ఓటుకు నోటు కేసు పునఃసమీక్షించిన కేసీఆర్‌కు, జెరూసలెం మత్తయ్య ధన్యవాదాలు చెప్పారు... ఈ రోజు మీడియా సమావేశం ఉంటుంది అని, ఆ సమావేశంలో చంద్రబాబు, రేవంత్ పై మత్తయ్య ఆరోపణలు చేస్తారని మీడియాకు లీకులు ఇచ్చాయి తెలంగాణా వర్గాలు.. అయితే, మత్తయ్య మాత్రం రివర్స్ లో అటు, కేసీఆర్, కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసాడు. తనను కోవర్టుగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గన్ మెన్ ప్రయత్నం చేశాడని, తాను అందుకు ఒప్పుకోలేదని, కోవర్టుగా మారకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అతను బెదిరించాడని మత్తయ్య పేర్కొన్నాడు. క్రిష్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ను మాత్రమే బలిపశువును చేయడానికి చూశారని, తాను వారు చెప్పినట్టు వినలేదు కాబట్టే తన తమ్ముడి బంధువులను కొట్టించారని మత్తయ్య చెప్పాడు.

mattayya 08052018 2

ఓటుకు నోటు కేసుతో పాటు.. పోన్ టాపింగ్ పై విచారణ ఎందుకు జరగడం లేదని ఆయన అన్నారు.. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు మత్తయ్య పది ప్రశ్నలు సంధించారు.. 1.ఓటుకు నోటు కేసుతో పాటు.. పోన్ టాపింగ్ పై కూడా దర్యాప్తు జరగాలి... 2. ఎమ్మల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు, ఎమ్మల్యేలను కొనటానికి చూసాయి, మీ ట్యాపింగ్ లో ఆ విషయం బయట పడింది కదా, అందరి మీద దర్యాప్తు చెయ్యండి...3. నీ కుమారుడు కేటీఆర్, ఇద్దరు మంత్రులు, ఇద్దరు మీడియా ప్రతినిధులు, నాకు ఎందుకు డబ్బులు పంపారో, సమగ్ర దర్యాప్తు చెయ్యాలి... 4. చంద్రబాబు పేరు చెప్పలేదని, నా బంధువలని ఎందుకు కొట్టించావు ? దాని పై కూడా విచారణ జరిపించు... 5.క్రిష్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ను మాత్రమే ఎందుకు బలిపశువును చెయ్యటానికి చూస్తున్నారు ?

mattayya 08052018 3

6. కోర్ట్ కి పంపించ వలసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలు, కేవలం టీ న్యూస్, సాక్షి కి మాత్రమే ఎందుకు పంపారు ? ఏసిబి పై ఈ విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ? 7. మిగతా ఎమ్మల్యేలు కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ లో ఉంటే, కేవలం క్రిష్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ను , ఎందుకు టార్గెట్ చేసారు ? 8. నన్ను నీ కొడుకు బెదిరించాడు, దాంట్లో నీ పాత్ర ఏంటి ? ఏపి ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకోకుండా ఎందుకు పారిపోయావు ? 9. ఫోన్ ట్యాపింగ్ పై, RTI వేసినా ఎందుకు ఇవ్వలేదు ? 10.ఈ వివాదంలో ప్రాధాన పాత్రదారి జిమ్మిబాబుని ఎందుకు విచారించలేదు ?

2017లో, గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలు, ఎలాంటి భూసేకరణ బిల్లు అయితే కేంద్రానికి పంపారో, అలాంటి బిల్లే ఆంధ్రపదేశ్ రాష్ట్రం కూడా కేంద్ర ఆమోదానికి పంపింది... అయితే అప్పట్లో, గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలు ఇలాంటి భూసేకరణ బిల్లు పెడితే, వెంటనే ఆమోదించింది కేంద్రం... ఒక్క క్లాజులో కూడా మార్పులేని, ఇదే బిల్ మనం కూడా పెట్టాం... కాని మనకి స్పెషల్ ట్రీట్మెంట్, దాదాపు 6 నెలల నుంచి, పెండింగ్ లో పెట్టి, అక్టోబర్ 2017లో కుదరదు, దీనికి వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అని బిల్లుకు బ్రేక్‌ వేసింది కేంద్రం... ఒక్క క్లాజులో కూడా మార్పులేని తెలంగాణా బిల్లు, గుజరాత్ బిల్లు మాత్రం ఏ ఒక్క శాఖకు పంపకుండా నేరుగా ఆమోదం తెలిపింది. .

