రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయతో ఆయన చూపుతో మేము మనుషులమయ్యామని రాయలసీమ హిజ్రాల అధ్యక్షురాలు హాసిని పేర్కొన్నారు. పులివెందులలో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆమె మాట్లాడారు. హిజ్రాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1500 పింఛన్ తో పాటు ఇళ్ల స్థలాలు, చదువును బట్టి ఉద్యోగం తదితరాలను కల్పించడం ఎంతో ఉన్నతాశయమన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాడు రాముని కాలు తగిలి రాయి అహల్యగా మారిందని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చూపు మా పై పడి మేము మనుషులుగా మారామన్నారు.

hijra 04012018 2

హిజ్రాలకు ఇళ్ల పట్టాలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది హిజ్రాలు ఉన్నారని, మా ఓట్లను ఆయనకే అన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాల పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా కోణంలో ఆదుకుంటుంది... వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు హిజ్రాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది... వారికి ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంది...

hijra 04012018 3

ఈ పెన్షన్స, ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు, హిజ్రాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రమాణాలను రూపొందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం జన్మించినప్పుడు ఉన్న జెండర్‌కు వ్యతిరేకంగా వారి ప్రవర్తన తీరు ఉంటే వారిని ట్రాన్స్‌జెండర్‌గా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు చెందాలంటే జిల్లా కలెక్టర్‌ ఏర్పాటుచేసిన స్ర్కీనింగ్‌ కమిటీ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీలో మెడికల్‌ ఆఫీసర్‌, సైకాలజిస్టు లేక సైక్రియాట్రిస్టు.. జిల్లా సంక్షేమాధికారి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక ట్రాన్స్‌జెండర్‌ సభ్యులుగా ఉండాలి.

పులివెందుల చరిత్రలోనే ఎప్పుడూ చూడని సంఘటనలు ఇవి... ఈ మాటలు అంటున్నది ఆ ఊరి పెద్దలు... రాష్ట్రాన్ని రామారావు పార్టీ పెట్టి ఒక ఊపు ఊపాడు, అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డికే జై కొట్టాం... నిన్న చంద్రబాబు వచ్చినప్పుడు మా ఊరిలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్పందన ఇక్కడ ఇది వరకు ఎప్పుడూ చూడాలా... జగన్ హయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించుకోవాలా... జగన్, ఇక్కడ జరుగుతుంది అర్ధం చేసుకోలేకపొతే నష్టపోతాడు... ఇవే మాటలు నిన్న పులివెందులలో ఎక్కువుగా వినిపించాయి... ఇదంతా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పై వచ్చిన పోజిటివ్ మూడ్... ఇన్నాళ్ళు విసుగెత్తిపోయిన అక్కడి ప్రజలకు, బాగా నచ్చిన అభివృద్ధి మంత్రం..

pulivendula 04012018 2

నిన్న పులివెందులలో జరిగిన చంద్రబాబు సభకు, ప్రజలు పెద్ద ఎత్తున తరిలి వచ్చారు... 25-30 వేల మంది వస్తారు అని అంచనా వేస్తే, 50 వేలు దాటింది... చంద్రబాబునాయుడు సభ 2 గంటలకు ప్రారంభం కానుండగా జనం 11 గంటల నుంచే మైదానంలోకి తరలివచ్చారు. పులివెందుల ప్రాంతీయులు, పరిసర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. ఉదయం 11 నుంచి వేదిక వద్ద వేచి ఉన్న జనం, ముఖ్యమంత్రి సభ 4.45 గంటలకు ముగిసేవరకు ఓపిగా అక్కడే ఉండడం విశేషం.... పులివెందుల పట్టణంలో కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీలు చేపట్టి, ఉత్సా హంగా చిందులు వేస్తూ ఆనందంతో మునిగి తేలారు.

pulivendula 04012018 3

పట్టణంలో చంద్రబాబు సభ భారీగా విజయవంతం కావడం కార్యకర్తలు, నేతల్లో ఆనందం కనిపిస్తోంది. నియోకవర్గ ఇంచార్జ్, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి సీఎం సభ విజయవంతం కోసం కొద్ది రోజులుగా పులివెందుల్లోనే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారిక కార్యక్రమం కావడంతో జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంపై దృష్టిపెట్టారు. సభకు వచ్చిన వారిలో మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. గతేడాది జనవరి 11న పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాళెంకు వచ్చిన చంద్రబాబు అప్పుడు గండికోట ఎత్తిపోతల నుంచి పైడిపాళెంకు నీటిని విడుదల చేశారు. ఏడాదికి తిరిగి పులివెందులకు వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు గండికోట నుంచి చిత్రావతి రిజ ర్వాయర్కు ఎత్తిపోతల పథకం నుంచి వస్తున్న నీటిని పరిశీలించి జలహారతి ఇచ్చారు. కృష్ణా జలాలు జిల్లాకు రావడం పులివెందుల ప్రాంతానికి రావడంతో ఇక్కడి వాసుల్లో ఆనందం వ్యక్త మవుతోంది.

