చాలా రోజులు తరువాత మన రాష్ట్ర సమస్యల మీద ఢిల్లీలో పరిణామాలు వేగంగా కదులుతున్నాయి.... పోలవరం విషయంలో అడ్డంకులు తోలిగిపోగా, ఇప్పుడు ఏకంగా మోడీ కూడా చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద పాజిటివ్ మూడ్ లో స్పందించారు... అసలు ఇన్ని రోజులు నుంచి మన సమస్యల మీద పట్టనట్టు ఉంటూ, ఇప్పుడు వేగం పెంచుతున్నారు.. కారణం ఏదైనా మన సమస్యలు పరిష్కారం అయితే అదే పది వేలు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు... ఇవాళ పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడగానే, మోడీని కలవటానికి రెడీ అయ్యారు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు... వీరు అడగగానే మోడీ కూడా టైం ఇచ్చారు...
దీంతో మన ఎంపీలు మనకు కావాల్సినవి అన్నీ లిస్టు అవుట్ చేసి, లెటర్ రూపంలో కూడా రాసారు... అందరు ఎంపీలు సంతకం కూడా పెట్టారు... వీరిని కేంద్ర మంత్రి సుజనా చౌదరి లీడ్ చేసారు... అన్నట్టు కలిసిన వారిలో టీడీపీ, బీజేపీ ఎంపీలు మాత్రమే ఉన్నారు... వైసీపీ ఎంపీలు మాత్రం రాలేదు... విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. సీట్ల పెంపు, రైల్వేజోన్, పోలవరం తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఎంపీల విజ్ఞప్తి పై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట తీరులో స్పష్టమైన తేడా కనిపించిని అని ఎంపీలు అంటున్నారు... త్వరలోనే ముఖ్యమంత్రితో భేటీ అవుతాను అని, ఆంధ్రప్రదేశ్ పర్యటన కూడా ఉంది అని ఎంపీలతో ప్రధాని అన్నారు...
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఏపీ విభజన చట్టంలో ఇంకా చేయని వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నాలుగేళ్లు పూర్తయిందనే విషయాన్ని ప్రధానికి గుర్తు చేశామని అన్నారు. ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారని, నాలుగేళ్లు చాలా తొందరగా గడచిపోయాయని చెప్పారని, ఎట్టిపరిస్థితుల్లో త్వరలోనే అన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఏపీకి సహకారం అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ప్రధాని చెప్పారని తెలిపారు.