ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడైనా శత్రువు అనే వాడు ఉన్నాడు అంటే, మొదటి వరుసలో ఉండేది ఈ హైదరాబాద్ మీడియా... హైదరాబాద్ లో కూర్చుని, అమరావతిలో జరిగేవాటి మీద, హైదరాబాద్ లో ఉండే కోడి బుర్ర గాళ్ళను తీసుకువచ్చి, మన సమస్యల మీద విషం చిమ్మిస్తారు... కాని మన విజయాలు మీద ఒక్క ప్రోగ్రాం ఉండదు, ఒక్క చర్చ ఉండదు... సాక్షాత్తు రాష్ట్రపతి మెచ్చుకుంటే, ఒక వార్తా కూడా వెయ్యరు.... ఎంత సేపు మన మీద ఏడవటమే ఈ హైదరాబాద్ మీడియా పని... హైదరాబాద్ లో ఉండి ఏ నాడైనా తెలంగాణా సమస్యల మీద చర్చలు పెడతారా అంటే ? అమ్మో భయం... మా వాడు, 10 కిమీ లోతులో పాతేస్తాడు... చంద్రబాబు అయితే ఏమి అనడు, అందుకే ఇక్కడ మా ఆటలు సాగుతుయ్యి అంటారు... VRO వనజాక్షి గుర్తుందా.. మనం బ్రతికి ఉన్నంత వరకు గుర్తు ఉంటుంది... అలా చేసింది హడావడి, ఈ హైదరాబాద్ మీడియా... ఇవాళ తెలంగాణాలో ఏమి జరిగిందో తెలుసా... ఇసుక అక్రమ రవాణా చేస్తున్నందుకు ఆపాడు అని, ఒక వీఆర్ఏను చంపేశారు... ఎవరికి అయినా ఈ విషయం తెలుసా ? ఇదే ఆంధ్రాలో జరిగితే ఈ పాటికి ఈ హైదరాబాద్ మీడియా ఏమి చేసేది ?

media 0501218 2

వివరాలు ఇలా ఉన్నాయ్.. కామారెడ్డిలో ఇసుకమాఫియా రెచ్చిపోయింది. ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు వీఆర్ఏను ఇసుకమాఫియా చంపేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని పిట్లం మండలం కంబాపూర్ గ్రామశివారులో కాకివాగు వద్ద నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు అక్కడకు చేరుకున్నాడు. ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక మాఫియా వీఆర్ఏ సాయిలు పైనుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు.

media 0501218 3

కారెగాం గ్రామానికి చెందిన సాయిలు మార్తాండ గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు సమాచారం ఇచ్చిన అనంతరం సాయిలు ఘటనాస్థలికి వెళ్లినట్లు తెలుస్తుంది. వీఆర్‌ఏ సాయిలు చనిపోయిన విషయం తెలుసుకు కారెగాం, మార్తాండ గ్రామస్థులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎమ్మార్వో, పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ ఐదవ విడత, ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గున్నారు... శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో గవర్నమెంట్‌ కాలేజీ గ్రౌండ్‌లో జన్మభూమి సభను ఏర్పాటు చేశారు. జన్మభూమి సభలో చంద్రబాబు ప్రసంగించారు. అంతకు ముందు ప్రజలతో మాట్లాడించారు... ఈ సందర్భంలో ఒక బాలిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది... ఒక్కటి కాదు రెండు కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పధకం, ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, ఆ పాప గుక్క తిప్పుకోకుండా, ప్రసంగించింది...

baby 0401218 2

ఆ పాప మాట్లాడుతూ ఉండగా, చంద్రబాబు, మంత్రి అచ్చెంనాయుడు, మిగతా నాయకులు చప్పట్లు కొడుతూ అభినందించారు... ఆ పాప ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు... ఈ పాపను చూసి ప్రతి పక్ష నేత జగన్ ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని, ఆ పాపకు తెలిసిన దాంట్లో జగన్ కు కనీసం సగం విషయం కూడా తెలీదు అని అంటున్నారు.. పాదయాత్రలో ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు అని, ఈ పాప చెప్పిన విషయాలు అన్నీ తెలుసుకుని, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది తెలుసుకుని జగన్ స్పందిస్తే, ప్రజలకు కూడా మంచిది అని అంటున్నారు...

baby 0401218 3

అంతే కాదు, జగన్ ఒక్కరే కాదు, చాలా మంది తెలుగుదేశం నాయకులు, ఎమ్మల్యేలు, ఎంపీలు కూడా ఈ పాపను చూసి నేర్చుకోవాలి అని అంటున్నారు.. వీళ్ళకు అసలు ఏమి తెలీదు అని, అందుకే ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తున్నా ప్రజలకి చెప్పలేకపోతున్నారు అని, కనీసం ఈ పాప ప్రసంగం విన్న తరువాత అయినా, ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తుందో, ఎంత కస్టపడి ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తుందో, ఇవి అన్నీ తెలుగుదేశం నాయకులు తెలుసుకుని, ప్రజలకు చెప్పాలి అని అంటున్నారు... ఆ పాప ప్రసంగం పూర్తి అయిన తరువాత చంద్రబాబు, ఆ పాపను అభినందించి, ఆ పాప తల్లిని కూడా అభినందించారు...

