సీపీఐ, సీపీఐ పార్టీలు రాష్ట్రంలో పెద్ద ఉనికి లేకపోయినా, జగన్, పవన్ తో కలిసి, వచ్చే ఎన్నికల్లో దున్నేస్తాం అంటూ స్టేట్మెంట్ లు ఇస్తూ ఉంటారు... పవన్ విషయంలో అయితే, పవన్ తో రాసుకు పూసుకుని తిరుగుతూ, హడావిడి చేస్తున్నారు... అయితే, పవన్ కళ్యాణ్ పొత్తులు ఏమి లేవని, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అంటూ వారం క్రిందట చేసిన ప్రకటనతో, కమ్యూనిస్ట్ పార్టీలు అవాకయ్యాయి.. ఇంకా బహిరంగంగా, పవన్ పై విమర్శలు చెయ్యకపోయినా, లోలోపల మాత్రం రగిలిపోతున్నాయి.. కలిసి ఉద్యమాలు చేసాం, ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేసి, సొంతగా పోటీ చేస్తాడు అంటాడు ఏంటి అంటూ, బాధ పడుతున్నాయి.. ఒకసారి పవన్ ను కలిసి , ఈ విషయంలో క్లారిటీ తీసుకుని, ఇక తమ దారి తాము చూసుకోవటానికి రెడీ అవుతున్నాయి.. ఇది ఇలా ఉంటే, జగన్ విషయంలో మాత్రం, బహిరంగంగా విమర్శలు చేస్తున్నాయి...

commuist 06052018 1

భారతీయ జనతా పార్టీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చూస్తుంటే అర్ధమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా తమ పార్టీ గెలుస్తుందని అని చెప్పుకుంటే పర్వాలేదు గానీ.. విష్ణుకుమార్ రాజు మాత్రం ప్రతిపక్ష పార్టీ వైకాపా అధికారంలోకి వస్తుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటకలో గాలి సోదరులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్టు ఇక్కడ కూడా వైకాపా.. భాజపా కలిసిపోయాయా? అని ప్రశ్నించారు. భాజపా, వైకాపా నాయకులు దీని వెనకున్న రహస్య ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

commuist 06052018 3

రాష్ట్ర ప్రయోజనాలు, హోదా కోసం ఏ రోజూ మోదీని పల్లెత్తు మాట అనని జగన్.. చంద్రబాబు మీద మాత్రం విరుచుకుపడుతూ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. వైకాపా గురించి ఆ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా భాజపా నాయకులే పొగడ్తలు కురిపిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రిస్తా అని చెప్పిన ప్రధాని మోదీ.. మైనింగ్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి కర్ణాటక ఎన్నికల్లో టిక్కెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతిని సహించనని ప్రగల్భాలు పలుకుతున్న మోదీ అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి, జగన్, బీజేపీ ని తిట్టటం లేదు అనే దాక వచ్చారు.. పవన్ కూడా ఎలాగు ఈ కోవలో వాడే కాబట్టి, త్వరలోనే పవన్, బీజేపీ తో చేసుకున్న ఒప్పందం గురించి, కమ్యూనిస్ట్ ల నోటి వెంట వినబోతున్నాం... మొన్నటి వరకు కమ్యూనిస్ట్ లు అంటే నిజాయతీ అనే జనసేన, వీళ్ళ విమర్సలకు ఎలా రియాక్ట్ అవుతుందో మరి...

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా, ఆడపిల్లల వేధింపుల విషయంలో మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా జరిగిన దాచేపల్లి ఘటనతో, చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ఆడపిల్లలను వేధించే ఆకతాయిల ఫొటోలను ఇకపై అందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో ఉంచుతాం. దీని వల్ల వారు చదువుకొనే కళాశాలలో, ఇంటి దగ్గర వారి పరువు పోతుంది. ఈ భయంతో ప్రతి యువకుడి కుటుంబ సభ్యుల్లో జవాబుదారీతనం వస్తుంది. త మ బిడ్డ తప్పుడు దోవ పట్టకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది వారి మనస్సుపై తీవ్ర చెడు ప్రభావం చూపుతోందన్నారు. విపరీతమైన మనస్తత్వం ఉన్న వారు ఆ మనోవికారంతో ఆంబోతుల్లా మారి అభం శుభం తెలియని చిన్నారులపై సైతం అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

