మోడీ ..నేను హిందీలో మాటాడతన్నా నీకు అర్థం కావాలని ..తెలుగు నేర్చుకో నువ్వు.. నీ గానా బజానా బ్యాచ్ ..షా లాంటి వాళ్ళ మాటలు కాదు ..జనాల మాటలు విను.. దేనికైనా ఒక హద్దుంటది జాగ్రత్త..ఇది నా వార్నింగ్... ఇది బాలయ్య ఉతికిన ఉతుకుడు... ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో చేపట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’కు మద్దతుగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎంతో మంది వీర పుత్రులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మనదని, ఎంతోమంది ప్రవక్తలు పుట్టిన వేధభూమి మనదని, పల్నాటి బ్రహ్మనాయుడు నడయాడిన నేలమనదని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, వాళ్ల గుళ్లకు గుండెను ఎదురొడ్డిన జగజ్జట్టీలకు జన్మనిచ్చిన పోతుగడ్డమనదని బాలయ్య వ్యాఖ్యానించారు. పద్యపాటవాల్లో మగవారికి ధీటుగా మోగించిన మగువల పుట్టినిల్లు మనదని, కళారంగాలలో ఘనతకెక్కిన వీరమాతల, వీరవణితల కన్న పుణ్యభూమి మనదని ఆయన వ్యాఖ్యానించారు.

balayya 200042018

మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీథుల్లో తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం 1982లో నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి... 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీ, వెనుకబడిన తరగతుల కులాలను పైకితీసుకువచ్చి అధికారపీఠంపై కూర్చోబెట్టిన మహానుభావుడు ఎన్టీరామారావని బాలయ్య కొనియాడారు. పేదవాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని అన్నారు. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వలన లోటు బడ్జెట్‌తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను తన అనుభవంతో చంద్రబాబునాయుడు అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళుతున్నారని, ఇలాంటి సమయంలో ఏపీని అన్నివిధాలా ఆదుకుంటుందని, సహాయ సహకారాలు అందిస్తుందన్న ఆశతో టీడీపీ, ఎన్డీయేతో పొత్తుపెట్టుకుందని బాలకృష్ణ అన్నారు. దాన, బేదాలు అయిపోయాయని, ఇప్పుడు దండోపాయం జరుగుతుందన్నారు. మోదీ తెలుగు నేర్చుకోవాలన్నారు. మోదీ ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని, ఆంద్రప్రదేశ్ అని ఆయన అన్నారు. రాజకీయాల్లో మోదీ కంటే చంద్రబాబు సీనియర్ అని, అనుభవజ్ఞులను ఎలా గౌరవించాలో మోదీ నేర్చుకోవాలని బాలయ్య సూచించారు. సామాన్య, పేద ప్రజల అవసరాలు ఏమిటో మోదీ తెలుసుకోవాలన్నారు. ఈ విషయాలన్నీ మోదీకి అర్థమయ్యే విధంగా బాలకృష్ణ హిందీలో మాట్లాడారు.

balayya 200042018


మోదీ ఉత్తర, దక్షిణ భారత దేశం అంటూ రాష్ట్రాల్లో విబేధాలు సృష్టిస్తున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు. తెలుగువారు పిరికివాళ్లు కాదని, తెలుగువారి సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. ప్రధాని ఎవరెవరితోనో కుప్పిగెంతులు వేయిస్తూ, చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా మట్టి, నీళ్లు ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చివరిగా రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం అంటూ బాలకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పోటీగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలోనే మకాం వేసి, గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆయనను ఒక నమ్మక ద్రోహిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, ముఖ్యమంత్రి చంద్రబాబులను ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా ఇస్తామంటూ మోడీ ప్రామిస్ చేశారు...

