1300 వందల కోట్ల పెట్టుబడి ఆకర్షించాలి అన్న టార్గెట్ తో విడుదల అయిన అమరావతి బాండ్లు...విడుదల అయిన గంటలో 2000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి... ఇది ఒక రకమైన ఊచకోత, అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.. ఇది మన రాష్ట్రం మీద ఉన్న నమ్మకం... మన నాయకుడి మీద ఉన్న నమ్మకం... నిన్న బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లో, అమరావతి ప్రభంజనం చూసాం.. గంట వ్యవధిలోనే ఒకటిన్నర రెట్లు అదనంగా సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి.. ఇదే ఉత్సాహంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బాండ్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలో అమరావతి బాండ్లను లిస్ట్‌ చేయాలని భావిస్తోంది.

cbn 15082018 2

సీఆర్‌డీఏ అధికారులు అమరావతి బాండ్ల పట్ల మదుపరుల నమ్మకం చూరగొనడానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. ముంబయిలో సమావేశాలు నిర్వహించారు. మదుపరులు పెట్టే అసలుకి, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 10.32 శాతం వడ్డీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరుల్ని ఈ బాండ్లు బాగా ఆకర్షించాయి. ముంబయి నుంచి కొందరు మదుపరులు వచ్చి రాజధానిలో జరుగుతున్న పనుల్ని చూసి వెళ్లారు. ఆ తర్వాతే బాండ్లలో మదుపు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గడచిన 30-40 ఏళ్లలో దేశంలోని వివిధ మున్సిపాలిటీలు బాండ్లు విడుదల చేసి సమీకరించిన మొత్తం రూ.1800 కోట్లయితే, తాము అమరావతి బాండ్ల ద్వారా ఒక్క రోజే రూ.2 వేల కోట్లు సమీకరించామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. రాజధాని నగర నిర్మాణం కోసం ఇలా నిధులు సమీకరించడం దేశంలో మొదటిసారని పేర్కొన్నారు.

cbn 15082018 3

అమరావతి బాండ్లను ఈ నెల 27న బీఎస్‌ఈలో లిస్టింగ్‌ చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవనున్నారు. ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అమరావతి బాండ్లను బీఎస్‌ఈలో నమోదు చేశాక... సెకండరీ మార్కెట్‌లో క్రయవిక్రయాలకు వీలుంటుంది. అంటే బాండ్లు కొనుగోలు చేసినవారు... మరొకరికి వాటిని విక్రయించుకోవచ్చు. బీఎస్‌ఈలో సంస్థాగత మదుపుదారులకోసం మాత్రమే అమరావతి బాండ్లను అందుబాటులో ఉంచారు. అయితే, సామాన్య ప్రజలు కూడా, వీటిని కొనేలా, మరో మూడు నాలుగు నెలల్లో రీటెయిల్‌ బాండ్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. సాధారణ ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు వీలుగా కనీసం రూ.100 పెట్టుబడి పెట్టేలా వీటిని మార్కెట్‌లోకి తెస్తామన్నారు. వడ్డీ ఎంత ఉండాలి వంటి విషయాలపై త్వరలో ఒక స్పష్టతకు వస్తామన్నారు.

పోలవరం నిర్మాణాన్ని, అడుగఅడుగునా అడ్డుకునేది జగన్, కేవీపీ.. వీరికి కేంద్రం సహకారం ఎలాగూ ఉందనుకోండి.. జగన్, కేవీపీ మాత్రం, పోలవరం పూర్తికాకుండా, చెయ్యని ప్రయత్నం లేదు. ఎందుకు అలా అంటే, దానికి కొన్ని పాత లెక్కలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి టైంలో, పోలవరం కాంట్రాక్టు, తదితర అంశాల పై ఇద్దరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అందుకే, కడుపు మంట ఇలా చల్లార్చుకుంటున్నారు. ఇదే కడుపు మంట, స్పీకర్ కోడెల పై చూపించారు, కేవీపీ. ఇటీవల స్పీకర్ కోడెల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంలో పోలవరం పనులు 2శాతమే పూర్తయ్యాయని కోడెల ఆరోపించారు.

దీన్ని ఉటంకిస్తూ ఏపీ స్పీకర్‌ కోడెలకు ఎంపీ కేవీపీ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం పనులు 2 శాతమే జరిగాయనడం సరికాదని పేర్కొన్నారు. పోలవరం పనులు చూసి పులకించిన కోడెల.. అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లేఖ రాసినపై ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఇది కోడెల లేఖ.. " జులై 31 వ తారీఖున గుంటూరుజిల్లా రైతాంగంతో కలిసి నేను పోలవరం ప్రాజెక్టు సంర్శించటం జరిగింది. నాతోపాటు జలవనరుల శాఖా మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు వున్నారు. ఆనాడు పోలవరం ప్రాజెక్టు సందర్శించాక విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని గురించి ప్రస్తావించటం జరిగింది. దానికి స్పందిస్తూ గౌరవ రాజ్యసభ సభ్యులైన డా. కె.వి.పి.రామచంద్రరావు గారు నాకొక సుదీర్ఘమైన లేఖ వ్రాయటం జరిగింది."

