ఒక పక్క ప్రధాని మోడీకి, చాలా రోజుల తరువాత చంద్రబాబు గుర్తుకొచ్చారు... 12వ తారీఖున కలవటానికి ఢిల్లీ రమ్మన్నారు... మరో పక్క పోలవరంలో అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయి... రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఉన్న గ్యాప్ కొంత తగ్గింది... ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానితో భేటీ అయిన తరువాత, చాలా విషయాల్లో క్లారిటీ రానుంది... రాష్ట్రానికి రావాల్సిన సహాయంతో పాటు, రాజకీయాలు కూడా ఈ మీటింగ్ లో ప్రస్తావనకు రానున్నాయి... బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఢిల్లీ లెవెల్ లో ప్యాచ్ అప్ వర్క్ జరుగుతుంటే, పురందేశ్వరి మేడమ్ గారు మాత్రం కుదరదు అంటున్నారు...
2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని పురంధేశ్వరి హెచ్చరించారు. అన్ని స్థానాల్లో పోటీ చేసి చంద్రబాబుకి బుద్ధి చెప్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు... పురందేశ్వరి టీడీపీపై, ముఖ్యంగా చంద్రబాబుపై విమర్శలు చేయడం కొత్తేమి కాదు. గతంలో ఎన్నోసార్లు చంద్రబాబుపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీరియస్ అవుతూనే ఉంటారు. కాని ఆవిడ మాట్లాడే మాటలకు అర్ధం ఉండదు.. 175 స్థానాల్లో బీజేపీకి అసలు 10 సీట్లలో అయినా అభ్యర్ధులు ఉంటారా అనే సందేహం ప్రజల్లో వస్తుంది...
అయినా కేంద్రం సహకారం మన నూతన రాష్ట్రానికి అవసరం కాబట్టి చంద్రబాబు బీజేపీతో కలిసి పని చేస్తున్నారు... ఇక్కడ రాష్ట్ర నాయకులు మాత్రం జగన్ మీద ప్రేమతో, చంద్రబాబు పై విమర్శలు చేస్తూ ఉంటారు... కాని వీరు కూడా ప్రభుత్వంలో భాగం అనే విషయం మర్చిపోయారు... టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఆ నాలుగు సీట్లు వచ్చాయి. సోము వీర్రాజు లాంటి వారికి తెలుగుదేశం ఎమ్మల్యేలో మద్దతుతో పదవి వచ్చింది.. పదవి ఇచ్చి ఎదురు తిట్టించుకుంటున్నారు... ఇక వీళ్ళు పురందేశ్వరి మేడమ్ గారు చెప్పినట్టు ఒంటరిగా పోటీ చేస్తే, మొన్న తమిళనాడులో జరిగినట్టు, నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి... మేడమ్ గారు ముందు చంద్రబాబుని తిట్టే మూడ్ నుంచి వాస్తవిక ప్రపంచంలోకి వస్తే, అన్నీ సవ్యంగా అర్ధం అవుతాయి...