నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోర్ కాపిటల్ ఏరియాలోని బిల్డింగ్స్ కోసం, రాజమౌళి సలహ కూడా తీసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయం పై, అమరావతి ద్వేషి అయిన జగన్ పార్టీ, వేరే రకంగా సృష్టించి, రాజమౌళి చేత రాజధానిలో సినిమా సెట్టింగ్ వేస్తున్నారు అనే ప్రచారం చేస్తున్నారు. నిజానికి నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్ లకు, తెలుగుదనం అద్దటానికి, మన సంస్కృతి ప్రతిబంభించాటానికి రాజమౌళి సలహాలు తీసుకోమన్నారు ముఖ్యమంత్రి. నిన్న రాజమౌళి, అమరావతి వచ్చి ముఖ్యమంత్రితో చర్చించారు కూడా. అయినా సరే, జగన్ పార్టీ, జగన్ సాక్షి ఛానల్, జగన్ పైడ్ సోషల్ మీడియా బ్యాచ్, అమరావతి మీద ఏడుస్తూనే ఉన్నారు... రాజామౌళి చేత రాజధాని డిజైన్ చేపిస్తున్నాడని, విషం చిమ్మారు.

rajamouli 13122017 2

ఇవాళ వీరందరికీ, లాచి పెట్టి కొట్టే సమాధానం ఇచ్చాడు రాజమౌళి. రామసేతు నిర్మాణంలో వానర సైన్యం పాల్గొందని.. ఆ వానరుల పేర్లు ఎవ్వరికీ అంతగా గుర్తుండవని.. కానీ ఓ ఉడుత పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొస్తుందని.. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా అలాంటి ఉడుత పాత్రే తనదని దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు. రామసేతు నిర్మాణంలో తన వంతు సాయం చేసిన ఆ ఉడుతను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ప్రస్తుతం ఆ ఉడుత పరిస్థితే తనదని బాహుబలి మేకర్, జక్కన్న రాజమౌళి అన్నారు. ఆ ఉడుతలా అమరావతి రాజధాని నిర్మాణంలో తాను పాలుపంచుకుంటున్నానని జక్కన్న చెప్పారు.

rajamouli 13122017 3

ఇప్పటికైనా జగన్ ఆధ్వర్యంలో పైడ్ సోషల్ మీడియా బ్యాచ్, హైదరాబాద్ లో కుర్చినే మేధావులు, సైకో చానల్స్ అండ్ సైకో పార్టీ, మా అమరావతి మీద ఏడవటం ఆపండి... ఇంకోసారి భ్రమరావతి అనే కూతలు కుయ్యకుండా, మీరు కూడా మీకు చేతనైన ఉడుత సహాయం చెయ్యండి... వీలయితే, మై బ్రిక్, మై అమవారతిలో పది రూపాయలు పెట్టి ఒక ఇటుక కొని, అమరావతిలో మీరు భాగస్వామ్యం అవ్వండి, అమరావతి మీద మీరు చేసిన పాపాలు పోతాయేమో...

ఇదే... అనుభవం, విజ్ఞత, సంస్కారం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మూర్ఖపు లక్షణాలు ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఉన్న తేడా.... వీరిద్దరినీ పోల్చటం కూడా సరికాదు... చంద్రబాబు లాంటి నాయకుడితో జగన్ లాంటి వాడికి అసలు పోలికే ఉండదు, కాని అధికార, ప్రతిపక్ష నేతలు కాబట్టి ఇద్దరినీ పోల్చాల్సి వచ్చింది... చంద్రబాబు వ్యవస్థకు, పదవికి ఇచ్చే గౌరవం ఇది.... ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం, నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం, అదే విధంగా ఇలాంటి బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఉండటం మన దౌర్భాగ్యం... అసలు విషయానికి వద్దాం...