"1941 నుంచి 2014 వరకు ప్రాజెక్టులో కేవలం 2 శాతం పని జరిగిందని, ఆ తరువాత ప్రస్తుత ముఖ్యమంత్రిగారి కార్యదక్షత, చొరవ వలన ప్రాజెక్టును ప్రస్తుత జలవనరుల శాఖామంత్రి గారికి అప్పగించగానే ప్రాజెక్టు 56 శాతం పూర్తయిందని నేను తెలిపినట్లు వారు ప్రస్తావిస్తూ, 1941 నుంచి 2014 వరకు ప్రాజెక్టులో కేవలం 2 శాతం పని మాత్రమే పూర్తిఅయిందని చెప్పటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఉద్దేశ్యపూర్వకంగా రాజ్యాంగపదవిలో వున్న నాచేత జాతిని తప్పుదోవ పట్టించటమేనని వారు వారి లేఖలో ప్రస్తావించటం జరిగింది. బాధ్యతాయుతమైన పదవిలో వున్న నన్ను స్వార్థరాజకీయాలకు పావుగా వాడుకోవాలనుకోవటం చాలా బాధ కలిగిస్తుందని గౌరవనీయమైన, ఉన్నతమైన స్థానంలో వున్న మీకే ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో అంటూ లేఖ వ్రాశారు. ఈ లేఖతోపాటు 2014 వరకు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో సమాచారాన్ని అనుబంధం రూపంలో ఇస్తున్నానంటూ వారు తమ లేఖకు జతచేసి పంపిస్తూ పోలవరం ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచ్చిన దగ్గరనుంచి 2014 వరకు ఎంత పని జరిగింది, ఆ తరువాత ఎంత పని జరిగింది వంటి వివరాలతోసహా శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించమంటూ వారు కోరారు."

"ఈ సందర్భంగా తెలియజేసేదేమంటే - నేను సందర్శించేనాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు 56 శాతం పూర్తికావటం అనేది అక్షరసత్యం. ఇది వాస్తవమని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సందేహం వున్నవారు ఎవరైనా సరే ప్రభుత్వ గణాంకాలు తెప్పించుకుని నిజాలు నిర్ధారించుకోవచ్చు. ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులను సమీక్షించే సందర్భంగా ఇచ్చే చాలా నివేదికలో ఏ వారానికి ఆ వారం ఆయా విభాగాలవారీగా ఎంత పురోగతి జరిగింది, ప్రాజెక్టు మొత్తమ్మీద ఎంత పురోగతి జరిగింది అనే వివరాలు పొందుపరచి వుంటున్నాయి. ఇకపోతే నేను 1941 నుంచి 2014 వరకు కేవలం 2 శాతం పని మాత్రమే జరిగిందని చెప్పటం, ప్రభుత్వం నాచేత అలా చెప్పించటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు అనుబంధంగా జతచేసిన సమాచారాన్ని చూస్తే 2005 నుండి 2012 వరకు అనేక అనుమతులు తెచ్చినట్లు తెలిపారు. అలాగే 2012 జులైలో ఎర్త్ డ్యామ్, స్పిల్ వే వర్క్ టెండర్లు ఫైనలైజ్ చేయటం జరిగిందని వారే తెలియజేశారు. అంటే ఈ విభాగాల్లో అంతకుముందు ఏమీ పని జరగలేదని వారూ ఒప్పుకున్నట్లేగా!"

"అన్ని అనుమతులు ఉన్నట్లు మీరే తెలిపారు. మరి అనుమతులుంటే హెడ్ వర్క్ పనులు ఎందుకు చేపట్టలేదు? మీరు పనులు అప్పగించిన ఏజెన్సీలు పనులు చేయలేమని ఎందుకు కాడి క్రిందపడేశాయి? కాలువలు త్రవ్వాం అని చెప్పారు. పోనీ కాలువలు పూర్తిచేశారా? లేదు. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ మట్టి త్రవ్వకం పనులు చేశారు. కాలువల మీద నిర్మించాల్సిన భారీ కాంక్రీటు నిర్మాణాలు వదిలేశారు. కనీసం మధ్యతరహా నిర్మాణాలు కూడా చేపట్టలేదు.
ఈ పరిస్థితుల్లో ఇప్పటి ప్రభుత్వం ఆర్థిక ఒడిదుడుకులు, అనేక కృత్రిమ అడ్డంకులు తొలగించుకొని పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను రూపొందించి త్వరితగతిన పూర్తిచేసి కుడి, ఎడమ కాలువలకు గోదావరి నీటిని విడుదల చేసి, రైతాంగాన్ని ఆదుకోవటం వాస్తవం కాదా."