cbn 06052018

‘ఆడపిల్లలను వేధించే ఆకతాయిల ఫొటోలను ఇకపై అందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో ఉంచుతాం. దీని వల్ల వారు చదువుకొనే కళాశాలలో, ఇంటి దగ్గర వారి పరువు పోతుంది. ఈ భయంతో ప్రతి యువకుడి కుటుంబ సభ్యుల్లో జవాబుదారీతనం వస్తుంది. త మ బిడ్డ తప్పుడు దోవ పట్టకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘దాచేపల్లి దురాగతాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కావడానికి వీల్లేదు. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ఏర్పడాలి. ఉరిశిక్ష తప్పదన్న భీతి కలగాలి. దానికోసం ఫోక్సో చట్టంలో సవరణల్ని కలెక్టర్లు, ఎస్పీలు విస్తృతంగా ప్రచారం చేయాలి’’ అని ఆయన కోరారు.

cbn 06052018

నిశ్శబ్దాన్ని ఛేదించడం ద్వారా ఎయిడ్స్‌ను నిరోధించామని, లైంగిక వేధింపులనూ అదే తరహాలో ఆడబిడ్డలు ప్రతిఘటించి తమను తాము సబలలుగా నిరూపించుకోవాలని కోరారు. దాచేపల్లి ఘటన నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం ‘‘ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం’’ పేరిట రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పనిలో పనిగా మీడియాకు సీఎం చంద్రబాబు క్లాస్‌ పీకారు. అత్యాచారానికి గురైన బాధితురాలిని ఎలా ఆదుకుంటారని ఒక విలేకరి ప్రశ్నించగా ఆయన తీవ్రంగా స్పందించారు. మీ ప్రశ్నలోనే లోపం ఉంది... మొదట అఘాయిత్యానికి పాల్పడిన దోషికి తగిన శిక్ష పడేలా చర్యలపై ప్రశ్నించాలి... ఆ తర్వాతే బాధితురాలికి సాయం గురించి అడగాలి... అని ఆయన సూచించారు. కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లలో బాలిలకపై లైంగికదాడులు జరిగితే అక్కడి ప్రభుత్వాలు సరిగా స్పందించ లేదనీ, దాచేపల్లి సంఘటనలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించిందనీ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రశంసించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తాజాగా చెప్పారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని స్పష్టం చేశారు. దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చని అన్నారు. దీన్ని ఓ జాతీయ పత్రిక ప్రచురించింది. ఆ వార్తను దియా మీర్జా రీట్వీట్‌ చేస్తూ.. ‘నాకు మీరంటే చాలా గౌరవం. మీరు చాలా మంచి వ్యక్తి’ అని పోస్ట్‌ చేశారు. బాధితురాలికి ‘వ్యక్తిగతంగా చదువుకు అయ్యే ఖర్చులను నేను భరిస్తాను. తను ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు ఆమె బాధ్యతలు చేసుకుంటాను’ అని చంద్రబాబు చెప్పడం చాలా గొప్పని అభిప్రాయపడ్డారు.

cbn bollywood 06052018 1

మరో పక్క నిన్న చంద్రబాబు, దాచేపల్లి బాధిత బాలికను పరామర్శించారు. ‘దాచేపల్లి’ బాధిత బాలికకు తాను గార్డియన్‌గా ఉండి, ఆమె చదువు పూర్తయ్యేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధిత బాలికలు, మహిళలకు అంతా అండగా నిలబడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘‘‘దాచేపల్లి’ బాలిక భవిష్యత్తు నాదే. ఇప్పటికే ప్రభుత్వపరంగా ప్రకటించిన రూ.5 లక్షల సాయానికి అదనంగా మరో రూ.5 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాం. బాలిక తండ్రికి రెండు ఎకరాల సాగు భూమి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తాం. ఆ బాలికకు గార్డియన్‌గా ఉండి.. ఎంతవరకు చదువుకొంటే అంతవరకయ్యే ఖర్చంతా స్వంతంగా భరిస్తాను. బాలిక పెద్దయ్యాక ఆమె ఆశయం నెరవేరేంత వరకు సాయం చేస్తాను’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