cbn jagan 13122017 2

ఇవాళ సమాచార కమిషనర్ల నియామకం సమావేశం జరగనుంది... కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు... అమరావతి రమ్మని ప్రభుత్వం కబురు పంపించింది... కాని జగన్ మాత్రం నేను రాను అని కబురు పంపించారు.. రాకపోగా, నా బదులు వేరే వ్యక్తి వస్తాడు సర్డుకుపోండి అని వర్తమానం పంపించాడు... నిజానికి, జగన్ రాకపోయినా, ప్రభుత్వం ఇష్టానుసారంగా మాచార కమిషనర్ల నియామకం చేసుకోవచ్చు... కాని ముఖ్యమంత్రి అలా చెయ్యలేదు... ప్రతిపక్ష నేత లేకుండా ఇలాంటి నియామకాలు చెయ్యకూడదు అని,మరో అవకాసం ఇద్దామని చెప్పి, సమాచార కమిషనర్ల నియామకంపై ఇవాళ్టి సమావేశం వాయిదా వేశారు...

cbn jagan 13122017 3

మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మళ్లీ సమావేశం తేదీ ఖరారు చేసి జగన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వనుంది. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, భేషిజాలకు పోకుండా, రెండు సార్లు అప్పటి సచివాలయానికి వెళ్లి, ప్రక్రియలో పాల్గున్నారు... కాని, జగన్ మాత్రం, ఎప్పటి లాగే, ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు... ప్రతి శుక్రవారం కోర్ట్ కి ఎలా వెళ్తున్నాడో, అలాగే అమరావతి వచ్చి వెళ్ళటానికి జగన్ కు ఇబ్బంది ఏంటో మరి... ఇదే పోగారబోతు నైజంతో ఇప్పటికే ప్రజల ఆదరణ పొందలేక జగన్ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు, కాని ఆయన నైజం మాత్రం మానటలేదు...

కేంద్రం పదే పదే పెడుతున్న ఇబ్బందులతో, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపిక పై రాష్ట్రానికి, కేంద్రానికి దాదాపు యుద్ధమే నడుస్తుంది.. ఈ పరిణామాలు అన్నీ గమనించిన చంద్రబాబు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న నండూరి సాంబశివరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.... దీనికి సంబంధించి జిఓ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విడుదల చేశారు... డీజీపీ సాంబశివరావు విషయంలో కేంద్ర హోం శాఖ ఒంటెత్తు పోకడలు పోవడం ఆగ్రహం తెప్పించింది...

cbn center 13122017 2

డీజీపీ నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం విసిగిపోయింది. ఇకపై రాష్ట్ర డీజీపీని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకునేలా ఆర్డినెన్స్‌ తేవాలని నిర్ణయించింది. లోగడ ప్రకాశ్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి అనేక రాష్ట్రాలు యూపీఎస్సీ ఆధ్వర్యంలోని కమిటీ ద్వారా డీజీపీ ఎంపిక ప్రక్రియను చేపడుతున్నాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ పోలీస్‌ యాక్ట్‌కు సవరణ చేసి యూపీఎస్సీ కమిటీ ద్వారానే డీజీపీ నియామకం జరగాలని క్లాజ్‌ చేర్చారు.

cbn center 13122017 3

ప్యానెల్‌లో ఎవరి పేరు పెట్టాలో, ఎవరి పేరు పెట్టకూడదో కేంద్రమే నిర్ణయిస్తే ఎలా? రాష్ట్రం సూచించిన పేర్ల నుంచి ముగ్గురిని ఎంపిక చేయడమే యూపీఎస్సీ కమిటీ విధి. కేంద్ర హోం శాఖ దీనికి ససేమిరా అనడంతో రాష్ట్ర ప్రభుత్వం.. 2014లో తెచ్చిన పోలీస్‌ చట్టసవరణను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే.. ఇకపై డీజీపీ నియామకం పాత పద్ధతిలో రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది. వారికి విధిగా రెండేళ్ల పదవి ఉండాలన్న నిబంధన ఉండదు. ఎప్పటిలాగే పదవీ విరమణ వయసు లేదా ప్రభుత్వ అభీష్టం మేరకు డీజీపీగా కొనసాగుతారు. పొరుగున ఉన్న కర్ణాటక తన డీజీపీని తానే నియమించుకుంటున్న నేపథ్యంలో అదే పంథాను ఏపీ అనుసరించాలని నిర్ణయించింది.