cbn 200042018

అయితే, చివరకు ప్రత్యేక హోదాతో పాటు చంద్రబాబును కూడా తొక్కేసే ప్రయత్నం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ తరహాలో మన రాష్ట్రానికి కూడా ఎలాంటి హామీలనైనా ఇవ్వడానికి మోదీ ఏమాత్రం సంశయించడం లేదని చెప్పారు. ఇప్పటికే బెంగళూరు గర్వించదగ్గ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి రాఫెల్ కాంట్రాక్టును ఇతర ప్రాంతానికి తరలించారు అంటూ ట్వీట్ చేశారు. తద్వారా మోడీ ఇచ్చే హామీలను కర్ణాటక ఓటర్లు నమ్మవద్దని కోరారు... ఇప్పటికే కర్ణాటకలోని తెలుగు ప్రజలు, బీజేపీకి వోట్ వెయ్యద్దు అంటూ, ప్రచారం సాగుతుంది. సోషల్ మీడియా వేదికగా, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై, మోడీకి దిమ్మ తిరిగేలా తీర్పు ఇవ్వాలి అంటూ, ప్రచారం చేస్తున్నారు...

cbn 200042018

ఇది సిద్ధరామయ్య పెట్టిన ట్వీట్లు PM promised special status to Andhra Pradesh but let down the state & Shri Chandrababu Naidu @ncbn.. For Karnataka the PM didn’t even bother to promise anything...Instead he took away Rafael contract from Bengaluru’s pride the Hindustan Aeronautics Limited. #KarnatakaDefeatsBJP Our people will vote performance & not promise. @BSYBJP failed the one chance given him & now he is promising corruption free governance! PM @narendramodi promised to bring black money back & deposit 15 lakhs in each family’s bank account. Not a rupee came.#KarnatakaDefeatsBJP

చంద్రబాబు నాయుడు, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు...ఆయన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం అలాంటిది మరి... 68వ ఏట అడుగుపెడుతన్న మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలతో...

అది 1950వ సంవత్సరం ఏప్రిల్ 20.. చిత్తూరు జిలాలోని నారావారి పల్లెకు తెలీదు ఆ రోజు తమ ఊరిలో ప్రపంచ స్థాయి నేతకి జన్మ స్థలం అయ్యింది అని... చంద్రిగిరిలోని హై స్కూల్ అనుకుని ఉండదు, రోజు కిలోమీటర్లు దూరం నడిచి వచ్చి, తన స్కూల్ లో చదువుకున్న ఆ విద్యార్ధి రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు అవుతాడు అని.... తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ ఉహించి ఉండదు, తన దగ్గర చదివిన స్టూడెంట్ దేశం గర్వించే నాయకుడు అవుతాడు అని.... ఆయన ఒక సామన్యుడు, ఏ రాజకీయ నేపధ్యం లేనివాడు, తండ్రి ఒక అయిదు ఎకరాలు సాగు చేసుకునే సామాన్య రైతు, తల్లి ఒక కష్ట జీవి...ఆయన మాత్రం నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను శాశిస్తూ, అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు...ఆయనే నారా చంద్రబాబు నాయుడు..

నారావారి పల్లె లాంటి మారు మూల గ్రామంలో పుట్టిన అతి సామాన్యుడు, తిరిగులేని శక్తిగా ఎలా మారారు...గవర్నమెంట్ స్కూల్ లో చుదువుకున్న ఒక సామాన్య కుర్రవాడు, టైమ్స్ మాగజైన్ లో స్పెషల్ స్టొరీ వేసే స్థాయికి ఎలా చేరాడు....క్లింటన్, టోనీ బ్లెర్ లాంటి దేశాధినేతల మనసు ఎలా దోచుకున్నారు....బిల్ గేట్స్ లాంటి కార్పొరేట్ దిగ్గజాల్ని ఎలా ఆకట్టుకున్నారు....