cbn bollywood 06052018 1

‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. చెప్పడానికి కూడా సిగ్గుపడే సంఘటన. మనకే ఈ బాధ ఉంటే ఆ బాలిక తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. బాలిక తండ్రి యాత్రకు వెళ్లి ఉన్నారు. ఆయనకు విషయం చెప్పకుండా ఆరోగ్యం బాగాలేదని చెప్పి రమ్మన్నారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇదొక నీచమైన, అమానవీయ సంఘటన. ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. ఆ నీచుడిని ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలిచ్చాను. డీజీపీ నుంచి ఎస్పీ వరకు అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి 17 బృందాలను నియమించాం. గుంటూరు జిల్లా అంతా జల్లెడ పట్టడంతో నిందితుడు పారిపోలేక ఉరి వేసుకొన్నాడు. ఇలాంటి నీచుల పట్ల ప్రతీ ఒక్కరు స్పందించడంతో పాటు ప్రతిఘటించాలి. చైతన్యం ఎంత ముఖ్యమో కాఠిన్యం కూడా అంతే ముఖ్యం. అత్యాచార కేసులను వాదించడానికి లాయర్లు అంగీకరించొద్దు’’ అని పిలుపునిచ్చారు.

2015లోనే చంద్రబాబు బయటకు ఎందుకు రాలేదు అంటే, ఇదే కారణం... ఇలా కక్షసాధించి, చంద్రబాబుని, తద్వారా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతారని తెలిసే, చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేసారు... పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రూ.1400 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మర్చి నెలలో అనుమతిచ్చింది. ఇక ఇక్కడ బీజేపీ నాయకులు చూసారా అంటూ, తొడలు కొట్టారు... అయితే, ఇచ్చిన డబ్బులని కూడా ఈ రోజు కోత పెట్టారు... కేంద్రం మరో షాకిచ్చింది... రెండు రోజుల్లోనే వెనక్కు తగ్గింది.. మార్చ్ 22 వ తేదిన, పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టింది. రూ.1400 కోట్లు ఇవ్వము అంటూ, రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని జలవనరులశాఖ ఆదేశించింది.

polavaram 06052018 2

సరేలే చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని, కనీసం ఆ డబ్బులు అన్నా ఇస్తారులే అని రాష్ట్రం ఎదురు చూసింది... మార్చి అయిపొయింది, ఏప్రిల్ అయిపొయింది, ఇప్పుడు మే నెలకు వచ్చాం... రూపాయి అంటే, రూపాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు.. ఆర్ధిక సంవత్సరం చివరిలో డబ్బులు ఇవ్వటం కుదరలేదు అని చెప్పారు.. సరే ఏప్రిల్ నెలలో ఇస్తారులే అని ఎదురు చూపులు చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఈ లోపు, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎదో ఆపరేషన్ చెయ్యటంతో, ఆయన అందుబాటులో లేరని, ఆర్దిక సంవత్సరం మారిపోయింది కాబట్టి, ఆయన అప్రూవల్ కావాలని ఆర్ధిక శాఖ అధికారులు, రాష్ట్రానికి చెప్పారు..

polavaram 06052018 3

మే నెల వచ్చినా డబ్బులు రాకపోవటంతో, అధికారులు కేంద్రానికి మళ్ళీ లేఖలు రసారు... మార్చ్ నెలలో విడుదల చెయ్యాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,089.07కోట్లు త్వరలోనే డబ్బులు ఇస్తున్నాం అని, కేంద్ర జలవనరులశాఖ ఈ మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థకు లేఖ రాసింది. రూ.1794.37 కోట్ల రుణాన్ని నాబార్డు నుంచి మంజూరు చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కోరగా, ముందు రూ.1400 కోట్లు ఇస్తాం అన్నారు, తరువాత రూ.1,089 కోట్లు మాత్రమే ఇస్తాం అన్నారు. చివరకు మూడు నెలలు అయినా, ఒక్క పైసా వదలలేదు. ఇలాంటివి ఇంకా ఎన్నో భవిషత్తులో ఎదుర్కోవాలి.. ఇంకా చాలా వస్తాయి.. సంవత్సరం టైం ఉంది.. ఇబ్బంది పెడుతూనే ఉంటారు... ప్రజలు మానసికంగా సిద్ధం కావలి...

Advertisements

Latest Articles

Most Read