మొన్నటి దాకా కేంద్రంలోని పెద్దలు, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అని చూసారు... వాతావరణం చుసిన ప్రతి ఒక్కరికి, ఇక బీజేపీ, తెలుగుదేశం విదిపోయినట్టే అనే అంచనాకు వచ్చేసాయి... కాని ఊహించని విధంగా రెండు రోజుల నుంచి అన్నీ శుభవార్తలే వినిపిస్తుంది కేంద్రం... మొన్న పోలవరం విషయంలో కాంట్రాక్టర్ ను మార్చటానికి సరే అంది, పోలవరం కాఫర్ డ్యాం కట్టటానికి గ్రెన్ సిగ్నల్ ఇచ్చంది, చాలా రోజుల తరువాత మన ఎంపీలకు ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరికింది, నిన్న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటకు ముందడుగు అంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసారు, చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరికింది...

cbn 06012018 1

ఇవన్నీ ప్రజలకు ఆశ్చర్యానికి కలిగించాయి... ఇన్నాళ్ళు లొంగని కేంద్రం ఇప్పుడు ఎందుకు లొంగింది ? పోలవరం కాంట్రాక్టర్ ని మార్చమని చంద్రబాబు వేడుకున్నారు... రెండు నెలలు విలువైన సమయం వేస్ట్ అయ్యిన తరువాత, ఇవాళ సరే అన్నారు.. అలాగే కాఫర్ డ్యాం చాలా అవసరం అన్నారు చంద్రబాబు... కుదరదు అంది కేంద్రం... ఇవాళ సరే అన్నారు... అప్పుడు ఎందుకు ఆపారో, ఇప్పుడు ఎందుకు సరే అన్నారో వారికే తెలియాలి... కాని రెండు నెలలు సమయం వృధా అయ్యింది... ఇవన్నీ చూస్తున్న ప్రజలు, లోపల ఎదో జరిగింది అని అనుకుంటున్నారు... చంద్రబాబు ఎంతో ఒత్తిడి చెయ్యకపోతే, మోడీ, అమిత్ షా లాంటి వారి లొంగరు అని, చంద్రబాబు ఎదో గెట్టి దెబ్బ వేసారు అంటున్నారు....

cbn 06012018 2

లోపల జరిగింది మనం చెప్పలేము, చంద్రబాబు ఎలా ఒత్తిడి తెచ్చారో చెప్పలేం... బయటకు మాత్రం ఒక విషయం కనిపిస్తుంది.. అదే ట్రిపుల్ తలాక్ బిల్లు... ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోకి రాగానే తెలుగుదేశం పావులు కదిపింది... ఎన్డీఎ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లు పై మిగతా ప్రతిపక్షాలతో ఏకమైనది... ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని కోరింది... ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం కాదు అని, దాంట్లో కొన్ని అంశాలు అభ్యంతరం అని చెప్పింది.. ఈ ఒక్క విషయం మాత్రం బయటకు కనిపిస్తుంది... నేషనల్ లెవెల్ లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నారు అనే సంకేతాలు వెళ్తే, అది బీజేపీకి రాజకీయంగా నష్టం కలుగుతుంది... ఈ విషయం బయటకు కనిపిస్తున్నా, ఇంకా ఎదో విషయం ఉండే ఉంటుంది అని, అందుకే మోడీ, అమిత్ షాలు ఇద్దరూ తలొగ్గారు అంటున్నారు...

పాదయత్రలో ఉన్న జగన్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు... మీడియాలో సాక్షి తప్ప ఎవరూ చూపించటం లేదు... న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్ లో అయితే అసలు వార్త కూడా రావటం లేదు... నిజంగా జగన్ పాదయాత్ర చేస్తున్నాడా అనే డౌట్ కూడా ప్రజల్లో ఉంది... అయినా ప్రశాంత్ కిషోర్ చెప్పిన విధంగా స్క్రిప్ట్ పండిస్తూ, శుక్రవారం సెలవు తీసుకుంటూ, అలా నడుచుకుంటూ 50 రోజులు దాటాడు జగన్ (శుక్రవారాలతో కూడా కలిపి)... అయితే ప్రజల్లో పాదయాత్ర పేరు నాన్చటానికి ఏమి చెయ్యాల్లో తెలీక, చిత్ర విచిత్ర పనులు చేసినా మీడియా కవేరజ్ లేక, జగన్ టీం బాధ పడుతున్నారు... అందుకే మీడియా అటెన్షన్ కోసం ఇప్పుడు సినిమా డైలాగ్ లు చెప్తున్నారు జగన్...

jagan 06012018 2

సూపర్ స్టార్ రజనీకాంత్ భాష సినిమాలో ఫేమస్ డైలాగ్... "నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే" అనే డైలాగ్ ని వాడి, "నాన్న ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు వేస్తా" అంటూ అక్కడ తన వెంట వస్తున్న కార్యకర్తలను ఉద్దేశించిన అన్నారు.. చంద్రబాబు ఏ హామీ నెరవేర్చలేదు అని జగన్ చెప్తున్నారు.. అలాగే అవినీతి పై పోరాడే కసి తనకు ఉంది అని, తాను అధికారంలోకి రాగానే అవినీతి చేసిన వారి అందరినీ పట్టుకుని, జైల్లో పెడతాను అని, అది నా కసి అని జగన్ ప్రతి ఊరిలో చెప్తున్నారు...

jagan 06012018 3

అలాగే ఇంకో ఒక్క సంవత్సరంలో నేను సియం అవుతాను అని, నేను సియం అవ్వటానికి మీరందరూ గెట్టిగా దేవుడిని ప్రార్ధించండి అని జగన్ అన్నారు... తాను అధికారంలోకి వస్తే 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను అని, బడికి పంపిస్తే పిల్లలకు ఎదురు డబ్బులు ఇస్తాను అని, వెయ్య రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ ఇస్తాను అని,ఇలా అనేక ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ, వెళ్తున్నారు జగన్... ఇప్పటి వరకు అభివృద్ధి గురించి కాని, రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతాను అని కాని, ఉద్యోగాలు తెస్తాను, కంపెనీలు తెస్తాను, కేంద్రంతో పోరాడతాను అనే మాటలు మాత్రం అనకుండా, సినిమా డైలాగ్ లు మాత్రం వాడుతున్నారు..

