంలో మద్దతు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం అన్నా, ఒక్క మాట కూడా మాట్లాడడు. దీనికి కారణాలు ఏంటో తెలియదు. ఎక్కడ లొంగిపోయాడో తెలియదు. తెలంగాణా అంటే నాకు పిచ్చి అని నిన్న పవన్ అన్నాడు. మరి తెలంగాణాలో జరిగే అక్రమాలను ఒక్క రోజు కూడా ఎందుకు ప్రశ్నించలేదు ? తెలంగాణాలో పరిమితి సీట్లలో పోటీ అంటున్నాడు, అంటే ఇక్కడే అర్ధమవుతుంది, కెసిఆర్ తో చేసుకున్న ఒప్పందం ఏమిటో. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కళ్యాణ్ ను వినియోగించుకోవాలనే యోజనలో టీఆర్ఎస్ ఉంది. దీని కోసం, ఎదో బలమైన కారణం చూపి, పవన్ కళ్యాణ్ ను కెసిఆర్ లొంగదీసుకున్నాడు. అందుకే, పాపం పవన్ కళ్యాణ్ కు ఈ పాట్లు. అటు అమిత్ షా చేతిలో, ఇటు కెసిఆర్ చేతిలో, నలిగిపోతున్నాడు.

నిత్యం అబద్ధాలతో, గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో పాటు, బీజేపీ నాయకులకు, ప్రతి సారి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గట్టి జర్క్ ఇస్తూ ఉంటారు. అబద్ధాలను, నిజాలు చెయ్యటంతో దిట్ట ఈ జీవీఎల్. అందుకే మొన్న రాజ్యసభలో, టీఎంసీ ఎంపీ ఒబ్రియాన్ మాట్లాడుతూ, ఢిల్లీలో జీవీఎల్ కు ఆధార్ కార్డు ఉంది, ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు అంటూ, జీవీఎల్ గాలి తెసేసారు. జీవీఎల్ నరసింహారావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఇలాంటి తియ్యని అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టే, ఇతన్ని రాజ్యసభలో కూర్చోబెట్టాడు అమిత్ షా..

gvl 16082018 2

అయితే, ప్రతిసారి రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేతిలో ఫూల్ అవుతున్న జీవీఎల్, ఆయన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగటం మొదలు పెట్టాడు. కుటుంబరావు గారు, ఇది వరకు స్టాక్ మార్కెట్ లో పని చేసేవారు. అది పట్టుకుని, కుటుంబరావుని "స్టాక్ బ్రోకర్" అంటూ వెటకారం చెయ్యటం మొదలు పెట్టాడు జీవీఎల్. అయితే ఇప్పుడు ఈ "స్టాక్ బ్రోకర్" పర్యవేక్షణలో జరిగిన అమరావతి బాండ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సిఆర్డీఏ అధికారుల కృషి, కుటుంబరావు సలహాలతో, అమరావతి బాండ్స్ స్టాక్ ఎక్స్చేంజి ని షేక్ చేసాయి.

gvl 16082018 3

1300 వందల కోట్ల పెట్టుబడి ఆకర్షించాలి అన్న టార్గెట్ తో విడుదల అయిన అమరావతి బాండ్లు...విడుదల అయిన గంటలో 2000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి... గంట వ్యవధిలోనే ఒకటిన్నర రెట్లు అదనంగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి.. అమరావతి బాండ్ల పట్ల మదుపరుల నమ్మకం చూరగొనడానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. ముంబయిలో సమావేశాలు నిర్వహించారు. మదుపరులు పెట్టే అసలుకి, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 10.32 శాతం వడ్డీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరుల్ని ఈ బాండ్లు బాగా ఆకర్షించాయి. జీవీఎల్ ఎగతాళి చేస్తున్న ఈ "స్టాక్ బ్రోకర్" అమరావతికి ఇంత సహాయం చేసాడు, మరి జీవీఎల్ ఏమి చేసాడు అని ప్రశ్నిస్తే ?

రాజకీయాలకు ప్రజలు బలి అవ్వటం అంటే ఇదేనేమో.. ఎక్కడ ప్రజలకు మంచి జరిగితే, ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందో అని, కొంత మంది ఎప్పుడూ మంచి కార్యక్రమాలను ఆపటానికి రెడీగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'బసవతారకం కిట్స్' పంపిణీకి సిద్ధమవుతున్న సమయంలో ఆ పథకానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది... ఈ పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ కొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా... పథకం అమలుపై స్టే విధించింది హైకోర్టు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి, దీనిపై ప్రభుత్వ వివరణ కోరుతూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు.

basava 15082018

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బసవతారకం కిట్లను పంపిణీచేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో... కిట్ల పంపిణీకి అధికారయంత్రాంగం సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా బాలింతలకు 'బసవ తారకం మదర్ కిట్‌' పేరుతో... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు ఈ కిట్లను అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ. 37.37 కోట్లను కేటాయించి ఏపీ సర్కార్... ఒక్కో కిట్ విలువ రూ. 1,038గా నిర్ణయించింది. ఈ కిట్‌లో బాలింతలకు మాతృత్వ కానుకగా ఒక చీర, రెండు స్కార్ఫ్‌లు, ఒక బ్లాంకెట్, 40 శానిటరీ నాప్ కిన్స్, ఫ్లాస్క్ అందించనుంది.

