మొన్నటి వరకు చాటు మాటుగా ఉన్న బంధం, బరి తెగించే స్థాయికి వచ్చింది... ఒక పక్క ఆంధ్రులు అందరూ, మోడీ పై ఆందోళన బాట పడితే, మరో పక్క వైసిపీ మాత్రం, మా మోడీ అంటూ, బీజేపీకి ప్రచారం చేస్తుంది... మొన్నటి దాక చాటు మాటుగా ఉన్న బంధం, ఇప్పుడు ఓపెన్ అప్ అయిపొయింది.. ఏమి చేసుకుంటారో చేసుకోండి, మేము బీజేపీకే మద్దతు ఇస్తాం, ప్రజల సెంటిమెంట్ మాకు అనవసరం, మాకు బీజేపీతో ఉంటేనే మా కేసులు మాఫీ అవుతాయి అని బహిరంగంగా చెప్తుంది వైసిపీ... ఏపీలోని ఆ పార్టీకి చెందిన నాయకులు కర్ణాటక వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డికి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సన్నిహితుడైన రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీ గెలుపు కోసం రోజూ ప్రచారం చే స్తున్నారు.

karnataka 0805201 1

కర్నూలు, అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు, కర్నూలు జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మొళకాల్మూరులో బి.శ్రీరాములు, బళ్లారి సిటీలో గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. రామచంద్రారెడ్డి మొళకాల్మూరులో కొన్ని వార్డులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం నుంచి వైసీపీ కార్యకర్తలను, మునిసిపల్‌ కౌన్సిలర్లను, తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. సోమశేఖరరెడ్డి తరపునా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రకు ప్రత్యే క హోదా ఇవ్వనందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేయాలని ఏపీ నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతుంటే.. వైసీపీ నాయకులు కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేస్తు న్నారు.

karnataka 0805201 1

ఇప్పటికే జగన్ పెద్ద ఎత్తున తన మనుషులని కర్ణాటక పంపించారు.. కడప, అనంతపురం నుంచి, ఇప్పటికే కొన్ని వేల మంది వైసిపీ కార్యకర్తలని, కర్ణాటక పంపించారు.. అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గునటం, చీకటి పడిన తరువాత, ఎన్నికల సమయంలో చేసే పనులు, వీళ్ళ బాధ్యత... అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి వ్యతిరేక ప్రచారం చేసే ఎవరైనా వస్తే, వారిని అడ్డుకోవటం కూడా వీరి బాధ్యత... మొన్న మహా న్యూస్, బెంగుళూరులో డిబేట్ జరుపుతుంటే, అక్కడకు వెళ్లి, గొడవ చేసి, మహా న్యూస్ మూర్తి పై దాడి చేసింది కూడా ఈ వైసిపీ కార్యకర్తలే... నిన్న అశోక్ బాబు పై కూడా దాడి చేసారు. మొత్తానికి, అమిత్ షా ని ప్రసన్నం చేసుకోవటాని, జగన్, విజయసాయి రెడ్డి, కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు... మరి, ఫలితం ఎలా ఉంటుందో, కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది...

రెండు నెలల నుంచి ఆపరేషన్ గరుడ అంటూ హడావిడి చేస్తున్నారు.. చంద్రబాబుని లోపల వేస్తాం.. లోకేష్ ని లోపల వేస్తాం.. వీళ్ళు అవినీతి చేసారు.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. అదిగో సిబిఐ, ఇదిగో సిబిఐ అంటూ హడావిడి చేసారు.. ఇంటలిజెన్స్ చీఫ్ వచ్చి వెళ్ళాడు... గవర్నర్ వచ్చి బ్రతిమిలాడి వెళ్ళాడు... కాని, చంద్రబాబు మాత్రం, ఏమి పీక్కుంటారో పీక్కోండి, ముందు మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అంటూ క్లారిటీగా క్లియర్ గా చెప్పేశారు... రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పుతాం, మీ రాష్ట్రాన్ని నాశనం చేస్తాం అంటూ హడావిడి చేస్తున్నారు.. మా చేతిలో పవన్ ఉన్నాడు, జగన్ ఉన్నాడు, మీ అంతు చూస్తాం అన్నారు.. చంద్రబాబు మాత్రం, చాలా క్లారిటీతో, ఉన్నారు.. దీంతో ఏమి చెయ్యాలో తెలియక, మళ్ళీ వెనక్కు వెళ్లారు...

kcr 07052018

అందుకే ఆపరేషన్ గరుడలో తరువాత పాత్రధారి కెసిఆర్ ఎంటర్ అయ్యాడు... ఒక పక్క బీజేపీ వ్యతికేరం అంటూ, ఫెడరల్ ఫ్రంట్ అంటూ నాటకాలు ఆడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్వాసం అంటే ముందుకు రాడు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటే ముందుకు రాడు... బీజేపీ రహ్య స్నేహితుడుగా, అమిత్ షా చెప్పినట్టు నాటకాలు ఆడుతూ, మీడియా ముందు హడావిడి చేస్తున్న కెసిఆర్, ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టు రంగంలోకి దిగాడు... ఎప్పుడో వదిలేసిన ఒక పిల్ల కేసు, మళ్ళీ దుమ్ము దులిపారు. నిన్న గవర్నర్ ని కలిసి, ఆయన దగ్గర ఆదేశాలు, ప్లాన్ తీసుకుని, ఈ రోజు ప్లాన్ ఇంప్లెమెంట్ చెయ్యటానికి రెడీ అయ్యారు... మళ్ళీ ఓటుకి నోటు కేసు అంటూ హడావిడి మొదలు పెట్టారు.. ఇదొక టుంబ్రీ కేసు అని, దీంతో చంద్రబాబు గెడ్డం మీద ఉన్న తెల్ల వెంట్రుక కూడా ఊడే పని లేదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి..

