ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ‘ధర్మ పోరాట దీక్ష’ చేస్తున్నారు. తన పుట్టిన రోజైన ఈనెల 20వ తేదీన బాబు దీక్ష చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటలపాటు నిరశన దీక్ష చేస్తారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సుమారు 150 మంది చంద్రబాబుతో దీక్షలో పాల్గొంటారు. 68ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేపడుతున్న ఈ దీక్షకు ప్రజలంతా మద్దతివ్వాలని ప్రభుత్వం కోరింది. కేంద్రం పై ఒత్తిడి తేవాలని, ప్రజలంతా కలిసి రావాలని, అలాగే, అఖిల పక్ష నేతలను కూడా దీనికి ఆహ్వానించారు... రేపు చంద్రబాబు, కేంద్రం పై ఒత్తిడి తెచ్చే దీక్ష చేస్తుంటే, రేపు మాత్రం జగన్ ఏమి చేతున్నాడో తెలుసా ?
ఇంకా అర్ధం కాలేదా అండి ? రేపు శుక్రవారం.. భూమి, ఆకాశం ఏకం అయినా, మనోడు రేపు ఎక్కడ ఉంటాడు ? నాంపల్లి కోర్ట్ లో జడ్జి గారి ముందు... దీని కోసం, ఇప్పటికే చెక్కేసాడు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది ? బస్సులో వెళ్ళే మనమే, నాలుగు గంటల్లో హైదరాబాద్ వెళ్తున్నాం... ఈయనగారు, కార్లు వేసుకుని వెళ్తాడు... మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ట్యాగ్ ఒకటి ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ కు కూడా ఫ్రీ చేస్తారు... గట్టిగా కొడితే, మూడు గంటల్లో హైదరాబాద్ లో ఉంటాడు... అలాంటిది, ఒక్క రోజు ముందే ఇంటికి వెళ్ళటం ఏంటి ? అసలు ఇలాంటి పాదయత్ర ఎక్కడన్నా ఉంటుందా ? రెండు రోజులు వెళ్లి లోటస్ పాండ్ లో డొల్లుతాడు... మసాజ్ లు, ఫేషియల్ లు చేపించుకుని, రెస్ట్ తీసుకుని, హాయగా రెండు రోజులు ఎంజాయ్ చేసి, మళ్ళీ పాదయాత్ర అంటాడు...
తిరిగి వచ్చి చంద్రబాబు మోసం చేసాడు, చంద్రబాబు అవినీతి చేసాడు అంటూ ఊదరగొడతాడు... ఇదండీ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పరిస్థితి...నేడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా, కేంద్రం పై యుద్ధం ప్రకటించి, నిరసనగా దీక్ష చేస్తున్నారు... అదీ తన పుట్టిన రోజు నాడు.. మరి, మన ప్రతిపక్ష నాయుకుడు ? శుక్రవారం వస్తే కోర్ట్ కు వెళ్ళాలి.. సంతకం పెట్టి రావాలి.. విచారణ ఎదుర్కోవాలి.. ఏదన్న తేడా వస్తే, కోర్ట్ అరెస్ట్ చేసే లోపల ఉండమంటుంది... బెయిల్ పై బయట తిరుగుతున్నాడు... అంతా కేంద్రం దయ.. అందుకే, ఇవ్వాల్సిన మోడిని ఒక్క మాట కూడా అనడు.. ఆయనేమో రాష్ట్రం కోసం ధర్మ పోరాటం చేస్తుంటే, ఈయనేమో అవినీతి ఆరాటం... ఇది వరుస..