అనుకున్నదే జరిగింది... డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో మేము బీజేపీకి ఓటు వెయ్యం అంటూ, హడావిడి చేసిన జగన్, విజయసాయి రెడ్డి, చివరి నిమషంలో ప్లేట్ మార్చేసారు. రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బుధవారం ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమని తాజాగా ప్రకటించింది. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ అభ్యర్ధి అని తెలిసినా, రెండు రోజుల నుంచి ఏమి మాట్లాడని జగన్ పార్టీ నేతలు, ఈ రోజు ప్లేట్ మార్చారు. విపక్షాల నుంచి ప్రాంతీయ పార్టీల అభ్యర్థి నిలబడితేనే ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చెప్పారని, కానీ విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిప్రసాద్ పేరును ప్రతిపాదించడంతో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.
అయితే, విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిప్రసాద్ నిలబడుతున్నారని, రెండు రోజుల ముందే అందరికీ తెలుసు. రెండు రోజుల నుంచి, మేము వోట్ వేస్తాం, బీజేపీని ఓడిస్తాం అని చెప్పిన విజయసాయి రెడ్డి, ఈ రోజు, అదీ చివరి అరగంటలో బయటకు వచ్చి, మేము కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వెయ్యం, ఓటింగ్ కు దూరంగా ఉంటాం అంటూ ప్రకటించారు. ఓటింగ్ కి దూరంగా ఉండటం అంటే, బీజేపీని గెలిపించటం అని అర్ధం. దూరంగా ఉంటే, సహజంగా మెజారిటీ మార్క్ తగ్గిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బొటాబోటీగా ఉన్న బీజేపీకి, ఇలా ఓటింగ్ కు రాకుండా ఉంటే, మెజారిటీ హాఫ్ వే మార్క్ తగ్గుతుంది.
మాములుగా అయితే జగన్ ఎప్పుడూ బీజేపీకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదే ధీమాతో అమిత్ షా ఉన్నారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ ఉన్న పరిస్థితిలో, వారితో ఎవరు ఉన్న మసి అయిపోతారు. ఆ పార్టీ ఇప్పుడు కనుక బిజెపికి మద్దతు ఇస్తే..వైకాపా,బిజెపిలు రహస్యస్నేహితులని, వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా..అధినేత 'జగన్' కేసులే ముఖ్యమనే సంగతి ప్రజలకు తెలిసిపోతుంది. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎకి మద్దతు ఇచ్చిన వైకాపా..బిజెపితో అంటకాగుతోందన్న పరిస్థితిని తెచ్చుకుంది. ఆ పార్టీ అధినేత కూడా రాష్ట్రానికి ఏమీ ఇవ్వని 'మోడీ'ని ఏమీ అనకుండా సిఎం చంద్రబాబుపై విరుచుకుపడుతుండడం, వారి రహస్య అవగానలో భాగమేనన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది.
ఈ నేపధ్యంలో బీజేపీకి ఓటు వెయ్యద్దు అని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రెండు రోజుల నుంచి విజయసాయి ప్రకటనలు చుసిన అమిత్ షా, నిన్న రాతి జగన్ కు ఫోన్ చేసినట్టు సమాచారం. "తన దైన శైలి"లో అమిత్ షా జ్ఞానదోయం చెయ్యటంతో, జగన్ కు తత్త్వం బోధపడింది. అయితే, మేము మీకు ఓటు వెయ్యలేము, మా పరిస్థితి కూడా అర్ధం చేసుకోండి, కావాలంటే ఓటింగ్ కు దూరంగా ఉండి, మీ గెలుపుకి సహాయం చేస్తాం అని జగన్ చెప్పటంతో, అమిత్ షా ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. దీంతో వెంటనే, ఈ రోజు ఉదయం మీడియా ముందుకు వచ్చిన విజసాయి రెడ్డి, మేము ఓటింగ్ లో పాల్గునటం లేదని చెప్పారు. మొత్తానికి, అమిత్ షా దెబ్బ, గట్టిగానే తగలింది.