కాబట్టి గత ప్రభుత్వం దశాబ్దకాలం (2004-2014) పాటు కేవలం అనుమతులు వచ్చాయని పులకించిపోవటమే తప్ప ఆ అనుమతులకు తగ్గట్లు పనులు చేసి, వృధాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను ఇటు కృష్ణానదికి అటు ఉత్తరాంధ్రకు మళ్ళించినట్లయితే గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల ఆయకట్టు స్థిరీకరించబడేది, అలాగే కృష్ణానదిలో ఆదాచేసిన నీరు రాయలసీమకు అందించబడేవి అంటూ ప్రతిఒక్కరూ అనుకోవటం వాస్తవం కాదా. అనుమతులన్నీ వుండి, నిధులు వెచ్చించే అవకాశం వుండి కూడా పాలకులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించటం వలన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ. 57 వేల కోట్లకు పెరగటానికి కారకులు అప్పటి పాలకులు కాదా? ఈ విషయాలన్నీ ఒకసారి పెద్దలు ఆలోచించాలి.

ఆ తరువాత వారేదో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసినట్లు, దానికి ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పలేదని, దానిపై ప్రభుత్వాన్ని ఆదేశించమంటూ కూడా కోరారు. ఈ వ్యాజ్యంపై మొదటి ప్రతివాది అయిన కేంద్రప్రభుత్వం తరఫున జలవనరులశాఖా విభాగము సెక్రటరీ గారు కౌంటరు అఫిడవిట్ దాఖలు చేసినందున కోర్టులో పెండింగ్ లో వున్నది అని తెలియవచ్చింది. ఈ విషయం న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నందున ఈ విషయంపై అతిగా మాట్లాడటం సమంజసం కాదు. న్యాయవ్యవస్థ తన పని తాను చేసుకొంటూ పోతున్నదని గమనించవలసి వుంది. అదేవిధంగా అంతకుమునుపూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మెమో ఆఫ్ అప్పియరెన్స్ లేఖను దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఇవి కోర్టు పరిశీలనలో ఉన్నందువలన మీరు ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇవ్వమని కోరటం ఎంతవరకు సబబో పునరాలోచన చేయవలసి వుంది.

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా వుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తావుంది. దీని పైన ప్రత్యేకించి ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. అలాగే ప్రత్యేకంగా జి.వో. జారీచేసి, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజానీకానికందరకు ప్రాజెక్టును స్వయంగా సందర్శించేలా భోజనాది సదుపాయాలతో సహా ఉచితంగా బస్సులను ఏర్పాటుచేసి మరీ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు ఈ ప్రాజెక్టును స్వయంగా సందర్శించి "అహో పోలవరం... అద్భుత నిర్మాణం' అంటూ కొనియాడుతున్న విషయాన్ని గమనించైనా వాస్తవ పరిస్థితులను విజ్ఞులైన పెద్దలు గ్రహించుకోవాలి.

ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, కోర్టుకు హాజరయ్యే శుక్రవారాలతో కలిపి ఇప్పటికి 237 రోజుల పాదయాత్ర చేసారు. అయితే, అత్యధికంగా పాదయాత్ర చేసింది మాత్రం, తూర్పు గోదావరి జిల్లాలో. 63 రోజులు పాదయత్ర తూర్పు గోదావరి జిల్లాలోనే సాగింది. దీనికి ప్రధాన కారణం, ఇక్కడ తెలుగుదేశం చాలా బలంగా ఉందని, అందుకే అక్కడ వారిని కట్టడి చేస్తే, దీని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని జగన్ అభిప్రాయం. వ్యూహాత్మకంగా పట్టు సాధించాలన్న ఆయన ఎత్తుగడ అంతగా పారినట్టు కనిపించలేదు. తమ అధినేత పాదయాత్రతో తూర్పు రాజకీయాలు మలుపు తిరుగుతాయని ఆశపడిన ఆ పార్టీ నాయకులకూ ఇప్పుడు అర్థంకాని గందరగోళ పరిస్థితి.

jagan 14082018 2

ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్రకు చాపకింద నీరులా చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి వెంటాడింది. ఒక పక్క కాపు రిజర్వేషన్ ల పై జగన్ సెల్ఫ్ గోల్, మరో పక్క నాయకుల్లో ఉన్న విభేదాలు. తెర వెనుక పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసినా లెక్కచేయలేదు. కొందరైతే ఆయన జిల్లాలో ఉండగానే జెండా మార్చేశారు. జగన్‌ వ్యూహాత్మకంగానో, ఆవేశపూరితంగానో చేసిన వ్యాఖ్యానాలు పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై చేసిన కామెంట్లు పెను దుమారాన్నే రేపాయి. జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైనం ఇప్పటికీ ఆ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. తుని ఘటనలో సీఎం చంద్రబాబే రైలు తగుల బెట్టించారన్న ఆరోపణ సైతం పేలలేదు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి నుంచీ స్పందన కరువు.

