గత రాత్రి మొత్తం టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ కు సంబంధించి, హైడ్రామా నడిచింది. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో, ఒక పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో, విజయవాడ పటమటలంకలో, సిఐడి పోలీసులు , అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబుని 11 గంటలకు అదుపులోకి తీసుకుని, 12.30 గంటలకు అరెస్ట్ చేసామని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. 12.30 గంటలకు అరెస్ట్ చేసినట్టు, సిఐడి పోలీసులు అధికారికంగా దృవీకరించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఐపిసిలోని 477(A),466,467,468,471,465,420, Rw34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా పని చేయక ముందు, ఏపి ఎన్జీవో అధ్యక్షుడిగా పని చేసారు. ఆయన ఏపి ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ విభాగంలో పని చేసారు. ఆ సమయంలో పదోన్నతి కోసం, బీకాం డిగ్రీ ఉన్నట్టుగా పేర్కొన్నారని, సర్వీస్ రికార్డులు ట్యాంపర్ చేసారని, ఆయన పైన అభియోగాలు నమోదు అయ్యాయి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇదే అభియోగాలు రాగా, అప్పట్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపింది.

cid 110222022 2

ఆయన రికార్డులు ఏమి ట్యాంపర్ చేయలేదని, ఆయన డి.కాం అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అని చెప్తే, రికార్డు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపింగ్ లో తప్పు చేసి, బి.కాం అని టైపు చేసారని, అప్పట్లో విజిలెన్స్ విభాగం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పై కేసు పెట్టటంతో, అశోక్ బాబు పది రోజుల క్రిందటే ఈ కేసు పై స్పందించారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడి పేరు చెప్పి, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ ఉద్యోగ సంఘ నేత వెనుక ప్రభుత్వం ఉందని, ఆరోపణలు చేసారు. దీని పైన లోకాయుక్తాకు ఫిర్యాదు చేసారు. అయితే లోకాయుక్తాకు ఫిర్యాదు చేస్తే, వారు ఎంక్వయిరీ చేయకుండా, సిఐడి విభాగానికి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసారు. సిఐడి దీని పైన కేసు నమోదు చేసారు. అయితే ఇలాంటి చిన్న కేసు విషయంలో, కనీసం ప్రాధమిక ఎంక్వయిరీ కూడా చేయకుండా, గతంలోనే ముగిసిపోయిన అంశాన్ని, ఇప్పుడు పైకి తెచ్చి, ఏదో పెద్ద నేరం లాగా, అర్ధరాత్రి హైడ్రామా మధ్య అరెస్ట్ చేసారు. ప్రస్తుతం అశోక్ బాబు సిఐడి కార్యాలయంలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో న్యాయమూర్తులు, కోర్టులను ఇష్టం వచ్చినట్టు తిట్టి, వారిని పార్టీలకు ఆపాదించి, కులాలకు ఆపాదించి, చేసిన వికృత క్రీడ అందరికీ తెలిసిందే. ఏ పార్టీకి అయినా సోషల్ మీడియా వింగ్ లు ఉండటం సహజం. వాళ్ళని తమ పనులు చెప్పుకోవటానికి, లేకపోతే ప్రత్యర్ధులు చేసే ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పి కొట్టటానికి వాడుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం రాజ్యాంగ సంస్థల మీదకు వదిలారు. జడ్జిలను, న్యాయమూర్తులను టార్గెట్ చేసారు. వారు చేసిన పనులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేరుగా రంగంలోకి దిగింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని తమ పైన చేసిన అటాక్ గురించి సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇక్కడే ఇప్పుడు అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇప్పటికే కొంత మందిని సిబిఐ అరెస్ట్ చేయగా, వారు ఇచ్చిన పక్కా సమాచారంతో, ఇదంతా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ నుంచి జరుగుతున్న వ్యవహారంగా సిబిఐ తన దర్యాప్తులో తెల్చినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు సిబిఐ అధికారులు డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ కు వచ్చి, కొంత మందిని విచారణ చేసి, అక్కడ నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉండగా, వారు సమాచారం తెలుసుకుని పరార్ అయినట్టు చెప్తున్నారు.

cbi 10022022 2

దీంతో సిబిఐ వేట మొదలు కావటం, ఏకంగా తమ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస్ వరకు కూడా, సిబిఐ వచ్చిందని తెలుసుకున్న పేటీయం బ్యాచ్ మొత్తం అలెర్ట్ అయ్యింది. ఎవరు అయితే అతిగా ప్రవర్తన చేసే వారో, వారు అందరూ ఇప్పుడు వారి ఎకౌంటు ను డియాక్టివ్ చేసుకున్న, కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తాము దొరికిపోతే, వాస్తవాలు బయట పడి పోతాయి ఏమో అని వారు పారిపోతున్నారు. అయితే ఇక్కడ ఏకంగా ప్రభుత్వం అధీనంలో ఉండే డిజిట‌ల్ కార్పొరేష‌న్ కేంద్రంగా ఇంత కుట్ర జరిగింది అంటే, ఏ స్థాయిలో వీరి నెట్వర్క్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీరి వెనుక ఎవరు ఉన్నారు, ఏ స్థాయి నాయకులు ఉన్నారు, ఎవరు చెప్తే ఈ పని చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఇలా మొత్తం వ్యవహారాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాచ్ లో కొంత మంది, విదేశాల నుంచి కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో కూడా ఉండటంతో, సిబిఐ దూకుడు పెంచింది. ఏమి జరుగుతుందో చూడాలి మరి.

