అమరావతిలో మరొక 19 సంస్థలకు మొత్తం 51.92 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల బృందం సిఫార్సుతోపాటు సీఆర్డీయే కమిషనర్‌ పంపిన ప్రతిపాదనల ఆధారంగా వివిధ సంస్థలు, విద్యాసంస్థలకు ఈ భూమిని కేటాయించారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు 3.50 ఎకరాలను, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)కు 0.80 ఎకరాలను, భారత వాతావరణ శాఖకు ఎకరం, విదేశ్‌ భవన్‌ నిర్మాణార్థం విదేశీ వ్యవహారాల శాఖకు 2 ఎకరాలను (ఎకరం రూ.కోటి చొప్పున) కేటాయించారు. ఆర్‌అండ్‌డీ కేంద్రం, టెక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి 2 ఎకరాలు, రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇంటెలిజెంట్‌ వింగ్‌కు 2,000 చదరపు గజాలు, ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు 2 ఎకరాలు, లింగాయపాలెంలో ఏపీ ట్రాన్స్‌కో 2201132- 33 కేవీ జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి 2.59 ఎకరాలను నామమాత్ర ధరకు ఇచ్చారు.

amaravati 09052018

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 1.57 ఎకరాలను, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు 1.55 ఎకరాలను, ఇండియన్‌ బ్యాంక్‌కు 1.50 ఎకరాలను ఎకరం రూ.4 కోట్లకు కేటాయించారు. సెంట్రల్‌ చిన్మయ మిషన్‌ ట్రస్ట్‌కు 3 ఎకరాలు, రూప్‌టెక్‌ ఎడ్యుకేషనల్‌ ఇండియాకు 4 ఎకరాలు, ఎన్‌లెర్న్‌ ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 3 ఎకరాలు, సెయింట్‌ లారెన్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ట్రస్ట్‌కు 4 ఎకరాలు, సద్భావన నాలెడ్జ్‌ ఫౌండేషన్‌కు 4 ఎకరాలు, ఆనందీలాల్‌ గణేష్‌ పొదార్‌ సొసైటీకి 3 ఎకరాలు, హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీకి 8 ఎకరాలు, గ్లోబల్‌ స్కూల్స్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 4 ఎకరాలను ఎకరం రూ.50 లక్షల లెక్కన కేటాయించారు.

amaravati 09052018

సంస్థల పేర్లు మార్పు... కాగా, గతంలో అమరావతిలో భూములను కేటాయించిన కొన్ని సంస్థల పేర్లలో మార్పులు చోటుచేసుకున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది. రాజధానిలో 10 ఎకరాలను పొందిన బ్రహ్మ కుమారీస్‌ సొసైటీ పేరును ఇకపై ‘బ్రహ్మ కుమారీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ’గానూ, 50 ఎకరాలను పొందిన గ్జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పేరును ‘గ్జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’గానూ మార్చినట్లు తెలిపింది.

విశాఖపట్టణం ఎంపీ సీటు పై కన్నేసిన, A2 విజయసాయి రెడ్డి, వైజాగ్ ఫై పూర్తి ఫోకస్ పెట్టాడు.. అక్కడే ఒక ఇల్లు, ఆఫీస్ తీసుకుని, వైజాగ్ పై దండయాత్రకు రెడీ అవుతున్నాడు.. దీని కోసం, గత వారం రోజులుగా వైజాగ్ లో పాదయాత్ర చేస్తున్నాడు విజయసాయి రెడ్డి... జగన్ మోహన్ రెడ్డి పాదయత్రకు మద్దతుగా పాదయత్ర చేస్తున్నా, మీ కష్టాలు నాకు చెప్తే, నేను తీరుస్తా అంటూ వైజాగ్ వీధుల పై తిరుగుతున్నాడు... చంద్రబాబుని జైలుకు పంపుతా, కేంద్ర మంత్రిని అవుతా, రాబోయేది మా ప్రభుత్వమే అంటూ, ఏవేవో మాట్లాడుతూ ప్రజలకు చెప్తున్నాడు... అంతే కాదు, ఐఏఎస్ లు ఐపీఎస్ లను కూడా లోపల వేస్తా అంటూ, పాదయాత్రలో హల్ చెల్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డి... అసలు తాను ఎందుకు పాదయత్ర చేస్తున్నాడు, రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం చంద్రబాబు నామస్మరణ చేస్తూ సాగుతున్న విజయసాయి పాదయాత్రకు నిన్న అనుకోని జర్క్ ఎదురైంది...