దేశం మొత్తం మీద, సారీ ప్రపంచం మొత్తం మీద 24/7 ప్రజా నాయకుడు అంటే ఆయనే...వ్యక్తిగత జీవితం లేదు, ఒక సరదా లేదు, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చెయ్యటం లేదు...67 ఏళ్ళ వయసులో మనవడితో ముచ్చటించలేని స్థితి ఆయనది....ఆయన ఎంజాయ్ చేసేది అయన పనిని, అయన కష్టాన్ని...పొద్దున్న లెగిసిన దెగ్గర నుంచి, పడుకునే దాక, విశ్రాంతి అనేది ఉండదు ఆ మనిషికి....రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం స్వరూపం మొత్తం తెలుసు ఆయన డెబ్బైల్లో రాజకీయాలు చూసారు, ఎనభైల్లో రాజకీయాలు చూసారు, తొంబైల్లో రాజకీయాలు చూసారు, ఇప్పుడు 2017 రాజకీయాలు చూసారు...పాతికేళ్ళకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికి 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది... అందుకే ఆయనను రాజకీయ అపర చాణిక్యుడు అంటారు...అయన చూడని ఎత్తులు లేవు, ఆయనకి ఎదురైన అవరోధాలు లేవు...అన్ని తట్టుకుని ముందుకు సాగరు, సాగుతూనే ఉన్నారు....రాష్ట్ర రాజకీయం కాదు, కేంద్ర రాజకీయ్యాల్లో కుడా ఆయనకి ప్రత్యేక స్థానం ఉంది...

రాజకీయాల్లో పోలిటీషియన్ లే ఉంటారు, కాని ఆయనను అడ్మినిస్ట్రేటర్గానే ప్రజలు గుర్తిస్తారు....రాష్ట్రానికి IT పరిచియం చేసిన హై-టెక్ CM ఆయనే, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేత గా, మళ్ళి ఇప్పుడు నవ్యాంధ్ర మొదట ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ఎవరకి లేని అవకాశం ప్రజలు ఆయనకి ఇచ్చారు...

ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రం నాయుడు, దేవినేని రమణ, పరిటాల రవి లాంటి ఎంతో ముఖ్యమైన నాయకులు చనిపోయినా...రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన రాజకీయం, 2012 జగన్ హవా, 2014 రాష్ట్ర విభజన, 2015 లో తెలంగాణాలో కెసిఆర్ పెట్టిన ఇబ్బందులు....ఇలా అన్ని దెబ్బలు తగిలినా, మళ్ళి లెగుస్తారు, సరిచేసుకుంటారు, మళ్ళి మొదలు పెడతారు..అది ఆయన స్టైల్.... ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, పోరాట పటిమ అస్సలు తగ్గకుండా, అంతే వేగంతో దూసుకు వెళ్తున్న పొలిటికల్ మిస్సైల్ ఆయన...ఆయన నినాదాలతో పార్టీ రూపు రేఖలను, ఆయన విధానాలతో రాష్ట్ర అభివ్రుది రూపు రేఖలను మార్చేసిన ఘనుడు ఆయన....సంస్కరణలు అంటే ఏంటో దేశానికి చెప్పి, గవర్నమెంట్ అంటే ఎలా పని చెయ్యాలో చేసి చూపించారు.... జన్మభూమి, ప్రజల వద్దకు పాలనా అంటూ, నిద్రపోతున్న ఉద్యోగులను పరుగులు పెట్టించిన నాయకుడు ఆయన... ఇప్పుడు ఏమి లేని నవ్యాంధ్రకి పెద్ద దిక్కు ఆయనే... పెట్టుబడిదారులకు అయస్కాంతం ఆయన... ఆయన పడుకోడు, ఎదుటివాళ్ళని పడుకోనివ్వరు... పని పని పని....అదే ఆయన బలం... ఇంత పనిలో కుడా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు... చక్కటి ఆహరం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా... ఇదే ఆయన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్.... క్రమశిక్షణ, కష్టపడటం, నిజాయితీ ఇది ఆయన సక్సెస్ సీక్రెట్.... నాయకత్వం అంటే కేవలం జనాలని సమీకరించటం కాదు, జనాల్ని చైతన్య పరచటం...

ఇది ఆయన వ్యక్తిగత జీవన ప్రస్థానం...

