రెండు రోజుల నుంచి అనంతపురంలో పాదయత్ర చేస్తున్న జగన్, ఎలాంటి ప్రవచనాలు చెప్తున్నాడో వింటూనే ఉన్నాం... అసలు నాకు ఫాక్షన్ అంటే ఏంటో తెలీదు అన్నట్టు, నేను వస్తే అసలు ఫాక్షన్ లేకుండా చేస్తా అని, నీటి సూక్తులు వల్లిస్తున్నారు... కాని అక్కడ జరుగుతుంది వేరు... తాను ఎక్కడైతే పాదయత్ర చేస్తున్నాడో, అక్కడే జగన్ పార్టీ నేతలు రెచ్చిపోయారు... డబ్బులు ఇవ్వాలి అంటూ, వసూల్లకి పాల్పడుతూ, డబ్బులు ఇవ్వలేదు అని విచక్షణా రహితంగా ఒక పెద్దాయన్ను కొట్టారు... ఇదేనా జగన్ తెస్తాను అంటున్న రాజాన్న రాజ్యం ? ఇదేనా జగన్ తెస్తాను అంటున్న శాంతి బధ్రతలు ? తన మనుషుల చేత, జనాల మీద దౌర్జన్యాలు చేస్తూ, అక్రమ వసూళ్ళకు పాల్పడుతూ, నీతులు చెప్తున్నాడు... వివరాల్లోకి వెళ్తే...

anantapuram 15122017 2

అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్‌ కృ ష్ణానాయక్‌ పై స్థానిక వైసీపీ సర్పంచ్‌ బంధువులు బుధవారం రాత్రి దాడి చేశారు. ధనుంజయ.. మిత్రులు కిరణ్‌, నాగేంద్ర, మనోహర్‌తో కలిసి అర్ధరాత్రి వేళ వసతి గృహంలోని వార్డెన్‌ గది వద్దకెళ్లాడు. పెద్దఎత్తున కేకలు పెట్టి, భయ భ్రాంతులకు గురి చేశారు. కృష్ణానాయక్‌ తలుపు తీయగానే ఇష్టారాజ్యంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దాడికి చేసిన వారిలో కిరణ్‌ హాస్టల్‌లో పనిచేస్తున్న ట్యూటర్‌ హేమంత్‌కుమార్‌ కుమారుడు. వీరందరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుగుతూ మామూళ్లు వసూళ్లు చేసేవారని వార్డెన్‌ తెలిపారు

anantapuram 15122017 3

ట్యూటర్‌ కుమారుడితో కలిసి రెగ్యులర్‌గా వసతి గృహానికి వచ్చి, అక్కడే ఉండేవారన్నారు. తనను కూడా డబ్బు డిమాండ్‌ చేశారన్నారు. అందుకు ససేమిరా అనటం, హాస్టల్‌లో వారి ఆటలను సాగనివ్వకుండా అడ్డు చెప్తుండటంతో తనపై కక్షకట్టి దాడి చేశారన్నారు. వార్డెన్‌ను లేకుండా చేస్తే వారి ఆటలకు అడ్డులేకుండా చేసుకోవడంలో భాగంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన వార్డెన్‌ కృష్ణా నాయక్‌ జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో చికిత్స పొం దుతున్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద తెలంగాణా మహాసభలు నిర్వహిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం, మరో సారి తన నైజాన్ని బయట పెట్టింది... ప్రపంచ తెలుగు మహాసభలు అని పేరు పెట్టుకుని, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు.. బహుసా కెసిఆర్ చదివన 80 వేల పుస్తకాల్లో ఎక్కడా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడతారు అని తెలీదు ఏమో... కెసిఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పగానే, సరిహద్దులకు అతీతంగా తెలుగువారందరూ పాల్గొనేలా చేసి రాష్ట్రాలుగా విడిపోయినా.. జాతిగా, సాంస్కృతికంగా కలిసే ఉన్నాం అన్న స్పృహను కల్పిస్తారు అని అందరూ భావించారు...