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గత రెండు సంవత్సరాల నుంచి "నేనే ముఖ్యమంత్రి " "నేనే ముఖ్యమంత్రి " అంటూ తిరుగుతూ ఉండటం చూసాం... ఒకానొక సందర్భంలో మాత్రం ఏకంగా "ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్తున్నాం నువ్వు" అని అనటంతో ప్రజలు అందరూ అవాక్కయ్యారు... తరువాత ఎన్నో అవార్డులు అందుకున్న నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ అహ్మద్ బాబుని, జైలుకు తీసుకుపోతా అన్నారు... తరువాత పాదయాత్రలో కూడా నేను వచ్చిన తరువాత మీకు ఏది కావాలంటే అది చేస్తా అంటూ చెప్తున్నారు... ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు జగన్ మరింత ముందుకు వెళ్లారు...

jagan 04012018 2

ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఇప్పుడు జగన్ ఏకంగా క్యాబినెట్ మంత్రుల్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు... పలానా అతను గెలిస్తే, పలానా మంత్రి పదవి ఇస్తాను అంటూ, ప్రజల ముందే ప్రకటిస్తూ ఉండటంతో, ప్రజలకు క్లారిటీ వచ్చింది... "నేనే ముఖ్యమంత్రి " అనే వ్యాధి తగ్గకపోగా, నెక్స్ట్ స్టేజిలోకి వెళ్లి మరింత పెరిగింది అంటున్నారు... జగన్ పాపం ఇలాగే కంటిన్యూ అయితే, ఏమైపోతాడో అని ప్రజలు జాలి పడుతున్నారు... దీనికి ఏదోఒకటి చెయ్యకపోతే, అంబటి రాంబాబు అన్నట్టు, ఇక నేనే ప్రధాని అని కూడా అంటారేమో... లేకపోతే నేనే అమెరికా ప్రెసిడెంట్ అని కూడా అంటారేమో...

jagan 04012018 3

జగన్ పాదయత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో మాట్లాడారు. కుప్పం పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చంద్ర‌మౌళికి ఓటు వేసి గెలిపిస్తే కేబినెట్‌లో కూర్చోబెట్టి చంద్ర‌బాబు కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు... ఈ సందర్భంగా ఇచ్చాపురంలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు.. గవర్నమెంట్‌ కాలేజీ గ్రౌండ్‌లో జన్మభూమి సభను ఏర్పాటు చేశారు... సభలో చంద్రబాబు ప్రసంగించారు. జన్మభూమి-మా ఊరు స్ఫూర్తిదాయక కార్యక్రమం అని చెప్పారు. జన్మభూమి రుణం తీర్చుకోవటానికే ఈ కార్యక్రమం తలపట్టామని తెలిపారు... 16వేల గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతోందన్నారు. 35 కుటుంబాలకు ఒక డ్వాక్రా మహిళను ఇన్‌చార్జ్‌గా పెట్టామని చెప్పారు...

cbn srikakulam 04012018 2

మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన పెరిగిందని సీఎం చెప్పారు. గతంలో బహిరంగ మల విసర్జనతో అవమానాలు ఎదుర్కొన్నారని, నా ఆడబిడ్డలను కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.15వేలు ఇస్తున్నామని, సెల్‌ఫోన్లపై ఉన్న ప్రేమ మరుగుదొడ్ల నిర్మాణంపై లేదన్నారు. చంద్రన్న బాట కింద పెద్ద ఎత్తున రోడ్లను నిర్మిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.

cbn srikakulam 04012018 3

మార్చి 31తేదీ లోపు అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు కట్టకపోతే మీ ఇంటికొచ్చి కూర్చుంటా, మౌన దీక్ష చేస్తానన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా మహిళలకు విజ్ఞానం పెరుగుతుందని, గర్భిణిలను గౌరవంగా ఇంటికి పంపించేందుకు తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామన్నారు. ఇంటి పెద్ద చనిపోతే కుటుంబం అనాధ కాకూడదనే చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. గ్రామ పంచాయతీల్లో కూరగాయలు పండించే క్షేత్రాలు ఏర్పాటు చేశాం..ఆ కూరగాయలను గ్రామాల్లోని పిల్లలకు ఆహారంగా వినియోగిస్తామని ఆయన చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read