ఒక మనిషి మీద ఉన్న నమ్మకం ఇది.. కేవలం ఆ ఒక్క మనిషి మీద ఉన్న నమ్మకంతో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, 33 వేల ఎకరాలు, ఒక్క పిలుపుతో ఇచ్చారు.. కేవలం ఆ ఒక్క మనిషి మీద నమ్మకంతో, వివిధ దేశాలు అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి.. కేవలం ఒక్క మనిషి మీద నమ్మకంతో, వివిధ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి.. ఇప్పుడే అదే మనిషి మీద నమ్మకంతో, అమరావతి మదుపరులని కూడా ఆకట్టుకుంది. అల ఇలా కాదు. రికార్డు కొనుగోళ్ళు జరిగాయి. అదీ చంద్రబాబు మీద ఇన్వెస్టర్స్ కి ఉండే నమ్మకం. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో అమరావతి కేపిటల్ బాండ్లు ఈ రోజు ట్రేడ్ అయ్యాయి.
ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ఫ్లాట్‌ఫాం ద్వారా బాండ్ల అమ్మకాలు జరిగాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఏపీ సీఆర్‌డీఏ ద్వారా బాండ్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం కోసం రూ. 1300 కోట్ల విలువైన బాండ్లను బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో ఉంచారు. అయితే విడుదలైన గంటలోనే, ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రూ.1300 కోట్ల బాండ్లు విడుదల చేయగా రూ.2వేల కోట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. గంట వ్యవధిలోనే బాండ్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యాయి. ప్రభుత్వ క్రెడిబులిటీ కారణంగానే ఇది సాధ్యమైందని సీఆర్డీఏ అధికారులు అంటున్నారు.
ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం దేశంలో మొదటి సారి అని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో పురపాలక సంఘాలన్నీ కలిపి రూ.1800కోట్లకు మాత్రమే బాండ్లు కొనుగోలు అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఓ ఇన్వెస్టర్ 600 బాండ్లను కొనుగోలు చేశారు. ఒక్కో బాండ్ విలువ రూ.10 లక్షలుగా ఉంది. అమరావతి కేపిటల్ బాండ్లకు ఆదరణ దక్కడంతో సీఆర్డీఏ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాండ్లను కొనుగోలు చేసిన వారికి 10.38 వడ్డీ చెల్లించే విధంగా బాండ్లను అమ్మకానికి ఉంచారు. బాండ్లకు ఏపీ ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇచ్చింది. బాండ్ల కొనుగోలుకు ఆదరణ పెరుగుతుండటంతో భవిష్యత్‌లో మరో రూ.700 కోట్లు విలువైన రీటైల్ బాండ్లకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.