vijayasayi 09052018 2

నిన్న ఒక చిన్న పాటి మీటింగ్ పెట్టి, ప్రత్యేక హోదా పై జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో, వైసిపీ పార్టీ, మోడీ పై యుద్ధం చేస్తుంది అని ప్రసంగం మొదలు పెట్టటంతో, అందరూ అవాక్కయ్యారు... అసలు మోడీ పై ఒత్తిడి తెస్తుంది మేమే, ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు అందరూ రాజీనామా చేసారు, తొందర్లోనే మా ఎమ్మల్యేలు కూడా రాజీనామా చేస్తారు అంటూ, విజయసాయి ప్రసంగం విని, ఒక యువకుడుకి చిర్రేత్తుకు వచ్చింది.. దీంతో, ఆ యువకుడు, విజయసాయి ప్రసంగానికి అడ్డు తగిలి, వాళ్ళ సంగతి తరువాత, ముందు మీరు ఎందుకు రాజీనామా చెయ్యలేదు అని విజయసాయిని ఎదురు ప్రశ్న వేసాడు... మీరు రాజ్యసభలో ఎంపీ కదా, అందరూ రాజీనామా చేస్తే, మీరు ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించాడు...

vijayasayi 09052018 3

అంతే కాదు, మీరు రాజీనామా చెయ్యకుండా, మోడీ ఆఫీస్ లో ఎందుకు ఉంటున్నారు ? అవిశ్వాస తీర్మానం అని మోడీ మీద పెట్టి, ఆ అవిశ్వాస తీర్మాన కాపీని తీసుకుని, మోడీ ఆఫీస్ కు ఎందుకు వెళ్లారు అంటూ, ఆ యువకుడు వైజాగ్ దమ్ముతో ప్రశ్నలు సందించాడు... అంతే, ఆ యువకుడుకి ఏమి సమాధానం చెప్పాలో, తెలియక, విజయసాయి అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.. ఇలాంటి వారిని ఎందుకు మాట్లాడనిచ్చారు ? మన వాళ్ళు ఉన్నారు కదా ? జగన్ పాదయత్రలో, ఇలాంటి ప్రశ్నలు వెయ్యటానికి కొంత మందిని పెట్టుకున్నాం కదా, వారిని తీసుకురమ్మంటే, తీసుకు రాకుండా, ఇలాంటి వారితో నా పరువు తీస్తారా అంటూ, అక్కడ స్థానిక నాయకుల పై, విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేసారు...

ఒకడు అంటాడు, చంద్రబాబు ఎవరు, కర్ణాటకలో బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వటానికి అని... ఇంకొకడు, ఆంధ్రా విషయాలు కర్ణాటకలో ఎందుకు, చంద్రబాబుది దిగజారుడు రాజకీయం అని... ఇక మన జగన్ పార్టీ అయితే, ఎవరన్నా బీజేపీని తిడుతుంటే చాలు, వాళ్ళ మీద దాడులు చేస్తుంది... ఇన్నీ చేసి, ఈ రోజు బీజేపీ ఏమి చేసిందో చూడండి.. మేము, ఆంధ్ర రాష్ట్రానికి ఇవి చేసాం, అవి చేసాం అంటూ కర్ణాటకలోని న్యూస్ పేపర్స్ లో పెద్ద పెద్ద యాడ్ లు ఇచ్చింది... మరి మొన్నటి వరకు, ఆంధ్రా విషయాలు తీసుకువచ్చి, కర్ణాటకలో ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటున్న బీజేపీ, ఈ రోజు, చేసింది ఏంటి ? సరే ఆ యాడ్ ఒకసారి పరిశీలిస్తే, ఒక్కటంటే ఒక్కటి కూడా, విభజన హామీల గురించి ప్రస్తావన లేదు... అన్ని రాష్ట్రాలకి, ఎలా అయితే చేసారో, ఆ పనులు గురించే గొప్పగా రాసారు...

modi add 09052018 1

ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన సంపూర్ణ అభివృద్ధికి, అన్ని అంచనాలను అధిగమించి నిరంతర కృషి చేస్తున్న మోడి ప్రభుత్వం అంటూ, ఒక పెద్ద పేజి యాడ్ ఇచ్చారు... ఇన్నాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ అబద్ధాలు అయితే ప్రచారం చేసారో, అవే అబద్ధాలు అక్కడ కూడా రాసారు... ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ సెంటిమెంట్ గా భావిస్తున్న స్పెషల్ స్టేటస్ మీద ఒక్క మాట లేదు.. పోనీ స్పెషల్ ప్యాకీజీ మీద ఒక్క మాట లేదు.. పోలవరం ప్రాజెక్ట్ కు డబ్బులు ఎంత ఇచ్చారో లేదు... అమరావతి నిర్మాణానికి ఎంత ఇచ్చారో లేదో.. రైల్వే జోన్ విషయం లేదు... ఇలా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఆందోళనలు చేపడుతున్న ఒక్క విషయంలో కూడా, ఏమి మాట్లాడలేదు...