jagan 14082018 3

జూన్‌ 12న రోడ్‌ కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించి, బ్రిడ్జి ఊగిపోయింది అని చెప్పుకున్న జగన్, ఈ రోజు ఈ జిల్లా వదిలి, వైజాగ్ వెళ్ళే సమయానికి, తన పార్టీ ఊగిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద జగన్‌ పాదయాత్ర అనుకూల ప్రభావం చూపించడంకన్నా తలనొప్పులు తెప్పించిందనే అభిప్రాయాన్ని పలువురు విశ్లేషిస్తున్నారు. బీసీలను దరి చేర్చుకుందామన్న ప్రయత్నం రామచంద్రపురంలో గందరగోళానికి గురిచేయగా, జగ్గంపేటకు చేరేసరికి కాపులపై తన ద్వంద్వం వైఖరితో మరింత నష్టపోయారని కొందరు చెబుతున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు అన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తంకాగా, సొంత పార్టీ నాయకులను ఇబ్బందిలో పడేసిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు రైలు తగులబెట్టించారన్న ఆరోపణలు కూడా కలిసిరాకపోగా చవుకబారు రాజకీయంగా ఉందని మరికొందరు చెబుతున్నారు.

అమరావతి బాండ్లకు భారీ డిమాండ్ లభించింది. రూ.1300 కోట్లకు బాండ్లు విడుదల జరగగా బాండ్లకు రూ.2 వేల కోట్లకు పైగా డిమాండ్ వచ్చింది. మరో రూ.700 కోట్ల విలువైన బాండ్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక గంటలోనే రూ.2వేల కోట్ల బాండ్ల అమ్మకం జరగడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాతోనే అమరావతి బాండ్లను స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెట్టారు . సీఎం చంద్రబాబు సమర్థతకు నిదర్శనమే అమరావతి బాండ్లకు భారీ డిమాండ్ అని స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా మున్సిపల్ బాండ్లలో ఓ స్థానిక నగరాభివృద్ధి సంస్థ జారీ చేసిన బాండ్లకు ఈ స్థాయిలో ఆనూహ్య స్పందన రావటం ఇదే తొలిసారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

cbn 14082018 2

ట్రేడ్ వర్గాలు కూడా, ఈ స్పందన చూసి ఆశ్చర్యపోతున్నాయి. అమరావతి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న నగరమని, ఇలాంటి పరిస్థితితిలో, అమరావతి బాండ్స్ ఇంతలా అమ్ముడు పోయాయి అంటే, అది చంద్రబాబుకు ఉన్న క్రేజ్ మాత్రమే అని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మళ్ళీ చంద్రబాబు వస్తారు అనే నమ్మకం ఉండబట్టే, ఈ బాండ్లు గంటలోనే అయిపోయాయి అని అంటున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ బాండ్లు అయినా, జగన్ వస్తే, అమరావతిని రాజధానిగా మార్చేస్తారనే ప్రచారం బలంగా ఉంది. అయినా సరే, చంద్రబాబె మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వస్తారానే నమ్మకం ఉండబట్టే, గంటలోనే ఈ బాండ్లు కొనేసారు.

cbn 14082018 3

తొలివిడతగా 1300 కోట్ల రూపాయలకు సీఆర్డీఏ బాండ్లను విడుదల చేసింది. అనూహ్యంగా గంట వ్యవధిలోనే 1.5 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన అమరావతి బాండ్లు 2వేల కోట్ల రూపాయల మార్కెట్‌ను సృష్టించాయి. తొలి బిడ్‌లో 600 బాండ్లను సంస్థాగత మదుపరులు దక్కించుకున్నారు. అనంతరం గంట వ్యవధిలో అన్ని బాండ్లనూ దక్కించుకునేందుకు మదుపరులు పోటీ పడ్డారు. దీంతో బాండ్లు ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయినట్లు బోంబే స్టాక్ ఎక్చ్సేంజీలో నమోదైంది. ఇప్పటివరకూ దేశంలోని మున్సిపాలిటీలు జారీ చేసిన మొత్తం బాండ్ల విలువ 1800 కోట్ల రూపాయలైతే.. ఒక్క సీఆర్డీఏ గంట వ్యవధిలోనే బాండ్ల ద్వారా 2వేల కోట్ల రూపాయల నిధుల్ని సేకరించగలిగిందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాతోనే అమరావతి బాండ్లను స్టాక్‌మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రిటైల్‌ బాండ్లను కూడా ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read