ఈ రోజు జగన్ తో సినీ ప్రముఖులు భేటి అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భేటికి  మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ ,చిరంజీవి హాజరవుతున్నారు. సినిమా ప్రముఖులు  సినిమా టికెట్ల వివాదం గురించి మాట్లాడటానికే జగన్ తమను ఆహ్వానించారని మీడియాకు తెలిపారు. అయితే చిరంజీవి బృందం రాక ముందే, సినీ వర్గాల చర్చల్లో ట్విస్ట్ నెలకొంది. చిరంజీవి బృందం రాక ముందే  ఆలీ, పోసాని, ఆర్. నారాయణ మూర్తి ముందుగానే జగన్ నివాసానికి , మంత్రి పేర్నినాని తో కలిసి చేరుకున్నారు. ముందుగానే వారిని జగన్ పిలిపించుకున్నారు అనే వార్త నడుస్తుంది. అయితే ఆలీ , పోసాని వైసీపీ నాయకులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్. నారాయణ మూర్తి జగన్ కు ఎంత పెద్ద సపోర్టర్, ఎలా భజన చేస్తారు అనేది అందరికీ తెలిసిందే. ఇక ఆచార్య నిర్మాత అయిన నిరంజన్ రెడ్డి జగన్ రెడ్డి లాయర్. చిరంజీవి బృందం రాక ముందే, వైసీపీకి అనుకూలంగా ఉండే సినిమా వాళ్ళు జగన్ ఇంటికి వెళ్ళటంతో, ఇవి సినిమా టికెట్ల పై చర్చలా, లేక వైసీపీ అధికార ప్రతినిధులతో  చర్చలా అని కూడా వార్తలోస్తున్నాయి. ఇక వీరి భేటీ జరిగిన తరువాత, చిరంజీవి బృందం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి జగన్ నివాసానికి వచ్చారు.  చిరంజీవి బృందంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి వచ్చారు. అప్పటికే అక్కడ అలీ, పోసాని, నారాయణ మూర్తి ఉండటంతో, వారితో కలిసి చిరంజీవి బృందం జగన్ తో సమావేశం అయ్యింది.

పరిటాల రవి హ-త్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీను అంటే తెలియని వారు ఉండరు. అయితే ఆ తరువాత మొద్దుశీను కూడా జైల్లోనే హ-త్య-కు గురైన విషయం తెలిసిందే . ఈ విషయం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. అప్పట్లో మొద్దుసీనుని జైల్లో పెట్టిన తరువాత తాను అప్రూవర్ మరతానని కోర్టుకు తెలియచేసిన తరువాత , ఈ పరిటాల రవి హ-త్య కేసులో మరో నిందితుడు అయిన ఓం ప్రకాష్ చేతిలో మొద్దుశీను దారుణంగా హ-త్య-కు గురి అయిన సంగతి తెలిసిందే. మొద్దుశీనుని, ఓం ప్రకాష్ సిమెంట్ డంబెల్తో కొట్టి చం-పా-డు. కాని మొద్దుశీను సెల్ లోకి ఓం ప్రకాష్ ఎలా వచ్చాడు, అతని సెల్లోకి సిమెంట్ డంబెల్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికి మిస్టరీనే. అయితే అప్పటి వరకు అనంతపురం జైలు సూపరింటెండెంట్ ఉన్న ఆయన మొద్దుశీను హ-త్య జరిగిన రోజున సెలవుల్లో ఉన్నారు. ఆయన ప్లేస్ లో ఇంచార్జ్‌గా పోచా వరుణారెడ్డి భాధ్యతలు తీసుకున్నారు. అయితే అసలు సూపరింటెడెంట్ సెలవు నుంచి విధుల్లోకి వచ్చే సరికి కధ మొత్తం జరిగి పోయింది. అసలు వరుణారెడ్డి ఓం ప్రకాష్ ను మొద్దుశీను సెల్ లోకి ఎందుకుపంపించ్చారని కూడా విమర్శలు ఎదుర్కున్నారు. అయితే మొద్దు శీను హ-త్య ఉదంతం అంత ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఆయనను అప్పట్లో సస్పెండ్ కూడా చేసారు.

vvieka 10022022 2

అప్పట్లో ఈ అదికారి పై మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కంప్లైంట్ చేస్తూ ఒక ఉత్తరం కూడా రాసారు. ఆతరువాత ఈయన కూడా హ-త్య కాబడ్డాడు. ఇదంతా అప్పుడు జరిగితే, తాజాగా ఇప్పుడు అదే అధికారి వరుణారెడ్డి, ఇప్పుడు మళ్ళీ కడప జైలు సూపరిండెంట్‌గా భాద్యతలు చేపట్టారు. అయితే ఏమాత్రం అర్హత లేని ఆయన్ను ఎలా సూపరిండెంట్‌గా నియమిస్తారని కూడా విమర్శలు వస్తున్నాయి. వైసిపి ప్రభుత్వంలో ఈ సస్పెండ్ అయన ఆయనకు, మెడల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టొరీ అంతా ఎందుకు అంటే, కడప జైల్లోనే, వివేక కేసు నిందితులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా దస్తగిరి, ఇప్పటికే అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతోనే, కూసాలు కదిలిపోయాయి. అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ ని అరెస్ట్ చేసి లోపల వేసే వరుకు విషయం వెళ్ళింది. ఇప్పుడు ఈ అధికారి ఇక్కడకు రావటంతో, అందరూ మొద్దు శీను ఘటన, అలాగే ఇప్పుడు దస్తగిరి పరిస్థితి ఏమిటి అనే విషయం పై, రిలేట్ చేస్తూ కధనాలు రాస్తున్నారు.

 

Advertisements

Latest Articles

Most Read