modi add 09052018 1

మరి, తెలుగు వారు ఎందుకు బీజేపీ ఓటు వెయ్యాలి ? కమలం గుర్తు బటన్ నొక్కండి, గెలిపించండి అని, ఆంధ్రా వారిని అడిగే హక్కు బీజేపీ పార్టీకు ఉందా ? రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది, కర్ణాటక ఎన్నికల్లో, ఓడించండి అని చంద్రబాబు పిలుపు ఇస్తే, కర్ణాటకతో మీకు ఏమి సంబంధం అని ఏడ్చినా రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడు ఏ సంబంధం ఉందని, ఆంధ్రప్రదేశ్ కు ఇది చేసాం, అది చేసాం అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ? ఎందుకంటే కర్ణాటకలో దాదాపుగా కోటి మంది తెలుగు వారు ఉన్నారు.. వారిలో మెజారిటీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు.. అందుకే, ఆంధ్రా వాడి పేరు తలుచుకుంటేనే బీజేపీ నాయకులకు తడిచిపోతుంది.. అందుకే, దేశం మొత్తాన్ని ఎలా మభ్య పెడుతున్నారో, అలాగే ఆంధ్రా వారిని కూడా, కర్ణాటకలో మభ్య పెడదాం అనుకుంటున్నారు.. అయ్యా, మేము చాలా తెలివి గల వాళ్ళం... 125 ఏళ్ళు ఉన్న పార్టీకి, కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు.. మీరు ఎంత...

విజయవాడ- గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు.. నవ్యాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైనది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో నానాటికీ తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ కష్టాలను తీర్చటంతోపాటు, రాజధాని అమరావతిని ఉభయ గోదావరి జిల్లాలతో అనుసంధానం చేసే ‘విజయవాడ-గుండుగొలను’ రోడ్డు ప్రాజెక్టుకు మోక్షం కలగటం లేదు. విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టును బీఓటీ కింద కాంట్రాక్టు సంస్థ గామన్‌ తలకెత్తుకున్న దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు పరిస్థితి అతీ గతీ లేకుండా పోయింది. విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా కాజ నుంచి పెద అవుటపల్లి వరకు విజయవాడ జంక్షన్‌, మధ్యలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి వరకు ఒక పార్ట్‌ పెద అవుటపల్లి నుంచి జంక్షన్‌ వరకు జాతీయ రహదారి విస్తరణ, జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు జంక్షన్‌ బైపాస్‌లు అంతర్గత ప్రాజెక్టులుగా ఉన్నాయి.

highway 09052018 2

అప్పట్లో ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,645 కోట్లు. విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలు తీరాలంటే అతి ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టు ఇది! ఏళ్ల తరబడి గామన్‌ సంస్థ పనులు చేయలేకపోవటంతో ఈ ప్రాజెక్టును రద్దు చేయటానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు దీని వెనుక కూడా కేంద్రం కుట్ర దాగి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. విజయవాడ-గుండుగొలను రోడ్డు నిర్మాణాన్ని కావాలనే ఆపుతున్నారా? టెండర్ల దశలో అవకతవకలు, డీపీఆర్‌ తయారీ కన్సల్టెన్సీల ఎంపిక జాప్యంలో కుట్ర దాగి ఉందా? అంటే పరిస్థితులు అవుననే సమాధానాన్నే ఇస్తున్నాయి. అన్నీ సవ్యంగానే ఉన్నా టెండర్లు ఖరారు చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం, ఎన్‌హెచ్‌ అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడం ప్రాజెక్టును సందిగ్ధంలోకి నెట్టింది.

highway 09052018 3

ఈ ప్రాజెక్టుకు సంబంధించి సకాలంలో కన్సల్టెన్సీలను పిలవటం మొదలుకుని, టెండర్ల తతంగం, వాటిని ఖరారు చేసే విషయం వరకు విపరీతమైన జాప్యం జరుగుతోంది. అన్నీ సవ్యంగానే ఉన్నా వాటిని ఖరారు చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందంటే సమాధానం లేని ప్రశ్నగా మారింది. విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో పార్ట్‌-1గా ప్యాకేజీ-1, 2 పనులకు పిలిచిన టెండర్లు నేటికీ ఖరారు కాలేదు. పార్ట్‌-2 గా ప్యాకేజీ-3, 4 లకు సంబంధించి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెన్సీలనే ఎంపిక చేయలేదు. ఏమీ చెప్పలేక మౌనం వహిస్తున్న జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) అధికారులను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. జాతీయ రహదారుల సంస్థకు కేంద్రం నుంచి స్పష్టమైన మౌఖిక ఆదేశాలు వచ్చినందునే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read