basava 15082018

చీర, ప్లాస్క్‌, స్కార్ప్‌, దుప్పటి, శానిటరీ నాప్‌కిన్స్‌...ఈ ఐదు వస్తువులను ఒక కిట్‌లో పెట్టి బాలింతలకు అందించనుంది. ఈక్రమంలో మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక హాలులో 'బసవ తారకం మదర్‌ కిట్లను' ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా కొందరు బాలింతలకు అందజేశారు. ఆ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ "ఆస్పత్రిలో అడుగుపెట్టి పురుడుపోసుకొని పండంటి బిడ్డను కన్న తల్లి. ఏ దశలోనూ ఎలాంటి ఇబ్బందికీ గురి కాకూడదని, తల్లిబిడ్డలు సంతోషంగా ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశయం"...అని చెప్పారు. అయితే ఈ పథకం అమలుకు ఎంపిక చేసిన సంస్థను నిబంధనలకు విరుద్దంగా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన క్రమంలో కోర్టు ఆదేశాలను అనుసరించి ఈ పథకం అమలు నిలిచిపోయింది. ప్రభుత్వం మాత్రం, అన్నీ పధ్ధతి ప్రకారమే చేసామని, అన్ని విషయాలు కోర్ట్ కి చెప్తామని అంటుంది.

నోరు తెరిస్తే ప్రజాస్వామ్యం, స్వేఛ్చ అంటూ మాట్లాడే బీజేపీ నేతలు, ముఖ్యంగా అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే మన ప్రధాని గారు, ఇప్పుడు మీడియా అంటే భయపడి పోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తమకు వ్యతిరేకంగా వార్తా వస్తే తట్టుకోలేక పోతున్నారు. తమకు వ్యతిరేకంగా, పేపర్ లో కాని, ఛానల్ లో కాని వార్తా వచ్చింది అంటే, చిందులు వేస్తున్నారు. మొన్నా మధ్య, హిందీ వార్తా చానెల్‌ ఏబీపీ న్యూస్‌ లో, బీజేపీకి, అదీ మోడీకి వ్యతిరేకంగా వార్తా రావటంతో, బీజేపీ పెద్దలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరకు, వీరి ఆగ్రహానికి ఆ ఛానల్ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌, యాంకర్‌ ఉద్యోగాలు ఊడిపోయాయి.

times 15082018 2

ఇందుకోసమే, దేశంలో ఉన్న ప్రముఖ ఛానెల్స్ అన్నీ, మోడీకి లొంగిపోయాయి. మోడీ, అమిత్ షా ను రంజింపచేసే కధనాలు వేస్తూ, వాస్తవానికి దూరంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. మేము తోపులం అని చెప్పుకునే కొన్ని జాతీయ ఛానెల్స్ కూడా, లొంగిపోయారు. అయితే, వీరు వాస్తవానికి దూరంగా ప్రసారం చేసే కధనాలు మాత్రం కామెడీ అయిపోయాయి. కనీసం ఏమి ప్రసారం చేస్తున్నామో కూడా, విశ్లేషించకుండా, వీరు వేసే కధనాలతో, నవ్వులాపాలు అవుతున్నారు. నిన్న టైమ్స్ నౌ అనే ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ లో, వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వెస్తాయో సర్వే వేసారు.

times 15082018 3

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారో చెప్పుకుంటూ వచ్చారు. మిగతా రాష్ట్రాలు మనకు అనవసరంగా కాబట్టి, అవి పక్కన పెడదాం. మన రాష్ట్రానికి వచ్చే సరికి, వారు చూపించిన సర్వే ఫలితాలు చూస్తూ, ముందు షాక్ అయ్యి, తరువాత పగలబడి నవ్వుతారు. ఆ సర్వే ప్రకారం, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మన రాష్ట్రంలో 7 ఎంపీ సీట్లు వస్తాయి అంట.. ఇదే పెద్ద కామెడీ అనుకుంటుంటే, కాంగ్రెస్ కు 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఈ సర్వే వేసే ముందు, కనీసం ఆ ముంబై స్టూడియో నుంచి, ఏ హైదరాబాద్ రిపోర్ట్ ని అడిగినా, ఇది ఎంత కామెడీగా ఉందో చెప్పేవాడు. అసలు కాంగ్రెస్ అనేది, మన రాష్ట్రంలో లేనే లేదు, అలాంటి కాంగ్రెస్, మన రాష్ట్రంలో 3 స్థానాలు గెలుస్తుంది అంట.. ఇక కాంగ్రెస్ సమాధి పక్కనే, గొయ్య తవ్వుకున్న బీజేపీకి, 7 వస్తాయి అంట.. ఈ సర్వే చూపిస్తే, కనీసం అమిత్ షా అయినా నమ్ముతారా ? అలాంటిది ప్రజలు నమ్ముతారని, ఈ జాతీయ మీడియా ఎలా అనుకుంటుందో ? అసలు ఇది జాతీయ మీడియా అని పిలవటానికి కూడా సిగ్గు వేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read