kendram 08052018

మాకు ఎందుకి ఇలా జరుగుతుంది, మీ ప్రశ్నలకు అన్నీ సమాధానం చెప్పాము కదా, మాకు ఎందుకీ వివక్ష అని రాష్ట్రం అడిగితే, ఆ రాష్ట్రాల బిల్లులు మా శాఖకు కేంద్రం పంపలేదు, మీదే వచ్చింది అని కేంద్ర వ్యవసాయశాఖ సమాధానమిచ్చింది... ఈ బిల్లు ఆమోదం పొందక పొతే, అమరావతి నిర్మాణం కూడా హోల్డ్ లోకి వెళ్తుంది... అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ కూడా ఆలస్యం అవుతుంది అని స్వయంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, వెళ్లి జనవరి నెలలో మోడీకి చెప్పారు.. అయినా మార్పు లేదు.. ఇలా ఒక రాష్ట్రాన్ని ఒకలా, మరో రాష్ట్రాన్ని మరోలా కేంద్రం చూస్తుంటే, దీని అర్ధం ఏంటి, అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ లోపు, చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో, సీన్ మొత్తం మారిపోయింది... దీంతో అధికారులు, దీని పై నిత్యం సంప్రదింపులు జరపటం మొదలు పెట్టారు.. కేంద్ర అధికారులు ఎన్ని తిప్పలు పెట్టినా, వారికి సమాధానం చెప్తూ, ఓర్పుగా ముందుకు వెళ్లారు.. ఇక బిల్ ఆమోదించక తప్పని పరిస్థితి వచ్చింది.

kendram 08052018

ఏపీ అధికారులు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సత్పాల్‌సింగ్‌కు పూర్తి వివరణలు ఇచ్చారు. భూసేకరణ బిల్లుకు సవరణలు చేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లును రూపొందించినట్లు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టడం వల్ల ఆహార భద్రతకు ముప్పేమీ రాదని, రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వివరణలతో సంతృప్తి చెందిన హోంశాఖ అధికారులు ప్రస్తుతం అంతిమ ఆమోదం కోసం న్యాయశాఖకు పంపినట్లు తెలిసింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ఆమోదముద్ర వేస్తే తదుపరి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండువారాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామంతో, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం షాక్ అయ్యింది.. ఈ బిల్ ఆమోదించరు అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన తరుణంలో, కేవలం అధికారుల జవాబులతో, ఆమోదం పొందటం, సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న బిల్ కు గ్రీన్ సిగ్నల్ లభించటంతో, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, కేంద్రంలో ఎందుకో ఇంత సడన్ మార్పు అని మాట్లాడుకుంటున్నాయి.. ఎందుకంటే, ఈ చట్టం ఆమోదం పొందితేనే, ఎన్నో ప్రాజెక్ట్ లు ముందుకు వెళ్ళే అవకాసం ఉంది...

