12 ఓట్లుతో గెలిచిన ఎమ్మల్యే... ఎవరైనా ప్రజలకి మంచి చేసి, వచ్చే ఎలక్షన్స్ లో ఇలా 12 ఓట్లుతో కాకుండా, 12 వేల ఓట్లతో గెలివాలి అనుకుంటారు... కాని ఈయన ప్రజలను గాలికి వదిలేసి, వాళ్ళ పార్టీ అధినేత సేవలు తరిస్తూ ఉంటాడు... ఏ లిటిగేషన్ దొరుకుతుందా, ఎవరి మీద కేసు వేద్దామా అని చూస్తూ ఉంటాడు... చివరకి ఏ కేసు నిలబడు అనుకోండి అది వేరే విషయం... కాని, ఈ లోపు కేసు వేసి, సాక్షి టీవీలో హడావిడి చేస్తూ ఉంటారు... కేసు కొట్టేసిన రోజు మాత్రం, అసలు సాక్షిలో వార్తే ఉండదు... ఆంధ్రజ్యోతి ఏండి రాధాకృష్ణ అరెస్ట్ అయిపోతున్నాడు అని హడావిడి హడావిడి చేసారు... చివరకు నిన్న కోర్ట్ ఆళ్ళని నాలుగు తిట్టి, కేసు కొట్టేసింది... వివరాలు ఇలా ఉన్నాయి...

alla 0601218 2

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్ పై 'ఆంధ్రజ్యోతి ప్రచురించిన కధనం పై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోరులో చుక్కెదురైంది. ఆయన వేసిన పరువునష్టం కేసును శుక్రవారం కొట్టివేసింది. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఇచ్చిన వినతి పత్రంపై "అమ్మ జగనా". ఆనే కథనాన్ని గత ఏడాది మే 15న 'ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ కధనం తమ పార్టీ నాయకుడికి, పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని, అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆళ్ల రామకృషారెడ్డి నాంపల్లి క్రిమినల్ కోరులో పరువు నష్టం కేసు చేశారు. ఈ కేసును కొట్టి వేయాలని 'ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైకోరులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.

alla 0601218 3

ఈ వ్యాజ్యాన్ని లోతుగా విచారించిన హైకోర్ట్ శుక్రవారం 68 పేజీలు సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోరు ఇచ్చిన పలు తీర్పులను న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఉటంకించారు. ఆ కథనంతో మీకేం సంబంధం ఉందని పిటిషనర్ను నిలదీశారు. సంబంధంలేని అంశం పై కోర్ట్ ను ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. పిటిషనర్ కు ఎలాంటి అర్హతా లేదని స్పష్టం చేశారు. రామకృష్ణా రెడ్డి కింది కోర్ట్ లో దాఖలు చేసిన పరువ నష్టం కేసును కొట్టి వేశారు. ఈ కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్ట్ జారీచేసిన వారెంటు రద్దుపుతాయని స్పష్టం చేశారు.

నోరు తెరిస్తే అద్భుతంగా మాట్లాడే, వైసీపీ ఎమ్మల్యే రోజా మరో సారి వార్తల్లోకి వచ్చారు... శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి కొత్త పేరు పెట్టారు.... జగన్ ను బాహుబలిగా పోల్చారు... ప్రభాస్ అంటే వారి పార్టీ మొత్తానికి ఇష్టమో ఏమో కాని, జగన్ ను బాహుబలిగా పోల్చారు రోజా... జగన్ ఒక ధీరుడు అని చెప్పుకొచ్చారు... అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా అదే సినిమా డైలాగులతో విరుచుకుపడ్డారు మ్యాడం గారు... అంతే కాదు ఢిల్లీలో ఉన్న పెద్దలను కూడా రోజా ఇదే సినిమా డైలాగులతో పోల్చారు... మొత్తానికి ఈ దేశంలో జగన ఒక్కడే పోటుగాడు అని, దేశం మొత్తంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులు చేతకాని వారు తేల్చి చెప్పింది రోజా...

roja 05012018 2

ఆంధ్రప్రదేశ్ యువతను సీఎం చంద్రబాబు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబుపై యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె అన్నారు. జగన్ ను బాహుబలిగా పోల్చారు... ఢిల్లీలో శివగామి ఉంది అంటూ సోనియా గాంధీని అన్నారు....ఆంధ్రప్రదేశ్ లో భళ్లాలదేవుడి అంటూ చంద్రబాబుని అంది రోజా... కాని రోజా పాత్ర ఏంటో చెప్పటం మర్చిపోయింది.... కుట్రలకు ఎదురొడ్డి చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారని జగన్ అని, రోజా ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెబితే ఎంత పద్ధతిగా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

roja 05012018 3

నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే ‘అబ్బా’ అనిపించేలా ఉండాలని రోజా అన్నారు. జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించినా చెక్కు చెదరని చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్న జగనన్నను ఒకసారి చూడాలని రోజా అన్నారు. ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఎవరని అంటే.. జగన్మోహన్ రెడ్డని రోజా వ్యాఖ్యానించారు.