kcr babu 15122017 2

కాని కెసిఆర్ ఎప్పటిలాగే తన బుద్ధి బయట పెట్టాడు... మొన్న ఇవంకా వచ్చిన సదస్సుకి కూడా, చంద్రబాబు వస్తే తన కొడుకుని ఎవరూ పట్టించుకోరు అని ఆహ్వానం ఇవ్వలేదు... ఇవాళ కూడా చంద్రబాబు వస్తే, ఫోకస్ మొత్తం ఆయన వైపు వెళ్తుంది అని, ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చరిత్ర, తెలుగు కవలు పేర్లు చెప్తారు అని భయంతో, తన తెలంగాణా చరిత్ర మాత్రమే వినిపించాలి అనే ఉద్దేశంతో, చంద్రబాబుని దూరం పెట్టాడు... తెలుగు మహాసభలో తెలుగు సంస్కృతి, భాష పరిరక్షణకు ఉద్దేశించి కాబట్టి పక్క తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ప్రజా ప్రతినిధులని పిలవాల్సిన అవసరం అనుకోవటం అతని కుసంస్కారానికి నిదర్సనం... మరో పక్క, కేవలం కెసిఆర్ వల్ల రాష్ట్రం ఈ పరిస్తుతుల్లో ఉంది అని తెలిసినా, కెసిఆర్ ఆంధ్రా వాళ్ళని అమ్మనా బూతులు తిట్టినా, అమరావతి శంకుస్థాపనకు కెసిఆర్ ని ఆహ్వానించిన సంస్కారి చంద్రబాబు...

kcr babu 15122017 3

తెలుగు భాష అంటే రెండు రాష్ట్రాల భాషా అన్న నిజాన్ని ఇవాళ తుంగలో తొక్కారు. తెలంగాణా కూడా భాషాపరంగా చరిత్ర కలిగిన రాష్ట్రమే ... సందేహం లేదు. కానీ, ఆంధ్రా లో ఎంతో మంది భాషా సేవకులు, మేధావులు, పండితులు ఉన్నారు. చరిత్ర ఉంది... అసలు వారి ఉసే లేదు... అసలు ఆంధ్ర , తెలంగాణా ప్రాంత వాసులంతా తెలుగు వారే ... రెండు రాష్ట్రాలు కలుపుకుని జరుపుకునే ఉత్సవాలు ఇవి ... అది గుర్తుంచుకోవాలి ఈ కెసిఆర్ లాంటి నాటకాలు అడే రాజకీయ నాయకులు ఇది తెలుగు జాతికే అవమానం... తెలంగాణా మహాసభులు అని పెట్టుకుంటే, నిన్ను అడిగేవాడే ఉండడు... తెలుగు అని చెప్పి, నీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడితే, కుదరదు.. ఇది చరిత్ర... నువ్వు ఎంత దాచినా దాగదు...

రోజా మళ్ళీ రెచ్చిపోయింది... నిన్న కాక మొన్న, లైవ్ లో బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిన రోజా, 24 గంటలు తిరగకుండానే పవన్ నుంచి చంద్రబాబు దాకా అందరి మీద తన జుబుక్సాకరమైన మాటలతో విరుచుకుపడింది... పవన్‌కు టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనని మాట్లాడుతూ, చంద్రబాబుకి కూడా వార్నింగ్ ఇచ్చింది రోజా... మా జగనన్న "ఊ" అంటే మీ పార్టీ ఏమవుతుందో తెలుసా అంటూ చంద్రబాబుని భయపెడుతుంది... ఇందిరా గాంధీ నుంచి రాజశేఖర్ రెడ్డి దాకా పోరాడిన చంద్రబాబుకి చిరవారి జగన్, రోజా లాంటి వాళ్ళు కూడా సవాలు విసురతున్నారు, నీ పార్టీ మూసేస్తాం అంటున్నారు అంటే, బ్యూటీ అఫ్ డెమోక్రసీ అని అనటం తప్ప, ఇంకేమి అనగలం...

roja 15122017 1

టీడీపీలో ఉన్న వారు బయటికి రావాలంటే వైసీపీ అధినేత జగన్ ఎక్కడ తమను రాజీనామా చేయమంటారో అని భయంతోనే వైసీపీలోకి రాలేదని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. రాజీనామా లేదు ఏమీ లేదు వైసీపీలోకి రండి అని జగన్ ఒక్కమాట అంటే తెలుగుదేశం పార్టీ సగం ఖాళీ అవుతుందని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు.