రాజధాని పరిధిలో ఒక్కొక్కటిగా కంపెనీల రాక ప్రారంభమైంది. ఐటీ సంస్థలతో పాటు పారిశ్రామిక క్లస్టర్లు సైతం ఏర్పాటు చేస్తుండడంతో యువతకు ఉపాధి అవకాశాలు చేరువవుతున్నాయి. కృష్ణా, గుంటూరుల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు గత ఏడాది కాలంలో 35 వరకూ ప్రారంభమయ్యాయి. వీటిలో 2300కు పైగా కొలువులు స్థానిక యువతకు లభించాయి.... తాజాగా మరో 12 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఈ నెల 17న వీటిని ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ రాజధాని ప్రాంతంలోనే వస్తున్నాయి.

it 04012018

మంగళగిరి సమీపంలోని ఏపీ ఎన్‌ఆర్‌టీ టెక్‌పార్కులో 9 కంపెనీలు, మంగళగిరిలోని పైకేర్‌ ఐటీ పార్కులో మరో మూడు కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థ చొరవతో వస్తున్న కంపెనీలు. వీటిలో 90 శాతం అమెరికా కంపెనీలు, బ్రిటన్‌కు చెందినవి ఒకటి రెండు, మన దేశంలో వేరే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఉన్నాయి.. ఈ కంపెనీలు రావడంతో తక్షణం 5-6 వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెట్టాక సుమారు 1300 మందికి ఉపాధి లభిస్తుంది. మరో 20 వరకు కంపెనీలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

it 04012018

12 కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి... సిగ్నం డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, చారువికెంట్ ఐటీఈఎస్ ప్రైవేటు లిమిటెడ్, అద్వైత్ అల్గారిథం, స్క్రిప్ట్ బీస్, స్వరా సాఫ్ట్, సన్ స్వెట్, పిక్సీ, సువిజ్, డీఎఫ్ఐ స్విస్, ఎక్సెల్లార్, మెక్ మై క్లినిక్, బీవీజీ ఇండియా కంపెనీలు ఉన్నాయి.. ఇందులో మూడు స్టార్ట్ అప్ కంపెనీలు ఉన్నాయి.. ఈ కంపెనీల్లో మెక్ మై క్లినిక్, ఎక్సెల్లార్, బీవీజీ ఇండియా కంపెనీలు పైకేర్ ఐటి పార్కులో ఏర్పాటుఅవుతున్నాయి... మిగతా తొమ్మిది కంపెనీలు ఎన్ఆర్టీ ఐటీ పార్కులో వస్తున్నాయి..

జగన్ పేరు నేషనల్ లెవెల్ లో మారు మోగుతుంది... నేషనల్ మీడియాలో జగన్ చేసిన ఘనకార్యాలు గొప్పగా చెప్తున్నారు... జగన్ పాదయాత్రలో నీతులు చెప్తూ, నాకు అవినీతిని అంతం చేసే కసి ఉంది, అవినీతి పరులని జైలులో పెడుతా, అవినీతిని సహించను, నాకు నిజాయితీ ఉంది, నేను ధర్మంగా ఉంటాను అని డైలాగులు మీద డైలాగులు చెప్తుంటే, దర్యాప్తు సంస్థలు, కోర్ట్ లు, జగన్ వాస్తవ రూపాన్ని బయట పెడుతున్నాయి... నిన్న ఈడీ జగన్ ఆస్తులు అటాచ్ చేసిన నేపధ్యంలో, మనోడి టాలెంట్ మరోసారి నేషనల్ మీడియాలో మారు మోగింది... చాలా రోజులు తరువాత జగన్ ని నేషనల్ మీడియాలో చూసిన దేశ ప్రజలు, ఇంకా శిక్ష వెయ్యలేదా అంటూ మాట్లాడుకుంటున్నారు...

jagan national 04012018

ప్రధానంగా "ET Now" "TOI" చానల్స్ తో పాటు, జాతీయ వార్తా పత్రికల్లో కూడా జగన్ ఘనకార్యాలు గురించి వేసారు... ఒక పక్క ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రం పేరు నిలపటానికి, అందరి దృష్టి ఆకర్షించి పెట్టుబడులు కోసం దేశాల్లో ప్రచారం చేస్తుంటే, మనోడు మాత్రం తను చేసిన ఘనకార్యలతో మన రాష్ట్ర పరువు తీస్తున్నాడు... అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత అనే హోదా కూడా ఉంది... దీంతో ఒక నాయకుడు రాష్ట్ర ప్రతిష్టని పెంచుతుంటే, ఇంకో నాయకుడు రాష్ట్ర ప్రతిష్టని దిగజారుస్తున్నాడు..

jagan national 04012018

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించి అప్పటి వైఎస్‌ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు సహకరించిన మరో రెండు సంస్థలకు చెందిన రూ.117 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ మేరకు బుధవారం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ‘ఇందూ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు చెందిన వివిధ స్థిరాస్తులు, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జితేంద్ర వీర్వాణి), వసంత ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (వీవీ కృష్ణప్రసాద్‌) చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పీఎంఎల్‌ఏ కింద జప్తు చేశాం. వీటి విలువ రూ.117.74 కోట్లు. వైఎస్‌ జగన్‌, ఇతరులపై దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లకు సంబంధించిన కేసుల్లో ఈ జప్తు చేశాం." అంటూ ఈడీ తెలిపింది.

Advertisements

Latest Articles

Most Read