ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విడిపోయిన సందర్భంలో పదేళ్ళ లోపు హామీలు నెరవేర్చాలి అంటూ ఒక చట్టం చేసారు. 8 ఏళ్ళు అయినా ఏపికి చిప్ప మాత్రమే మిగిలింది. మరో రెండేళ్ళు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో, కేంద్రం సోయలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కమిటీ పేరుతో ముందుకు వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన వివాదాలకు సంబంధించి, ముగ్గురు సభ్యులతో , కేంద్ర హోం శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ తరుపున జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. అలాగే తెలంగాణా, ఏపి నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈ కమిటీ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కేంద్రం ఈ కమిటీని నియమించింది. ప్రతి నెలలో కూడా ఈ కమిటీ సమావేశం కావాలని హోంశాఖ తెలిపింది. ఇందులో భాగంగా, మొదటి సమావేశాన్ని ఈ నెల 17న ఏర్పాటు చేసారు. రాష్ట్ర విభజన సమయంలో, ఇచ్చిన హామీలు, చట్టాలు, అవి నెరవేర్చక పోగా, రాష్ట్రానికి హామీలు కూడా నెరవేర్చలేదు. ఇదే అంశం పైన, గత చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి కూడా బయటకు వచ్చింది. జగన్ మొహన్ రెడ్డి వచ్చిన తరువాత, ఈ అంశం పై పెద్దగా కదలిక లేకపోగా, అసలు ముందు వచ్చినవి కూడా రాలేదు.
అయితే ఇప్పుడు కేంద్రం ఒక కమిటీ వేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని అంశాల పైన ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. విభజన హామీలు అమలు, కేంద్ర హోం శాఖకు హక్కులు ఉంటాయి కాబట్టి, కేంద్రం హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17న ఈ సమావేశం, వర్చ్యువల్ గా జరగనుంది. అయితే ఈ కమిటీ కోసం ఒక అజెండాని కూడా సిద్ధం చేసారు. ఆ అజెండాలో మొత్తం తొమ్మిది అంశాలు ఉన్నాయి. అయితే ఇందులో కేంద్రం తరుచూ, ముగిసిపోయిన అధ్యయనం అని చెప్పిన ప్రత్యేక హోదా అంశం కూడా ఉంది. ఎప్పుడు పార్లమెంట్ లో అడిగినా, అది ముగిసిపోయిన అధ్యయనం అని చెప్పిన కేంద్రం, ఇప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ ముందుకు తేవటం వెనుక, రాజకీయ అజెండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని, మరి ఈ అంశం పై, కేంద్ర వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా, ఇది మరో కాలయాపన చేసే ఎత్తుగడా, లేక అసలు దీని వెనుక ప్లాన్ ఏంటో చూడాలి.