1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా, నారావారి పల్లెలో తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మన్నమ్మ కు జన్మించారు చంద్రబాబు...డిగ్రీ చదివే రోజుల్లోనే కాలేజి రాజకీయాల్లో అడుగుపెట్టారు. డిగ్రీ కంటే ముందే, కాంగ్రెస్ పార్టీలో చేరారు...ఆచార్య ఎన్జీరంగా, పాతూరి రాజగోపాల్ అయన రాజకీయ గురువులు...
1978 ఎన్నికలలో చంద్రబాబుకి MLA టికెట్ ఇచ్చారు. 28 ఏళ్ళకే, 1980-83 మధ్య మంత్రిగా పనిచేసారు.
చంద్రబాబుకి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు..
ఆయనకి కష్టం అనేది చిన్ననాటి నుంచే పరిచయం...ఆయన స్కూల్ కి రోజు అయుదు కీ.మీ నడుచుకుంటూ వెళ్ళే వారు...
1980 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిగింది.
1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి భాద్యతలు అప్పగించారు.
అధినేతగా పార్టీని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తనదైన స్టైల్ లో ముందుకి తీసుకువెల్తున్నారు.. 44 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళి పుట్టరేమో...

ఆయన కష్ట జీవి... కష్టం అనేది చాలా మజానిస్తుంది, సక్సెస్ కూడా ఇవ్వలేనంత గొప్ప సంతృప్తిని ఇస్తుంది. కష్టం ఇచ్చిన మజాకి రుచి మరిగిన వాడికి విజయం గురించి పెద్దగా పట్టింపు ఉండదు. విజయమైనా, అపజయమైనా వాడికి కావలసిన సంతృప్తి వాడు ఆల్రెడీ ఆస్వాదించాడు. అదీ శ్రమైక జీవన సౌందర్యం!! అదే చంద్రబాబు నైజం....

మీ నవ్వు చెరగకూడదు
మీ లక్ష్యం చెదరకూడదు
కోట్ల మంది ఆశలు మీపైనే
భావితరాల బ్రతుకు మీతోనే
కాలం కరుణించకపోయినా
వ్యతిరేక పవనాలెన్ని వీచినా
వడివడిగా సాగిపో నీ గమ్యం వైపు
తెలుగు నేలవైపు తిప్పు ప్రపంచపు చూపు...
వర్ధిల్లు వర్ధిల్లు వెయ్యేళ్ళు అమరేంద్రుడువై...
కొలువై నిలిచిపో హృదయాల్లో స్వర్ణాంధ్ర వల్లభుడివై...!!

హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారు....మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి....

ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల సీఎం చంద్రబాబు దీక్ష చేస్తున్న వేళ,మోడీ చంద్రబాబుని ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన చిరకాలం చల్లగా ఉండాలంటూ ప్రధాని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ మోదీ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా...’’ అని పేర్కొన్నారు. ఓ వైపు పుట్టినరోజునే చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తుండగా.. మరోవైపు శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

deeksha 200042018 1

మరో పక్క, శుక్రవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి.. సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్టర్ ఖాతాలో జగన్ పేర్కొన్నారు. పోయిన ఏడాది, చంద్రబాబు జగన్ పుట్టిన రోజు నాడు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. మరో పక్క గవర్నరు నరసింహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం గవర్నరు నరసింహన్ చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు చంద్రబాబుకు శక్తి, ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

deeksha 200042018 1

అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా కూడా ట్వీట్ చేసారు "Wishing N Chandrababu Naidu @ncbn Ji a very happy birthday".. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. "Warm wishes to Andhra Pradesh CM Shri N Chandrababu Naidu Garu. May the Almighty bless you with good health, happiness and a long life." తమిళ నాడు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కూడా విషెస్ చెప్పారు 'I convey my birthday greetings to @ncbn and wish him a healthy life and successful stint in serving the people of Andhra Pradesh and this country. On this occasion, I request @ncbn to continue speaking out for States' rights and federal autonomy."

 

Advertisements

Latest Articles

Most Read