roja 15122017 1

జగన్ నీతి వదిలేసి రాజకీయాలు చెయ్యడు అని, విలువలతో రాజకీయాలు చేస్తాడు అని చెప్పారు… రోజా మాట్లాడిన తీరు చూస్తుంటే, ఈ ప్రపంచంలోనే జగన్ అంతటి నీటి మంతుడు లేడు అన్నట్లు మాట్లాడింది రోజా... జగన్‌ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టులు ఎప్పుడు పిలిచినా జగన్ వెళ్తున్నారని అంటుంది రోజా... మరి అలాంటప్పుడు ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి ఎందుకు సంతకం పెట్టి వస్తున్నాడు ?బ బెయిల్ మీద షరతులతో బయట ఎందుకు తిరుగుతున్నాడు లాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు... 

ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరయ్యే జగన్, ఇవాళ కూడా అనంతపురంలో పాదయాత్ర ఆపి మరీ హైదరాబాద్ సిబిఐ కోర్ట్ కి జగన్ హాజరయ్యారు... కాని, ఇక్కడ జగన్ కు అనూహ్య పరిణామం ఎదురైంది... విచారణ ఉంటుంది అనుకుని, జగన్ తో పాటు అతని లాయర్లు కూడా కోర్ట్ కి వచ్చారు... అనూహ్యంగా ఇవాళ సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉండటంతో, ఇవాళ జగన్ కేసు విచారణ లేదు అని చెప్పటంతో జగన్ మొఖం వెలిగిపోయింది... అటు సెలవు దొరికింది, ఇటు కోర్ట్ లో జడ్జి లేకపోవటంతో, జగన్ ఆనందానికి అవధులు లేవు... స్కూల్ లో టీచర్ లేకుండా గ్రౌండ్ కి తీసుకువెళ్ళి ఆడిస్తే పిల్లలు ఎంత సంతోష పడతారో, జగన్ అంత సంతోషంగా ఉన్నారు...

jagan 15122017 2

ఇవాళ సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉండటంతో, కేసు విచారణ ఇవాళ లేదు, కేసును వచ్చే శుక్రవారం 22వతేదీకి వాయిదా వేశారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం కోర్టు వాయిదా ఉండడంతో పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించి హైదరాబాద్ వచ్చారు. అక్రమాస్తుల కేసులో ఆయన 11 సిబిఐ కేసుల్లో A1...వీటికి ఈడీ కేసులు అదనం... బెయిల్ మీద షరతులతో బయట తిరుగుతున్నాడు... ఇప్పటికే సిబిఐ 43 వేల కోట్లు అవినీతి సొమ్ము నోక్కేసాడు అని కోర్ట్ కి చెప్పింది... 16 నెలలు జైలు జీవితం కూడా గడిపివచ్చారు...

jagan 15122017 3

ఈయన నాన్న ముఖ్యమంత్రి అవ్వక ముందు, ఆస్తలు అమ్ముకుని బ్రతికిన చరిత్ర నుంచి, ఇప్పుడు బంగాళాలు, ప్యాలస్ లు, ఎస్టేట్ లు, కంపెనీలు వరకు వచ్చారు... అయితే ఇప్పుడు సుప్రేం కోర్ట్ కూడా ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసులు ఏడాది లోపు విచారణ పూర్తి అవ్వాలి అని ఆదేశాలు ఇచ్చిన నేపద్యంలో, అది కూడా జగన్ ను కుంగదీస్తుంది. ఇప్పటికే జగన్ మీద సిబిఐ కోర్ట్ లో విచారణలో ఉన్న కేసుల్లో మూడు కేసులు తుది దశకు వస్తున్నాయి... మరో పక్క సుప్రీం చర్యలు చూస్తుంటే, జగన్ ఏంతో కాలం, బయట తిరగలేరు అనే వాతావరణం ఉంది...

Advertisements

Latest Articles

Most Read