పోలవరం పై ఒకే రోజు రెండో శుభవార్త వినిపించింది కేంద్రం... రెండు నెలల క్రితం కాఫర్ డ్యాం ఆపెయ్యమని కేంద్రం చెప్పింది... దీని పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అలజడి మొదలైంది... ఏకంగా చంద్రబాబు మీకు ఒక నమస్కారం అని కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు... ప్రజల్లో ఆందోళన మొదలైంది... చంద్రబాబు వల్లే కాకపోతే ఇంకా పోలవరం ఎవరు పూర్తి చేస్తారు అనే సందేహం ప్రజల్లో వ్యక్తమైంది... అందరిలోనూ ఒకటే ఆందోళన... చంద్రబాబు కొరియా పర్యటనలో ఉండి కూడా నితిన్ గడ్కరీతో మాట్లాడి ఒత్తిడి తెచ్చారు.. ఇలా చేస్తే కష్టం అని తెగేసి చెప్పారు కూడా... అయినా రెండు నెలలు ఉలుకు పలుకు లేదు...

polavarm cbn 005012018 2

కేంద్రం నుంచి ఆ కమిటీ అని, ఈ కమిటీ అని, ఒకరి తరువాత ఒకరు వచ్చారు... ఒకరు కాఫర్ డ్యాం కావాలి అంటారు... ఇంకొకరు అక్కర్లేదు అంటారు.. ఇలా రెండు నెలలు కాలయాపన చేసారు... చంద్రబాబు రంగంలోకి దిగి కాఫర్ డ్యాం లేకుండా ఏ పెద్ద డ్యాం అయినా నిర్మాణం జరిగిందా, ఇది కాఫర్ డ్యాం వల్ల ఉపయోగం అని ఎంత చెప్పినా, అటు నుంచి రియాక్షన్ లేదు... ఎక్కడ నొక్కారో కాని, చంద్రబాబు తీవ్ర ఒత్తిడి మాత్రం కేంద్రం మీద తెచ్చారు అనేది అర్ధమవుతుంది... నిన్న పోలవరం కాంట్రాక్టర్ మార్చటానికి కేంద్రం ఒప్పుకుంది, ఇవాళ ఉదయం చాలా రోజుల తరువాత ప్రధాని మోడీ, మన ఎంపీలతో మన రాష్ట్ర సమస్యల పై స్పందించారు....

polavarm cbn 005012018 3

ఇవాళ సాయంత్రానికి, కాఫర్ డ్యామ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది... పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం పై డిజైన్ రివ్యూ కమిటీ ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పోలవరం కాఫర్ డ్యామ్‌కు ఏబీ పాండ్యా కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో కాఫర్ డ్యాం నిర్మాణానికి కెల్లర్ సంస్థ సిద్ధమైంది. ఎగువ కాఫర్ డ్యాం పనులు ఆపాలని..అప్పటి కేంద్ర జలవనరుల కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారుల వాదనలు వినిపించారు... దీంతో మన వాదన సరైనిదే అని కమిటీ తేల్చింది... కాఫర్ డ్యామ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది... ఎవరికీ ఏమి జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు... ఎస్కార్ట్ వాహనంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే వాహనం నిలిపేశాడు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ జిల్లాకు మంత్రి బయలదేరారు. ఒక్కసారి ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ జీపులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కిందకు దిగారు. జీపు పూర్తిగా దగ్ధమైంది.

home 05012018 1

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు... చినరాజప్పతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు... చినరాజప్ప పరిస్థితిని దగ్గర ఉండి చూసి, అగ్నిమాపక సిబ్బంది వచ్చే దాకా ఉండి, కార్యక్రమానికి వెళ్ళిపోయారు... అయితే ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే, జీప్ మొత్తం కాలిపోయింది... ఏ మాత్రం డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయినా, లోపల ఉన్న వారికి మంటలు అంటుకునేయి అని ప్రత్యక్షంగా చూసిన వారు అంటున్నారు.,..

home 05012018 1

ఆకవరపాలెం సర్పానది వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరి, ప్రజలను అక్కడ నుంచి పంపించి, వాహనం అక్కడ నుంచి తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న ముఖయంత్రి చంద్రబాబు, చినరాజప్పతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటన పై ఆరా తీశారు. పోలీసులతో కూడా మాట్లాడి, ప్రమాదానికి గల కారణాల పై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read