kcr 07052018

అసలు చంద్రబాబు ఫోన్ సంభాషణలో ఏముందని, కేసు పెడతారని ? ఒక నామినేటెడ్ ఎమ్మల్యేని ఫ్రీ గా ఓటు వెయ్యమని మాత్రమే దాంట్లో ఉందని, తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.. అయినా, కెసిఆర్ ఎక్కువ రెచ్చిపోతే, ఇక్కడ చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఒక్క రివ్యూ చేస్తే, ఏమవుతుందో కెసిఆర్ కు బాగా తెలుసని, పాపం ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందని కెసిఆర్ మర్చిపోయారేమో అని అంటున్నారు... వోట్ కి నోట్ అనే టుంబ్రీ కేసుకి ఇంత హడావిడి చేస్తే, ఫోన్ ట్యాపింగ్ అనే పవర్ఫుల్ కేసు ముందుకు వస్తే ఏమవుతుందో చరిత్ర చెప్తుంది అని అంటున్నారు... ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రులు రాజీనామా చేసి, జైలుకి వెళ్లిన చరిత్ర 80 వేల పుస్తకాలు చదివిన కెసిఆర్ గుర్తు తెచ్చుకోవాలని అంటున్నారు... అయినా, ఓటు కి నోటు కేసుకి భయపడితే... రేవెంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళేవాడు కాదు, చంద్రబాబు మోడీ మీద దాడి మొదలెట్టేవాడు కాదు!! ఏమి పీకుతారో పీక్కోండి!!.. బయపడటానికి వాళ్లేమయినా పవనా, జగనా..

మూడు రోజుల నుంచి, తన కుమార్తె పెళ్లి సందడిలో సరదాగా గడిపిన మంత్రి పరిటాల సునీత, అనుకోని సంఘటనతో కుప్పకూలిపోయారు. దివంగతన నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ సాబ్ హఠాన్మరణం చెందడంతో మంత్రి పరిటాల సునీత ఆసుపత్రిలోనే కళ్లుతిరిగి స్పృహతప్పి పడిపోయారు. పరిటాల రవి కుమార్తె స్నేహలత వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న చమన్‌కు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సునీత చమన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

suneeta 07052018 2

అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగానే చమన్ ఆకస్మికంగా మృతి చెందారు. చమన్ మృతి చెందారనే విషయం తెలియగానే అక్కడే ఉన్న సునీత ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు శ్రీరామ్ ఓదారుస్తుండగానే సునీత స్పృహతప్పి పడిపోయారు. వెంటనే శ్రీరామ్‌తో పాటు అక్కడున్నవాళ్లు పైకి లేపి ఆసుపత్రి బెడ్‌పై పడుకోబెట్టారు. అనంతరం వైద్యులు ఆమె ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి, చికిత్స అందిస్తున్నారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక కోసం పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.

suneeta 07052018 3

పరిటాల రవికి ఎంతో సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం... పరిటాల సునీత మంత్రి అవడంతో.. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత తన పదవికీ రాజీనామా చేశారు.

సాక్షాత్తు దేశ రాష్ట్రపతే, అమరావతి వచ్చి ఆశ్చర్యపోయి, దేశంలో అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి, మీరు వచ్చి ప్రధానికి ఈ విషయం చెప్పండి అంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పారు... అదే రియాల్ టైం గవర్నెన్స్ సెంటర్... అయితే, ఈ రోజు కేరళ, పుదుచ్చేరి, కర్నాటక, పశ్చిమ బంగ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారులు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. 15వ ఆర్థిక సంఘం పై చర్చించటానికి వచ్చారు. అయితే అంతకంటే ముందు, మీ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ చూడాలని ఉంది అని వారు కోరటంతో, చంద్రబాబు వెంటనే ఆ ఏర్పాట్లు చేసారు.. అహ్మద్ బాబుని పిలిచి, అక్కడ ఏర్పాట్లు చెయ్యమని చెప్పారు.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి సహా, మిగతా రాష్ట్రాల మంత్రులు, అధికారులు మన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లి, దాని పని తీరు చూసి ఆశ్చర్యపోయారు.. ఇది కదా మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి... ప్రతి ఆంధ్రుడు గర్వ పడాల్సిన విషయం

real 07052018 2

తరువాత, 15వ ఆర్థిక సంఘం పై చర్చించారు. ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా కేంద్ర ప్రభుత్వ తీరు వుందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకుంటోందని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు అద్దంపడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు చేస్తామంటే జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్ధికంగా పురోగతిలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించేట్టుగా వుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదని చెప్పారు.

real 07052018 3

ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ముఖ్యమంత్రి సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రించుకోవడం ద్వారా భవిష్యత్‌లో లోక్‌సభ స్థానాలు తగ్గి, రాజకీయంగా ప్రాబల్యం కోల్పేయే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థను గౌరవించాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం టీవోఆర్ ప్రకారం రాష్ట్రాలు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నాయని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే ఇలాంటి విధానాన్ని అమలు చేస్తారని, అయితే కేంద్రం ఇందుకు విరుద్ధంగా సాధారణ పరిస్థితుల్లోనూ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా వుండాలో సర్కారియా కమిషన్ స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు.

Advertisements

Latest Articles

Most Read