ఆంధ్రుల ఆశల సౌధం... అమరావతి రూపురేఖలు దాదాపు ఫైనలైజ్ అయ్యాయి... రేపు అధికారికంగా ప్రకటించనున్నారు... చంద్రబాబు సూచించినట్టుగా, రాజమౌళి సలహాలతో, డిజైన్లలో మార్పులు చేసింది నార్మన్ ఫోస్టర్స్... అమరావతి అంటే అది పీపుల్స్ కేపిటల్... అది వన్ అఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కావలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు మేధో మధనం చేసి, మైన్యూట్ విషయాలు కూడా పర్ఫెక్షన్ వచ్చేలా చేసి, ఎట్టకేలకు డిజైన్ ఫైనల్ చేసారు... అమరావతిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో తలమానికంగా నిర్మించదలచిన అసెంబ్లీ డిజైన్లపై లండన్‌ నుంచి వచ్చిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు...

amaravati 13122017 2

ఈ ఏడాది అక్టోబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మంత్రి నారాయణ, రాజమౌళి, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో కూడిన బృందం లండన్ వెళ్లి మాస్టర్ ఆర్కిటెక్ట్ నిపుణులతో జరిపిన చర్చల్లో అసెంబ్లీకి సంబంధించి రెండు డిజైన్ల పట్ల సుముఖత వ్యక్తం చేసింది. వీటిల్లో ఒకటి చతురస్రాకారపు ఆకృతి కాగా, మరొకటి మధ్యలో పొడవాటి సూదిమొనను పోలిన టవర్‌ను కలిగిన డిజైన్‌. అయితే మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆకృతులు ఉండాలని సీఎం కొన్ని మార్పులు సూచించారు. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు సీఆర్డీయే ఉన్నతాధికారులకు చూపించారు. అయితే ఎక్కువ మంది టవర్ డిజైన్ పై మొగ్గు చూపారు... హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్ ని మరింత ఆకర్షణీయంగా మలచి, ఫోస్టర్‌ ప్రతినిధులు తాజా సమావేశంలో ప్రదర్శించారు. అంతర్గత నిర్మాణాలు, అంతస్థుల ప్రణాళికలను వివరించారు.

శాసనసభ భవంతి కోసం రూపొందించిన రెండు డిజైన్ లను సమావేశంలో ప్రదర్శించారు. సూది మొన కలిగిన టవర్ రూపంలో ఒకటి, చతురస్రంగా ఉన్న మరో ఆకృతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యధికులు టవర్ బిల్డింగ్‌ వైపే మొగ్గు చూపారు. ఈ రెండు డిజైన్ లను వెంటనే సీఆర్‌డీఏ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచి ప్రజానీకం అభిప్రాయాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం మరోమారు ఫోస్టర్ బృందంతో సమావేశమై చర్చిద్దామని నిర్ణయించారు. నిర్మాణ, భద్రతాపరమైన అంశాలన్నింటినీ పరిశీలించి ప్రజాభిప్రాయం ప్రకారం తుది ఎంపిక చేద్దామని చెప్పారు. అత్యధికులకు నచ్చిన టవర్ డిజైన్ భవంతిలో కింది భాగంలో శాసనసభ ఉంటుంది. పైన ప్రజలు సందర్శన నిమిత్తం పొడవైన వ్యూయింగ్ టవర్ నిర్మిస్తారు. ఈ తరహా నిర్మాణం ప్రపంచంలోనే వైవిధ్యమైనదని ఫోస్టర్ బృందం పేర్కొంది.

Advertisements

Latest Articles

Most Read