దాదాపు సంవత్సరం తరువాత, ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు... నిన్న మన ఎంపీలు కలిసిన నేపధ్యంలో, ప్రధాని వచ్చే వారం చంద్రబాబుతో భేటీ అవుతాను అని చెప్పిన విషయం తెలిసిందే... అయితే చంద్రబాబు 11వ తారీఖు వరకు జన్మభూమి కార్యక్రమం ఉంది అని, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది అని, 12వ తారీఖు వస్తాను అని చెప్పటంతో, ప్రధాని షడ్యుల్ కూడా చూసుకుని, 12వ తారీఖు ఖరారు చంద్రబాబు అప్పాయింట్మెంట్ ఖరారు చేసింది ప్రధానమంత్రి కార్యాలయం..

modi 06012018 2

దీంతో ఈ నెల 12 న చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు అయినట్టు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కు సమాచరం వచ్చింది... దాదాపు ఏడాది తర్వాత మోదీ, చంద్రబాబు సమావేశం కానున్నారు... విబజన హామీలు, పోలవరం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది... ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది... దాదాపు తెలుగుదేశం, బీజేపీ మైత్రి అయిపొయింది అనుకున్న సమయంలో, రెండు రోజుల నుంచి రాష్ట్రానికి కేంద్రం అన్నీ మంచి విషయాలు చెప్తుంది..

modi 06012018 3

రాష్ట్రం మీద ప్రేమ కానివ్వండి, రాజకీయ అవసరం కానివ్వండి, ఎట్టకేలకు ఢిల్లీ మన సమస్యల పై స్పందిస్తుంది... చంద్రబాబు కూడా సంవత్సరం నుంచి మోడీ పిలవక పోయినా, రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు భరించారు... బయటకు వచ్చేసి, ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి, ఆత్మ గౌరవ నినాదం అనో, ఇంకోటో అనో, హాయిగా రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు... కాని ఈయన అందరి లాంటి రాజకీయ నాయకుడు కాదు... ముందు నవ్యాంధ్ర నిర్మాణం ముఖ్యం.. పోలవరం ముఖ్యం, అమరావతి ముఖ్యం... ఇవి సాకారం అవ్వాలి అంటే కేంద్రం సహకరించాల్సిందే... లేకపోతే పర్మిషన్ లు ఉండవు, నిధులు ఉండవు, రాష్ట్రంలో అశాంతి వాతావరణం... ఇవన్నీ బేరీజు వేసుకుని, చంద్రబాబు ఓర్పుగా, ప్రజల సహకారంతో, ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవంతో నిలబడ్డారు... ఢిల్లీ పెద్దలు ఇప్పటికైనా, మన ఆకాంక్షను, చంద్రబాబు కష్టాన్ని గుర్తించి, సహకరించాలి అని కోరుకుందాం..

కడప జిల్లాలో ఏర్పాటు కావాల్సిన స్టీల్ ప్లాంట్ విషయంలో మొన్నటి వరకు కదలిక లేదు... అందరూ ఇది మన రాష్ట్రానికి రాదు అని ఫిక్స్ అయిపోయారు కూడా... రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి రావటం, ఉప రాష్ట్రపతి వెంకయ్య స్వయంగా కేంద్ర మంత్రులు, అధికారులతో రివ్యూ చెయ్యటంతో, మళ్ళీ కదలిక వచ్చింది... కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భాగంగా మెకాన్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు శుక్రవారం జిల్లాకు చేరుకున్నాయి. బృందం సభ్యులు మైలవరం మండలంలో ఉక్కు పరిశ్రమ ఏర్చాటుకు గల అనుకూల పరిస్థితులను అధ్యయనం చేశారు.

steel plant 06012018 2

నీటి లభ్యత విషయమై మైలవరం జలాశయాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే ఎం.కంబాలదిన్నె గ్రామా పరిధిలో ఒకే ప్రాంతంలో ఉన్న 3 వేల ఎకరాల భూమి అనుకూలతను పరిశీలించి, రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. అలాగే తలమంచిపట్నం గ్రామం వద్ద ఉన్న పవర్ గ్రిడ్, ప్రధాన రహదారి అనుకూలతను పరిశీ లించారు. జమ్మలమడుగు ప్రాంతంలో రైలుమార్గం అందుబాటుపై ఆరా తీసారు.

steel plant 06012018 3

ఈ నెలలోనే మరోసారి మెకాన్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు మండలంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. చివరగా సమర్పించే నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బృందం సభ్యులు జిల్లా కలెక్షర్ను కలిసి మరిన్ని వివరాలు సేకరించి, తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి మూడు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబధించిన అన్ని పనులు చక చకా చేస్తుంది.. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని, ఆ అవకశాలు చూడాలి అని రాష్ట్ర విభజన బిల్లులో కూడా ఉంది...

Advertisements

Latest Articles

Most Read