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ సాబ్ గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ రోజు, రేపు కలెక్టర్స కాన్ఫరెన్స్ ఉండటంతో, చంద్రబాబు అంత్యక్రియలకు వెళ్ళటం కుదరక, ఫోన్లో చమన్ భార్య రమీజాబీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం మాట్లాడారు. చమన్ భార్య రమేజాబీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. చమన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా నేను ఉన్నా అంటూ చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు.. కాగా, చమన్ చిరకాలవాంఛ తెలుసుకుని, చంద్రబాబు అది తీరుస్తా అని హామీ ఇచ్చారు... చమన్ చిరకాలవాంఛ, అయిన కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ చెయ్యటం..

chaman 087052018 2

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని, డాక్టర్ ను చేస్తాని, ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిటాల రవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చమన్ మృతిపట్ల పరిటాల అభిమానులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. చమన్‌ ప్రస్థానం గీత కార్మికుడిగా మొదలైంది. పరిటాల రవితో పరిచయం.. 1993లో రవి తెదేపాలో చేరడంతో నాటి నుంచి చమన్‌ కూడా ఆయన వెంట నడిచారు. రవీంద్ర అనుచరుడిగా పెనుకొండ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పునర్విభజనకు ముందు పెనుకొండ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పరిటాల వర్గీయులపై దాడులు మొదలవడంతో రవి సూచనతో అజ్ఞాతంలోకి వెళ్లారు. రవి ప్రధాన ప్రత్యర్థి మద్దలచెరువు సూరి హత్య తర్వాత పరిణామాలు మారిపోవడంతో 2012లో అజ్ఞాతం నుంచి చమన్‌ బయటకు వచ్చారు.

chaman 087052018 3

సోమవారం రామగిరి మండలం వెంకటాపురంలో సొమ్ముసిల్లి కుప్పకూలిన చమన్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్సలు చేస్తుండగానే చమన్‌ తుది శ్వాస వదిలారు. గుండెపోటు రావడంతోనే ఆయన మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. చమన్‌ మరణవార్త వినగానే మంత్రి పరిటాల సునీత విలపిస్తూ కుమారుడు శ్రీరామ్‌ చేతుల మీద సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న వైద్యులు హుటాహుటిన ఆమెకు చికిత్సలు అందజేశారు. అనంతరం మంత్రిని కలెక్టర్‌, డీఐజీ, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత చమన్‌ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం రామగిరి మండలం ఆర్‌.కొత్తపల్లికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇప్పటి వరకు, 15వ ఆర్థిక సంఘం విషయంలో, నిధుల విషయంలోనే అన్యాయం జరుగుతుంది అని అందరూ భావించారు.. నిన్న జరిగిన 7 రాష్ట్రాల సమావేశంలో, దక్షిణాది రాష్ట్రాలని ముంచేసే మరో కుట్ర కూడా చర్చలోకి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం 2011, జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని, దక్షినాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ విషయంలో మాత్రమే కాదు, ఇదే జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని, భవిష్యత్తులో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకూ ఆ లెక్కల్నే పరిగణనలోకి తీసుకుంటాయని, నిన్నటి సమావేశం అభిప్రాయ పడింది. ఇది జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

south 08052018 2

‘దక్షిణాదిలో ఇప్పుడు 100 లోక్‌సభ స్థానాలున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే వీటి సంఖ్య 70కో, 50కో పడిపోతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల గొంతు ఈ మాత్రం కూడా వినపడదు. ఈ రాష్ట్రాలను ఎవరూ పట్టించుకోరు’ అని చంద్రబాబు వాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం నుంచే రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బతీయడం మొదలైందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాడటం తెదేపాకు కొత్త కాదని, ఎన్టీఆర్‌ హయాంలోనే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పోరాటం సాగించామని చంద్రబాబు తెలిపారు. దాని ఫలితంగానే సర్కారియా కమిషన్‌ ఏర్పాటైందని చెప్పారు.

south 08052018 3

ఈ రోజు జరిగుతున్న కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ విషయంలో కూడా చంద్రబాబు ఈ విషయం ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం తీరును గమనిస్తే మరింత బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటాననడం విచారకరమన్నారు. జనాభా నియంత్రణ కోసం నాడు తెదేపా హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించామన్నారు. 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం వుందన్నారు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుందని, కొత్త ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు మరింత నష్టం కలుగుతుందన్నారు. అటు విభజన వల్ల, ఇటు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు.

Advertisements

Latest Articles

Most Read